
షర్మిల ఠాగూర్.. బెంగాలీ, హిందీ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా వెలుగొందింది. సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలకుగానూ ఫిలింఫేర్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు పొందింది. 2013లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. ఈమె క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి సైఫ్ అలీ ఖాన్ అనే కుమారుడితో పాటు సబ, సోహ అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మన్సూర్ 2011లోనే కాలం చేశాడు. తర్వాత సినిమాలవైపే వెళ్లని షర్మిల గతేడాది గుల్మొహర్ అనే సినిమాతో మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది.
ముగ్గురికీ సమానంగా వీలునామా..
తాజాగా తన పర్సనల్ ఫైనాన్స్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. 'నేను కొన్న నగలు, కార్లు, ఇళ్లు.. ఇలా ఏవైనా సరే అవన్నీ నా పేరు మీదే ఉంటాయి. ఆ ఆస్తిని భర్తతో కూడా పంచుకోలేదు. అతడు కూడా తను సంపాదించిన ఆస్తులను తనే మేనేజ్ చేసుకునేవాడు. చనిపోవడానికి ముందే ఏవి ఎవరికి చెందాలనేది వీలునామా రాశాడు. నా ఆస్తులు కూడా నా ముగ్గురు పిల్లలకు సమానంగా పంచుతాను. ఆర్థిక విషయాలపై నాకంత అవగాహన లేకపోయేది. కానీ లాక్‌డౌన్‌లో నాకంటూ ఓ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకున్నాను. అప్పటినుంచే దీనిపై ప్రత్యేక దృష్టి సారించాను' అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment