
ప్రేమపెళ్లిళ్లు అనేవి బాలీవుడ్‌లో ఎప్పటినుంచో ఉన్నవే! మనసులు కలిశాక మనుషులు ఒక్కటైన సంఘటనలు కోకొల్లలు. బాలీవుడ్ సీనియర్ జంట షర్మిల ఠాగోర్- మన్సూర్ అలీ ఖాన్ పటౌడీలు కూడా ఇదే కోవలోకి వస్తారు. వీరిద్దరూ ప్రేమ బంధాన్ని 1968లో పెళ్లితో పదిలపర్చుకున్నారు.
కిచెన్‌లోకి నో
పెళ్లైన కొత్తలో జరిగిన విషయాలను తాజాగా ఓ షోలో గుర్తు చేసుకుంది షర్మిల. 'నా భర్త నన్ను రోజుకు మూడుసార్లు వంటగదికి వెళ్లాలని చెప్పాడు. ఇది చాలా చెడ్డ ఆలోచన.. నేను అన్నిసార్లు కిచెన్‌కు వెళ్లానంటే నీకే కష్టమవుతుందని భర్తకు వార్నింగ్ ఇచ్చాను. ఇదెక్కడుంది? ఆ వస్తువు ఎక్కడుంది? నాకు ఏదీ దొరకడం లేదంటూ నీ వెంటే పడతానని హెచ్చరించాను.
అతడే స్వయంగా..
దానికంటే నేను వంటగదికి వెళ్లకపోవడమే మేలని చెప్పాను. దీంతో అతడు తన వంట తానే చేసుకోవాల్సి వచ్చింది. నేను తెలివిగా అతడు వంటగదిలోకి వచ్చేలా చేశాను. ఏమాటకామాట కిచెన్‌లో అద్భుతాలు చేసేవాడు. యూట్యూబ్‌లో చూసి కొత్తరకం వంటలు చేసేవాడు. దానివల్ల తను మరింత కాన్ఫిడెంట్‌గా తయారయ్యాడు.
అద్భుతంగా వండుతాడు
ఓసారి నేను లండన్‌లో ఉన్నప్పుడు ఒకరు నాకు కాల్ చేసి నీ భర్త వంట ఎంత సూపర్‌గా చేశాడో.. అని కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను కిచెన్‌లోకి వెళ్లకపోవడం వల్లే అతడు అమోఘంగా వంటలు చేయగలిగాడు' అని షర్మిల చెప్పుకొచ్చింది. మన్సూర్ అలీ ఖాన్- షర్మిల ఠాగోర్‌లకు సైఫ్, సబా, సోహా అలీ ఖాన్ అని ముగ్గురు సంతానం. కాగా క్రికెటర్ మన్సూర్ 2011లోనే కన్నుమూశాడు.
చదవండి: భర్తతో విడాకులు ప్రకటించిన తెలుగు నటి.. అర్థం చేసుకోండంటూ..
Comments
Please login to add a commentAdd a comment