R. P. Patnaik
-
ఎస్పీ బాలుకి టాలీవుడ్ స్వరనీరాజనం, 12 గంటల పాటు..
గాన గంధర్వుడు, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతిని పురస్కరించుకొని టాలీవుడ్ ఆయనకు ఘన నివాళి అందించబోతోంది. బాలు జయంతి రోజైన జూన్ 4వ తేదీన స్వరనీరాజనం పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. తెలుగు సినిమాకే కాక భారతీయ సినిమాకి బాలు చేసిన సేవలను గుర్తు చేస్తూ టాలీవుడ్ ఆయనకు ఘన నివాళి అర్పించబోతోంది. జూన్ 4న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్‌ను తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది. ఇందులో మా అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, నిర్మాతలు, సంగీత దర్శకులు, పాటల రచయితలు.. ఇలా సినీరంగానికి చెందిన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చెప్పారు. నాన్ స్టాప్‌గా జరిగే ఈ ప్రోగ్రామ్ని చూసి అందరూ జయప్రదం చేయాల్సిందిగా ఆయన కోరారు. -
పొలిటికల్ థ్రిల్లర్‌గా ఆర్. పి. పట్నాయక్ వ్యూహ
సాక్షి, బెంగళూర : గ్లామరస్ ప్రాతల్లో తనదైన అందంతో టాలీవుడ్, శాండల్‌వుడ్‌లో తళుక్కున మెరిసిన తార ప్రియమణి. ఇక టాలీవుడ్లో ఎన్నో చిత్రాలకు మెలోడీ మ్యూజిక్‌ను అందించిన దర్శకుడు ఆర్.పి.పట్నాయక్. శాండల్‌వుడ్‌లో వీరిద్దరి భాగస్వామ్యంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ‘వ్యూహ’. ఈ సినిమాకు కథ, దర్శకత్వాన్ని ఆర్.పి.పట్నాయక్ అందిస్తుండగా, ప్రియమణి ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమాలో ప్రియమణి పవర్ఫుల్ సీబీఐ అధికారి పాత్రలో కనిపించనుండగా, ప్రముఖ నటుడు రంగాయణ రఘు మరో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే కన్నడ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ శనివారం రాత్రి నగరంలో విడుదలైంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆర్.పి.పట్నాయక్, నటీనటులు ప్రియమణి, రంగాయణ రఘు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంలో ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ....ఈ సినిమాలో కథే హీరో పాత్రను నిర్వహిస్తుందని అన్నారు. ఈ సినిమా కచ్చితంగా విమర్శకుల మన్ననలు అందుకుంటుందనే అశాభావాన్ని ఆర్.పి.పట్నాయక్ వ్యక్తం చేశారు. -
అటు నవ్విస్తూ... ఇటు భయపెడుతూ...
‘‘హారర్ సినిమాలంటే చీకట్లోనే ఎక్కువగా ఉంటాయి. కానీ మా సినిమా అందుకు భిన్నం. ప్రపంచంలోనే అత్యంత కాంతివంత ప్రదేశమైన లాస్ వేగాస్‌లో ఈ చిత్రాన్ని తీశాం’’ అని ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘తులసీదళం’. నిశ్చల్, వందనాగుప్త జంటగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్పీ మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకూ వచ్చిన హారర్ చిత్రాలకు ఇది పూర్తి భిన్నమైంది. ఈ సినిమా చూశాక దెయ్యాలంటే భయపడేవారు సైతం... ఆత్మలుంటే ఎంత బావుణ్ణు అనుకుంటారు. చక్కని ప్రేమకథ కూడా ఇందులో మిళితమై ఉంటుంది. లాజిక్కులు లేకుండా మంచి కథతో ఈ సినిమా తీశాను. ఓ వైపు నవ్విస్తూ, మరో వైపు భయపెట్టడమే ఈ సినిమా లక్ష్యం. నటీనటులందరూ ఎంతో సహకరించారు. డాక్టర్ తిలక్‌గా నేను కూడా ఇందులో ఓ మంచి పాత్ర చేశాను. బ్రహ్మానందం భూతవైద్యునిగా నవ్విస్తారు. సంగీత పరంగా కూడా నా మార్క్ మెలొడీ ఇందులో ఉంటుంది. ఓ పదిరోజుల్లో పాటలను విడుదల చేసి, అతి త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. తన మిత్రుని సినిమాతో ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు నందన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా నిశ్చల్, అనితాచౌదరి, ఛాయాగ్రాహకుడు శరత్ మండవ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: తిరుమల నాగ్, కూర్పు: ఎస్.బి.ఉద్ధవ్, నిర్మాణం: కలర్స్ ఎంటర్టైన్మెంట్స్. -
సన్నాఫ్ పెదరాయుడు
మంచు మనోజ్ కొత్త సినిమా కమిటయ్యారు. టైటిల్ ‘సన్నాఫ్ పెదరాయుడు’. హాలీవుడ్లో ‘డార్క్ఫీల్డ్స్’ చిత్రానికి సహాయకునిగా పనిచేసిన పి.సాగర్ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. రమేష్ పుప్పాల నిర్మాత. ఈ సినిమాతో పాటు ఆయన ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో మరో చిత్రం కూడా ప్లాన్ చేశారు. ఈ రెండు సినిమాల గురించి రమేష్ పుప్పాల మాట్లాడుతూ -‘‘ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో విమలారామన్ ప్రధాన పాత్ర పోషిస్తారు. సాయికుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు పరిచయం అవుతున్నారు. అక్టోబర్ తొలివారంలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లో ముగిస్తాం. ఆర్పీ దర్శకత్వం వహించిన గత చిత్రాలకు భిన్నంగా సరదాగా సాగిపోయే సినిమా ఇది. ఇక మనోజ్ సినిమా విషయానికొస్తే ఆ దర్శకుడు ‘కిక్’సురేందర్‌రెడ్డి దగ్గర పలు చిత్రాలకు పనిచేశాడు. అతని కథే ఈ చిత్రానికి హైలైట్. మనోజ్ కెరీర్‌ని మలుపు తిప్పే సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని కూడా అక్టోబర్‌లోనే మొదలు పెడతాం. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు.