Sireesha
-
ఘనంగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం
తెలుగు హీరో నారా రోహిత్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టేశాడు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో గ్రాండ్‌గా నిశ్చితార్థం జరిగింది. ఉదయం 10:45 గంటలకు శిరీష(సిరి) వేలికి ఉంగరం తొడిగేశాడు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు దంపతులతో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. (ఇదీ చదవండి: రూ.500 కోట్లు దాటేసిన 'దేవర' కలెక్షన్)2019లో 'బాణం' సినిమాతో నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'సోలో' మూవీతో హిట్ కొట్టిన తర్వాత వరస 2018 వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ ఏడాది మళ్లీ 'ప్రతినిధి 2' అనే మూవీతో వచ్చాడు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. కానీ ఇందులో నటించిన హీరోయిన్ సిరి లెల్లా మాత్రం ఇతడికి లైఫ్ పార్ట్నర్ అయిపోయింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. నారా రోహిత్‌కి పెదనాన్న అవుతారు. రోహిత్ ప్రస్తుత వయసు 40 ఏళ్లు. కొన్నాళ్ల క్రితం ఇంట్లో పెళ్లి గురించి టాపిక్ రావడంతో సిరిని ప్రేమిస్తున్న విషయం చెప్పాడట. అలా పెద్దలు మాట్లాడుకుని మొత్తానికి నిశ్చితార్థం నిశ్చయించారట. డిసెంబరు 15న పెళ్లి జరగనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం) -
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)
-
భర్తతో విడిపోయిన సీరియల్ నటి.. సోషల్ మీడియాలో పోస్ట్
ఈ రోజుల్లో విడాకులు అనేవి మామూలైపోయాయి. కానీ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారంటేనే ఏమైందో తెలుసుకోవాలని జనాలు ఉత్సుకత ప్రదర్శిస్తారు. మొన్నే కోలీవుడ్ హీరో, సంగీత దర్శకుడు జీవీ సైంధవ్.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికినట్లు వెల్లడించాడు. తాజాగా ఓ తెలుగు బుల్లితెర నటి అదే బాట పట్టింది.మా మధ్య బంధం ముగిసిపోయిందిసీరియల్ నటి శిరీష భర్త నవీన్‌తో విడిపోయినట్లు వెల్లడించింది. 'నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను, నవీన్ భార్యాభర్తల బంధాన్ని తెంచేసుకున్నాం. మా నియంత్రణలో లేని కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరం విడిపోయాము. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం.తనపై గౌరవముందివీలైతే సపోర్ట్ చేయండి, కానీ విమర్శించకండి. నవీన్‌పై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. నేను ఒక సెలబ్రిటీ అయినందున ఈ విషయం మీతో చెప్పడం అవసరమనిపించి దీన్ని షేర్ చేస్తున్నాను. అర్థం చేసుకున్నందుకు థాంక్యూ' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది.ఆ సీరియల్‌తో పాపులర్కాగా శిరీష.. అచ్చ తెలుగమ్మాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టిపెరిగిన ఈమెకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండగా వీరు కూడా సీరియల్స్‌లో నటించారు. కానీ శిరీష మాత్రం అక్కలను మించి క్రేజ్ అందుకుంది. మొగలిరేకులు సీరియల్‌తో బాగా పాపులర్ అయింది. స్వాతిచినుకులు, రాములమ్మ, మనసు మమత, చెల్లెలి కాపురం. . ఇలా అనేక సీరియల్స్‌లో నటించింది. View this post on Instagram A post shared by It's-me-Sireesha Actor- Official (@its_me_sireesha_actor) చదవండి: జబర్దస్త్ కమెడియన్ ఇంట విషాదం.. ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ.. -
శిరీష కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు అండ
బద్వేలు అర్బన్: వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం చింతలచెరువు గ్రామంలో ఈ ఏడాది జూన్ 18న ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన గొడుగునూరు శిరీష కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. శిరీష కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందించడంతోపాటు ఆమె సోదరుడు నాగేంద్రకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. చింతలచెరువు గ్రామానికి చెందిన గొడుగునూరు సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె శిరీష (19) బద్వేలులోని ఓ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అట్లూరు మండలం మాడపూరు పంచాయతీ చిన్నరాజుపల్లె గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడు ఏడాది కాలంగా శిరీషను ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆమె నిరాకరించడంతో చరణ్ కత్తితో విచక్షణా రహితంగా శిరీష గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయంతో పాటు శిరీష సోదరుడైన నాగేంద్రకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం బద్వేలులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శిరీష కుటుంబ సభ్యులకు చెక్కును, ఉద్యోగ నియామక పత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య అందజేశారు. టీడీపీవి నీచ రాజకీయాలు ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో మహిళలపై ఎన్నో దాడులు, హత్యలు జరిగినా చూసీచూడనట్టు వ్యవహరించిన ఆ పార్టీ నేతలు శిరీష హత్య విషయంలో అనవసర రాద్ధాంతం చేసి నీచ రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ప్రకాశం జిల్లాలో నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జాతీయ కబడ్డీ క్రీడాకారుడు నరేష్‌ను హత్య చేస్తే ఏమాత్రం స్పందించని టీడీపీ నాయకులు నేడు రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. శిరీష కుటుంబ సభ్యులు టీడీపీ అభిమానులైనప్పటికీ పార్టీ చూడకుండా ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఉద్యోగం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ వాకమళ్ల రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భర్త మృతి చెందడంతో.. డిప్రెషన్లో
పటాన్చెరు టౌన్ : భర్త మృతి చెందడంతో అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్లిన భార్య ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమీన్పూర్ పరిధిలోని బీరంగూడ సమీపంలో తిరుమల ఆసుపత్రిలో నర్సుగా శిరీష రెడ్డి (31) పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. రెండున్నరేళ్ల క్రితం భర్త రమేశ్ గుండెపోటుతో మృతి చెందాడు.వీరికి ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు ప్రియ, చిన్న కూతురు కౌశిక, మూడేళ్ల కుమారుడు హిమాష్ కలడు. భర్త మృతి చెందినప్పటి నుంచి శిరీష రెడ్డి డిప్రెషన్‌కులోనై అప్పటి నుంచి మూడు సార్లు ఆత్మహత్య యత్నాలు చేసింది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో చికిత్స కోసం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. రెండున్నరేళ్ల క్రితం తండ్రి, ఇప్పుడు తల్లి మృతి చెందడంతో పిల్లులు ముగ్గురు అనాథలుగా మారారు. -
లాక్డౌన్ విజేత
యూరో క్లోతింగ్ కంపెనీ. అతి పెద్ద గార్మెంట్ ఫ్యాక్టరీల్లో ఇదొకటి. ఒక యూనిట్ కర్ణాటక రాష్ట్రం, మాండ్యా జిల్లా, శ్రీరంగపట్టణంలో ఉంది. కోవిడ్ కారణంగా లే ఆఫ్ ప్రకటించింది. 1300 మంది ఉద్యోగాలు రోడ్డున పడ్డాయి. వస్త్రపరిశ్రమలకు కొత్త ఆర్డర్లు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు, ఉన్న ఆర్డర్లు కూడా రద్దవుతున్నాయి. ప్రస్తుతానికి పని ఆపేయడం ఒక్కటే మార్గం అనుకుంటున్న కంపెనీలు ఇలా లే ఆఫ్ ప్రకటించేస్తున్నాయి. పెద్ద కంపెనీలు ఇలా ఉంటే... చిన్న పరిశ్రమ నడిపే మేకా శిరీష మాత్రం తన ఉద్యోగులకు పని భద్రత కల్పించి ఆదర్శంగా నిలిచారు. చేయి చాచనివ్వలేదు హైదరాబాద్‌లో ఓ చిన్న గార్మెంట్ యూనిట్ నడుపుతున్న శిరీష లాక్డౌన్ కష్టకాలంలో తన ఉద్యోగుల సంపాదన మార్గాన్ని సంరక్షించగలిగారు. ఆమె గార్మెంట్ యూనిట్‌ని కరోనా పోరాటంలో భాగం చేశారు. అప్పటివరకు యూనిఫామ్‌లు కుడుతున్న తన ఉద్యోగులకు పీపీఈ కిట్లు కుట్టడంలో శిక్షణ ఇప్పించారు. ‘‘పీపీఈ కిట్ల మెటీరియల్ కోసం, ఆర్డర్ల కోసం రోజుకు పదహారు గంటలు పని చేశాను. నాతో పనిచేసే మహిళలకు రోజుకు ఐదు వందల రూపాయలు రాబడిని చూపించగలిగాను. సంస్థ నిర్వహణలో ఎప్పుడూ అవసరానికి తగినట్లు మార్పులు చేసుకుంటూ ఉద్యోగులకు పని కల్పించాలి. ఇలాంటి సందర్భంలో నేను ఆలోచించాల్సింది ఈ పీపీఈ కిట్ల తయారీలో నాకు లాభాలు వస్తాయా లేదా అని కాదు. పరిశ్రమ నడక సజావుగా సాగాలి. తమకు పని ఉందనే భావనే ఉద్యోగులకు ధైర్యాన్నిస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. యజమాని ఉద్యోగుల్లో ఆ ధైర్యాన్ని పాదుకొల్పగలగాలి. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గర్వంగా చెప్పగలను. చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఎంతోమంది ఈ కష్టకాలంలో ఉపాధి కోల్పోయి, దాతలిచ్చే విరాళాల కోసం క్యూలో నిలబడ్డారు. నా యూనిట్లో పని చేస్తున్న మహిళలకు విరాళాల కోసం చేయి చాచాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోగలిగాను’’ అన్నారు శిరీష. తెనాలమ్మాయి పాతికేళ్ల కిందట హైదరాబాద్, కూకట్‌పల్లిలో సొంతంగా పరిశ్రమ పెట్టిన శిరీష సొంతూరు గుంటూరు జిల్లా, తెనాలికి సమీపంలో ఉన్న మున్నంగి. తెనాలికి ఆంధ్రాపారిస్ అని పేరు. శిరీష ఫ్యాషన్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడానికి, అప్పటికి తెలుగురాష్ట్రాల్లో నడుస్తున్న ఫ్యాషన్కంటే రెండడుగులు ముందుగా ఉండడానికి కారణం ఆ నేల ప్రభావం కూడా ఉన్నట్లుంది. ఆమె 1996లో బొటీక్ స్థాపించి విజయవంతంగా నడిపించారు. ‘‘వస్త్రవ్యాపారం ప్రధానంగా మగవాళ్ల చేతుల్లోనే ఉన్న రోజులవి. మగవాళ్లు టెక్స్టైల్ ఫ్యాక్టరీలు తయారు చేసిన దుస్తులను యదాతథంగా తెచ్చి షోరూమ్‌లో అమ్మేవాళ్లు. నేను ప్రయోగాలు చేశాను. నా తొలి ప్రయోగం మా గుంటూరు మంగళగిరి కాటన్‌తోనే. బెనారస్ నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల చేనేతలనూ నా బొటీక్‌కు తెచ్చాను. ప్రతిదీ కస్టమైజ్డ్ పీస్ కావడంతో బాగా క్లిక్ అయింది. తర్వాత మగ్గం వర్క్ కూడా చేర్చాను. నా బొటీక్ ప్రచారం కోసం ఒక్క పాంప్లెట్ కూడా వేయించలేదు. ప్రతి మోడల్‌నీ, ప్రతి డిజైన్‌నీ నేను ఒక పీస్ చేయించుకుని ధరించడమే నా ప్రచారం. నాకు నేనే అంబాసిడర్‌ని’’ నవ్వుతూ అన్నారామె. యజమానికి పరీక్ష ‘నాకు ఆస్తులున్నాయి. నాకు వచ్చే నష్టం ఏమీ లేదు... కాబట్టి లాక్డౌన్ నుంచి పరిస్థితి చక్కబడే వరకు యూనిట్‌ను మూసేస్తాను. ఉద్యోగులు రోడ్డున పడితే నాకేంటి’ అనుకునే మనస్తత్వం పరిశ్రమ నిర్వహణకు ఏ మాత్రం పనికి రాదు. అలాంటి వాళ్లు పరిశ్రమ బాధ్యతను తలకెత్తుకోక పోవడమే మంచిది. వ్యాపారం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఉద్యోగుల ఉపాధికి భరోసా కలిగించాలి. యజమాని తనను తాను నిరూపించుకోగలిగేది ఇలాంటి కష్టకాలంలోనే.– మేకా శిరీష గెలిపించిన అసంతృప్తి పరిశ్రమ నిర్వహణ గురించి ఇంత చక్కగా పండు వలిచి చేతిలో పెట్టినట్లు వివరిస్తున్న శిరీష మున్నంగి నుంచి హైదరాబాద్‌కు సాగిన తన ప్రస్థానాన్ని వివరించారు. ‘‘మా నాన్న చిన్నప్పుడే పోవడంతో నన్ను, అన్నయ్యను పెంచి పెద్దచేసే బాధ్యత అమ్మదే అయింది. మా ఊళ్లో కాలేజ్ లేకపోవడంతో నేను టెన్త్‌తోనే చదువాపేయాల్సి వచ్చింది. పెళ్లయిన తర్వాత 1988లో మున్నంగి నుంచి హైదరాబాద్‌కి వచ్చాను. నాకు ఏదో ఒకటి చేయాలని, నన్ను నేను నిరూపించుకోవాలని ఉండేది. చదువుకోలేకపోయాననే అసంతృప్తితో వారపత్రికలతోపాటు ఎన్ని పుస్తకాలు చదివానో లెక్కేలేదు. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో పత్రికల పాత్ర చాలా పెద్దది. నాకంటూ ఉన్న లక్ష్యాలను చేరాలంటే సొంతంగా పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. పక్కింటి ఆంటీ దగ్గర టైలరింగ్ నేర్చుకుని ‘సఖి బొటీక్’ పెట్టాను. రెండేళ్ల కిందట షాపూర్లో యూనిఫామ్‌లు కుట్టే గార్మెంట్ యూనిట్ చేపట్టాను. లాక్డౌన్ కారణంగా స్కూళ్లు ప్రారంభమయ్యే టైమ్‌టేబుల్‌లో అనిశ్చితి ఉంది. యూనిఫామ్ కుట్టే పని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. యూనిట్లో పని చేసే వాళ్లకు పని కల్పించడం కోసం పీపీఈ కిట్లకు మారిపోయాం. డాక్టర్లు, హాస్పిటళ్లతో నాకున్న పరిచయాలే నా మార్కెట్. మోడల్ పీస్ ఒక్కొక్కటి ఇచ్చి వాళ్లు ధరించిన తర్వాత వాళ్లకు తగినట్లు మార్పులు సూచించమని అడిగాను. అలా సౌకర్యవంతంగా మార్పులు చేయగలిగాం. స్కూళ్లు తెరిచి పరిస్థితులు గాడిన పడేవరకు పీపీఈ కిట్ల అవసరం ఉండనే ఉంటుంది’’ అన్నారు శిరీష. వ్యాపారంలో విజేతగా నిలబెట్టే లక్షణం ఒకటి ఉంటుంది. అది సమాజంలో ఎదురయ్యే అవసరాన్ని మిగిలిన వారికంటే ముందుగా గుర్తించగలిగిన నైపుణ్యం. ఇందుకు పెద్ద కోర్సులేవీ అక్కరలేదని నిరూపిస్తోంది శిరీష. అలాగే తన ఉద్యోగులు ఆకలితో ఉండకూడదనే అమ్మతనం మగవాళ్లలో కంటే మహిళల్లోనే ఎక్కువని చెప్పడానికి కూడా ప్రతీక ఆమె.– వాకా మంజులారెడ్డి -
నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం
నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో ఏమైందో గానీ ముందుగా యువతి.. ఆ తరువాత ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతులిద్దరూ యలమంచిలి వాసులు. ప్రస్తుతం వీరు నగరంలో ఉంటున్నారు. ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. సాక్షి, విశాఖపట్నం: వారిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు... విషయం ఇంట్లో వారికి తెలియడంతో కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేస్తామన్నారు... ఇంతలో ఏం జరిగిందో ముందుగా యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విషయం తెలియడంతో ఆమె లేని జీవితం ఎందుకని ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలు విశాఖలో కలకలం రేపాయి. గోపాలపట్నం, కంచరపాలెం పోలీస్ స్టేషన్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యలమంచిలి రామ్‌నగర్‌లో తల్లిదండ్రులు, అక్కతో కలిసి నివసించే మక్క శిరీష(20) నాలుగేళ్ల కిందట అక్కడే ఇంటర్ చదువుతూ అదేప్రాంతానికి చెందిన వెంకటేష్(22)ను ప్రేమించింది. ఈ విషయం యువతి ఇంటిలో తెలియడంతో అక్కకు పెళ్లి చేసిన తర్వాత శిరీష పెళ్లి చేస్తామని చెప్పారు. అనంతరం కుటుంబంతో సహా గోపాలపట్నం వచ్చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ రెస్టారెంట్ నడపుతూ, దానిపై ఇంటిలో జీవిస్తున్నారు. అయినప్పటికీ వెంకటేష్‌తో ఫోన్లో శిరీష మాట్లాడుతుండేది. శిరీష, వెంకటేష్ (వెంకటేష్ మృతదేహం) ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం రెస్టారెంట్ కౌంటర్లో శిరీష ఉండగా వెంకటేష్ ఫోన్ చేశాడు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ వెంకటేష్‌కు మెసేజ్ చేసి మేడపైన గదిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ మెసేజ్‌ను యువతి అక్కకి వెంకటేష్ పంపించగా... ఆమె అప్రమత్తమై మేడపైకి వెళ్లి చూడగా శిరీష అప్పటికే ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. వెంటనే రెస్టారెంట్ సిబ్బంది సాయంతో యువతిని కిందకు దించి గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న గోపాలపట్నం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నారని పోలీసులు చెప్పారు. ప్రియురాలు లేదని... మరోవైపు ప్రియురాలు చనిపోయిందన్న విషయం ఆమె కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న వెంకటేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి బర్మా క్యాంపు సమీపంలో నివసిస్తున్న అతను అక్కడికి దగ్గరలోని చెట్టుకు బుధవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని చెప్పినప్పటికీ ఎందుకు ఇలా చేసుకున్నారో అర్థం కావడం లేదని యువతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ప్రధాని దిష్టిబొమ్మ దహనానికి టీడీపీ యత్నం
సాక్షి, శ్రీకాకుళం జిల్లా : ప్రత్యేక హోదాకోసం రోజురోజుకు ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శిరీష బుధవారం ప్రధాని దిష్టి బొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆమెతో పాటు మరో వందమంది టీడీపీ నాయకుల్నిపోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీస్‌స్టేషన వద్ద టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. -
రాజీవ్ ఫోర్డ్ కారు సీజ్.. కీలక ఆధారాలు లభ్యం
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష, సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యల కేసులో రాజీవ్‌కు చెందిన ఫోర్డ్ కారును పోలీసులు గురువారం సీజ్ చేశారు. కారులో ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కుకునూర్‌పల్లిలో ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి, శిరీష, శ్రావణ్, రాజీవ్ లు ఒకేచోట ఉన్నట్లు కీలక ఆధారాలు సేకరించారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న శ్రావణ్, ఆర్జే ఫొటోగ్రఫీ స్టూడియో నిర్వాహకుడు రాజీవ్‌లను బుధవారం అర్ధరాత్రి వరకు విచారించినట్లు డీసీపీ లింబారెడ్డి తెలిపారు. సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేసే తేజస్వినితో రాజీవ్‌కు పరిచయం కాగా, వారు సన్నిహితంగా ఉండటంతో శిరీషతో విభేదాలు తలెత్తాయి. రాజీవ్, శిరీష మధ్య రాజీ కుదర్చేందుకు కామన్ ఫ్రెండ్ శ్రావణ్ యత్నించాడు. హైదరాబాద్ నుంచి రాజీవ్ ఫోర్డు కారులోనే సోమవారం శ్రావణ్, శిరీష, రాజీవ్‌లు కుకునూర్ పల్లికి వెళ్లినట్లు సమాచారం. ప్రభాకర్‌రెడ్డి పోలీస్ క్వార్టర్స్‌లో పంచాయితీ జరిగాక... హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అదేరోజు రాత్రి 1.40 గంటలకు శిరీష తాను శామీర్‌పేట ప్రాంతంలో ఉన్నట్లుగా భర్త సతీశ్‌చంద్రకు వాట్సాప్ ద్వారా శిరీష లోకేషన్ పంపింది. రాత్రి మూడు గంటల ప్రాంతంలో స్టూడియోలో ఆమె ఆత్మహత్య చేసుకుందని శిరీష పనిచేసే స్టూడియో ఓనర్ రాజీవ్ పోలీసులకు వెల్లడించాడు. రాజీవ్‌పై అనుమానం ఉందంటూ సతీశ్‌చంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో కేసు వివాదం మొదలైంది. ఈ క్రమంలో బుధవారం శ్రావణ్, రాజీవ్‌లను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుసుకున్న ప్రభాకర్‌రెడ్డి సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. అధికారుల ఒత్తిడి వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఓవైపు, శిరీష ఆత్మహత్యతో సంబంధం ఉండటం వల్లే సూసైడ్ చేసుకున్నాడని మరోవైపు సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తోంది. స్టూడియోలోని సీసీ కెమెరా ఫుటేజీలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. కాగా, శిరీష పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటివరకూ పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. -
చైనా గోడపై గిరిజన బాలిక
► జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన శిరీష ►తల్లి ఒకప్పటి మావోయిస్టుల దళ సభ్యురాలు ►తండ్రి లేకపోయినా అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ►దేశం తరన చైనాలో ప్రాతినిధ్యం మల్కన్‌గిరి: ఒకప్పుడు ఆడ పిల్లలు గడపదాటి బయట కాలు పెట్టాలంటేనే ఎన్నో ఆంక్షలు. మరి సాధారణంగానే అభివృద్ధికి ఆమడ దూరంలో.. సంప్రదాయాల సుడిగుండాల్లో నిత్యం బతికే గిరిజన బాలికలు అయితే..? ఇక సరే సరి. వీటన్నీంటికి తోడు అన్ని రంగాల్లో వెనుకంజలో ఉన్న ఒడిశా రా లో క్రీడలకు అసలు గుర్తింపే లేదు. అయితే.. చైనా గోడలాంటి ఈ ఆంక్షలన్నీంటినీ ఛేదించుకుని సగర్వంగా నిలిచింది ఓ గిరిజన బాలిక. నిత్యం మావోయిస్టుల అలజడులు, బాంబు చప్పుళ్లను బేఖాతరు చేస్తూ.. జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది శిరీష కార్తమ(15). ఈమె ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 10కి పైగా పతకాలు పొందింది. వీటితో పాటు ఇటీవల కేరళలోని ఎర్నాకుళంలో అంతరాష్ట్ర వాలీబాల్ టోర్నీలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలువురి ప్రశంసలు పొందింది. ఈ టోర్నీలో పతకంతో పాటు వచ్చే నెల చైనాలో జరగనున్న అంతర్జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలో పాల్గొనే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. మన్యంలో మాణిక్యం మల్కన్‌గిరి జిల్లా పేరు చెబితే చాలు.. నిత్యం ఇనుపబూట్ల చప్పుళ్లు వినిపిస్తూనే ఉంటాయి. అటువంటి ప్రాంతంలో మట్టిలో మాణిక్యంలా పుట్టింది శిరీష. చిన్నప్పుడే తండ్రి కుటుంబాన్ని వదిలిపెట్టి పోయినా తల్లి సహకారంతో అంచలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని జాతీయ శిక్షణా శిబిరానికి ప్రయాణమవుతున్న ఆమె అక్కడ మరింత నైపుణ్యాన్ని పెంచుకోనుంది. తానీ స్థాయికి ఎదగడానికి తల్లి చెల్లిలామ్మ, గురువు జ్ఞానేంద్రబొడాయి కారణమని సగర్వంగా శిరీష చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో అభినందనలతో పాటు నగదు పారితోషికం కూడా అందించారు. అమ్మ మాజీ నక్సలైట్..! శిరీష ప్రతిభ ఇప్పటి వరకు బాహ్య ప్రపంచం గుర్తించనట్లే, ఆమె పడ్డ కష్టాలు కూడా అంతగా బయటకు తెలియవు. ఆమె తల్లి చెల్లిలామ్మ ఒకప్పటి నక్సలైటు. చిత్రకొండ, బలిమెళ దళంలో సుమారు 18 ఏళ్లు పని చేసి ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ముఖ్యనేతగా ఎదిగింది. అనంతరం వివిధ కారణాలతో 1996లో పోలీసులకు లొంగిపోయి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా చింతపల్లి జైలులో 1998 వరకు శిక్ష అనుభవించింది. విడుదల అనంతరం మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ మనీష్ ముదిగల్ చిన్న ఉద్యోగం కల్పించారు. వివాహానంతరం ఇద్దరు కూతుళ్లు పుట్టాక భారమని చెల్లిలామాను భర్త వదిలేశాడు. అయితే దళంలో అలవడిన ధైర్యం, తెగింపు మరిచి పోలేదేమో! ఇద్దరు కూతుళ్లను ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ప్రస్తుతం శిరీష ఉన్నత స్థానానికి ఎదగడం పట్ల పట్టలేని ఆనందంతో ఆమె పరవశించిపోతోంది. బుధవారం శిరీష మహారాష్ట్ర బయలుదేరిన నేపథ్యంలో చెల్లిలామా పుత్రికోత్సాహంతో గర్వంగా ఆల్ ది బెస్ట్ చెబుతూ.. శిరీషను సాగనంపింది.