potugadu
-
రెండు రోజుల్లోనే రికార్డ్ సాధించింది - లగడపాటి శ్రీధర్
‘‘కన్నడ చిత్రం ‘గోవిందాయ నమః’ని లగడపాటి శ్రీధర్ తెలుగులో రీమేక్ చేస్తున్నాడని వినగానే, సాహసం చేస్తున్నాడనుకున్నాను. ఎందుకంటే కన్నడ చిత్రాల తెలుగు రీమేక్స్‌లో ఇక్కడ సక్సెస్ అయినవి చాలా తక్కువ. ఈ నేపథ్యంలో శ్రీధర్ ఈ రీమేక్ చేశాడు. ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చిందని వినగానే చాలా ఆనందపడ్దాను’’ అన్నారు కోదండరామిరెడ్డి. మంచు మనోజ్ హీరోగా పవన్ వడియార్ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్-శిరీషా నిర్మించిన చిత్రం ‘పోటుగాడు’. ఇటీవల విడుదలై, మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎ. కోదండరామిరెడ్డి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలందజేశారు. లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ -‘‘కథని, నటీనటుల్ని నమ్మి నేనీ సినిమా చేస్తే, డిస్ట్రిబ్యూటర్లు నన్ను నమ్మారు. విడుదలైన రెండు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లను సాధించిందీ చిత్రం. ‘అత్తారింటికి దారేది’ ప్రభంజనం సాగుతున్నప్పటికీ మా సినిమా ఏదో మూల ఆడుతోందనే విషయం నన్ను ఆనందపడేలా చేస్తోంది’’ అని చెప్పారు. 150 థియేటర్స్‌లో మంచి వసూళ్లతో ఈ చిత్రం సాగుతోందని మల్టీ డైమన్షన్ వాసు తెలిపారు. ఈ వేడుకలో దామోదర ప్రసాద్, జి.నాగేశ్వరరెడ్డి, ఆర్పీ పట్నాయక్, లగడపాటి శ్రీధర్ తల్లి రామలక్ష్మి, సతీమణి శిరీషాలతో పాటు అలీ, పోసాని కృష్ణమురళి, సాక్షి చౌదరి, అనుప్రియ, గీతాసింగ్తో పాటు పలువురు పంపిణీదారులు పాల్గొన్నారు. -
నా కల నిజమైంది: పవన్ వడయార్
‘‘తెలుగులో సినిమా చేయడం నా కల. అది ‘పోటుగాడు’తో నిజమైంది. ఈ సినిమా హిట్ అవుతుందని నిర్మాణ సమయంలోనే అనిపించింది. అయితే... ఇంత విజయాన్ని మాత్రం ఊహించలేదు’’ అని దర్శకుడు పవన్ వడయార్ అన్నారు. మనోజ్ కథానాయకునిగా ఆయన దర్శకత్వంలో లగడపాటి శిరీష, శ్రీధర్ నిర్మించిన ‘పోటుగాడు’ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కన్నడంలో తాను తీసిన గోవిందాయనమః, గూగ్లీ చిత్రాలు మంచి విజయాలు సాధించాయని, తెలుగులో చేసిన ‘పోటుగాడు’ తనకు హ్యాట్రిక్ విజయాన్ని ఇచ్చిందని పవన్ అన్నారు. మరికొన్ని విషయాలు చెబుతూ -‘‘చిన్నప్పట్నుంచీ కథలు, నాటకాలు అంటే ఇష్టం. ఆ ఇష్టం వల్లే యూకేలో ఉద్యోగాన్ని కూడా వదిలి కన్నడ అగ్ర దర్శకుడు యోగరాజ్‌భట్ దగ్గర సహాయకునిగా చేరాను. అయితే... రెండు నెలల్లోనే కథ రాసుకుని దర్శకునిగా ఛాన్స్ కొట్టేశాను. అదే ‘గోవిందాయ నమః’. ఆ కథ ద్వారానే తెలుగులో కూడా పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘‘గోవిందాయనమః’ కామెడీ ఎంటర్టైనర్. ‘గూగ్లీ’ లవ్‌స్టోరీ. తర్వాత యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని ఉంది. అది కూడా అగ్రహీరోతోనే చేస్తా’’ అని చెప్పారు. నేను హీరోగా, మా గురువు యోగరాజ్‌భట్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రీతి.. గీతి.. ఇత్యాది’. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. నా కెరీర్లో నేను హీరోగా చేసే తొలి సినిమా, చివరి సినిమా ఇదే. ఎందుకంటే... దర్శకత్వమే నా ఊపిరి. త్వరలో బాలీవుడ్లో కూడా ఓ సినిమా చేయబోతున్నాను’’అని తెలిపారు. -
పోటుగాడు సినిమా టీంతో చిట్‌చాట్
-
'పోటుగాడు'కి కాలేజీ విద్యార్థుల అండ: పోసాని
'పోటుగాడు' సినిమా విజయానికి కాలేజీ విద్యార్థులే కారణమని సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ అన్నారు. ఇటీవల విడుదలయిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించాడు. పోసాని ఓ ముఖ్యపాత్రలో నటించారు. 'పోటుగాడు' విజయం కాలేజీ విద్యార్థులకే దక్కుతుందని పోసాని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలు జరుగుతున్నప్పటికీ కాలేజీ విద్యార్థులు ఈ సినిమా చూసేందుకు ధియేటర్లకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో చాలా సినిమాలు వాయిదా పడ్డాయని చెప్పారు. తాము కూడా భయపడుతూనే తమ సినిమా విడుదల చేశామని చెప్పారు. అదృష్టవశాత్తు తమ సినిమాకు విద్యార్థులు అండగా నిలిచారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 'పోటుగాడు' విజయవంతంగా ప్రదర్శించబడుతోందని పోసాని తెలిపారు. -
పోటుగాడికి పూల బాట
‘‘ ‘ఎవడి గోల వాడిది’ తర్వాత అంత పెద్ద సినిమా ఇది. ఆ సినిమా స్థాయికి ఎక్కడా తగ్గలేదు’’ అని లగడపాటి శిరీష చెప్పారు. మంచు మనోజ్ హీరోగా పవన్ వడయార్ దర్శకత్వంలో శిరీష, శ్రీధర్ నిర్మించిన ‘పోటుగాడు’ ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ -‘‘సినిమా చూసిన వారందరూ పోటుగాడికి ప్రశంసల పూలబాట వేస్తున్నారు. ‘నాయక్’ తర్వాత మంచి పాత్ర ఇందులో చేశాను’’ అన్నారు. ఈ సినిమా విజయం విషయంలో తన అంచనా నిజమైందని శ్రీధర్ ఆనందం వెలిబుచ్చారు. మనోజ్ మంచి కోస్టార్ అని అనుప్రియ, సాక్షి చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా కాశీవిశ్వనాథ్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్, మల్టీడెమైన్షన్ వాసు, శరత్ మండవ కూడా మాట్లాడారు. -
గీత స్మరణం
పల్లవి :ఆమె: ప్యార్ మే పడిపోయా మై... ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై అతడు: ప్రాణ మే ఛోడ్ దియా మై... ఓ జాను మేరీ ప్రాణ మే ఛోడ్ దియా మై ఆ: ఖానా పీనా నైరే బావా కడుపుకే నిద్ర గిద్ర ఆతీ నైరే కళ్లకే అ: జిందగీ హలాల్ అయిందిరో ॥మే॥ చరణం : 1 అ: దిల్ దిల్ ధడ్కే బుగ్గల్ చూస్తే... జిల్ జిల్లాడే నడుమును చూస్తే దిల్లు మేరా లాగుతా హై రే ఓ పిల్లా... తేరే ప్యార్ కోసం దేఖేత్తున్నానే దిల్ దిల్ ధడకే బుగ్గల్ చూస్తే... జిల్ జిల్లాడే నడుమును చూస్తే దిల్లు మేరా లాగెత్తాందిరే ఓ పిల్లా... తేరే ప్యార్ కోసం దేఖేస్తున్నానే ఆ: దేఖుడు గీకుడు నక్కోజీ ప్యార్ మాత్రం కర్లోజీ మై భీ నీతో ఇష్క్ చేస్తే హుం... ॥మే॥ చరణం : 2 ఆ: చమ్కీ గిమ్కీ కొట్టుకోనీ షాదీ గీదీ చేసేసుకోని ఛోటా ఇల్ల్లే కట్టేసుకుందామూ ఖుషీలో క్రికెట్ టీమ్ పుట్టించేద్దామూ ॥ అ: షాదీ గీదీ ఛోడోజీ చుమ్మా ఇప్పుడే దేదోజీ ఠక్కని నువ్వే మమ్మీ హోతావూ ఆ: నక్కో... నక్కో... ॥మే॥ ఆ: ప్యార్ మే టిక్కుం టిక్కుం మై ఓ మియా తేరే ప్యార్ మే టిక్కుం టిక్కుం మై... చిత్రం : పోటుగాడు (2013) రచన : బాషాశ్రీ సంగీతం : అచ్చు గానం : ఇందు నాగరాజ్, మంచు మనోజ్‌కుమార్ -
పోటుగాడు టీంతో సాక్షి వేదిక
-
'పోటుగాడు' సినిమా రివ్యూ!
టాలీవుడ్ తెరపై ఎప్పుడూ విభిన్నంగా కనిపించాలని తాపత్రయపడే యువతరం హీరోల్లో మంచు మనోజ్ ఒక్కరని నిస్సందేహంగా చెప్పవచ్చు. నటుడిగా మంచు మనోజ్ అభిరుచికి 'నేను మీకు తెలుసా?', 'ప్రయాణం', 'ఝుమ్మంది నాదం', 'ఊ కొడుతారా ఉలిక్కి పడుతారా' చిత్రాలే నిదర్శనం. తాజాగా కన్నడంలో విజయం సాధించిన ‘గోవిందయ నమః’ చిత్ర రీమేక్ ఆధారంగా రూపొందించిన ‘పోటుగాడు’ శనివారం (సెప్టెంబర్ 14) రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ఆడియోతో ‘పోటుగాడు’ ప్రేక్షకులకు దగ్గరై.. అభిమానుల్లో భారీ ఈ చిత్రం అంచనాలు పెంచింది. ఎలాగైనా భారీ హిట్‌ను సాధించాలని కసితో చేసిన ‘పోటుగాడు’ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను ఆలరించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే! జీవితాన్ని ఎప్పుడు చాలా లైట్‌గా తీసుకునే గోవిందం.. ఆత్మహత్య చేసుకోవాలని సీరియస్‌గా నిర్ణయం తీసుకుని ఓ కొండపైకి చేరుకుంటాడు. అదేసమయంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ వెంకట్ కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. అయితే కొండపైకి చేరుకున్న గోవిందం, వెంకట్లు ఆత్మహత్య చేసుకున్నారా? ఒకవేళ ఆత్మహత్యా ప్రయత్నాన్ని మానుకుంటే ఎందుకు? ఆత్మహత్యను విరమించుకునేలా ప్రభావం చేసిన అంశాలేమిటనే ప్రశ్నలకు సమాధానమే పోటుగాడు సినిమా సింగిల్ లైన్ కథ. సింగిల్ లైన్ కథ చాలా సింపుల్‌గా అనిపించినా.. డిటైల్డ్ స్టోరిలో ప్రేక్షకుల్ని ఐదు ప్రేమకథలు వినోదంతో గిలిగింతలు పెట్టాయని చెప్పవచ్చు. గోవిందం పాత్రలో నాలుగు రకాల ప్రేమ వ్యవహారాల్లో నడిపించిన మనోజ్.. నాలుగు రకాల విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రతి పాత్రలోనూ మనోజ్ పలికించిన హావభావాలు, సంభాషణలు పలికే తీరు ‘డైలాగ్ కింగ్’ మోహన్‌బాబును మరిపించేలా ఉన్నాయి. ఇప్పటి వరకు స్టార్‌గానే అభిమానులను ఆలరించిన మనోజ్.. తన నటుడుగా నూటికి నూరు మార్కులు సొంతం చేసుకున్నాడు. గోవిందం పాత్ర ఛాలెంజ్ లాంటిది. అయితే మనోజ్ తనదైన శైలిలో రఫ్ ఆడించాడు. చిత్ర అధికభాగం ఎంటర్టైన్మెంట్తో అదరగొట్టిన మనోజ్..క్లైమాక్స్‌లో సెంటిమెంట్‌తో వాహ్ అనిపించాడు. ఇక నటన, డ్యాన్స్లేకాక.. ఈ చిత్రంలో మనోజ్ కంపోజ్ చేసిన స్టంట్స్ నేచురల్‌గా ఉన్నాయి. మనోజ్‌కు సపోర్టింగ్‌గా చేసిన వెంకట్ క్యారెక్టర్లో పోసాని కృష్ణమురళి నటన ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. నలుగురు హీరోయిన్లగా వైదేహి(సిమ్రాన్ కౌర్), ముంతాజ్ (సాక్షి చౌదరీ), రేచల్ (రేచల్), ప్రియ (అనుప్రియ)లు నటించారు. నలుగురిలో ముఖ్యంగా ముంతాజ్ ఎక్కువ మార్కులు కొట్టేసిందని చెప్పవచ్చు. ఇక దర్శకుడు పవన్ వడెయార్ స్క్రీన్‌ప్లే, కథను నడిపించిన తీరు మరింత బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా శ్రీధర్ సీపానీ మాటలు బ్రహ్మండంగా పేలాయి. కొంత డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఇబ్బంది పెట్టినా.. మనోజ్‌తో పలికించిన తీరు కొంత రిలీఫ్ కలిగించాయి. అచ్చు అందించిన సంగీతం విడుదలకు ముందే ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. ‘ప్యార్ మే పడిపోయా’ అంటూ ఇందూ నాగరాజ్‌తో కలిసి మనోజ్ పాడిన పాట, శింబు పాడిన బుజ్జి పిల్లా, దేవతా పాటల చిత్రీకరణ బాగుంది. చిత్ర ద్వితీయార్థంలో కొంత నెమ్మదించినా.. అన్ని రంగాల సమిష్టి కృషి ముందు పెద్దగా ప్రభావం చూపేలా అనిపించలేదు. లగడపాటి శ్రీధర్ నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అభిమానులను, ప్రేక్షకులను సంతృప్తి పరిచే కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా థియేటర్‌కు రప్పించగలిగితే.. గత కొద్దికాలంగా ఎదురు చూస్తున్న కమర్షియల్ హిట్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా... కలెక్షన్లను రాబట్టడంలో కూడా మంచు మనోజ్ ‘పోటుగాడు’గా నిలువడం ఖాయం! - రాజాబాబు అనుముల -
పోటుగాడు తర్వాత మనోజ్ ‘కలెక్షన్ కింగ్’
‘‘దర్శకుడు పవన్ ఇప్పటికే కన్నడంలో రెండు హిట్లు కొట్టారు. దీంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. పాటలన్నీ మంచి హిట్ అయినందుకు ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. వచ్చేవారంలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని మనోజ్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘పోటుగాడు’. సాక్షి చౌదరి, సిమ్రన్ కౌర్ ముండి, రేచల్ వీస్, అనుప్రియా కోమెంక కథానాయికలు. పవన్ వడయార్ దర్శకుడు. శిరీష-శ్రీధర్ నిర్మాతలు. అచ్చు స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఇటీ వల విడుదల చేశారు. ఈ పాటలు శ్రోతలను అలరిస్తున్నాయని యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ -‘‘ఆదివారం పాటలు విడుదలైతే, సోమవారమే హిట్ టాక్ రావడం మా యూనిట్ మొత్తాన్ని ఆశ్చర్యానికి లోను చేసింది. సంగీత దర్శకుడు అచ్చు ఫ్యూచర్లో గొప్ప మ్యూజిక్ దర్శకునిగా ఎదుగుతాడు. ఈ ఆల్బమ్‌లోని ప్రతి పాట శ్రోతల్ని అలరిస్తున్నాయి. ఇది మంచు వారి నుంచి వస్తున్న మంచి పంచ్ ఉన్న సినిమా. ఈ సినిమా తర్వాత మనోజ్‌ని అందరూ ‘కలెక్షన్ కింగ్’ అంటారు’’ అని చెప్పారు. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని దర్శకుడు అన్నారు. ఇంకా కథానాయికల్లో ఒకరైన అనుప్రియ, సత్యదేవ్ కూడా మాట్లాడారు. -
పోటుగాడు ఆడియో విడుదల!
-
‘పోటుగాడు’ స్టిల్స్
మంచు మనోజ్ హీరోగా పవన్ వడెయార్ దర్శకత్వంలో పోటుగాడు చిత్రం రూపొందుతోంది. యంగ్ హీరో మంచు మనోజ్ మరోసారి గొంతు సవరించుకున్నారు. పోటుగాడు చిత్రంలో ‘ప్యార్ మే’పడిపోయామే’ అంటూ ఓ గీతాన్ని ఆలపించారు. గతంలో ‘కృష్ణార్జున’ చిత్రంలో ఓ పాట పడిన సంగతి తెలిసిందే.