తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్ | Ntr About Devara Movie Duration In Interview | Sakshi
Sakshi News home page

Ntr Devara: ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నా

Sep 20 2024 1:34 PM | Updated on Sep 20 2024 2:55 PM

Ntr About Devara Movie Duration In Interview

ఎన్టీఆర్ 'దేవర' మరో వారం రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ముంబై, చెన్నై ఇలా తిరిగేస్తున్న తారక్.. ప్రస్తుతం హైదరాబాద్‌కి తిరిగొచ్చేశాడు. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరోవైపు 'దేవర' ఇంటర్వ్యూలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం ఆలియా భట్-కరణ్ జోహార్‌-ఎన్టీఆర్‍‌ది రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు హీరో తారక్-కొరటాలతో విశ్వక్, సిద్ధు చేసిన ఇంటర్వ్యూని ఇప్పుడు రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)

దాదాపు అరగంట నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూలో తారక్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. కథని తాము చాలా తక్కువగానే చెప్పాం అని.. మొత్తంగా తీస్తే 8-9 గంటల సినిమా అవుతుందని అన్నాడు. అలానే జాన్వీ కూడా అద్భుతమైన యాక్టర్ అని, భాష పెద్దగా తెలియనప్పటికీ ఓసారి రెండు పేజీల డైలాగ్‌ని సింగిల్ టేక్‌లో చెప్పేసిందనే విషయాన్ని బయటపెట్టాడు.

'ఇది చాలా ఇంటెన్స్ సినిమా. బాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను కానీ లోపల ఎక్కడో చిన్న భయం ఉంది. ఈ సినిమా ఆడాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాం. మేం కొంత చెప్పి ఆపుతున్నాం, తప్పలేదు. మొత్తం తీసుకుంటే పోతే దాదాపు 8-9 గంటలు సినిమా వచ్చేది' అని ఎన్టీఆర్ చెప్పారు.

(ఇదీ చదవండి: మోసం చేస్తున్న మల్టీప్లెక్స్‌లు.. చెప్పేదొకటి చేస్తున్న మరొకటి)

తారక్-కొరటాల ఇంకే ఏమేం చెప్పారో తెలియాలంటే దిగువన ఇంటర్వ్యూ చూసేయండి.

Advertisement
 
Advertisement
Advertisement