Manoj Manchu
-
మద్యం మత్తులో దురుసు ప్రవర్తన? క్లారిటీ ఇచ్చిన మనోజ్
మద్యం మత్తులో హీరో మంచు మనోజ్ ఓ పెద్దాయనతో దురుసుగా ప్రవర్తించాడంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై మనోజ్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తన బిడ్డను ఇంట్లో బంధించి, తన దగ్గరకు వెళ్లనివ్వకపోతే ఇంకెలా ప్రవర్తిస్తానని ప్రశ్నించాడు. అలాగే తాను మద్యం సేవించలేదని స్పష్టం చేశాడు.నేనే మీడియాను పిలిచా'తెలంగాణ డీజీపీ ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత జరిగిన ఓ బాధాకర సంఘటన గురించి చెప్పాలి. దానివల్ల నేను, నా భార్య ఎంతో నరకం అనుభవించాం. మా తొమ్మిది నెలల కుమార్తెను ఇంట్లో బంధించి మమ్మల్ని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మాపై దాడి చేశారు. ఆ సమయంలో నా చొక్కా కూడా చిరిగిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న నేను మీడియా సాయం కోరాను. మా ఇంటి ఆవరణలోకి రావడంలో వాళ్లది ఏమాత్రం తప్పులేదు.నా ఛాతీపై కొట్టడంతో..దీనికి సంబంధించిన వీడియో రిలీజ్ చేయాలని విష్ణు భాగస్వామి రాజ్ కొందూరును కోరుతున్నాను. ఇప్పటికే కిరణ్, విజయ్‌లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణ పూర్తయితే నిజాలు బయటకు వస్తాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో విషయానికి వస్తే.. తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి నా ఛాతీపై కొట్టాడు. నన్ను నేను రక్షించుకునే క్రమంలో ఆయన్ను వెనక్కు నెట్టేశాను. రెండురోజుల్లో నాపై జరిగిన రెండో దాడికి ఇదే నిదర్శనం. మీరైతే ఏం చేస్తారు?అయినా మీ తొమ్మిది నెలల చిన్నారి నుంచి మిమ్మల్ని దూరం చేస్తే మీరేం చేస్తారో చెప్పండి.. ఆ సమయంలో నేను తాగి ఉన్నానని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ రోజంతా నేను పోలీసులతో, మీడియాతోనే ఉన్నాను. అలాంటి సమయంలో నేనెక్కడ మందు తాగాను? వినయ్ కావాలనే నాపై ఈ పుకార్లు సృష్టించాడు. ఆస్తి కోసం డిమాండ్ చేస్తున్నానన్నాడు. నా పరువు మర్యాదలకు భంగం కలిగించి నా నోరు నొక్కేయాలని చూస్తున్నాడు. కానీ నేను వెనక్కు తగ్గను.ఆయుధాలతో భయపెట్టాలని చూసిన విష్ణుఇదంతా జరుగుతున్నప్పుడు నా సోదరుడు విష్ణు ఎక్కడా కనిపించలేదు. మా నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు మాత్రమే కనిపించాడు. దీనికంటే ముందు నాకు సపోర్ట్‌గా వచ్చినవారిని తన బౌన్సర్లతో భయపెట్టేందుకు ప్రయత్నించాడు. ఆయుధాలు కూడా తీసుకువస్తానన్నాడు. అయినప్పటికీ వారు ఏమాత్రం జంకకుండా నా కూతురికి రక్షణగా నిలబడ్డారు.నేను పారిపోవడం లేదువినయ్ నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇది అన్యాయం, అనైతికం. నేను ఏ తప్పూ చేయలేదు. సాక్ష్యాధారాలతో నాపై చేసిన ప్రతి ఆరోపణను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడికీ పారిపోవడం లేదు. నిజం నిప్పులాంటిది.. కచ్చితంగా బయటకు వస్తుంది అని మనోజ్ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు.Press NoteI wish to address the deeply distressing incident that occurred following my visit to the Telangana DGP office. My wife and I were subjected to immense trauma when we were locked out of our own home, with our 9-month-old daughter left inside.After forcing our way… https://t.co/dlwU6wLcgS— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 13, 2024చదవండి: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ -
కొండా సురేఖ చౌకబారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మహేశ్ బాబు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ భగ్గుమంటుంది. సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి, అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో #FilmIndustryWillNotTolerate అనే హ్యాష్ ట్యాగ్‌తో కొండా సురేఖపై నటీనటులు భారీగానే విరుచుకుపడుతున్నారు.మహేశ్ బాబు'మంత్రి కొండా సురేఖ గారు మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. ఒక కూతురి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా మీ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. ఒక మహిళా మంత్రిగా మీరు మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యలు, మీ భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యాను. ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. మీరు చేసిన చౌకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని పబ్లిక్ డొమైన్లో ఉన్న అందరినీ అభ్యర్థిస్తున్నాను. మన దేశంలోని మహిళలను, మన సినీ సోదరులను గౌరవంగా చూడాలి.' అని మహేశ్ కోరారు.రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచమైన ఆరోపణలు చేస్తూ ఓ మహిళా మంత్రి పైశాచిక వ్యూహాలను అవలంబించడం నన్ను భయాందోళనకు గురిచేస్తోంది. ఇది అవమానానికి మించినది. తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను ఎవరూ లాగకూడదు. నాయకులు సమాజానికి ఉదాహరణగా నిలువాలి. అందరిలోనూ సామాజిక విలువలను పెంచాలి. వాటిని తగ్గించకూడదు.- రవితేజమంత్రి కొండా సురేఖ గారి నుంచి ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు వినడం చాలా బాధాకరం. అధికారంలో ఉన్న మహిళగా, మహిళలు విజయం సాధించడం ఎంత సవాలుతో కూడుకున్నదో మీకు తెలిసే ఉంటుంది. రాజకీయ లబ్ధి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలపై స్త్రీ ద్వేషంతో తప్పుడు ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదు. మీ మాటలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రాహుల్ గాంధీని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. మీ పార్టీలోని నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలి. భవిష్యత్ తరాలకు మనం సరైన ఉదాహరణగా ఉండాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాను. ఈ వ్యక్తిగత దూషణలు చిత్ర పరిశ్రమ ఏకతాటిపైకి తెస్తోంది. అని భావిస్తున్నాను. - మంచు మనోజ్రాజకీయాల కోసం సినీ, టీవీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాన్ని తప్పుడు ఆరోపణలు ప్రచారం చేయడం సరికాదు. చిత్ర పరిశ్రమలోని మేమందరమూ కూడా కుటుంబ సమేతంగా కలిసి నిరసన తెలియజేస్తున్నాం. వ్యూస్ కోసం తప్పుడు థంబ్నెయిల్లతో అవే వీడియోలను పోస్ట్ చేయవద్దని యూట్యూబర్స్ణు అభ్యర్థిస్తున్నాను. ఇతర వృత్తిలాగే మమ్మల్ని కూడా గౌరవించండి. - సుమ కనకాలసినీ ప్రముఖులపై రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఇది వ్యక్తిగత జీవితాలను దోపిడీ చేయడం .దయచేసి మాట్లాడే ముందు ఆలోచించండి. ఈ రకమైన నీచమైన వ్యాఖ్యలు, మాటల దూషణలకు వ్యతిరేకంగా మేము ఐక్యంగా ఉన్నాము. - కిరణ్ అబ్బవరంశ్రీమతి కొండా సురేఖ.. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా అసహ్యంగా మాట్లాడటం మమ్మల్ని చాలా బాధపెట్టింది.ఇలాంటి నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం అంత మంచి నిర్ణయం కాదు. మీ రాజకీయం కోసం సినీ పరిశ్రమ సభ్యుల వ్యక్తిగత జీవితాలను లాగితేప సహించం. - రాజశేఖర్మీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కానివి. చాలా అసహ్యంగా ఉంది. ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా ఇంత నీచంగా దిగజారి, మీడియా ముందు అవమానకరమైన వ్యాఖ్యలను ఎలా చేయగలరు..? సెలబ్రిటీల పేర్లను, వారి వ్యక్తిగత జీవితాన్ని లాగడం, వారిపై నిరాధార ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు. హద్దులు దాటి ఒక వ్యక్తి గుర్తింపును అగౌరవపరచడం సహించలేని చర్య. ఇలాంటి వాటిని సమాజం తిరస్కరిస్తుంది. ప్రతి ఒక్కరిని గౌరవించండి. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ.. సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని భావిస్తున్నాం. మహిళా మంత్రినే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం.' అని చెప్పుకొచ్చింది. - సంయుక్త మేనన్నేటి రాజకీయ నాయకుల ప్రవర్తనపై నా ఆలోచనలు, భావాలను మంచి భాషలో వ్యక్తీకరించడానికి ఇబ్బంది పడుతున్నా. ప్రజలకు మంచి జరగడానికి మేము ఓటు వేస్తామని చాలా మంది రాజకీయ నాయకులకు గుర్తు చేయాలనుకుంటున్నాము. ప్రజలుగా మేము దీన్ని అనుమతించలేము, అంగీకరించలేము. రాజకీయాలు ఏ మాత్రం దిగజారకూడదు. మీరుండేది ప్రజల బాగోగులూ చూసుకునేందకని గుర్తుపెట్టుకోండి. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల, విద్య గురించి మాట్లాడండి. ఉద్యోగాలు కల్పించి వారి శ్రేయస్సు కోసం కష్టపడండి. ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయాలను దిగజార్చకండి.' అంటూ కొండా సురేఖపై కామెంట్ చేశారు. - విజయ్ దేవరకొండ సమంత గారిపై, అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్క చేసిన వ్యాఖ్యలు బాధాకరం. గతంలో చైల్డ్ అబ్యూస్ కేసులో ముందుగా స్పందించిన మీరే.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధనిపిస్తుంది. మీ రాజకీయ విమర్శల కోసం ఏ మాత్రం సంబంధం లేని నటీనటుల పేర్లు తీసుకురావడం.. ఆపై వాళ్ల వ్యక్తిగత జీవితంపై దిగజారుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మీరే ఇలా మాట్లాడడం సమాజానికి శ్రేయస్కరం కాదు. మావి చాలా సున్నితమైన మనసులు. వాటిని గాయం చేసి మీ రాజకీయం కోసం వాడుకోవడం తగదు. గతంలో మా కుటుంబాన్ని కూడా ఎన్నిసార్లు లక్ష్యంగా చేసుకుని దారుణమైన వ్యాఖ్యలు చేసినా మేము స్పందించలేదు. మేమెప్పుడూ ఏమీ అనమని సాఫ్ట్ టార్గెట్ చేయవద్దు. దయచేసి ఇకపై నటులను మాత్రమే కాదు.. ఎవరి వ్యక్తిగత విషయాలపై ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయకూడదని కోరుకుంటున్నాను. - సాయి ధరమ్‌తేజ్ -
ఆదిపురుష్‌ను ప్రమోట్ చేస్తున్న మంచు మనోజ్ దంపతులు
దేశవ్యాప్తంగా జూన్ 16న విడుదల కానున్న ఆదిపురుష్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని నిరు పేదలకు, అనాథలకు ఉచితంగా చూపించాలని చాలా మంది ప్రముఖులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ సినిమా టిక్కెట్లను కొనుగోలు చేసి ప్రత్యేక షోలు వేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రామ్ చరణ్, కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్, గాయని అనన్య బిర్లా 10,000 టిక్కెట్లు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. (ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా) ఇప్పుడు తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక జంట కూడా ఆ క్లబ్లో చేరారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ అనాథ శరణాలయాలకు చెందిన 2500 మంది పిల్లలకు వారు ఆదిపురుష్ సినిమాను చూపించాలని నిర్ణయించుకున్నారు. 'ఎలాంటి హద్దులు లేకుండా అందరూ వేడుకలా జరుపుకోవాల్సిన సినిమా ఆదిపురుష్. దీనిని మా జీవితకాలంలో వచ్చిన అవకాశంగా భావించాలి. ఆదిపురుష్.. ద్వారా ఇతహాస మహాగాధ రామాయణం గురించి తెలుసుకునేలా తెలుగు రాష్ట్రాల్లోని పలు అనాథ శరణాలయాల్లో ఉన్న 2500 పిల్లలకు చూపించాలని నిర్ణయించుకున్నాం. జైశ్రీరామ్ అనే పవిత్ర శ్లోకం అన్ని చోట్ల ప్రతిధ్వనించాలి' అని మంచు మనోజ్, భూమా మౌనిక అన్నారు. (ఇదీ చదవండి: కావాలనే చేస్తుందా?.. మరో టాప్ హీరోకు షాకిచ్చిన కంగనా రనౌత్?) -
నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అల్లు అర్జున్ అంటే నాకు ...
-
కొత్త నోట్లను ప్రింట్ కొడుతూ.. వీడియో వైరల్
-
నటనకు గుడ్‌బై! నో నో... నటిస్తా!!
‘‘నటుడిగా ‘ఒక్కడు మిగిలాడు’ నా చివరి సినిమా. అందరికీ నమస్కారాలు’’ – బుధవారం ఉదయం మోహన్‌బాబు రెండో కుమారుడు, యువహీరో మంచు మనోజ్ చేసిన ట్వీట్ సారాంశమిది. ఈ ట్వీట్ చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. నటనకు రిటైర్మెంట్ ఏజ్ ఏమీ లేదు. అయినా మనోజ్ వయసెంత? 34 ఏళ్ళే! ఈ వయసులో నటనకు గుడ్‌బై చెప్పడం ఏంటి? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ట్విట్టర్, టీవీల్లో మనోజ్ గురించి డిస్కషన్స్ స్టార్ట్ చేశారు. అందరూ ఏమైందని ఆరా తీయడం మొదలుపెట్టారు. తీరిగ్గా ఓ ఆరు గంటల తర్వాత మనోజ్ అసలు సంగతి చెప్పారు. ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత ఆయన నటించబోయే కొత్త సినిమాను కూసింత సై్టల్‌గా ఎనౌన్స్ చేద్దామనుకున్నారట! అది స్ట్రయిట్‌గా సరైన దారిలో కాకుండా రాంగ్ టర్న్ తీసుకున్నట్టుందని మళ్లీ ట్వీట్ చేశారు. ‘‘వావ్! నా ట్వీట్ గురించి ఇంత స్పందన, ఇన్ని విమర్శలు వస్తాయని ఊహించలేదు. -
'బాహుబలి-2' పై యంగ్ హీరో ఏమన్నాడంటే..
హైదరాబాద్: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి: ది కన్‌క్లూజన్'ను తొలిరోజు చూడాలని సాధారణ అభిమానులతో సహా టాలీవుడ్ నటులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ భార్య ప్రణతితో కలసి ఐనాక్స్ నాలుగో స్కీన్‌పై బాహుబలిని వీక్షించారు. అనంతరం ఆ వివరాలను ట్వీట్ చేశారు. 'బాహుబలి-2 చాలా బాగుంది. సినిమాను మళ్లీ చూస్తాను. బాహుబలి టీ షర్ట్ ధరించి తర్వాతి షోలో బాహుబలి-2ను మరోసారి వీక్షిస్తానని' ట్వీట్లో రాసుకొచ్చారు మనోజ్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు టాలీవుడ్ నటులు, ఇతర ప్రముఖులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. శుక్రవారం దేశంలో అత్యధిక థియేటర్లలో విడుదలైన మూవీగా 'బాహుబలి: ది కన్‌క్లూజన్' రికార్డులు సృష్టించింది. బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా దేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. #Baahubali2 was so good, I HAVE to watch it again! Go ahead... put on your Baahubali t-shirt and catch the next show! -
సినిమా రివ్యూ: కరెంట్ తీగ
నటీనటులు: మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్, సన్ని లీయోన్, జగపతిబాబు, సుప్రీత్, తాగుబోతు రమేశ్, వెన్నెల కిషోర్, పృథ్వీ తదితరులు. సంగీతం: అచ్చు ఫొటోగ్రఫి: సతీష్ ముత్యాల నిర్మాత: మంచు విష్ణు దర్శకత్వం: జి నాగేశ్వరరెడ్డి ఆకట్టుకునే అంశాలు: కామెడీ మంచు మనోజ్ ఫెర్ఫార్మెన్స్ రకుల్ ప్రీత్ సింగ్, సన్ని లియోన్ గ్లామర్ ఫైట్స్, ఫోటొగ్రఫి క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ రొటిన్ కథ పార్వతీపురంలో గ్రామపెద్ద శివరామరాజు(జగపతిబాబు)కు ముగ్గురు కూతుళ్లు. వారిలో ఒకరు కవిత(రకుల్ ప్రీత్ సింగ్). ఆ ఊర్లో వీర్రాజు(సుప్రీత్) అనే వ్యక్తితో శివరామరాజుకు వైరం ఉంటుంది. అదే గ్రామానికి చెందిన రాజు (మంచు మనోజ్) వీఐపీల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటాడు. ఊర్లో అన్యాయాలను ఎదిరించే రాజు, కవితలు ప్రేమించుకుంటాడు. రాజుతో ప్రేమను ఇష్టపడని కవిత తండ్రి శివరామరాజు.. తనకు నచ్చిన వ్యక్తితో కూతురు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు. దాంతో కవిత, రాజులు లేచిపోవాలని నిర్ణయించుకుని.. ఊర్లో నుంచి పారిపోవడానికి సిద్ధపడుతారు. అయితే చివరి నిమిషంలో మనసు మార్చుకున్న వాళ్లిద్దరూ తిరిగి శివరామరాజు దగ్గరకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో తిరిగి వచ్చిన రాజు, కవితలను శివరామరాజు ఏంచేశాడు? వీర్రాజుతో శివరామరాజుకు మధ్య ఉన్న వైరం ఏంటి? ఏ కారణంతో రాజుతో కవిత ప్రేమను వ్యతిరేకించాడు? లేచిపోవాలనుకున్న రాజు, కవితలు ఎందుకు మనసు మార్చుకున్నారు? ఇక ఈ కథలో సన్నీ లియోన్, సంపూర్ణేష్ బాబుల పాత్రలేంటి అనే ప్రశ్నలకు సమాధానమే ’కరెంట్ తీగ’. ఎప్పటిలాగే హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెద్దలను వ్యతిరేకించడం లాంటి కథలతో చాలా సినిమాలే వచ్చాయి. అయితే సమాజంలో ఆడపిల్లలు పుట్టడం నేరంగా చూడకూడదు అనే పాయింట్‌ను ప్రధానంగా తీసుకుని అల్లిన కథలో రాజుగా మంచు మనోజ్.. ఓ మాస్ క్యారెక్టర్‌ను పోషించాడు. మాస్ ఎలిమెంట్స్‌కు తనదైన హాస్యాన్ని, టైమింగ్‌తో మనోజ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, సన్నీలియోన్ తో కలిసి రొమాన్స్‌ను పండించాడు. ఓ పాటను పాడటమే కాకుండా, క్యాస్టూమ్స్ డిజైన్, ఫైట్స్ విభాగాల్లో తన మార్కును చూపించాడు. మరోసారి మనోజ్ గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. గతంలో కంటే ఈ చిత్రంలో మనోజ్ కాస్త పుష్టిగా కనిపించాడు. ఈ విషయంలో మనోజ్ జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. గ్లామర్‌కే పరిమితి కాకుండా.. నటనకు కొంత స్కోప్ ఉండే పాత్ర రకుల్ ప్రీత్ సింగ్ కు లభించింది. తనకు లభించిన అవకాశాన్ని రకుల్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే.. ఫెర్ఫార్మెన్స్ విషయంలో కొంత మెచ్చురిటీ సాధించింది. అతిధి పాత్రలో సన్నీలియోన్ టీచర్‌గా హాట్ హాట్‌గా కనిపించించింది. ఒకే ఒక్క సీన్లో కనిపించిన సంపూర్ణేష్ బాబు ఎంట్రీ ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహన్ని కలిగించేలా ఉంది. లెజెండ్‌తో రూట్ మార్చిన జగపతిబాబు.. ఈచిత్రంలో మరో ప్రధానమైన పాత్రను పోషించాడు. గ్రామపెద్దగా, ముగ్గురు కూతుళ్ల తండ్రిగా ఓ బరువైన పాత్రను, కథకు వెన్నెముకగా నిలిచాడు. ఎప్పటిలాగే తాగుబోతు రమేశ్, వెన్నెల కిషోర్, పృథ్వీలు తమ పాత్రల పరిధి మేరుకు పర్వాలేదనించారు. సాంకేతిక విభాగం: ఈ చిత్రానికి అచ్చు సంగీతాన్ని అందించారు. విడుదలకు ముందే ఆడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన పిల్లా ఓ పిల్లా, వరికుప్పల యాదగిరి ’పోతే పోని పోరా’, భాస్కర భట్ల ’ఎర్ర ఎర్ర చీర’, అనంత శ్రీరాం రాసిన పదహారేళ్లైనా పాటలు ఆలరించాయి. అచ్చు బ్యాక్ గ్రౌడ్ స్కోర్‌పై మరింత దృష్టి పెట్టి ఉంటే అదనంగా మరికొంత ఫీల్ తెరపై కనిపించేంది. మంచు మనోజ్ కంపోజ్ చేసిన ఫైట్స్, ఫోటోగ్రఫి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. దర్శకత్వం: మినిమమ్ గ్యారెంటి అనే బ్రాండ్ ఉన్న దర్శకుడు నాగేశ్వరరెడ్డి. మనోజ్‌లో ఉండే ఎనర్జీని చక్కగా తెరక్కించాడు. రొటిన్ కథకు కామెడీ, యాక్షన్, సెంటిమెంట్‌ను జోడించి మనోజ్‌ను కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేశారు. తొలి భాగంలో కథనంలో వేగం మందగించనట్లు కనిపించినా.. సెకండాఫ్‌లో గన్ ఎపిసోడ్, జగపతిబాబు నిద్రలో నడిచే సన్నివేశాలను ఆసక్తికరంగా చిత్రీకరించి ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్ పై మరికొంత శ్రద్ద పెట్టి ఉంటే.. కథలో కొంత వేగం పెరగడానికి అవకాశం ఉంటుంది. ముగింపు: కామెడీ, మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ‘కరెంట్ తీగ’ బీ, సీ సెంటర్లోని ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే మనోజ్ కెరీర్లో భారీ విజయం చేరినట్టే. --రాజబాబు అనుముల Follow @sakshinews -
'తీన్మార్' హీరోయిన్ కు తప్పిన ప్రమాదం
'తీన్మార్' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన కృతి కర్బందా... అగ్ని ప్రమాదం నుంచి బయటపడింది. సినిమా షూటింగ్ లో ప్రమాదాలు సాధారణం. ఆమె చేస్తున్న సినిమా షూటింగ్ లో ప్రమాదమేమీ జరగలేదు. కానీ ఆమె బస చేసిన హోటల్ రూమ్ లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తప్పించుకుంది. 'హోటల్ చిరాంత్ లో నాకు ఎగ్జిక్యూటివ్ సూట్ ఇచ్చారు. గీజర్ తో వేన్నీళ్లు కాచుకుని సాన్నం చేసి.. కాసేపు టీవీ చూసి నిద్రపోయా. కొంత సమయం గడిచాక నిప్పులు అంటుకున్న చప్పుడు వినబడితే లేచాను. అయితే కలలో అనుకుని మళ్లీ నిద్రపోయాను. మళ్లీ శబ్దం వినబడడంతో మేల్కోని చూసే సరికి గదిలో మంటలు మెల్లగా వ్యాపిస్తున్నాయి. చాలా భయపడిపోయాను. వెంటనే తేరుకుని తడి తవల్ ఒంటికి చుట్టుకుని గట్టిగా కేకలు వేశాను. ఇంతలో సినిమా, హోటల్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ఎప్పుడూ భయపడని నేను చావును దగ్గరగా చూశాను' అని కృతి భయంగా చెప్పింది. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. కృతి తెలుగులో నటిస్తున్న 'కరెంట్ తీగ' సినిమా షూటింగ్ లోనూ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి మంచు మనోజ్ బయటపడ్డాడు. -
రెండు రోజుల్లోనే రికార్డ్ సాధించింది - లగడపాటి శ్రీధర్
‘‘కన్నడ చిత్రం ‘గోవిందాయ నమః’ని లగడపాటి శ్రీధర్ తెలుగులో రీమేక్ చేస్తున్నాడని వినగానే, సాహసం చేస్తున్నాడనుకున్నాను. ఎందుకంటే కన్నడ చిత్రాల తెలుగు రీమేక్స్‌లో ఇక్కడ సక్సెస్ అయినవి చాలా తక్కువ. ఈ నేపథ్యంలో శ్రీధర్ ఈ రీమేక్ చేశాడు. ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చిందని వినగానే చాలా ఆనందపడ్దాను’’ అన్నారు కోదండరామిరెడ్డి. మంచు మనోజ్ హీరోగా పవన్ వడియార్ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్-శిరీషా నిర్మించిన చిత్రం ‘పోటుగాడు’. ఇటీవల విడుదలై, మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎ. కోదండరామిరెడ్డి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలందజేశారు. లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ -‘‘కథని, నటీనటుల్ని నమ్మి నేనీ సినిమా చేస్తే, డిస్ట్రిబ్యూటర్లు నన్ను నమ్మారు. విడుదలైన రెండు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లను సాధించిందీ చిత్రం. ‘అత్తారింటికి దారేది’ ప్రభంజనం సాగుతున్నప్పటికీ మా సినిమా ఏదో మూల ఆడుతోందనే విషయం నన్ను ఆనందపడేలా చేస్తోంది’’ అని చెప్పారు. 150 థియేటర్స్‌లో మంచి వసూళ్లతో ఈ చిత్రం సాగుతోందని మల్టీ డైమన్షన్ వాసు తెలిపారు. ఈ వేడుకలో దామోదర ప్రసాద్, జి.నాగేశ్వరరెడ్డి, ఆర్పీ పట్నాయక్, లగడపాటి శ్రీధర్ తల్లి రామలక్ష్మి, సతీమణి శిరీషాలతో పాటు అలీ, పోసాని కృష్ణమురళి, సాక్షి చౌదరి, అనుప్రియ, గీతాసింగ్తో పాటు పలువురు పంపిణీదారులు పాల్గొన్నారు. -
పోటుగాడికి పూల బాట
‘‘ ‘ఎవడి గోల వాడిది’ తర్వాత అంత పెద్ద సినిమా ఇది. ఆ సినిమా స్థాయికి ఎక్కడా తగ్గలేదు’’ అని లగడపాటి శిరీష చెప్పారు. మంచు మనోజ్ హీరోగా పవన్ వడయార్ దర్శకత్వంలో శిరీష, శ్రీధర్ నిర్మించిన ‘పోటుగాడు’ ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ -‘‘సినిమా చూసిన వారందరూ పోటుగాడికి ప్రశంసల పూలబాట వేస్తున్నారు. ‘నాయక్’ తర్వాత మంచి పాత్ర ఇందులో చేశాను’’ అన్నారు. ఈ సినిమా విజయం విషయంలో తన అంచనా నిజమైందని శ్రీధర్ ఆనందం వెలిబుచ్చారు. మనోజ్ మంచి కోస్టార్ అని అనుప్రియ, సాక్షి చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా కాశీవిశ్వనాథ్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్, మల్టీడెమైన్షన్ వాసు, శరత్ మండవ కూడా మాట్లాడారు. -
సన్నాఫ్ పెదరాయుడు
మంచు మనోజ్ కొత్త సినిమా కమిటయ్యారు. టైటిల్ ‘సన్నాఫ్ పెదరాయుడు’. హాలీవుడ్లో ‘డార్క్ఫీల్డ్స్’ చిత్రానికి సహాయకునిగా పనిచేసిన పి.సాగర్ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. రమేష్ పుప్పాల నిర్మాత. ఈ సినిమాతో పాటు ఆయన ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో మరో చిత్రం కూడా ప్లాన్ చేశారు. ఈ రెండు సినిమాల గురించి రమేష్ పుప్పాల మాట్లాడుతూ -‘‘ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో విమలారామన్ ప్రధాన పాత్ర పోషిస్తారు. సాయికుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు పరిచయం అవుతున్నారు. అక్టోబర్ తొలివారంలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లో ముగిస్తాం. ఆర్పీ దర్శకత్వం వహించిన గత చిత్రాలకు భిన్నంగా సరదాగా సాగిపోయే సినిమా ఇది. ఇక మనోజ్ సినిమా విషయానికొస్తే ఆ దర్శకుడు ‘కిక్’సురేందర్‌రెడ్డి దగ్గర పలు చిత్రాలకు పనిచేశాడు. అతని కథే ఈ చిత్రానికి హైలైట్. మనోజ్ కెరీర్‌ని మలుపు తిప్పే సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని కూడా అక్టోబర్‌లోనే మొదలు పెడతాం. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు. -
పోటుగాడు తర్వాత మనోజ్ ‘కలెక్షన్ కింగ్’
‘‘దర్శకుడు పవన్ ఇప్పటికే కన్నడంలో రెండు హిట్లు కొట్టారు. దీంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. పాటలన్నీ మంచి హిట్ అయినందుకు ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. వచ్చేవారంలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని మనోజ్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘పోటుగాడు’. సాక్షి చౌదరి, సిమ్రన్ కౌర్ ముండి, రేచల్ వీస్, అనుప్రియా కోమెంక కథానాయికలు. పవన్ వడయార్ దర్శకుడు. శిరీష-శ్రీధర్ నిర్మాతలు. అచ్చు స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఇటీ వల విడుదల చేశారు. ఈ పాటలు శ్రోతలను అలరిస్తున్నాయని యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ -‘‘ఆదివారం పాటలు విడుదలైతే, సోమవారమే హిట్ టాక్ రావడం మా యూనిట్ మొత్తాన్ని ఆశ్చర్యానికి లోను చేసింది. సంగీత దర్శకుడు అచ్చు ఫ్యూచర్లో గొప్ప మ్యూజిక్ దర్శకునిగా ఎదుగుతాడు. ఈ ఆల్బమ్‌లోని ప్రతి పాట శ్రోతల్ని అలరిస్తున్నాయి. ఇది మంచు వారి నుంచి వస్తున్న మంచి పంచ్ ఉన్న సినిమా. ఈ సినిమా తర్వాత మనోజ్‌ని అందరూ ‘కలెక్షన్ కింగ్’ అంటారు’’ అని చెప్పారు. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని దర్శకుడు అన్నారు. ఇంకా కథానాయికల్లో ఒకరైన అనుప్రియ, సత్యదేవ్ కూడా మాట్లాడారు.