పోటుగాడికి పూల బాట | Potugadu makes big hit, says producer | Sakshi
Sakshi News home page

పోటుగాడికి పూల బాట

Published Wed, Sep 18 2013 1:17 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

పోటుగాడికి పూల బాట - Sakshi

పోటుగాడికి పూల బాట

‘‘ ‘ఎవడి గోల వాడిది’ తర్వాత అంత పెద్ద సినిమా ఇది. ఆ సినిమా స్థాయికి ఎక్కడా తగ్గలేదు’’ అని లగడపాటి శిరీష చెప్పారు. మంచు మనోజ్ హీరోగా పవన్ వడయార్ దర్శకత్వంలో శిరీష, శ్రీధర్ నిర్మించిన ‘పోటుగాడు’ ఇటీవల విడుదలైంది. 
 
 హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ -‘‘సినిమా చూసిన వారందరూ పోటుగాడికి ప్రశంసల పూలబాట వేస్తున్నారు. ‘నాయక్’ తర్వాత మంచి పాత్ర ఇందులో చేశాను’’ అన్నారు. ఈ సినిమా విజయం విషయంలో తన అంచనా నిజమైందని శ్రీధర్ ఆనందం వెలిబుచ్చారు. 
 
 మనోజ్ మంచి కోస్టార్ అని అనుప్రియ, సాక్షి చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా కాశీవిశ్వనాథ్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్, మల్టీడెమైన్షన్ వాసు, శరత్ మండవ కూడా మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement