Ace
-
బోల్డ్ కన్నన్
బోల్డ్ కన్నన్‌గా మారిపోయారు హీరో విజయ్ సేతుపతి. ఆయన హీరోగా నటిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘ఏస్’. అరుముగకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మూవీ ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో యోగిబాబు, బీఎస్ అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు, రాజ్ కుమార్ ఇతర లీడ్ రోల్స్æచేస్తున్నారు. జనవరి 16న విజయ్ సేతుపతి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రంలో బోల్డ్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇంకా విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న మరో మూవీ ‘ట్రైన్’ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మిస్కిన్ దర్శకత్వంలో కలైపులి యస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాజర్, కేఎస్ రవికుమార్, శ్రుతీహాసన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇలా బర్త్ డేకి డబుల్ ధమాకా ఇచ్చారు విజయ్ సేతుపతి. -
వందేళ్ల వరకు ఆదాయాన్నిచ్చే జీవిత బీమా పథకం
బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా ఏస్ పేరిట జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇటు జీవిత బీమా అటు దీర్ఘకాలం అంటే వందేళ్ల వరకు ఆదాయాన్ని ఆఫర్ చేసే పథకం ఇది. పాలసీ ప్రారంభమయ్యాక తొలి నెల/సంవత్సరం నుంచి లేదా అయిదేళ్ల తర్వాత నుంచి కూడా ఆదాయాన్ని అందుకోవడాన్ని ఎంచుకోవచ్చు. అలాగే పాలసీ కాల వ్యవధిని కనీసం 10 ఏళ్ల నుంచి తమకు 100 సంవత్సరాలు వచ్చే దాకా ఎంచుకోవచ్చని సంస్థ ఎండీ తరుణ్ చుగ్ తెలిపారు. తమ ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఎప్పుడు, ఎంతకాలం పాటు, రాబడిని ఎలా అందుకోవాలనుకుంటున్నదీ కూడా కస్టమర్లు తామే నిర్ణయించుకోవచ్చని ఆయన వివరించారు. వార్షిక ప్రీమియానికి సమ్ అష్యూర్డ్ 11 రెట్లు ఉంటుంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణించిన పక్షంలో నామినీకి డెత్ బెనిఫిట్, ప్రీమియంల చెల్లింపు నుంచి మినహాయింపుతో పాటు రాబడి కొనసాగడం, మెచ్యూరిటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మహిళా పాలసీదారులకు అదనంగా 2 శాతం ఆదాయ ప్రయోజనం ఉంటుంది. -
సత్యా నాదెళ్ళకు సలహా ఇచ్చిన బుడతడు!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్ళ ఇటీవల ఇండియా సందర్శించిన సందర్భంలో అనేకమంది ప్రముఖలు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో చర్చలు జరిపారు. అభివృద్ధికి సహకరించే ఎన్నో ప్రశ్నలు సంధించి సమాధానాలకోసం సహనంతో వేచి చూశారు. అయితే ఆయన ప్రశ్నలకు సమాధానంగాని, సలహాలు గాని ఇచ్చేందుకు పత్రికా ప్రతినిధులు, నిపుణులు వంటివారెవ్వరూ ముందుకు రాలేదు. అయితే ఓ ఎనిమిదేళ్ళ ఏస్ డెవలపర్ మాత్రం సత్యా నాదెళ్ళకు తనదైన శైలిలో సలహాలు, సూచనలను అందించి ఆహూతులనూ అబ్బుర పరిచాడు. సాధారణంగా ఎనిమిదేళ్ళ పిల్లలు అంటే వీడియో గేమ్ లు ఆడటంలో బిజీ బిజీగా గడుపుతుంటారు. కానీ ఈ ఎనిమిదేళ్ళ కుర్రాడు మాత్రం 'లెట్ దేర్ బి లైట్' పేరున ఓ కొత్త గేమింగ్ యాప్ ను అభివృద్ధి చేయడంలో బిజీగా ఉన్నాడు. ఈ గేమ్ లో వినియోగదారులు తమ పట్టణాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, కర్మాగారాల నిర్మాణం, వ్యవసాయ అభివృద్ధి వంటివి చేపట్టేలా రూపొందిస్తున్నాడు. అయితే ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక స్థానంలో ఉన్న మీరు సైతం పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయం సమతుల్యతను కలిగి ఉండేలా ప్రయత్నిస్తే కాలుష్య పెరుగుదలను నియంత్రించే అవకాశం ఉంటుందని, దీంతో స్థిరమైన అభివృద్ధిని కూడ సాధించవచ్చని ఆ యువ డెవలపర్ తనదైన రీతిలో మైక్రోసాఫ్ట్ సీఈవో కు సలహా ఇచ్చాడు. ఇంకేముందీ... ఆ చిన్నారి మేధావి సలహాకు సరైన సమాధానం ఇవ్వాల్సి పని సత్యా నాదెళ్ళ వంతైంది. అంతేకాక ఆ ఛైల్డ్ డెవలపర్... తాను భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ సీఈవో కావాలని ప్రయత్నిస్తున్నానని, ప్రపంచంలోని అన్ని టెక్నాలజీ కంపెనీలు తన అధీనంలో పనిచేసేట్టు చేస్తానని చెప్పాడా వండర్ బాయ్... -
సంతోషంగా ఉన్నాను
తమిళసినిమా : తమిళం, తెలుగు చిత్రాలతో నేను చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నానంటున్నారు అందాల తార హన్సిక. ఇప్పటికే తమిళంలో యమ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా టాలీవుడ్ పైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ అమ్మడు నటించిన తమిళ చిత్రాలు డిసెంబర్ వరకు వరుసగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. వాటిలో హన్సిక తొలిసారిగా హారర్ పాత్ర పోషించిన అరణ్మణై చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. కాగా చక్క నమ్మ చిక్కినా అందమే అన్నట్లు బాగా బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యారు. అయితే కావాలని, కష్టపడి, నోరు కుట్టుకుని శారీరక వ్యాయమం చేసి బరువు తగ్గలేదన్నారు. తాను చాలా చిన్న వయసులోనే నటిగా రంగ ప్రవేశం చేశానన్నారు. 17, 18 ఏళ్ల ప్రాయంలో ఏ అమ్మాయి అయినా పుష్టిగా ఉంటారన్నారు. మళ్లీ 21 ఏళ్ల వయసు వచ్చే సరికి సన్నబడుతుంటారని చెప్పారు. ఇప్పుడు తన పరిస్థితి అలాంటిదేనన్నారు. అంతేకానీ బరువు తగ్గాలనే నిర్ణయాన్ని తానెప్పుడు తీసుకోలేదన్నారు. ఇక బాలీవుడ్ రంగ ప్రవేశం ఎప్పుడన్న ప్రశ్నకు హన్సిక బదులిస్తూ తాను తమిళం, తెలుగు చిత్రాలతో చాలా కంఫర్టబుల్‌గా ఉన్నానని అందువల్ల, బాలీవుడ్ రంగ ప్రవేశం గురించిన ఆలోచనే లేదని బదులిచ్చారు. హీరోయిన్గా తన కెరీర్‌ను దక్షిణాదిలోనే ప్రారంభించానన్నారు. ఇక్కడా అవకాశాలతో చాలా సంతోషంగా ఉన్నానన్నారు. ఇక బాలీవుడ్ స్టార్ అనిపించుకోవాలనే ఆశ తనకు లేదని హిందీ చిత్రాల్లో నటించడం తనకు ఇంపార్టెంట్ కాదని స్పష్టం చేశారు. హిందీలో చాలా అవకాశాలు వస్తున్నాయని అయితే వాటిలో ఏ ఒక్క అవకాశాన్ని అంగీకరించలేదని హన్సిక తెలిపారు. -
పొలిటికల్ థ్రిల్లర్‌గా ఆర్. పి. పట్నాయక్ వ్యూహ
సాక్షి, బెంగళూర : గ్లామరస్ ప్రాతల్లో తనదైన అందంతో టాలీవుడ్, శాండల్‌వుడ్‌లో తళుక్కున మెరిసిన తార ప్రియమణి. ఇక టాలీవుడ్లో ఎన్నో చిత్రాలకు మెలోడీ మ్యూజిక్‌ను అందించిన దర్శకుడు ఆర్.పి.పట్నాయక్. శాండల్‌వుడ్‌లో వీరిద్దరి భాగస్వామ్యంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ‘వ్యూహ’. ఈ సినిమాకు కథ, దర్శకత్వాన్ని ఆర్.పి.పట్నాయక్ అందిస్తుండగా, ప్రియమణి ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమాలో ప్రియమణి పవర్ఫుల్ సీబీఐ అధికారి పాత్రలో కనిపించనుండగా, ప్రముఖ నటుడు రంగాయణ రఘు మరో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే కన్నడ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ శనివారం రాత్రి నగరంలో విడుదలైంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆర్.పి.పట్నాయక్, నటీనటులు ప్రియమణి, రంగాయణ రఘు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంలో ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ....ఈ సినిమాలో కథే హీరో పాత్రను నిర్వహిస్తుందని అన్నారు. ఈ సినిమా కచ్చితంగా విమర్శకుల మన్ననలు అందుకుంటుందనే అశాభావాన్ని ఆర్.పి.పట్నాయక్ వ్యక్తం చేశారు. -
నేడు తెరపైకి ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’
చిన్న చిత్రాల జాబితాలో విడుదలైనా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కురిపించిన చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. ఈ చిత్రానికి రీమేక్‌గా కన్నడలో రూపొందించిన ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాత శైలేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మించగా, ఆయన కుమారుడు సుమంత్, నటి కృతి కర్బంద హీరో హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక ఇప్పటికే విష్ణువర్థన్, చారులతా వంటి రీమేక్‌లను అందించిన దర్శకుడు పీ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన కుమారుడు సుమంత్‌ను ఎలాగైనా సరే శాండల్‌వుడ్‌లో స్టార్‌ని చేయాలనే లక్ష్యంతో శైలేంద్రబాబు ఈ చిత్ర నిర్మాణానికి, ప్రచారానికి ఎక్కువగానే ఖర్చు పెట్టారని గాంధీనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా సాధించే విజయం పైనే సుమంత్ భవిష్యత్తు ఆధారపడి ఉందనేది సినీవిశ్లేషకుల అభిప్రాయం.