
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా రతన్ రిషి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్టిస్ట్’. ఎస్‌జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఓ ప్రేమ ప్రేమ..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.
‘జారే కన్నీరే అడుగుతుందా.. . నేరం ఏముందో చెప్పమంటూ... నా ప్రేమే ఇలా ఓ ప్రశ్నయ్యేనా... నా మౌనం ఇలా ఈ బదులిచ్చేనా...’ అంటూ భావోద్వేంగా సాగుతుందీ పాట. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటని రమ్యా బెహ్రా పాడారు. ‘‘ఒక వినూత్నమైన ప్రేమ కథతో ‘ఆర్టిస్ట్’ సినిమా రూపొందింది.
ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘చూస్తూ చూస్తూ..’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘సత్యం’ రాజేశ్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, పి.సోనియా ఆకుల, స్నేహా, మాధురి శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమేరా: చందూ ఏజే, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సురేష్ బసంత్, లైన్ ప్రోడ్యూసర్: కుమార్ రాజా.
Comments
Please login to add a commentAdd a comment