27 ఏళ్లకే ప్రముఖ సింగర్ మృతి.. కారణమేంటి? | Singer Ruksana Bano Passed Away Reasons Inside | Sakshi
Sakshi News home page

Ruksana Bano: సింగర్ మృతి.. కుట్రతో చంపేశారని ఆరోపణలు

Sep 20 2024 8:54 AM | Updated on Sep 20 2024 10:07 AM

 Singer Ruksana Bano Passed Away Reasons Inside

ప్రముఖ లేడీ సింగర్ రుక్సానా బానో (27) చనిపోయింది. ఒడిశా సంబల్‌పూర్‌కి చెందిన ఆల్బమ్ సాంగ్స్ పాడుతూ బాగానే గుర్తింపు తెచ్చకుంది. అనారోగ్య సమస్యలతో ఆగస్టు 27న ఆస్పత్రిలో చేరిన ఈమె.. ఇప్పుడు ఇలా చనిపోవడం అభిమానులకు షాక్‌కి గురిచేసింది. మరి చిన్న వయసులోనే తనువు చాలించడంపై ఆమె తల్లి, సోదరి చేసిన కామెంట్స్ మాత్రం చర్చనీయాంశంగా మారిపోయాయి.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)

ఒడియా సాంగ్స్ పాడుతూ ఫేమస్ అయిన రుక్సానా బానో.. కొన్నాళ్ల క్రితం షూటింగ్ కోసం బోలంగిర్ అనే ఊరు వెళ్లింది.  జ్యూస్ తాగిన తర్వాత అనారోగ్యానికి గురైంది. వెంటనే భవానీపట్నలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఇదంతా ఆగస్టు 27న జరిగింది. బోలంగిర్‌లోని పెద్దస్పత్రిలో చూపించినప్పటికీ ఫలితం లేకపోవడంతో బార్గర్ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అక్కడి కూడా అవ్వకపోయేసరికి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కి తరలించారు. అప్పటినుంచి చికిత్స అందించారు కానీ ఫలితం కనిపించలేదు. ఈ బుధవారం రాత్రి చనిపోయింది.

ఆస్పత్రి వర్గాలు.. రుక్సానా బానో విషపురుగు కాటుకి గురైందని అంటుడగా ఈమె తల్లి, సోదరి మాత్రం ప్రత్యర్థి సింగర్ ఈమెకు విషమిచ్చి చంపేసిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఒడిశా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement