హీరోగా 'బిగ్‌బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు | Bigg Boss 7 Amardeep Chowdary New Movie Launch | Sakshi
Sakshi News home page

Bigg Boss Amardeep: హీరోగా 'బిగ్‌బాస్' అమరదీప్.. లాంచ్ ఫొటోలు

Oct 13 2024 9:39 AM | Updated on Oct 13 2024 10:39 AM

Bigg Boss 7 Amardeep Chowdary New Movie Launch

దసరా సందర్భంగా పలు చిన్న చిత్రాలు నుంచి అప్‪‌డేట్స్ వచ్చేశాయి. వీటిలో బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ హీరోగా చేస్తున్న మూవీ ఒకటి కాగా.. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు ప్రధాన పాత్ర పోషించిన మూవీ రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు.

సీరియల్ నటుడిగా అందరికీ తెలిసిన అమర్‌దీప్.. గతేడాది బిగ్‌బాస్ షోలో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా ఇప్పటికే ఓ మూవీ చేస్తుండగా.. ఇప్పుడు 'నా నిరీక్షణ' పేరుతో మరో చిత్రాన్ని మొదలుపెట్టాడు. దసరా సందర్భంగా ఇది ప్రారంభమైంది. లిషి గణేష్ కల్లపు హీరోయిన్‌ కాగా సాయి వర్మ దాట్ల దర్శకుడు. పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం)

'ఎర్రచీర' రిలీజ్ ఎప్పుడంటే?
నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్వి నటించిన కొత్త సినిమా 'ఎర్రచీర'. తల్లి సెంటిమెంట్ కథతో తీసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ డిసెంబరు 20న థియేటర్లలో మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సుమన్ బాబు దీనికి దర్శకుడు.

'పెన్ డ్రైవ్' మూవీ షురూ
విష్ణు వంశీ, రియా కపూర్ హీరోహీరోయిన్లుగా చేస్తున్న సినిమా 'పెన్ డ్రైవ్'. ఎంఆర్ దీపక్ దర్శకుడు. కె.రామకృష్ణ నిర్మాత. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సమకాలీన కథా కథనాలతో తెరకెక్కుతోంది. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

(ఇదీ చదవండి: ప్రముఖ నేత దారుణ హత్య.. బిగ్‪‌బాస్ షూటింగ్ రద్దు)

'ప్రేమలు' బ్యూటీ తెలుగు సినిమా
'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు చేస్తున్న తొలి తెలుగు సినిమా 'డియర్ కృష్ణ'. దినేష్ బాబు దర్శకుడు. కొత్తోళ్లు అక్షయ్, ఐశ్వర్యతో మమిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ కృష్ణుడి నమ్మే ఓ భక్తుడి స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement