సన్నాఫ్ పెదరాయుడు | Manchu monoj new movie title 'son of pedda rayudu' | Sakshi
Sakshi News home page

సన్నాఫ్ పెదరాయుడు

Published Fri, Sep 13 2013 12:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

సన్నాఫ్ పెదరాయుడు

సన్నాఫ్ పెదరాయుడు

మంచు మనోజ్ కొత్త సినిమా కమిటయ్యారు. టైటిల్ ‘సన్నాఫ్ పెదరాయుడు’. హాలీవుడ్‌లో ‘డార్క్‌ఫీల్డ్స్’ చిత్రానికి సహాయకునిగా పనిచేసిన పి.సాగర్ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. రమేష్ పుప్పాల నిర్మాత. ఈ సినిమాతో పాటు ఆయన ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో మరో చిత్రం కూడా ప్లాన్ చేశారు. 
 
ఈ రెండు సినిమాల గురించి రమేష్ పుప్పాల మాట్లాడుతూ -‘‘ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో విమలారామన్ ప్రధాన పాత్ర పోషిస్తారు. సాయికుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు పరిచయం అవుతున్నారు. అక్టోబర్ తొలివారంలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో ముగిస్తాం. 
 
ఆర్పీ దర్శకత్వం వహించిన గత చిత్రాలకు భిన్నంగా సరదాగా సాగిపోయే సినిమా ఇది. ఇక మనోజ్ సినిమా విషయానికొస్తే ఆ దర్శకుడు ‘కిక్’సురేందర్‌రెడ్డి దగ్గర పలు చిత్రాలకు పనిచేశాడు. అతని కథే ఈ చిత్రానికి హైలైట్. మనోజ్ కెరీర్‌ని మలుపు తిప్పే సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని కూడా అక్టోబర్‌లోనే మొదలు పెడతాం. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement