బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ క్షమాపణ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. కొన్ని దశాబ్దాల నుంచి హీరోగా హిందీలో సినిమాలు చేసిన ఈయన.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ హిందీ, తెలుగులో మూవీస్ చేస్తున్నారు. అలాంటిది ఈయన ఇప్పుడెందుకు సారీ చెప్పారు. అసలు ఏం జరిగింది?
(ఇదీ చదవండి: Bigg Boss 8: కొట్టుకు చస్తుంటే సినిమా చూస్తాడేంట్రా బాబూ.. చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్!)
తప్పుగా పలకడంతో
నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తారు. అలా కొన్నిరోజుల క్రితం ప్రజలకు సందేశమిచ్చే ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. 'హలో నేను అమితాబ్ బచ్చన్, నేను చెత్త వేయను. ధన్యవాదాలు' అని అందులో చెప్పుకొచ్చారు. అయితే ఇదే వీడియోని మరాఠీలోనూ మాట్లాడి పోస్ట్ చేశారు. ఇందులో కచ్రా (చెత్త) అనే పదాన్ని తప్పుగా పలికానని, దాని గురించి తన స్నేహితుడు సుదేశ్ భోసలే చెప్పాడని, అందుకే ఈసారి సరైన ఉచ్ఛారణతో చెప్పినట్లు పేర్కొన్నారు.
సారీ చెప్పారు
ఈ క్రమంలోనే తన తప్పుని మన్నించాలని మరాఠీ వాసులకు అమితాబ్ బచ్చన్ క్షమాపణలు చెప్పారు. దీంతో నెటిజన్లు అమితాబ్ మంచితనాన్ని ప్రశంసిస్తున్నారు. రీసెంట్‌గానే ప్రభాస్ 'కల్కి'లో అశ్వద్ధామగా అదరగొట్టేసిన అమితాబ్.. ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ 'వేట్టాయాన్' మూవీలో కీలక పాత్ర పోషించారు. అక్టోబరు 10న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: బాధితురాలిపై జానీ మాస్టర్ భార్య చౌకబారు వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment