Devara Glimpse: జూ.ఎన్టీఆర్ 'దేవర' గ్లింప్స్ రిలీజ్ | Jr NTR's Devara Telugu Movie Glimpse | Sakshi
Sakshi News home page

Devara Movie: 'దేవర' గ్లింప్స్ వీడియో.. అది మాత్రం వేరే లెవల్

Published Mon, Jan 8 2024 4:06 PM | Last Updated on Mon, Jan 8 2024 4:28 PM

Ntr Devara Movie Glimpse Telugu - Sakshi

'ఆర్ఆర్ఆర్' తర్వాత జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. ఏప్రిల్ 5న తొలి భాగం, థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇంతకీ గ్లింప్స్ వీడియో ఎలా ఉంది? కొరటాల మార్క్ మేకింగ్.. అనిరుధ్ మ్యూజిక్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: స్టార్ హీరో ఇంట్లోకి చొరబాటు.. ఇద్దరు అనుమానితులు అరెస్ట్)

'జనతా గ్యారేజ్' లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ చేసిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తొలుత ఒక పార్ట్ అనుకున్నారు గానీ తర్వాత రెండు భాగాలుగా చేశారు. ఈ ఏప్రిల్ 5న ఫస్ట్ పార్ట్.. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. 79 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో.. అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తోంది. అలానే ఎన్టీఆర్ చెప్పిన.. 'ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూసుండాది అందుకే దీన్ని ఎర్రసముద్రం అంటారు' అని ఫైట్ తర్వాత చెప్పిన డైలాగ్ మంచి హై ఇస్తోంది.

ఈ వీడియోలో 'దేవర' ప్రపంచం ఎలా ఉండబోతుందనేది చూపించారు. అలానే అనిరుధ్ మార్క్ బీజీఎం కూడా ఉంది. అదిరిపోయే విజువల్స్‌కి ఇంగ్లీష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరికొత్తగా అనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా చేస్తున్నాడు. సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలతో పాటు 'దేవర' గ్లింప్స్ వీడియోని థియేటర్లలో ప్లే చేయబోతున్నారని టాక్.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు రిలీజ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement