లైంగిక వేధింపుల వ్యవహారం, పోక్సో కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడి భార్య ఆయేషా అలియాస్ సుమలత తొలిసారి ఈ వ్యవహారంపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. జానీ మాస్టర్ ఎదగకూడదనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
కొరియోగ్రాఫర్స్‌తో ఎఫైర్స్
అయితే హీరోయిన్ అవ్వాలి, లేదంటే టాప్ కొరియోగ్రాఫర్ అవ్వాలన్న లక్ష్యంతోనే ఆమె ఇలాంటి పనులు చేస్తోంది. 16 ఏళ్లకే అత్యాచారం జరిగిందంటున్నారు.. అందుకు సాక్ష్యం ఉందా? దానికంటే ముందు ఎవడి దగ్గరకు వెళ్లలేదని గ్యారెంటీ ఏంటి? తనకు చాలామంది కొరియోగ్రాఫర్స్‌తో ఎఫైర్స్ ఉన్నాయి. మహిళ అనే పదానికే ఆమె కళంకం అని బాధితురాలి గురించి నీచమైన వ్యాఖ్యలు చేసింది.
జానీపై కేసు
అవకాశాల కోసం ఇండస్ట్రీకి వస్తే, సాయం చేస్తాడనుకున్న జానీ మాస్టర్ తనను లైంగికంగా, మానసికంగా హింసించాడని ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను మైనర్‌గా ఉన్నప్పుడే అత్యాచారం జరిగిందని చెప్పడంతో పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటినుంచి జానీ మాస్టర్ కనిపించకుండా పోయాడు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడు.
నిప్పు లేనిదే పొగ రాదు
నిజంగానే అతడు ఏ తప్పూ చేయకపోతే అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇన్నిరోజులు పోలీసులకు చిక్కకుండా దాక్కోవాల్సిన గత్యంతరం ఏంటి? ఈ ప్రశ్నలకు సుమలత సమాధానాలు చెప్పలేకపోయింది కానీ తానే ఒప్పని చూపించుకోవడం కోసం బాధితురాలిపై నానా నిందలు వేసింది. తనకు చాలా ఎఫైర్స్ ఉన్నాయని, ఎంతోమందితో తిరిగిందన్నట్లుగా చౌకబారు వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎన్ని చెప్పినా సరే నిప్పు లేనిదే పొగ రాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment