హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భైరవం. ఇది తమిళ 'గరుడన్' సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి సోమవారం (జనవరి 20) టీజర్ రిలీజ్ చేశారు. రాత్రి నాకో కల వచ్చింది. చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు.. అంటూ జయ సుధ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది.
శీనుగాడి కోసం నా ప్రాణాలిస్తా.. వాడి జోలికెవడైనా వస్తే ప్రాణాలు తీస్తా అని మనోజ్ పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పాడు. యాక్షన్‌కు ఢోకా లేదన్నట్లుగా ఉన్న ఈ టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాను కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్‌తో పాటు ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్, రాజా రవీంద్ర, సంపత్ రాజ్, సందీప్ రాజ్, వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment