
బాలీవుడ్ హీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రియాలిటీ షో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో బిగ్‌బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ సీజన్ అభిమానులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తోంది. తాజా ఎపిసోడ్‌లో బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ మెరిసింది. ఇటీవల విడుదలైన తన మూవీ విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాను ప్రమోట్ చేసేందుకు వచ్చింది.
ఈ ఎపిసోడ్‌లో పాల్గొన్న మల్లికా షెరావత్.. సల్మాన్ ఖాన్‌పై ప్రేమవర్షం కురిపించింది. ఇండియా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అంటూ కొనియాడింది. నా కళ్లలో కళ్లు పెట్టి చూడు అంటూ సల్మాన్‌తో సరదాగా మాట్లాడింది. మీరు నా హృదయంలో ఉన్నారంటూ వేదికపైనే సల్మాన్‌కు ముద్దుపెట్టి మరి తన ప్రేమను వ్యక్తం చేసింది. దీంతో సల్మాన్ ఖాన్ సిగ్గుపడుతూ కనిపించారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
కాగా.. సల్మాన్ హోస్ట్‌గా ఉన్న ఈ రియాలిటీ షోలో మల్లికా షెరావత్ మొదటిసారి కనిపించింది. ఈ ఎపిసోడ్‌కు మల్లికతో పాటు చిత్రంలో నటించిన రాజ్‌కుమార్ రావు, ట్రిప్తి డిమ్రీ కూడా హాజరయ్యారు. 1990లో ఓ చిన్న పట్టణంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి రాజ్ శాండిల్య దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment