Sharmila Tagore
-
మా ఇంటిదేవతకు హ్యాపీ బర్త్‌డే : బాలీవుడ్ బ్యూటీ సంబరాలు (ఫొటోలు)
-
కోపంతో ఆ హీరోయిన్ చెంప చెళ్లుమనిపించా..: హీరో
అలనాటి హీరోయిన్ షర్మిల ఠాగూర్‌పై గతంలో చేయి చేసుకున్నానని చెప్తున్నాడు బెంగాలీ హీరో ప్రోసెంజిత్ చటర్జీ. చిన్న వయసులో ఆమె చెంప చెళ్లుమనిపించానని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. 'అప్పుడు నాకు నాలుగైదు ఏళ్లు ఉంటాయనుకుంటాను. నాన్న(విశ్వజిత్ చటర్జీ)తో పాటు షూటింగ్‌కు వెళ్లాను. అప్పుడు హీరోయిన్ షర్మిల ఠాగూర్ ఓ ఎమోషనల్ సీన్లో నాన్నను కొట్టింది.ఆ కోపం నా మీద..లంచ్ బ్రేక్‌లో అంతా ఒకేచోట కూర్చున్నాం. ఆమె నన్ను తన దగ్గరికి తీసుకున్న వెంటనే చెంప మీద కొట్టాను. ఇప్పటికీ మేము కలిసిన ప్రతిసారి ఆ సంఘటనను గుర్తు చేస్తూ ఉంటుంది. మీ నాన్నను కొట్టానన్న కోపంతో నన్ను కొట్టావు కదా.. అంటుంది' అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా విశ్వజిత్ చటర్జీ, షర్మిల ఠాగూర్.. ప్రభాతెర్ రంగ్, యె రాత్ ఫిర్ నా ఆయేగి అనే రెండు సినిమాల్లో జంటగా నటించారు. గోల్డెన్ కపుల్..ఇక ప్రోసెంజిత్ విషయానికి వస్తే.. హీరోయిన్ రితుపర్ణ సేన్గుప్తతో కలిసి దాదాపు 50 సినిమాలు చేశాడు. వీరిని అభిమానులు గోల్డెన్ కపుల్ అని పిలుచుకుంటారు. ఇటీవలే వీరు అజోగ్యో మూవీలో జంటగా నటించారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి.చదవండి: శాండల్‌వుడ్ హీరో దర్శన్.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు! -
రోజుకు మూడుసార్లు వంటగదిలో పని చేయాలన్నాడు: సీనియర్ నటి
ప్రేమపెళ్లిళ్లు అనేవి బాలీవుడ్లో ఎప్పటినుంచో ఉన్నవే! మనసులు కలిశాక మనుషులు ఒక్కటైన సంఘటనలు కోకొల్లలు. బాలీవుడ్ సీనియర్ జంట షర్మిల ఠాగోర్- మన్సూర్ అలీ ఖాన్ పటౌడీలు కూడా ఇదే కోవలోకి వస్తారు. వీరిద్దరూ ప్రేమ బంధాన్ని 1968లో పెళ్లితో పదిలపర్చుకున్నారు.కిచెన్‌లోకి నోపెళ్లైన కొత్తలో జరిగిన విషయాలను తాజాగా ఓ షోలో గుర్తు చేసుకుంది షర్మిల. 'నా భర్త నన్ను రోజుకు మూడుసార్లు వంటగదికి వెళ్లాలని చెప్పాడు. ఇది చాలా చెడ్డ ఆలోచన.. నేను అన్నిసార్లు కిచెన్‌కు వెళ్లానంటే నీకే కష్టమవుతుందని భర్తకు వార్నింగ్ ఇచ్చాను. ఇదెక్కడుంది? ఆ వస్తువు ఎక్కడుంది? నాకు ఏదీ దొరకడం లేదంటూ నీ వెంటే పడతానని హెచ్చరించాను.అతడే స్వయంగా..దానికంటే నేను వంటగదికి వెళ్లకపోవడమే మేలని చెప్పాను. దీంతో అతడు తన వంట తానే చేసుకోవాల్సి వచ్చింది. నేను తెలివిగా అతడు వంటగదిలోకి వచ్చేలా చేశాను. ఏమాటకామాట కిచెన్‌లో అద్భుతాలు చేసేవాడు. యూట్యూబ్‌లో చూసి కొత్తరకం వంటలు చేసేవాడు. దానివల్ల తను మరింత కాన్ఫిడెంట్‌గా తయారయ్యాడు. అద్భుతంగా వండుతాడుఓసారి నేను లండన్‌లో ఉన్నప్పుడు ఒకరు నాకు కాల్ చేసి నీ భర్త వంట ఎంత సూపర్‌గా చేశాడో.. అని కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను కిచెన్‌లోకి వెళ్లకపోవడం వల్లే అతడు అమోఘంగా వంటలు చేయగలిగాడు' అని షర్మిల చెప్పుకొచ్చింది. మన్సూర్ అలీ ఖాన్- షర్మిల ఠాగోర్లకు సైఫ్, సబా, సోహా అలీ ఖాన్ అని ముగ్గురు సంతానం. కాగా క్రికెటర్ మన్సూర్ 2011లోనే కన్నుమూశాడు.చదవండి: భర్తతో విడాకులు ప్రకటించిన తెలుగు నటి.. అర్థం చేసుకోండంటూ.. -
నా సంపాదన.. భర్తతో పంచుకోలే: సీనియర్ హీరోయిన్
షర్మిల ఠాగూర్.. బెంగాలీ, హిందీ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా వెలుగొందింది. సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలకుగానూ ఫిలింఫేర్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు పొందింది. 2013లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. ఈమె క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి సైఫ్ అలీ ఖాన్ అనే కుమారుడితో పాటు సబ, సోహ అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మన్సూర్ 2011లోనే కాలం చేశాడు. తర్వాత సినిమాలవైపే వెళ్లని షర్మిల గతేడాది గుల్మొహర్ అనే సినిమాతో మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ముగ్గురికీ సమానంగా వీలునామా.. తాజాగా తన పర్సనల్ ఫైనాన్స్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. 'నేను కొన్న నగలు, కార్లు, ఇళ్లు.. ఇలా ఏవైనా సరే అవన్నీ నా పేరు మీదే ఉంటాయి. ఆ ఆస్తిని భర్తతో కూడా పంచుకోలేదు. అతడు కూడా తను సంపాదించిన ఆస్తులను తనే మేనేజ్ చేసుకునేవాడు. చనిపోవడానికి ముందే ఏవి ఎవరికి చెందాలనేది వీలునామా రాశాడు. నా ఆస్తులు కూడా నా ముగ్గురు పిల్లలకు సమానంగా పంచుతాను. ఆర్థిక విషయాలపై నాకంత అవగాహన లేకపోయేది. కానీ లాక్డౌన్లో నాకంటూ ఓ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకున్నాను. అప్పటినుంచే దీనిపై ప్రత్యేక దృష్టి సారించాను' అని చెప్పుకొచ్చింది. చదవండి: నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం -
బ్లాక్‌బస్టర్ మూవీ.. క్యాన్సర్ వల్ల వదిలేసుకున్న హీరోయిన్!
సినీ ఇండస్ట్రీలో దీర్ఘకాలం కొనసాగడం హీరోలకు చాలా మామూలు విషయం. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా ఉండదు. వరుస ఫ్లాపులు వచ్చినా, వయసు మీదపడ్డ ఛాయలు కనిపించినా, శరీరాకృతిలో మార్పులు వచ్చినా వెంటనే రిజెక్ట్ చేస్తారు. స్టార్ హీరోయిన్గా కీర్తి అందుకున్నా సరే కొద్దికాలానికే తెరమరుగు అవుతుంటారు. కానీ కొందరే తమకు ఎదురయ్యే ఆటంకాలను దాటుకుని ఎక్కువ కాలంపాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. అలాంటివారిలో సీనియర్ హీరోయిన్ షర్మిల ఠాగూర్ ఒకరు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు నటిగా కొనసాగిన ఈమె ఇటీవలే గుల్మొహర్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ పాత్ర షర్మిల చేయాల్సింది తాజాగా హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే 'కాఫీ విత్ కరణ్' షోకి హాజరైన షర్మిల తాను క్యాన్సర్‌తో పోరాడిన విషయాన్ని బయటపెట్టింది. ముందుగా యాంకర్, నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ.. 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని సినిమాలో షబానా అజ్మీ పోషించిన పాత్ర షర్మిల చేయాల్సింది. ముందు తననే అడిగాను. కానీ తన అనారోగ్య కారణాల వల్ల ఆమె చేయనని చెప్పింది. తనతో పని చేయలేకపోయానన్న బాధ మాత్రం నాకు అలాగే ఉండిపోయింది' అన్నాడు కరణ్. క్యాన్సర్‌తో పోరాడిన సీనియర్ హీరోయిన్ దీనికి షర్మిల స్పందిస్తూ.. 'తను నాకు సినిమా ఆఫర్ ఇచ్చినప్పుడు కరోనా పీక్స్‌లో ఉంది. నేను వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. పైగా అప్పుడే నేను క్యాన్సర్ నుంచి కోలుకున్నాను. అందుకే నేను రిస్క్ చేయడానికి నా ఫ్యామిలీ ఒప్పుకోలేదు' అని చెప్పుకొచ్చింది. తాను ఎప్పుడు క్యాన్సర్ బారిన పడింది? ఎలా కోలుకుంది? అన్న విషయాలనేమీ వివరించలేదు. ఆమె క్యాన్సర్‌తో పోరాడిన విషయం తెలిసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. సత్తా చాటిన హీరోయిన్ కాగా ఈమె సత్యజిత్ రే 'ద వరల్డ్ ఆఫ్ అపు' అనే బెంగాలీ సినిమాతో 14 ఏళ్ల వయసులోనే వెండితెర ప్రవేశం చేసింది. కొంతకాలానికే బాలీవుడ్లో ప్రవేశించి అక్కడా జెండా పాతింది. ఆరాధన, మౌసమ్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన షర్మిల ఇటీవలే గుల్మొహర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి సైఫ్, సోహ, సబ అని ముగ్గురు సంతానం. సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ ప్రభుత్వం షర్మిలను 2013లో పద్మభూషణ్‌తో సత్కరించింది. చదవండి: నల్లగా ఉన్నాడని హేళన.. ఏడాదిలో 18 సినిమాలు -
Sharmila Tagore Celebrates 79th Birthday: హీరో సైఫ్ అలీ ఖాన్ తల్లి 79వ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
తొలిసారి నెగటివ్ రోల్లో ఒకరు.. ఎమోషనల్ కేరెక్టర్లో మరొకరు.. ఇంకా
ఒకరు నెగటివ్‌గా కనిపించనున్నారు. ప్రేక్షకులు ఎప్పుడూ ఆమెను అలాంటి పాత్రలో చూడలేదు. ఇంకొకరు కన్నీళ్లు తెప్పించే పాత్రతో వచ్చారు.. అలాంటి పాత్రతో వచ్చినందుకు ఆనందభాష్పాలను ఆపుకోలేకపోయారామె. మరొకరు కథానాయికగా కనుమరుగై.. చెల్లెలిగా రిటర్న్ అవుతున్నారు. నటనకు ఒక్కసారి బ్రేక్ ఇచ్చాక మళ్లీ నటించాలంటే ఆ క్యారెక్టర్ ఎంతో బలమైనది అయ్యుంటేనే ఆ ఆర్టిస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. జయా బచ్చన్, షర్మిలా ఠాగూర్, జీవితలకు అలాంటి పాత్రలే దొరికాయి. అందుకే బ్రేక్‌లు తీశారు.. నటిగా మేకప్ వేసుకున్నారు. ఒక్కప్పటి ఈ స్టార్స్ రిటర్న్ కావడం అభిమానులకు ఆనందమే కదా. ఇక ఈ ముగ్గురి చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నెగటివ్‌గా... జయా బచ్చన్ కెరీర్ దాదాపు 60 ఏళ్లు. ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్లో నటిగా ఎన్నో అద్భుత పాత్రలు చేశారామె. కెరీర్ ఆరంభంలో ‘గుడ్డి’ (1971)లో చేసిన పాత్రతో ‘గర్ల్ నెక్ట్స్ డోర్’ ఇమేజ్ తెచ్చుకున్న జయ ఆ తర్వాత ‘జవానీ దివానీ’లో గ్లామరస్ రోల్లో మెప్పించారు. అలాగే అనామిక (1973)లో కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్ర చేసి, భేష్ అనిపించుకున్నారు. అయితే ఇన్నేళ్ల కెరీర్లో జయ పూర్తి స్థాయి నెగటివ్ క్యారెక్టర్ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారు. ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో లేడీ విలన్‌గా కనిపించనున్నారామె. దాదాపు ఏడేళ్ల తర్వాత జయా బచ్చన్ ఒప్పుకున్న చిత్రం ఇది. కరణ్ జోహార్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయా బచ్చన్‌తో కరణ్ నెగటివ్ క్యారెక్టర్ గురించి చెప్పగానే ‘‘నేనా? నన్నే తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు?’ అని ఆమె అడిగారు... ‘మీరే చేయాలి’ అంటూ జయాని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు కరణ్. ఫైనల్‌గా ‘ఓకే’ అన్నారామె. అయితే ఈ పాత్రని అర్థం చేసుకుని, ఒక క్రూరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తిలా నటించడానికి జయ కొన్నాళ్లు ఇబ్బందిపడ్డారట. ఆ తర్వాత పూర్తిగా ఆ పాత్రలోకి లీనం కాగలిగారని, నెగటివ్ క్యారెక్టర్ని ఆమె ఎంజాయ్ చేస్తున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా రూపొందిన ఈ చిత్రం జులై 28న విడుదల కానుంది. పుష్కర కాలం తర్వాత... పుష్కర కాలం తర్వాత షర్మిలా ఠాగూర్ ఓ సినిమా చేశారు. ఈ నెల 3న విడుదలైన ‘గుల్మోహార్’లో ఆమె ఇంటి పెద్దగా లీడ్ రోల్ చేశారు. గుల్ మోహార్ అనే తమ ఇంటిని అమ్మేసి, తాను వేరే రాష్ట్రానికి వెళతానని ఇంటి పెద్ద కుసుమ్ బాత్రా (షర్మిలా ఠాగూర్ పాత్ర) చెబుతారు. అప్పుడు ఆ కుటుంబ సభ్యుల భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ‘బ్రేక్ కే బాద్’ (2010) సినిమా తర్వాత మళ్లీ మంచి పాత్రలు వచ్చేంతవరకూ బ్రేక్ తీసుకోవాలనుకున్నారు షర్మిలా. ‘గుల్మోహార్’లో తన పాత్ర కీలకం కావడంతో పాటు మంచి ఎమోషన్స్ కనబరిచే చాన్స్ ఉన్నందున ఆమె అంగీకరించారు. ఈ సినిమా ప్రివ్యూ చూసి, షర్మిలా ఏడుపు ఆపుకోలేకపోయారు. ‘‘పన్నెండేళ్ల తర్వాత ఒక మంచి పాత్రలో తెరపై కనిపించడంతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. ఈ సినిమాని మూడుసార్లు చూశాను. చూసిన ప్రతిసారీ ఏడ్చాను. అంతగా ఈ పాత్రతో కనెక్ట్ అయ్యాను’’ అని షర్మిలా పేర్కొన్నారు. చెల్లెలిగా... కథానాయికగా గర్ల్ నెక్ట్స్ డోర్ అనదగ్గ పాత్రల్లో కనిపించారు జీవిత. ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’ వంటి చిత్రాల్లో చేసిన పాత్రలతో మంచి నటి అనిపించుకున్నారామె. ‘మగాడు’ (1990) తర్వాత నటిగా వేరే సినిమాలు ఒప్పుకోలేదు. ఇప్పుడు రజనీకాంత్ అతిథి పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’లో నటించడానికి జీవిత ఒప్పుకున్నారు. ఇందులో ఆమెది రజనీ చెల్లెలి పాత్ర. ‘‘నా కెరీర్లో రజనీ సార్‌తో సినిమా చేయలేదు. ఇప్పుడు కుదిరినందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఒప్పుకోవడానికి కొంత టైమ్ తీసుకున్నాను. ‘మీరు స్క్రీన్‌పై కనిపించి చాలా రోజులైంది కాబట్టి.. చేస్తే బాగుంటుంది’ అని ఐశ్వర్య అనడం, నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఓకే చెప్పాను’’ అని పేర్కొన్నారు జీవిత. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె కనిపించనున్న చిత్రం ఇది. కాగా నటిగా ఇన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నిర్మాతగా ‘గడ్డం గ్యాంగ్, దెయ్యం’ వంటి చిత్రాలను నిర్మించారు. గత ఏడాది ‘శేఖర్’ చిత్రానికి దర్శకత్వం వహించారు జీవిత. -
మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే!
మన దేశంలో రెండు వినోద ప్రధానాంశాలు.. క్రికెట్- సినిమా. చాలా మంది క్రికెట్‌ను ఓ మతంలా ఆరాధిస్తే.. సినిమాను ప్రేమించే వాళ్లూ కోకొల్లలు. ఈ రెండిటి మధ్య.. ముఖ్యంగా బాలీవుడ్- క్రికెట్ మధ్య విడదీయరాని అనుబంధం ఉందని ఇప్పటికే ఆయా రంగాల సెలబ్రిటీలు పలువురు నిరూపించారు. ప్రేమ పక్షుల్లా విహరిస్తూ పాపరాజీలకు పని కల్పించిన వారు కొందరైతే.. ప్రణయాన్ని వైవాహిక బంధంగా మార్చుకుని పెళ్లిపీటలెక్కిన వారు మరికొందరు. ఆ జాబితాలో తాజాగా క్రికెటర్ కేఎల్ రాహుల్- బీ-టౌన్ సెలబ్రిటి అతియా శెట్టి జంట కూడా చేరిన విషయం తెలిసిందే. మరి ఈ ‘లవ్‌బర్డ్స్’ కంటే ముందు వివాహ బంధంతో ముడిపడి సక్సెస్ అయిన క్రికెట్- బాలీవుడ్ జోడీలు ఎవరంటే! మన్సూర్ అలీ ఖాన్ పటౌడ్- షర్మిలా ఠాగోర్ భారత క్రికెట్లో లెజండరీ ఆటగాడిగా పేరొందిన మన్సూర్ అలీ ఖాన్ పటౌట్ అలియాస్ టైగర్ పటౌడీ. పిన్న వయసులోనే టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన టైగర్ మనసును గెలుచుకున్న మహరాణి.. షర్మిలా ఠాగోర్. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఆమె.. టైగర్‌ను పెళ్లాడి నవాబుల కోడలైంది. ఇరు కుటుంబాల అంగీకారంతో 1968లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ముగ్గురు సంతానం. కుమారుడు సైఫ్ అలీఖాన్, కుమార్తెలు సోహా, సబా. హర్భజన్ సింగ్- గీతా బస్రా భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు భజ్జీ. కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూసిన టర్బోనేటర్.. 2011 ప్రపంచకప్ విజయంలో తన వంతు సాయం చేశాడు. తన ఆటతో అభిమానులను ముగ్ధుల్ని చేసిన ఈ ఆఫ్ స్పిన్నర్.. బాలీవుడ్ నటి గీతా బస్రా కొంటెచూపులకు బౌల్డ్ అయ్యాడు. ది ట్రెయిన్, దిల్ దియా హై వంటి సినిమాల్లో నటించిన గీతను 2015లో పంజాబీ సంప్రదాయంలో అంగరంగవైభవంగా పెళ్లాడాడు. వీరికి కుమార్తె హినయ హీర్ ప్లాహా, కుమారుడు జోవన్వీర్ సింగ్ ప్లాహా సంతానం. యువరాజ్ సింగ్- హాజిల్ కీచ్ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎన్నో రికార్డులు సృష్టించి కెరీర్లో శిఖరాగ్రాలను చూసిన యువరాజ్ సింగ్- నటి హాజిల్ కీచ్ ప్రేమ ముందు మాత్రం తలవంచాడు. క్యాన్సర్ బాధితుడైన యువీని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన హాజిల్.. 2016లో అతడితో కలిసి పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. వీరి ప్రేమకు గుర్తుగా కుమారుడు ఓరియన్ ఉన్నాడు. కాగా సల్మాన్ ఖాన్- కరీనా కపూర్ జంటగా నటించిన బాడీగార్డ్ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా హాజిల్ నటించింది. జహీర్ ఖాన్- సాగరికా ఘట్కే టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన లెఫ్టార్మ్ పేసర్ జహీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టెస్టు క్రికెట్లో టీమిండియా తరఫున మూడు వందల వికెట్లు తీసిన జాక్.. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎక్కువగా బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడే జహీర్ ఖాన్.. 2017లో స్వయంగా తనే తన వివాహ ప్రకటన చేశాడు. బాలీవుడ్ నటి సాగరిక ఘట్కేను ప్రేమించి పెళ్లాడనున్నట్లు వెల్లడించాడు. హాకీ నేపథ్యంలో సాగే ‘చక్ దే ఇండియా’ సినిమాలో ప్రీతి పాత్రలో నటించిన అమ్మాయే సాగరిక! విరాట్ కోహ్లి- అనుష్క శర్మ టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమకథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ షాంపూ యాడ్‌లో అనుష్కను చూసిన ఈ పరుగుల వీరుడు తన మనసు పారేసుకున్నాడు. తమ బంధాన్ని బాహాటంగానే ప్రకటించిన విరుష్క జోడీ.. దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2017 డిసెంబరులో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి దాంపత్యానికి గుర్తుగా కుమార్తె వామిక జన్మించింది. హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్ పాండ్యా.. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం క్యాష్ రిచ్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అరంగేట్ర సీజన్లోనే తమ జట్టును విజేతగా నిలిపి.. భారత జట్టులో పునరాగమనం చేయడంతో పాటుగా భవిష్యత్తు సారథిగా మన్ననలు అందుకుంటున్నాడు. ఇక హార్దిక్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. సెర్బియా మోడల్, బీ-టౌన్ నటి నటాషా స్టాంకోవిక్‌తో ప్రేమలో పడిన అతడు.. 2019లో తనతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకున్న ఈ జంట.. అంతకంటే ముందే కుమారుడు అగస్త్యకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించింది. కాగా నటాషా ప్రకాశ్ ఝా దర్శకత్వం వహించిన సత్యాగ్రహ సినిమాతో నటిగా గుర్తింపు పొందింది. కేఎల్ రాహుల్- అతియా శెట్టి టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్- బాలీవుడ్ వెటరన్ నటుడు సునిల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టితో చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్నాడు. 2019లో ప్రేమలో పడ్డ వీళ్లిద్దరు 2021లో తమ బంధం గురించి అందరికీ తెలిసేలా సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్నారు. ఇక రాహుల్ బిజీ షెడ్యూల్ కారణంగా వివాహాన్ని వాయిదా వేసుకున్న ఈ జంట.. ఎట్టకేలకు జనవరి 23, 2023లో పెళ్లిపీటలెక్కింది. సునిల్ శెట్టికి చెందిన ఖండాలా ఫామ్‌హౌజ్‌లో వీరి వివాహం అత్యంత సన్నిహితుల నడుమ జరిగింది. ఇదిలా ఉంటే అజాహరుద్దీన్- సంగీత బిజ్లానీ పెళ్లి చేసుకున్నప్పటికీ బంధాన్ని కొనసాగించలేకపోయారు. ఇక రవిశాస్త్రి- అమృతా సింగ్, సౌరవ్ గంగూలీ- నగ్మా, రవిశాస్త్రి- నిమ్రత్ కౌర్ తదితరుల పేర్లు జంటలుగా వినిపించినప్పటికీ వీరి కథ సుఖాంతం కాలేదు. -వెబ్‌డెస్క్ చదవండి: Mohammed Shami: షమీకి ఏడాదికి రూ. 7 కోట్లు! నెలకు 10 లక్షల భరణం ఇవ్వలేరా? కోర్టు కీలక ఆదేశాలు అర్జున్ దగ్గర అన్నీ ఉన్నాయి.. నా దగ్గర నువ్వు ఉన్నావు, చాలు నాన్న: సర్ఫరాజ్ ఖాన్ -
ఆయన క్యాచ్ జారవిడిస్తే.. నాకు తిట్లు పడేవి: నటి
క్రికెటర్లు పెళ్లి చేసుకుని భార్యలతో టోర్నమెంట్లకు వస్తే, వచ్చాక సరిగా ఆడకపోతే ఆ భార్యలను ట్రోల్ చేసే అభిమానులు ఉన్నారు. విరాట్ కోహ్లి విఫలమైనప్పుడల్లా అనుష్క శర్మ ఈ విషయంలో బాగా ఇబ్బంది పడ్డారు. అయితే అనుష్కా మాత్రమే కాదని... తాను కూడా పటౌడి సరిగ్గా ఆడకపోతే తిట్లు తిన్నానని షర్మిలా టాగోర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘పటౌడి గారు మా పెళ్లి సమయానికి ఇంకా ఆడుతున్నారు. ఆయన బరిలో దిగితే బాగా ఆడతారని పేరు. కాని మా పెళ్లయ్యాక ఆయన క్యాచ్ జార విడిచినా, సరిగ్గా బ్యాటింగ్ చేయకపోయినా నాకు తిట్లు పడేవి. అయితే అభిమానుల నుంచి కాదు. మా నాన్న నుంచే. ఆయన కామెంటరీ వింటూ ‘‘అరె... నువ్వతన్ని రాత్రి సరిగ్గా నిద్ర పోనిచ్చావా లేదా’ అని నా మీద కయ్యిమనేవారు’ అని తిట్టేవారు’’ అని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. షర్మిలా టాగోర్, పటౌడీలకు సైఫ్ అలీ కాకుండా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోహా అలీ ఖాన్, సాబా అలీ ఖాన్. అయితే వీరెవరికీ ఆమె ఇతర హీరోలతో కలిసి నటించిన సినిమాలు చూడటం ఇష్టం లేదు. చూడరు కూడా. సాబా అలీ ఖాన్ మాత్రం ‘నువ్వు నటించిన చుప్కే చుప్కే మాత్రం నాకు చాలా ఇష్టం’ అంటూ ఉంటుంది. పిల్లలు ముంబైలో ఉంటున్నా షర్మిలా ఢిల్లీలో నివసిస్తుంటారు. చదవండి: ఇక నుంచి మా అమ్మ సలహా తర్వతే సైన్ -
ఇక నుంచి మా అమ్మ సలహా తర్వతే సైన్
76 ఏళ్ల షర్మిలా టాగోర్‌కు ఈ వయసులో తల్లిగా ఆందోళన పట్టుకొంది. కొడుకు సైఫ్ అలీఖాన్ చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడని కాదు. చెడ్డ స్క్రిప్ట్‌ల వల్ల చికాకుల్లో పడుతున్నాడని. దానికి కారణం ‘తాండవ్’ వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్‌లో జనవరిలో విడుదలైన 9 ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ రాజకీయ డ్రామాకు చెందినదే అయినా హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యానాలు మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని వివాదం చెలరేగింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ సిరీస్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, రచయిత గౌరవ్ సోలంకి, నటుడు జీషాన్ ఇంకా నిర్మాతల మీద కేసులు నమోదయ్యాయి. సైఫ్ ఇందులో నేరుగా లేకపోయినా అతను నటించాడు కనుక ఇదొక తలనొప్పిగా మారింది. పైగా సిరీస్ టీమ్ సుప్రీంకోర్టులో అరెస్టులు చేయకుండా రక్షణ ఇవ్వండి అనంటే సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. దాంతో సిరీస్ టీమ్‌కు టెన్షన్ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ ఏం తలనొప్పులు తెచ్చుకుంటాడోనని షర్మిలా టాగోర్ బెంగ పడుతోంది. ‘వాడు రొటీన్ వేషాలు ఇష్టపడడు. భిన్నమైనవి ఎంచుకుంటాడు. ఒక్కోసారి ఇలా జరుగుతుంటుంది’ అందామె. తల్లి ఆందోళన చూసి కొడుకు కూడా కొంచెం సర్దుకున్నాడు. ‘ఇక మీదట నేను ఓకే చేసే అసైన్మెంట్ల కథను మా అమ్మ వినాలి. ఆమె సలహా నేను తీసుకోవాలి’ అని ప్రకటించాడు. ఓటిటి ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఒక గజం ఆవలికి వెళ్లి కథను చెబుతున్నాయి. అయితే ఆ సాహసం అన్నిసార్లు సద్ఫలితాలే ఇవ్వవని ఈ ఉదంతం చెబుతోంది. -
అమ్మ మాట్లాడిన తీరు చూస్తే భయమేసింది: సైఫ్
ముంబై : లాక్డౌన్ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ , తన భార్య కరీనా కపూర్ ఖాన్, కొడుకు తైమూర్‌తో కలిసి ముంబైలోని ఇంట్లో ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ను సమయాన్ని సైఫ్.. తన ముద్దుల కొడుకు తైమూర్‌కు తోట పని నేర్పించడం, కరీనాతో వంట చేయడం వంటి పనులతో బిజీగా గడుపుతున్నాడు. అయితే సైఫ్ తన తల్లి, సీనియర్ నటి షర్మిలా ఠాగూర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంటోంది. దీంతో తన తల్లిని ఎంతగానో మిస్ అవుతున్నానని సైఫ్ అన్నారు. ఈ క్రమంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్ మాట్లాడుతూ.. లాక్డౌన్ కాలంలో తన తల్లి షర్మిలాతోపాటు సోదరీమణులు(సాబా, సోహా)గురించి తనెంత ఆందోళన చెందుతున్నాడో వివరించాడు. (సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఈ పెళ్లి ఇష్టం లేదు..) "నేను నా తల్లి గురించి ఆందోళన చెందుతున్నాను, కానీ ఆమె చాలా తెలివైనది. ఆమె తన పూర్తి జీవితాన్ని అనుభవించానని. తన జీవితంపై ఎలాంటి విచారం లేదని చెప్పింది. నా తల్లి నుంచి ఇలాంటి మాటలు వినడం, ఆమె మాట్లాడిన తీరు నన్నుభయాందోళనకు గురిచేస్తోంది. అలాగే నా ఇద్దరు సోదరీమణులు సాబా, సోహాను మిస్ అవుతున్నాను. ప్రస్తుతం వారిని చూడలేకపోతున్నాను. కానీ మేము తరచుగా ఫోన్ కాల్ ద్వారా టచ్‌లో ఉంటున్నాం. ఆపద సమయంలో ఉన్నప్పుడు మనం అన్ని, అందరినీ వదులుకోవాల్సి వస్తుంది. అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సైఫ్ లాక్‌డౌన్‌ను 19 వ శతాబ్ధపు ఓడతో పోల్చారు. ఓడలో ఉన్నప్పుడు భూమిని దూరం నుంచి చూడొచ్చు. కానీ మీరు నీటిలీ భూమికి మైళ్ల దూరంలో ఉన్నారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనం దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు. స్నేహితులతో దగ్గరగా ఉండటానికి వీలవుతుంది.’’ అంటూ సైఫ్ చెప్పుకొచ్చారు. (ఇంగ్లాండ్ బోర్డింగ్ స్కూల్‌కు తైమూర్!) -
అత్తగారూ కోడలూ
అత్తగారూ కోడలూ టీవీల్లో ఒకరినొకరు హింసించుకోవడం కనిపిస్తుంది. నిజ జీవితంలో వారు సఖ్యంగా ఉండరనే అపవాదు ఉంది. కాని ఒక సెలబ్రిటీ కోడలు తన సెలబ్రిటీ అత్తగారితో ఒక రేడియో షో నిర్వహించడం చాలామందిని ఆకట్టుకుంది. ‘ఇష్క్’ రేడియో 104.8 ముంబై, కోల్‌కతా, ఢిల్లీలో ప్రసారం అవుతోంది. ఇందులో కరీనా కపూర్ ‘వాట్ ఉమెన్ వాంట్’ (స్త్రీలకు ఏమి కావాలి?) అనే షో చేస్తోంది. మొదటి సీజన్ ముగిసి రెండో సీజన్ ప్రారంభం కాగా మొదటి ఎపిసోడ్లో తన అత్తగారూ సైఫ్ అలీ ఖాన్ తల్లి అయిన షర్మిలా టాగోర్తో సంభాషించింది. పది నిమిషాలకు పైగా సాగిన ఈ షోను యూ ట్యూబ్ ప్రచారం కోసం వీడియోగా కూడా అందుబాటులో ఉంచారు. కరీనా, షర్మిలా పక్కపక్కన కూచుని మాట్లాడుకోవడం అభిమానులను కుతూహలపరిచింది. ‘మీరు స్త్రీగా మీ కెరీర్‌ను కుటుంబాన్ని ఎలా అనుసంధానించుకున్నారు’ అని కరీనా అడిగితే ‘నా సినిమాలను మానుకోవడం ద్వారా’ అని షర్మిలా సమాధానం ఇచ్చారు. ‘పని చేసే భార్ య ఉన్నప్పుడు ఇంట్లో ఉండే భర్త– అంటే హౌస్ హజ్బెండ్స్ ఉండటం మన సమాజం అంగీకరించదు. అలా భర్తను ఇంట్లో ఉంచితే భార్యను తప్పుగా చూస్తుంది. స్త్రీలు అలా తప్పుగా చూడబడటాన్ని అంగీకరించరు. కనుక తాము ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటూ భర్తను పనికి పంపుతారు. నేను కూడా అలాగే చేయాల్సి వచ్చింది’ అని షర్మిలా అన్నారు. ‘కూతురికి కోడలికి తేడా ఏమిటి?’ అని కరీనా అడిగితే ‘కూతురు గురించి మనకు తెలిసి ఉంటుంది. కోడలి గురించి తెలియదు. మెల్లగా తెలుసుకోవాలి. అందుకు సమయం వెచ్చించాలి. ఓర్పు వహించాలి’ అని షర్మిల చెప్పారు. ‘కోడలిగా అడుగుపెట్టినప్పుడు నేను కూడా ఇబ్బంది పడ్డాను. నేను బెంగాలీని రైస్ తింటాను. టైగర్ (పటౌడి–భర్త) వాళ్లు రొట్టె తింటారు. నాకు చేపలు ఇష్టం. టైగర్‌కు ఇష్టం ఉండదు. ఇవన్నీ నడిచాయి. వీటిని అత్తాకోడళ్లు ఇద్దరూ అర్థం చేసుకోవాలి’ అని ఆమె అన్నారు. ఇద్దరూ కరీనా కుమారుడు తైమూర్ గురించి సోషల్ మీడియా ప్రదర్శిస్తున్న అటెన్షన్ గురించి కొద్దిగా ఆందోళన పడ్డారు. ‘మీ (నలుగురు) మనమలలో ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టం’ అని షర్మిలను అడిగితే ‘అమ్మో... ఒకరినని ఎలా చెప్పడం.. నలుగురూ నాలుగు విధాలా ఇష్టం’ అని చెప్పారామె. సైఫ్–అమృతాసింగ్‌ల కుమార్తె అయిన సారా ఇప్పుడు హీరోయిన్గా సఫలం కావడం పట్ల షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. అత్తాకోడళ్ల ఈ సంభాషణలో ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ మాట్లాడుకోవడం మంచి విషయంగా అనిపించింది. చాలామంది ఇలాగే ఉంటారని ప్రచారం చేయాల్సిన అవసరం కూడా కనిపించింది. -
‘నా మనవరాలిని చూస్తే గర్వంగా ఉంది’
కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సైఫ్ అలీఖాన్ తనయ సారా అలీఖాన్ ‘సింబా’తో సూపర్ హిట్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారు. అంతేకాదు చేసింది రెండు సినిమాలే అయినా స్టార్ కిడ్‌గా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో సారా నానమ్మ, పాత తరం హీరోయిన్ షర్మిలా ఠాగూర్ ఆమెపై ప్రశంసలు కురిపించారు. లైఫ్ టైమ్ అవార్డు అందుకునేందుకు ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన షర్మిలా ఠాగూర్ మాట్లాడుతూ... ‘ సారా సినిమాలు, ఇంటర్వ్యూలు చూశాను. తను పరిణతితో మాట్లాడుతోంది. అద్భుతంగా నటిస్తోంది. వృత్తి పట్ల తన అంకిత భావం అమోఘం. నిరాండంబరంగా ఉండేందుకే మొగ్గు చూపుతుంది. మానవత్వం గల వ్యక్తి. అయితే అన్నింటి కన్నా కూడా పెద్దల పట్ల సారాకున్న మర్యాద, వారితో ప్రవర్తించే తీరు నన్నెంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే సారాను చూస్తే నాకెంతో గర్వంగా ఉంటుంది’ అని మనవరాలిపై అభిమానాన్ని చాటుకున్నారు. కాగా సారా... సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కూతురన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘లవ్ ఆజ్కల్2’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సారాకు జంటగా కార్తిక్ ఆర్యన్ నటిస్తున్నాడు. -
మావాడు ఆ సినిమాలు చేయడం సరికాదు
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించిన బుల్లెట్ రాజా, హమ్‌షకల్స్, హ్యాపీ ఎండింగ్, ఫాంటమ్ తదితర సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. సైఫ్ సినిమాలపై అతని తల్లి, ఒకప్పటి హీరోయిన్ షర్మిలా ఠాగూర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. గత కొన్నేళ్లుగా సైఫ్ సినిమాల ఎంపిక సరిగా లేదని షర్మిల అంది. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ.. సైఫ్ భార్య, నటి కరీనా కపూర్ తనకు కూతురు వంటిదని చెప్పింది. సైఫ్, కరీనాల్లో బెస్ట్ యాక్టర్ ఎవరన్నప్రశ్నకు.. 'ఇద్దరూ మంచి నటులే' అంటూ నవ్వుతూ సమాధానిమిచ్చింది. ఒకప్పుడు బాలీవుడ్లో అగ్రశ్రేణి హీరోయిన్గా వెలుగొందిన షర్మిల.. టీమిండియా మాజీ క్రికెటర్ టైగర్ పటౌడీని వివాహం చేసుకుంది. తన భర్తతో గడిపిన క్షణాలు చిరస్మరణీయమైనవని గుర్తు చేసుకుంది. -
అప్పుడే కదా ఫ్యామిలీలో హ్యాపీ
బాలీవుడ్ అందాల తార సోహా అలీఖాన్ నగరంలో తళుక్కుమన్నారు. తన తల్లి, అలనాటి అందాల నటి షర్మిలా ఠాగూర్‌తో కలిసి గురువారం నగరంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని అభిమానులతో ముచ్చటించారు. శ్రీనగర్‌కాలనీ: సమానత్వం మా ఇంట్లో ఉంటుందని, తన భర్త పటౌడి లాండ్రీ బాగా చేస్తారని అలనాటి మేటి నటి షర్మిలా ఠాగూర్ కితాబివ్వగా కూతురు హీరోయిన్ సోహా అలీఖాన్ అవునంటూ చమత్కరించారు. గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్‌దక్కన్‌లో ఏరియల్-వర్ల్‌పూల్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న డాడ్స్ టు షేర్ ద లోడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమానత్వం కోసం, తండ్రులకు భారాన్ని తగ్గించి వారికి తోడుగా ఉండేలా చేస్తూ విలువలను కాపాడే ప్రయత్నమే ఈ కార్యక్రమమని, ఇందులో తాను, అమ్మ భాగస్వామిని కావడం సంతోషంగా ఉందని నటి సోహా అలీఖాన్ అన్నారు. ఇంటి పనులు కేవలం ఆడవారే చేయాలనే అపోహ దేశంలో ఉందని, అలాకాకుండా ఆ భారాన్ని మగవారు కూడా పంచుకుంటే కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. పిల్లలు సైతం చిన్నతనం నుండే ఈ విధానానికి అలవాటుపడతారని నటి షర్మిలా ఠాగూర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా షేర్ ద లోడ్ ప్యాక్‌ను ఆవిష్కరించారు. -
పాక్ నుంచి వెనక్కొచ్చిన షర్మిళ
లాహోర్: పాకిస్తాన్లో ఉండేందుకు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అంగీకరించినప్పటికీ నటి, సైఫ్ అలీఖాన్ తల్లి షర్మిళ ఠాకూర్ భారత్‌కు వెనక్కి వచ్చారు. ట్రావెల్ డాక్యుమెంట్లలో పోలీస్ రిపోర్టు లేదన్న కారణంతో ఆదివారం వాఘా సరిహద్దు వద్ద ఎఫ్ఐఏ (ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులు.. పాక్‌లో ఉండేందుకు షర్మిళకు అనుమతినివ్వలేదు. దీంతో సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి షర్మిళతో పాటు ఉన్న అధికారులు ఫాక్స్ ద్వారా ‘రిపోర్టు’ను తెప్పించారు. షర్మిళ తన పర్యటనలో భాగంగా లాహోర్ లిటరరీ ఫెస్టివల్లో పాల్గొన్నారు. తమ నివాసం ‘జతి ఉమ్రా’లో తమ కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేయాల్సిందిగా ఆమెను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానించారు. అయితే అధికారుల తీరుతో మనసు మార్చుకున్న షర్మిళ.. భారత్‌కు వెనక్కి వచ్చేశారు. -
డిసెంబర్ 8న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ధర్మేంద్ర (నటుడు), షర్మిలా ఠాగూర్ (నటి నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యసంబంధ సంఖ్య కావడం వల్ల స్వతస్సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు, జీవితంలో పైకి రావాలనే కోరిక బలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. పెద్దలతో, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి, వాటిని తమ ఉన్నతికి ఉపయోగించుకుంటారు. అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. అధికారుల సహకారంతో, పట్టుదలతో అనుకున్న పనులన్నింటినీ అవలీలగా సాధిస్తారు. ఇల్లు, ఆస్తులు కొనుక్కోవాలనే కోరిక తీరుతుంది. వీరు పుట్టిన తేదీ 8 శనికి సంబంధించిన సంఖ్య కాబట్టి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు ఒక గాడిన పడతాయి. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. సామాజిక పరమైన ఉన్నతి, గుర్తింపు లభిస్తాయి. నష్టాలలో ఉన్న వ్యాపారాలు, పరిశ్రమల వంటివి లాభాల బాట పడతాయి. పాతస్నేహాలు, పాత బంధుత్వాలు తిరిగి కలుస్తాయి. లక్కీ నంబర్స్: 1,3, 5,6,8; లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, శుక్ర, శనివారాలు; లక్కీ కలర్స్: రోజ్, బ్లూ, బ్లాక్, ఎల్లో, సిల్వర్, గోల్డెన్. సూచనలు: రుద్రాభిషేకం చేయించుకోవడం, ఆదిత్య హృదయం పఠించడం, తండ్రిని, తత్సమానులను గౌరవించడం, తోబుట్టువులను ఆదరించడం, వికలాంగులకు సహాయం చేయడం, శనికి తైలాభిషేకం, కాకులకు,శునకాలకు ఆహారం పెట్టడం, మంచిది - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
నేను హైదరాబాద్‌లో పుట్టలేదు
‘సినిమాలు నాకు ఎన్నో విషయాలు నేర్పాయి. నిజానికి ఎవరికైనా సినిమా జీవితం రావడం ఒక ఉత్తమ గురువు. వ్యక్తిగత జీవితం కూడా పబ్లిక్ అయ్యే పరిస్థితి. అదే సమయంలో ఎక్కడికి వె ళ్లినా గొప్ప గుర్తింపు’ అంటూ సినిమా జీవితంలోని వైరుధ్యాలను వెల్లడించారు సీనియర్ బాలీవుడ్ నటి, పద్మభూషణ్ షర్మిలా ఠాగూర్. బుధవారం నగరంలో యంగ్ ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సెలబ్రేట్ ఉమెన్హుడ్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు. హైదరాబాద్ : వికీపీడియాలో చెప్పినట్టుగా నేను 1946లో హైదరాబాద్‌లో పుట్టలేదు. 1944లో కాన్పూర్‌లో పుట్టాను. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వంశంలో 5వ తరం మహిళను. నన్ను నటిగా జనం గుర్తించడం మొదలుపెట్టాక, వారి హృదయాల్లో స్థానం సంపాదించగలిగాను. అప్పుడే గ్లామర్ గాళ్ అనే ఇమేజ్ నుంచి దూరమవ్వాలనే ఆలోచన.. ఇంకా మంచి పేరు పొందాలనే తపన పెరిగింది. ‘ఈవెనింగ్ ఇన్ ప్యారిస్’ సినిమా పెద్ద హిట్. తర్వాత నేను టైగర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీని కలిశాను. ఆ తర్వాత ‘ఆరాధన’ సినిమా రిలీజ్. ‘మౌసమ్’లో తల్లి, కూతురు పాత్రలు చేయడం ఎంజాయ్ చేశాను. ఏ పాత్రలో నటించినా, అది పూర్తి చేసిన వెంటనే అందులో నుంచి బయటకు వచ్చేయడం నా పద్ధతి. పెళ్లి ఓ గొప్ప బాధ్యత.. పెళ్లి, పిల్లల్ని కనడం ద్వారా మనం సొసైటీలో పెద్ద భాగం అవుతాం. మరింత మందితో కలిసి జీవించడం నేర్చుకుంటాం. మన బాధ్యతలూ ఇనుమడిస్తాయి. ఆది నుంచీ మాది ఉమ్మడి కుటుంబం. అందుకే షేరింగ్, కేరింగ్, సర్దుబాటు సహజంగానే వచ్చేసింది. టైగర్, నేను పాత కాలపు కుటుంబాల నుంచి వచ్చాం. మాకు కొన్ని ఆహారపు అలవాట్ల దగ్గర తప్ప పెద్ద వ్యత్యాసాలేవీ రాలేదు. పంచుకోవడాన్ని మరచిపోతున్నాం.. ప్రస్తుత తరం షేరింగ్, కేరింగ్ గురించి మరచిపోతున్నారు. టీవీ ఎదురుగా కూర్చుని భోజనాలే తప్ప కబుర్లతో కలిసి తినడం తగ్గిపోయింది. కలిసి జీవించడమనే కుటుంబ బంధం క్షీణిస్తోంది. మొబైల్, ఇంటర్నెట్ యుగం అన్నింటినీ మార్చేసింది. సినిమా ప్రొఫెషన్.. ఫ్యాషన్ అయింది నేను నటన ప్రారంభించినప్పుడు ఈ ప్రొఫెషన్‌కు అంత ఆదరణ లేదు. అయితే, కాలక్రమంలో యువతులు ఎంచుకుంటున్న టాప్ ప్రొఫెషన్లో ఒకటిగా మారింది. విదేశాలకు వెళితే ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో చదువు ఆపేసి మరీ పిల్లలు సినిమాల్లో నటిస్తామంటూ వస్తున్నారు. అయితే ఇది కఠినమైన వృత్తి. యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కొందరు నన్ను తక్కువగా చూసేవారు. మరికొందరు నా సినిమాలు అందులోని పాత్రల గురించి మాత్రమే మాట్లాడేవారు తప్ప నన్ను నన్నుగా చూసేవారు కాదు. అయితే ఒక మనిషి జీవితాన్ని అతని చదువు మాత్రమే నిర్మిస్తుందనేది వాస్తవం. నాకు 3 డాక్టరేట్స్ ఉన్నా, జీవితమనే విశ్వవిద్యాలయంలో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. -
'నేను గ్లామర్‌గా కనిపిస్తేనే మా అత్తకు ఇష్టం'
ముంబై: కరీనా కపూర్ గ్లామర్ పాత్రల్లో కనిపిస్తేనే ఆమె అత్త, అలనాటి నటి షర్మిల ఠాగూర్‌కు ఇష్టమట. ఈ విషయాన్ని కరీనాయే చెప్పింది. షర్మిల కొడుకు, హీరో సైఫ్ అలీఖాన్ కరీనాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 'మా అత్త షర్మిలకు నన్ను గ్లామర్ పాత్రలో చూడటానికే ఇష్టపడతారు. దబాంగ్ 2 చిత్రంలో నేను చేసిన ఫెవికాల్ ఐటమ్ సాంగ్ ఆమెకు చాలా ఇష్టం. ఈ పాట, నా డాన్స్ అంటే ఎంతో ఇష్టం. నేను సెక్సీ, గ్లామర్‌గా కనిపించాలని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు' అని కరీనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. షర్మిల తనకు స్ఫూర్తి అని కరీనా చెప్పారు. పెళ్లయి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా షర్మిల చిత్రం రంగంలో కొనసాగారని అన్నారు. -
కలల రాణి...
‘మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీ థఊ...’ (‘నా కలల రాణీ నువ్వెప్పుడొస్తావ్..’ అని అర్థం) అంటూ ప్రేయసి షర్మిలా ఠాగూర్ని ఉద్దేశించి ‘ఆరాధన’ చిత్రంలో రాజేశ్ ఖన్నా పాడే పాటను మర్చిపోవడం అంత సులువు కావు. లవ్ సాంగ్స్‌లో ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలిచిన వాటిల్లో ఈ పాటది అగ్రస్థానం. ఇప్పుడీ పాట ప్రస్తావన ఎందుకంటే... ‘ఎలి’ (ఎలుక అని అర్థం) అనే తమిళ చిత్రం కోసం ఈ పాటను రీమిక్స్ చేశారని సమాచారం. విశేషం ఏంటంటే.. హాస్యనటుడు వడివేలుతో కలిసి నటి సదా ఈ పాటకు కాలు కదిపారు. అదేంటీ అనుకుంటున్నారా? ఈ కామెడీ హీరో, సదా జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. వారిద్దరూ పాల్గొనగా ఇటీవల ఈ పాటను చిత్రీకరించారట. యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
చాంద్ స.. రోషన్ చెహరా..
హైదరాబాదీ: షర్మిలా టాగోర్.. సత్యజిత్ రే ఆమెను పరిచయం చేయకపోయి ఉంటే, వెండితెర కచ్చితంగా ఒక వెలుగును కోల్పోయి ఉండేది. ఇటు బాలీవుడ్‌ను, అటు బెంగాలీ చిత్రసీమను వెలిగించిన ఆ వెలుగు పేరు షర్మిలా టాగోర్. ఆమె పుట్టింది హైదరాబాద్‌లోనే. అప్పట్లో ఆమె తండ్రి గీతీంద్రనాథ్ టాగోర్ ఈస్టిండియా కంపెనీ యాజమాన్యంలోని ఎల్గిన్ మిల్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేసేవారు. గీతీంద్రనాథ్ తాత గగనేంద్రనాథ్ టాగోర్ సుప్రసిద్ధ పెయింటర్. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్‌కు సమీప బంధువు కూడా. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన షర్మిలను సినీరంగంలోకి పంపడం ఆమె తల్లిదండ్రులకు పెద్దగా ఇష్టం లేదు. అయితే, సత్యజిత్ రే స్వయంగా అడగడంతో కాదనలేకపోయారు. అలా షర్మిలా పదిహేనేళ్ల ప్రాయంలోనే తెరంగేట్రం చేసింది. సత్యజిత్ రే బెంగాలీలో రూపొందించిన ‘అపూర్ సంసార్’ ఆమె తొలి చిత్రం. వరుసగా నాలుగు బెంగాలీ చిత్రాలు చేశాక, బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. వైవిధ్యభరితమైన కథానాయికగా దాదాపు రెండు దశాబ్దాలు బాలీవుడ్‌ను ఏలింది. నాటి తరానికి చెందిన దాదాపు అందరు హీరోల సరసనా నటించింది. ఉద్దండ దర్శకులందరి దర్శకత్వంలోనూ తన ప్రతిభను నిరూపించుకుంది. సప్నోంకీ రానీ... ‘ఆరాధన’ చిత్రంలో ‘మేరే సప్నోంకీ రానీ...’ అంటూ రాజేశ్ ఖన్నా హుషారుగా జీపులో రైలును వెంబడిస్తుంటే, రైలులో పుస్తకం చదువుకుంటూ మధ్య మధ్య ఓరచూపులు విసిరే షర్మిలా నటనకు నాటి యువతరం ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. శక్తి సామంతా దర్శకత్వంలో 1969లో విడుదలైన ఈ చిత్రం షర్మిలాకు ఉత్తమ నటిగా ‘ఫిలింఫేర్’ అవార్డు తెచ్చిపెట్టింది. ‘ఆరాధన’ విడుదలకు ఐదేళ్ల ముందే ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టింది. హిందీలో ఆమె తొలిచిత్రం... శక్తి సామంతా దర్శకత్వంలోని ‘కాశ్మీర్ కీ కలీ’. అందులో షమ్మీకపూర్ సరసన నటించి, అందరినీ ఆకట్టుకుంది. ‘యే చాంద్ స రోషన్ చెహరా...’ అంటూ షమ్మీకపూర్ మెలికలు తిరుగుతూ ముసిముసి నవ్వుల షర్మిలాను ‘తారీఫ్’ చేస్తే, ప్రేక్షకులూ ఆమెను తారీఫ్ చేశారు. అయితే, ‘ఆరాధన’ తర్వాతే ఆమె కెరీర్ ఊపందుకుంది. శక్తి సామంతా దర్శకత్వంలోనే ‘యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్’లో టూ పీస్ బికినీతో తెరపై కనిపించి, ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపింది. ఒక భారతీయ నటి టూ పీస్ బికినీతో తెరపై కనిపించడం అదే తొలిసారి. ఆమె బికినీ ఫొటోను ‘ఫిలింఫేర్’ కవర్‌పేజీపై ముద్రించడం అప్పట్లో పెద్ద సంచలనం. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు నటనకు ఆస్కారం ఉన్న ఉదాత్త పాత్రల్లోనూ రాణించింది. సినీ కెరీర్ ఊపందుకుంటున్న దశలోనే భారత జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీని 1969లో పెళ్లాడింది. మతం మారి, బేగం ఆయేషా సుల్తానాగా పేరు మార్చుకుంది. పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు గ్లామర్ తగ్గి, తెరమరుగవుతారు. షర్మిలా మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. పెళ్లి తర్వాత చాలా సూపర్‌హిట్ సినిమాల్లో నటించింది. ‘అమానుష్’, ‘అమర్‌ప్రేమ్’, ‘మౌసమ్’, ‘సఫర్’ వంటి చిత్రాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించి విమర్శకుల మన్ననలు పొందింది. ‘మౌసమ్’ చిత్రంలో నటనకు ఉత్తమనటిగా 1976లో జాతీయ అవార్డు సాధించింది. భారత ప్రభుత్వం గత ఏడాది ఆమెకు ‘పద్మభూషణ్’ అవార్డు ఇచ్చింది. సెన్సార్‌బోర్డు చైర్‌పర్సన్‌గా, యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా సేవలందించిన షర్మిలా టాగోర్, ఇప్పటికీ వయసుకు తగిన పాత్రల్లో రాణిస్తోంది. ఆమె కొడుకు సైఫ్ అలీఖాన్, కూతురు సోహా అలీఖాన్ సినీ రంగంలో రాణిస్తున్నారు. మరో కూతురు సాబా అలీఖాన్ జ్యుయలరీ డిజైనర్‌గా కొనసాగుతోంది. ‘పారో’ పాత్ర... నెరవేరని కల ఎన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించినా, ‘పారో’ పాత్ర చేయలేకపోవడాన్ని షర్మిలా ఇప్పటికీ తీరని లోటుగానే భావిస్తుంది. ఆమె కెరీర్ ఉజ్వలంగా వెలుగుతున్న కాలంలో ‘దేవదాస్’ సినిమాను మళ్లీ తెరకెక్కించాలని దర్శక, రచయిత గుల్జార్ సంకల్పించాడు. ధర్మేంద్రను దేవదాసుగా, షర్మిలాను పారోగా (పార్వతి), హేమమాలినిని ‘చంద్రముఖి’గా పెట్టి తీయాలనుకున్నాడు. ఎందువల్లనో అది కార్యరూపం దాల్చలేదు. ‘పారో’ పాత్ర షర్మిలాకు నెరవేరని కలగానే మిగిలిపోయింది. - పన్యాల జగన్నాథదాసు -
‘డర్టీ పిక్చర్’ చేయలేను
డర్టీ పిక్చర్ వంటి సినిమా చేసే ధైర్యం తనకు లేదంది బెబో. ఆ సినిమాలో విద్యాబాలన్ చక్కగా చేసిందని కితాబునిచ్చింది బాలీవుడ్ జీరో సైజ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్. అయినా కమర్షియల్ సినిమాలంటేనే తనకు చాలా ఇష్టమంది. కెరీర్లో ‘దేవ్’, ‘చమేలీ’, ‘ఓంకార’ వంటి సినిమాలు చేశాను కదా అని చెప్పింది. తన అత్తగారు షర్మిలా ఠాగూర్ కూడా ‘అమర్ ప్రేమ్’, ‘మౌసమ్’ చిత్రాల్లో వేశ్య పాత్ర పోషించిన సంగతి గుర్తు చేసింది. -
షర్మిలా టాగోర్, సైఫ్ ఖాన్ల ఆస్తి తగాదా
తమ రాచకోటలోని కళాఖండాలను పంచుకునేందుకు భోపాల్ రాచకుటుంబానికి చెందిన నటుడు సైఫ్ అలీ ఖాన్, ఆయన తల్లి, అలనాటి నటి షర్మిలా టాగోర్ చేస్తున్న ప్రయత్నాలకు భోపాల్ పౌరులనుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. మాజీ భారత క్రికెట్ క్యాప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ భార్యగా షర్మిలా టాగోర్ ఈ కళాఖండాలను బంధువుల మధ్య పంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆమె ప్రస్తుతం భోపాల్ లోని కోహె ఫిజా పర్వతంపై ఉన్న అహ్మదాబాద్ పాలెస్ లో మకాం వేశారు. అయితే మెహ్రాజ్ ఖాన్ మస్తాన్ అనే స్థానిక నేత, భోపాల్ లోని పలువురు ముస్లింలు రాచకుటుంబం జ్ఞాపకాలను చెరపవద్దని డిమాండ్ చేస్తున్నారు. వీరు ధర్నా చేయడంతో చివరికి పోలీసుల సాయంతో షర్మిలా టాగోర్ ఎలాగోలా భవనం నుంచి బయటకు రాగలిగారు. పటౌడీ చనిపోయిన తరువాత నుంచీ స్థానికులకు, పటౌడీ కుటుంబీకులైన షర్మిలా, సైఫ్ ఖాన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. -
డీడీ షోలో తల్లీకూతుళ్లు
మహిళలపై నేరాలను నిరోధించే ప్రయత్నంలో భాగంగా దూరదర్శన్ తాజాగా ‘మై కుచ్ భీ కర్ సక్తీ హూ’ అనే షో రూపొందిస్తోంది. దీనికి సహకరించడానికి అలనాటి అందాలతార షర్మిళా ఠాగూర్, ఆమె ముద్దుల కూతురు సోహా అలీఖాన్ సిద్ధమవుతున్నారు. బాల్యవివాహాలు, లేత వయసు గర్భాలు, లింగ నిర్ధారణ వంటి దురాచారాలను ఎండగడుతుంది కాబట్టే ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నామని తల్లీకూతుళ్లు చెబుతున్నారు. ‘మనదేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఈ షోకు సహకరించడం మన బాధ్యత. ఇందులో పాల్గొనాలని నా కొడుకు-కోడలు సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్‌ను కూడా అడుగుతాను’ అని షర్మిళ అన్నారు. మై కుచ్ భీ కర్ సక్తీ హూను ఫిరోజ్ అబ్బాస్‌ఖాన్ నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారు. మహిళలపై నేరాల నిరోధానికి డాక్టర్ స్నేహ చేసిన కృషిని గురించి ఈ కార్యక్రమం వివరిస్తుంది. సోహా మాట్లాడుతూ ‘మేం సంపన్న కుటుంబంలో పుట్టాం. ఎటువంటి ఇబ్బందులూ లేకున్నా నేను సినిమాల్లోకి వస్తానంటే మాత్రం ఒప్పుకోలేదు. నేను పట్టువీడకపోవడంతో చివరికి సరే అన్నారు. అందుకు నా కుటుంబానికి కృతజ్ఞురాలిని. అయితే ఇలాంటి ఉన్నతస్థాయి జీవితమంటే ఏంటో చాలా మంది మహిళలకు తెలియదు. కాబట్టే ఇలాంటి మంచి కార్యక్రమానికి సహకరిస్తున్నాను’ అని వివరించింది. సినిమా తారల వంటి ప్రముఖులు ఇలాంటి సామాజిక సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటే వీక్షకుల సంఖ్య బాగా పెరుగుతుందని తెలిపింది. మై కుచ్ భీ కర్ సక్తీ హూ షో ప్రపంచ మహిళల దినోత్సమైన మార్చి 8 నుంచి ప్రసారమవుతుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ సైతం సత్యమేవ జయతే పేరుతో సామాజిక అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం తెలిసిందే. -
గుర్గావ్ నుంచి బరిలోకి షర్మిళా ఠాకూర్?
-
నటిని కావడం అమ్మానాన్నలకు ఇష్టం లేదు
న్యూఢిల్లీ: తాను నటిగామారడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ చెప్పింది. దివంగత టెస్ట్ క్రికెటర్ మన్సూర్ అలీఖాన్, నిన్నటి తరం నటి షర్మిలా టాగూర్ల గారాలపట్టి అయిన సోహా తన 25వ ఏటనే ముఖానికి రంగు వేసుకుంది. నటిగా మారాలన్న తన నిర్ణయం విని తన సోదరుడు సైఫ్ అలీఖాన్ సైతం దిగ్భ్రాంతికి గురయ్యాడని చెప్పింది. ఇటీవల కొందరు విద్యార్థులతో ‘ఫాలో యువర్ హార్ట్ (మీ మనసు చెప్పేది విను)’ అనే కార్యక్రమంలో మాట్లాడింది. ‘‘నువ్వు నాతో పాటు ముంబైలో ఉంటున్నందుకు అమ్మానాన్నలు నన్ను నిందిస్తారు. చక్కని బ్యాంకు ఉద్యోగం ఉంది. నీ ఇష్ట ప్రకారమే నటినయ్యానని అమ్మానాన్నలతో చెప్పాలి’’ అని సైఫ్ తనను హెచ్చరించినట్లు వివరించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పట్టభద్రురాలు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందిన సోహా 2004లో సినీ పరిశ్రమలో ప్రవేశించింది. తాను నటిని కావాలని, తల్లి, సోదరుని అడుగుజాడల్లో నడవాలని ఎప్పుడూ ఆశపడలేదని, అయితే థియేటర్, నటన పట్ల ఉన్న మక్కువ తనను ఉద్యోగం వదులుకునేలా చేసిందని తెలిపింది. మొదటిసారి షాహిద్ కపూర్ సరసన ‘దిల్ మాంగే మోర్’ చిత్రంలో నటించిన సోహా ‘‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్’’లో నటనకు గాను విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఆమె నటిస్తున్న ‘వార్ చోడ్నా యార్’, ‘చార్ఫుటియా ఛోకరే’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.