ప్రముఖ నేత దారుణ హత్య.. బిగ్‪‌బాస్ షూటింగ్ రద్దు | Salman Khan Cancelled Bigg Boss Show Baba Siddique Death | Sakshi
Sakshi News home page

Baba Siddique Salman Khan: షూట్ క్యాన్సిల్.. పరామర్శకు వెళ్లిన సల్మాన్

Published Sun, Oct 13 2024 8:07 AM | Last Updated on Sun, Oct 13 2024 8:43 AM

Salman Khan Cancelled Bigg Boss Show Baba Siddique Death

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ.. ముంబైలో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న ఈయన కుమారుడు ఆఫీస్ బాంద్రాలో ఉంది. అక్కడకు దగ్గర్లో ఉన్న సమయంలో సిద్దిఖీపై గుర్తుతెలియని వ్యక్తులు మూడు రౌండ్స్ కాల్పులు జరిపారు. హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈయన మృతి చెందారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం)

మరణవార్త తెలుసుకున్న సల్మాన్.. బిగ్ బాస్ 18వ సీజన్ షూటింగ్ మధ్యలోనే ఆపేసి మరీ సిద్దిఖీని పరామర్శించడానికి వెళ్లారు. వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ప్రతి ఏడాది సిద్ధిఖీ ఇచ్చే ఇఫ్తార్ విందుకు సల్మాన్ కచ్చితంగా హాజరవుతుంటారు. అలానే సిద్దిఖీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా సరే సల్మాన్ రావాల్సిందే. అలాంటిది ఇప్పుడు తన స్నేహితుడు చనిపోవడం సల్మాన్ విషాదంలో నింపేసింది.

సిద్దిఖీ విషయానికొస్తే ముంబైలోని బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 48 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు. గత ఫిబ్రవరిలో పార్టీని వీడి, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌సీపీలో చేరారు. మరో నెలరోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ఈ కాల్పులు ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 8: కిర్రాక్‌ సీత ఎలిమినేట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement