Artiste Movie
-
సరికొత్త సైకో థ్రిల్లర్ గా ‘ఆర్టిస్ట్’
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా రతన్ రిషి(Ratan Rishi) దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్టిస్ట్’(Artiste Movie). జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రతన్ రిషి మాట్లాడుతూ– ‘‘సైకో థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఆర్టిస్ట్’. ఇందులో సస్పెన్స్, భయం, కామెడీ, రొమాన్స్... వంటి అన్ని అంశాలు ఉన్నాయి’’ అన్నారు. జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలనే మా సంస్థలో న్యూ కమర్స్తో మూవీస్ చేస్తున్నాం. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మా సినిమా రిలీజ్ అవుతోంది’’ అని తెలిపారు. ‘‘నేటి సమాజంలోని ఒక సమస్యను రతన్ రిషి చక్కగా చూపించారు. ఆ సమస్య పాతదే అయినా కథ, కథనాలు కొత్తగా ఉంటాయి’’ అని పేర్కొన్నారు సంతోష్ కల్వచెర్ల. ‘‘ఇలాంటి మంచి సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు క్రిషేకా పటేల్. ఈ వేడుకలో ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ సురేష్ బసంత్, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, లిరిసిస్ట్ రాంబాబు గోసాల, నటీనటులు స్నేహ మాధురీ శర్మ, వెంకీ, తాగుబోతు రమేశ్ మాట్లాడారు. -
ఓ ప్రేమ... ప్రేమ
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా రతన్ రిషి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్టిస్ట్’. ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఓ ప్రేమ ప్రేమ..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.‘జారే కన్నీరే అడుగుతుందా.. . నేరం ఏముందో చెప్పమంటూ... నా ప్రేమే ఇలా ఓ ప్రశ్నయ్యేనా... నా మౌనం ఇలా ఈ బదులిచ్చేనా...’ అంటూ భావోద్వేంగా సాగుతుందీ పాట. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటని రమ్యా బెహ్రా పాడారు. ‘‘ఒక వినూత్నమైన ప్రేమ కథతో ‘ఆర్టిస్ట్’ సినిమా రూపొందింది.ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘చూస్తూ చూస్తూ..’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘సత్యం’ రాజేశ్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, పి.సోనియా ఆకుల, స్నేహా, మాధురి శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమేరా: చందూ ఏజే, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సురేష్ బసంత్, లైన్ ప్రోడ్యూసర్: కుమార్ రాజా. -
Artiste: చూస్తు చూస్తు చూస్తు నిన్నే చూస్తుండిపోయా
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "ఆర్టిస్ట్"(Artiste Movie). ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. "ఆర్టిస్ట్" మూవీ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి 'చూస్తు చూస్తు..' పాటను విడుదల చేశారు.'చూస్తు చూస్తు..' పాటను మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేయగా.. రాంబాబు గోసాల క్యాచీ లిరిక్స్ అందించారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు. చూస్తు చూస్తు పాట ఎలా ఉందో చూస్తే...'చూస్తు చూస్తు చూస్తు నిన్నే చూస్తుండిపోయా, చూస్తు చూస్తు నేనే నీవై పోయా, చూస్తు చూస్తు నువ్వే చేశావే మాయ...చూస్తు గుండెల్లోనే దాచా చెలియా..' అంటూ హీరో హీరోయిన్స్ మధ్య సాగే అందమైన ఈ పాటను హోలీ పండుగ నేపథ్యంలో కలర్ ఫుల్ గా పిక్చరైజ్ చేశారు.