ఎన్టీఆర్ 'దేవర'.. ఆ రోజే ఓటీటీకి రానుందా? | Jr NTR Devara Movie Part 1 Streaming In OTT Form This Date, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Devara Part 1 OTT Release: ఓటీటీకి 'దేవర'.. ఆ డేట్ ఫిక్సయిందా?

Published Mon, Nov 4 2024 9:01 PM | Last Updated on Tue, Nov 5 2024 12:12 PM

Jr NTR Devara Part 1 Streaming Ott Form This Date Goes Viral

యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్‌ చిత్రం దేవర పార్ట్-1. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. సెప్టెంబర్‌ 27న థియేటర్లలోకి వచ్చిన దేవర రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి ముద్దుల కూతురైన జాన్వీ తనదైన గ్లామర్‌తో అలరించింది.

బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం దక్షిణాది ప్రేక్షకులకు ఈ వారం నవంబర్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వారంలోనే దేవర ఓటీటీకి వస్తే బాగుంటుందని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్ ప్రేక్షకులకు నవంబర్ 22 నుంచి అందుబాటులోకి రానుందని టాక్.

కాగా.. దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు.  శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్. శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో మెప్పించారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. యువసుధ, ఎన్టీఆర్ బ్యానర్లపై దేవర సినిమా తెరకెక్కించారు. పార్ట్-2 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్‌పై  భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement