పొలిటికల్ థ్రిల్లర్‌గా ఆర్. పి. పట్నాయక్ వ్యూహ | Are political thriller. P. Patnaik strategy | Sakshi
Sakshi News home page

పొలిటికల్ థ్రిల్లర్‌గా ఆర్. పి. పట్నాయక్ వ్యూహ

Published Tue, Sep 9 2014 3:05 AM | Last Updated on Mon, Sep 17 2018 5:12 PM

పొలిటికల్ థ్రిల్లర్‌గా ఆర్. పి. పట్నాయక్ వ్యూహ - Sakshi

పొలిటికల్ థ్రిల్లర్‌గా ఆర్. పి. పట్నాయక్ వ్యూహ

సాక్షి, బెంగళూర : గ్లామరస్ ప్రాతల్లో తనదైన అందంతో టాలీవుడ్, శాండల్‌వుడ్‌లో తళుక్కున మెరిసిన తార ప్రియమణి. ఇక టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలకు మెలోడీ మ్యూజిక్‌ను అందించిన దర్శకుడు ఆర్.పి.పట్నాయక్. శాండల్‌వుడ్‌లో వీరిద్దరి భాగస్వామ్యంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ‘వ్యూహ’.

ఈ సినిమాకు కథ, దర్శకత్వాన్ని ఆర్.పి.పట్నాయక్ అందిస్తుండగా, ప్రియమణి ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమాలో ప్రియమణి పవర్‌ఫుల్ సీబీఐ అధికారి పాత్రలో కనిపించనుండగా, ప్రముఖ నటుడు రంగాయణ రఘు మరో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే కన్నడ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ శనివారం రాత్రి నగరంలో విడుదలైంది.

ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆర్.పి.పట్నాయక్, నటీనటులు ప్రియమణి, రంగాయణ రఘు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంలో ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ....ఈ సినిమాలో కథే హీరో పాత్రను నిర్వహిస్తుందని అన్నారు. ఈ సినిమా కచ్చితంగా విమర్శకుల మన్ననలు అందుకుంటుందనే అశాభావాన్ని ఆర్.పి.పట్నాయక్ వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement