'పోటుగాడు'కి కాలేజీ విద్యార్థుల అండ: పోసాని | Students made 'Potugadu' a success: Posani Krishna Murali | Sakshi
Sakshi News home page

'పోటుగాడు'కి కాలేజీ విద్యార్థుల అండ: పోసాని

Published Wed, Sep 18 2013 12:54 PM | Last Updated on Tue, Sep 18 2018 8:13 PM

'పోటుగాడు'కి కాలేజీ విద్యార్థుల అండ: పోసాని - Sakshi

'పోటుగాడు'కి కాలేజీ విద్యార్థుల అండ: పోసాని

'పోటుగాడు' సినిమా విజయానికి కాలేజీ విద్యార్థులే కారణమని సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ అన్నారు. ఇటీవల విడుదలయిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించాడు. పోసాని ఓ ముఖ్యపాత్రలో నటించారు. 'పోటుగాడు' విజయం కాలేజీ విద్యార్థులకే దక్కుతుందని పోసాని అన్నారు.

ఆంధ్రప్రదేశ్లో ఆందోళనలు జరుగుతున్నప్పటికీ కాలేజీ విద్యార్థులు ఈ సినిమా చూసేందుకు ధియేటర్లకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో చాలా సినిమాలు వాయిదా పడ్డాయని చెప్పారు. తాము కూడా భయపడుతూనే తమ సినిమా విడుదల చేశామని చెప్పారు. అదృష్టవశాత్తు తమ సినిమాకు విద్యార్థులు అండగా నిలిచారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 'పోటుగాడు' విజయవంతంగా ప్రదర్శించబడుతోందని పోసాని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement