ఎన్టీఆర్ 'దేవర' సరికొత్త రికార్డులు సెట్ చేసేలా ఉంది. ఎందుకంటే రిలీజ్‌కి ముందు ఓ మాదిరి ట్రోలింగ్‌కి గురైన ఈ సినిమా ఇప్పుడు తొలిరోజు ఏకంగా రూ.172 గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇన్నాళ్లు పాన్ ఇండియా సినిమా అంటే ప్రభాస్ మాత్రమే అనే దగ్గర నుంచి లిస్టులో తారక్ కూడా చేరిపోయాడు అనేంత వరకు వెళ్లింది. అలానే 'దేవర' పలు రికార్డులు కూడా సెట్ చేసినట్లు తెలుస్తోంది.
టాప్-5లోకి 'దేవర'
పాన్ ఇండియా అంటే తెలుగు, దక్షిణాది సినిమాలు మాత్రమే అనేలా ఉన్నాయి. ఎందుకంటే తొలిరోజు వసూళ్లలో తొలి ఐదు స్థానాల్లో మనమే ఉన్నాం మరి. ఆర్ఆర్ఆర్ (రూ.223.5 కోట్లు), బాహుబలి 2 (రూ.214.5 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.191.5 కోట్లు), సలార్ (రూ.178.8 కోట్లు) ఇప్పటివరకు టాప్-4లో కొనసాగుతున్నాయి. వీటి తర్వాతి స్థానంలో దేవర (రూ.172 కోట్లు) వచ్చి చేరింది. అనంతరం కేజీఎఫ్ 2 (రూ.164.2 కోట్లు), ఆదిపురుష్ (రూ.136.8 కోట్లు), సాహో (రూ.125.6 కోట్లు) ఉన్నాయి.
(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)
తెలుగు రాష్ట్రాల్లోనూ
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ తొలిరోజు వసూళ్లలో 'దేవర' సరికొత్త రికార్డ్ సెట్ చేసిందనే చెప్పాలి. రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' రూ.74.11 కోట్లు సాధించగా.. ఇప్పుడు 'దేవర' రూ.54.21 కోట్ల షేర్‌తో రెండో స్థానంలోకి వచ్చింది. అంతకు ముందు ప్రభాస్ సలార్ రూ.50.49 కోట్లతో ఈ ప్లేసులో ఉండేది. ఈ లెక్కన చూసుకుంటే టాప్-2లోని రెండు మూవీస్ కూడా తారక్‌వే కావడం విశేషం.
ప్రభాస్ తర్వాత ఎన్టీఆరే?
ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే పాన్ ఇండియా రేంజులో ప్రభాస్ తర్వాత సిసలైన స్టార్ ఎన్టీఆరే అనిపిస్తున్నాడు. ఎందుకంటే సోలో హీరోగా తొలిరోజే రూ.172 కోట్ల కలెక్షన్ రాబట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతానికి తారక్ ఉన్నప్పటికీ 'పుష్ప 2', 'గేమ్ ఛేంజర్' తదితర చిత్రాలు రిలీజైతే లెక్కలు మారే ఛాన్సులు ఉంటాయి.
(ఇదీ చదవండి: 'దేవర'తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందా?)
Comments
Please login to add a commentAdd a comment