తెలుగు హీరో నారా రోహిత్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టేశాడు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో గ్రాండ్‌గా నిశ్చితార్థం జరిగింది. ఉదయం 10:45 గంటలకు శిరీష(సిరి) వేలికి ఉంగరం తొడిగేశాడు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు దంపతులతో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
(ఇదీ చదవండి: రూ.500 కోట్లు దాటేసిన 'దేవర' కలెక్షన్)
2019లో 'బాణం' సినిమాతో నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'సోలో' మూవీతో హిట్ కొట్టిన తర్వాత వరస 2018 వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ ఏడాది మళ్లీ 'ప్రతినిధి 2' అనే మూవీతో వచ్చాడు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. కానీ ఇందులో నటించిన హీరోయిన్ సిరి లెల్లా మాత్రం ఇతడికి లైఫ్ పార్ట్‌నర్ అయిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. నారా రోహిత్‌కి పెదనాన్న అవుతారు. రోహిత్ ప్రస్తుత వయసు 40 ఏళ్లు. కొన్నాళ్ల క్రితం ఇంట్లో పెళ్లి గురించి టాపిక్ రావడంతో సిరిని ప్రేమిస్తున్న విషయం చెప్పాడట. అలా పెద్దలు మాట్లాడుకుని మొత్తానికి నిశ్చితార్థం నిశ్చయించారట. డిసెంబరు 15న పెళ్లి జరగనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం)
Comments
Please login to add a commentAdd a comment