రూ.500 కోట్లు దాటేసిన 'దేవర' కలెక్షన్ | Devara Movie Collection 500 Crores Worldwide Official | Sakshi
Sakshi News home page

Devara Collection: దసరా స్పెషల్.. రూ.500 కోట్ల వసూళ్లు

Oct 13 2024 11:22 AM | Updated on Oct 13 2024 11:30 AM

Devara Movie Collection 500 Crores Worldwide Official

ఎన్టీఆర్ 'దేవర' రూ.500 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. సెప్టెంబరు 27న పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రానికి తొలుత మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులే చాలామంది మూవీ నచ్చలేదని అన్నారు. కానీ రోజురోజుకు కుదురుకుని.. 16 రోజుల్లో ఇప్పుడు రూ.500 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నూతన్ నాయుడు ఇంట్లో విషాదం)

'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా ఇది. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేసిన సినిమా కావడంతో తొలుత చాలామంది 'దేవర'పై సందేహపడ్డారు. కానీ ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ పాటలు, బీజీఎం మూవీకి వెన్నముకగా నిలిచాయి. హిట్టా ఫ్లాప్ అనే సంగతి పక్కనబెడితే రూ.500 కోట్ల వసూళ్లు వచ్చాయంటే విశేషమనే చెప్పాలి.

'దేవర' రెండో భాగానికి సంబంధించిన వర్క్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. 'వార్ 2' అనే హిందీ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలలో ప్రశాంత్ నీల్ తీయబోయే మూవీ షూటింగ్‌కి హాజరవుతాడు. ఈ రెండు పూర్తయిన తర్వాతే 'దేవర 2' ఉండే అవకాశముంది. 

(ఇదీ చదవండి: హీరోగా 'బిగ్‌బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement