అటు నవ్విస్తూ... ఇటు భయపెడుతూ... | 'TULASIDALAM' film directed by R. P. Patnaik | Sakshi
Sakshi News home page

అటు నవ్విస్తూ... ఇటు భయపెడుతూ...

Published Sat, Sep 14 2013 12:39 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM

అటు నవ్విస్తూ... ఇటు భయపెడుతూ...

అటు నవ్విస్తూ... ఇటు భయపెడుతూ...

‘‘హారర్ సినిమాలంటే చీకట్లోనే ఎక్కువగా ఉంటాయి. కానీ మా సినిమా అందుకు భిన్నం. ప్రపంచంలోనే అత్యంత కాంతివంత ప్రదేశమైన లాస్ వేగాస్‌లో ఈ చిత్రాన్ని తీశాం’’ అని ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘తులసీదళం’. నిశ్చల్, వందనాగుప్త జంటగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్పీ మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకూ వచ్చిన హారర్ చిత్రాలకు ఇది పూర్తి భిన్నమైంది. 
 
 ఈ సినిమా చూశాక దెయ్యాలంటే భయపడేవారు సైతం... ఆత్మలుంటే ఎంత బావుణ్ణు అనుకుంటారు. చక్కని ప్రేమకథ కూడా ఇందులో మిళితమై ఉంటుంది. లాజిక్కులు లేకుండా మంచి కథతో ఈ సినిమా తీశాను. ఓ వైపు నవ్విస్తూ, మరో వైపు భయపెట్టడమే ఈ సినిమా లక్ష్యం. నటీనటులందరూ ఎంతో సహకరించారు. డాక్టర్ తిలక్‌గా నేను కూడా ఇందులో ఓ మంచి పాత్ర చేశాను. బ్రహ్మానందం భూతవైద్యునిగా నవ్విస్తారు. సంగీత పరంగా కూడా నా మార్క్ మెలొడీ ఇందులో ఉంటుంది. 
 
 ఓ పదిరోజుల్లో పాటలను విడుదల చేసి, అతి త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. తన మిత్రుని సినిమాతో ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు నందన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా నిశ్చల్, అనితాచౌదరి, ఛాయాగ్రాహకుడు శరత్ మండవ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: తిరుమల నాగ్, కూర్పు: ఎస్.బి.ఉద్ధవ్, నిర్మాణం: కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement