
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా రతన్ రిషి(Ratan Rishi) దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్టిస్ట్’(Artiste Movie). జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో రతన్ రిషి మాట్లాడుతూ– ‘‘సైకో థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఆర్టిస్ట్’. ఇందులో సస్పెన్స్, భయం, కామెడీ, రొమాన్స్... వంటి అన్ని అంశాలు ఉన్నాయి’’ అన్నారు.
జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలనే మా సంస్థలో న్యూ కమర్స్‌తో మూవీస్ చేస్తున్నాం. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మా సినిమా రిలీజ్ అవుతోంది’’ అని తెలిపారు. ‘‘నేటి సమాజంలోని ఒక సమస్యను రతన్ రిషి చక్కగా చూపించారు. ఆ సమస్య పాతదే అయినా కథ, కథనాలు కొత్తగా ఉంటాయి’’ అని పేర్కొన్నారు సంతోష్ కల్వచెర్ల.
‘‘ఇలాంటి మంచి సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు క్రిషేకా పటేల్. ఈ వేడుకలో ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ సురేష్ బసంత్, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, లిరిసిస్ట్ రాంబాబు గోసాల, నటీనటులు స్నేహ మాధురీ శర్మ, వెంకీ, తాగుబోతు రమేశ్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment