నేడు తెరపైకి ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’ | Today, due to the 'Tirupati Express' | Sakshi
Sakshi News home page

నేడు తెరపైకి ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’

Published Fri, Sep 5 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

నేడు తెరపైకి ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’

నేడు తెరపైకి ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’

చిన్న చిత్రాల జాబితాలో విడుదలైనా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌లను కురిపించిన చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. ఈ చిత్రానికి రీమేక్‌గా కన్నడలో రూపొందించిన ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాత శైలేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మించగా, ఆయన కుమారుడు సుమంత్, నటి కృతి కర్బంద హీరో హీరోయిన్లుగా కనిపించనున్నారు.

ఇక ఇప్పటికే విష్ణువర్థన్, చారులతా వంటి రీమేక్‌లను అందించిన దర్శకుడు పీ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన కుమారుడు సుమంత్‌ను ఎలాగైనా సరే శాండల్‌వుడ్‌లో స్టార్‌ని చేయాలనే లక్ష్యంతో శైలేంద్రబాబు ఈ చిత్ర నిర్మాణానికి, ప్రచారానికి ఎక్కువగానే ఖర్చు పెట్టారని గాంధీనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా సాధించే విజయం పైనే సుమంత్ భవిష్యత్తు ఆధారపడి ఉందనేది సినీవిశ్లేషకుల అభిప్రాయం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement