
షర్మిలా టాగోర్, సైఫ్ ఖాన్ల ఆస్తి తగాదా
తమ రాచకోటలోని కళాఖండాలను పంచుకునేందుకు భోపాల్ రాచకుటుంబానికి చెందిన నటుడు సైఫ్ అలీ ఖాన్, ఆయన తల్లి, అలనాటి నటి షర్మిలా టాగోర్ చేస్తున్న ప్రయత్నాలకు భోపాల్ పౌరులనుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది.
మాజీ భారత క్రికెట్ క్యాప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ భార్యగా షర్మిలా టాగోర్ ఈ కళాఖండాలను బంధువుల మధ్య పంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆమె ప్రస్తుతం భోపాల్ లోని కోహె ఫిజా పర్వతంపై ఉన్న అహ్మదాబాద్ పాలెస్ లో మకాం వేశారు. అయితే మెహ్రాజ్ ఖాన్ మస్తాన్ అనే స్థానిక నేత, భోపాల్ లోని పలువురు ముస్లింలు రాచకుటుంబం జ్ఞాపకాలను చెరపవద్దని డిమాండ్ చేస్తున్నారు. వీరు ధర్నా చేయడంతో చివరికి పోలీసుల సాయంతో షర్మిలా టాగోర్ ఎలాగోలా భవనం నుంచి బయటకు రాగలిగారు. పటౌడీ చనిపోయిన తరువాత నుంచీ స్థానికులకు, పటౌడీ కుటుంబీకులైన షర్మిలా, సైఫ్ ఖాన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.