రెండు రోజుల్లోనే రికార్డ్ సాధించింది - లగడపాటి శ్రీధర్
రెండు రోజుల్లోనే రికార్డ్ సాధించింది - లగడపాటి శ్రీధర్
Published Tue, Oct 1 2013 1:52 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
‘‘కన్నడ చిత్రం ‘గోవిందాయ నమః’ని లగడపాటి శ్రీధర్ తెలుగులో రీమేక్ చేస్తున్నాడని వినగానే, సాహసం చేస్తున్నాడనుకున్నాను. ఎందుకంటే కన్నడ చిత్రాల తెలుగు రీమేక్స్‌లో ఇక్కడ సక్సెస్ అయినవి చాలా తక్కువ. ఈ నేపథ్యంలో శ్రీధర్ ఈ రీమేక్ చేశాడు. ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చిందని వినగానే చాలా ఆనందపడ్దాను’’ అన్నారు కోదండరామిరెడ్డి.
మంచు మనోజ్ హీరోగా పవన్ వడియార్ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్-శిరీషా నిర్మించిన చిత్రం ‘పోటుగాడు’. ఇటీవల విడుదలై, మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎ. కోదండరామిరెడ్డి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలందజేశారు. లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ -‘‘కథని, నటీనటుల్ని నమ్మి నేనీ సినిమా చేస్తే, డిస్ట్రిబ్యూటర్లు నన్ను నమ్మారు. విడుదలైన రెండు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లను సాధించిందీ చిత్రం.
‘అత్తారింటికి దారేది’ ప్రభంజనం సాగుతున్నప్పటికీ మా సినిమా ఏదో మూల ఆడుతోందనే విషయం నన్ను ఆనందపడేలా చేస్తోంది’’ అని చెప్పారు. 150 థియేటర్స్‌లో మంచి వసూళ్లతో ఈ చిత్రం సాగుతోందని మల్టీ డైమన్షన్ వాసు తెలిపారు. ఈ వేడుకలో దామోదర ప్రసాద్, జి.నాగేశ్వరరెడ్డి, ఆర్పీ పట్నాయక్, లగడపాటి శ్రీధర్ తల్లి రామలక్ష్మి, సతీమణి శిరీషాలతో పాటు అలీ, పోసాని కృష్ణమురళి, సాక్షి చౌదరి, అనుప్రియ, గీతాసింగ్‌తో పాటు పలువురు పంపిణీదారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement