ఎన్టీఆర్‌ 'దేవర'.. నెట్టింట వైరలవుతోన్న పవర్‌ఫుల్‌ డైలాగ్‌! | Junior NTR latest Movie Devara Dialogue Leaked In Online Goes Viral | Sakshi
Sakshi News home page

Devara Movie: ఎన్టీఆర్‌ 'దేవర'.. గూస్‌బంప్స్‌ డైలాగ్‌ లీక్‌!

Published Wed, Jul 10 2024 5:46 PM | Last Updated on Wed, Jul 10 2024 6:20 PM

Junior NTR latest Movie Devara Dialogue Leaked In Online Goes Viral

టాలీవుడ్ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోన్న యాక్షన్‌ చిత్రం దేవర. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సముద్ర నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌, గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా దేవరకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయమైన విషయం నెట్టింట తెగ వైరలవుతోంది.  ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేవరలోని ఓ డైలాగ్‌ లీక్ అయినట్లు సమాచారం.  'సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా.' అనే డైలాగ్‌ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మొత్తంగా ఈ డైలాగ్‌ వింటే ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌ రోల్‌ ‍పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. దేవర ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement