భర్తతో విడిపోయిన సీరియల్‌ నటి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ | Serial Actress Sirisha Divorce With Husband Naveen | Sakshi
Sakshi News home page

భర్తతో విడాకులు ప్రకటించిన తెలుగు నటి.. అర్థం చేసుకోండంటూ..

May 16 2024 2:11 PM | Updated on May 16 2024 3:51 PM

Serial Actress Sirisha Divorce With Husband Naveen

వీలైతే సపోర్ట్‌ చేయండి, కానీ విమర్శించకండి. నవీన్‌పై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. మొగలిరేకులు సీరియల్‌తో బాగా పాపులర్‌ అయిన తెలుగు నటి ఈవిడ!

ఈ రోజుల్లో విడాకులు అనేవి మామూలైపోయాయి. కానీ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారంటేనే ఏమైందో తెలుసుకోవాలని జనాలు ఉత్సుకత ప్రదర్శిస్తారు. మొన్నే కోలీవుడ్‌ హీరో, సంగీత దర్శకుడు జీవీ సైంధవ్‌.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికినట్లు వెల్లడించాడు. తాజాగా ఓ తెలుగు బుల్లితెర నటి అదే బాట పట్టింది.

మా మధ్య బంధం ముగిసిపోయింది
సీరియల్‌ నటి శిరీష భర్త నవీన్‌తో విడిపోయినట్లు వెల్లడించింది. 'నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను, నవీన్‌ భార్యాభర్తల బంధాన్ని తెంచేసుకున్నాం. మా నియంత్రణలో లేని కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరం విడిపోయాము. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం.

తనపై గౌరవముంది
వీలైతే సపోర్ట్‌ చేయండి, కానీ విమర్శించకండి.  నవీన్‌పై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. నేను ఒక సెలబ్రిటీ అయినందున ఈ విషయం మీతో చెప్పడం అవసరమనిపించి దీన్ని షేర్‌ చేస్తున్నాను. అర్థం చేసుకున్నందుకు థాంక్యూ' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది.

ఆ సీరియల్‌తో పాపులర్‌
కాగా శిరీష.. అచ్చ తెలుగమ్మాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టిపెరిగిన ఈమెకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండగా వీరు కూడా సీరియల్స్‌లో నటించారు. కానీ శిరీష మాత్రం అక్కలను మించి క్రేజ్‌ అందుకుంది. మొగలిరేకులు సీరియల్‌తో బాగా పాపులర్‌ అయింది. స్వాతిచినుకులు, రాములమ్మ, మనసు మమత, చెల్లెలి కాపురం. . ఇలా అనేక సీరియల్స్‌లో నటించింది.

 

 

చదవండి: జబర్దస్త్‌ కమెడియన్‌ ఇంట విషాదం.. ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement