రూ.99కే సినిమా చూసే ఛాన్స్. దేశవ్యాప్తంగా ఏకంగా 4000 స్క్రీన్స్‌లో ఈ ఆఫర్ వర్తింపు. కొత్త సినిమాల్ని కూడా తక్కువ ధరలోనే మల్టీప్లెక్స్‌లో చూసేయొచ్చు. మూడు రోజుల క్రితం మల్టీప్లెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పెద్దగా ప్రచారం చేసుకుంది. మిగతా చోట్ల రూ.99 అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో రూ.112 అని చెప్పుకొచ్చింది. తీరా చూస్తే అది కూడా లేదు. పైకి చెబుతున్నది ఒకటి రియాలిటీలో జరుగుతున్నది మరొకటి అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)
ఆఫర్ కొన్నిచోట్లే
నేషనల్ సినిమా డే అని ఘనంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ సహా చాలా థియేటర్లలో తక్కువ రేటు టికెట్ అని ఊరించారు. కానీ నిజంగా అలా చేయట్లేదు. ఈ శుక్రవారం రెండు మూడు తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటికి అరకొరా థియేటర్లు దొరికాయి. అందులో కొన్నింటిలోనే రూ.112 ఆఫర్ ఉంది.
మోసం చేస్తున్నారా?
ఆఫర్ అన్నప్పుడు ప్రస్తుతం ఏ సినిమాలు అయితే ప్రదర్శితమవుతున్నాయో అన్నింటికి అప్లై అవుతుందేమో? కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 'మత్తువదలరా 2', 'సరిపోదా శనివారం', '35 ఇది చిన్న కథ కాదు' చిత్రాలు కూడా థియేటర్లలో ఉన్నాయి. కానీ వీటిని ఆఫర్‌లో పెట్టలేదు. మళ్లీ హైదరాబాద్‌లో పలు మల్టీప్లెక్స్‌లో రిలీజైన హిందీ సినిమాలకు పెట్టారు. అంటే తెలుగు ప్రేక్షకులంటే మల్టీప్లెక్స్ అసోసియేషన్‌కి చిన్నచూపా లేదంటే ఆఫర్ చెప్పి మోసం చేయాలని చూస్తున్నారా?
(ఇదీ చదవండి: 27 ఏళ్లకే ప్రముఖ సింగర్ మృతి.. కారణమేంటి?)
ఇలా చేస్తే ఎలా?
ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లకు జనాలు వెళ్లడం గతంతో పోలిస్తే తగ్గింది. సినిమా డే నాడు ఆఫర్స్ అని చెప్పినప్పుడు పూర్తిగా పాటిస్తేనే కదా ఆసక్తి లేకపోయినప్పటికీ టికెట్ డబ్బులు తక్కువే కాబట్టి ప్రేక్షకుడు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇలా పైకి ఒకటి చెప్పి లోపల మరొకటి చేస్తే ఉన్న క్రెడిబులిటీ కూడా పోతుందేమో? ఈ విషయం మల్టీప్లెక్స్‌లు ఆలోచిస్తే బెటర్.. లేదంటే సినిమా డే-ఆఫర్ అని చెప్పేటప్పుడు కేవలం ఉత్తరాదికి మాత్రమే చెప్పుకొంటే బెటర్!
రీ రిలీజ్ సినిమాలకు కూడా
కొత్త సినిమాలకు ఆఫర్ పెట్టలేదంటే నిర్మాత కోట్లు ఖర్చు పెట్టాడు అనుకోవచ్చు. 'బొమ్మరిల్లు' లాంటి రీ రిలీజ్ సినిమాకు కూడా రూ.250, రూ.300 టికెట్ రేటు పెట్టున్నారు. కనీసం వీటినైనా సరే సినిమా డే ఆఫర్ కిందకు తీసుకొస్తే జనాలు థియేటర్లకు వస్తారేమో?
(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్)
National Cinema Day returns for its 3rd edition on September 20th! Enjoy movies at over 4,000 screens across India for just Rs. 99. Don’t miss this perfect opportunity to catch your favorite films with your friends and family. #NationalCinemaDay2024 #20September pic.twitter.com/hEduoRbGtZ
— Multiplex Association Of India (@MAofIndia) September 17, 2024
Comments
Please login to add a commentAdd a comment