పోటుగాడు తర్వాత మనోజ్ ‘కలెక్షన్ కింగ్’
పోటుగాడు తర్వాత మనోజ్ ‘కలెక్షన్ కింగ్’
Published Tue, Sep 3 2013 1:04 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
‘‘దర్శకుడు పవన్ ఇప్పటికే కన్నడంలో రెండు హిట్లు కొట్టారు. దీంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. పాటలన్నీ మంచి హిట్ అయినందుకు ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. వచ్చేవారంలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని మనోజ్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘పోటుగాడు’. సాక్షి చౌదరి, సిమ్రన్ కౌర్ ముండి, రేచల్ వీస్, అనుప్రియా కోమెంక కథానాయికలు.
పవన్ వడయార్ దర్శకుడు. శిరీష-శ్రీధర్ నిర్మాతలు. అచ్చు స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఇటీ వల విడుదల చేశారు. ఈ పాటలు శ్రోతలను అలరిస్తున్నాయని యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ -‘‘ఆదివారం పాటలు విడుదలైతే, సోమవారమే హిట్ టాక్ రావడం మా యూనిట్ మొత్తాన్ని ఆశ్చర్యానికి లోను చేసింది. సంగీత దర్శకుడు అచ్చు ఫ్యూచర్‌లో గొప్ప మ్యూజిక్ దర్శకునిగా ఎదుగుతాడు.
ఈ ఆల్బమ్‌లోని ప్రతి పాట శ్రోతల్ని అలరిస్తున్నాయి. ఇది మంచు వారి నుంచి వస్తున్న మంచి పంచ్ ఉన్న సినిమా. ఈ సినిమా తర్వాత మనోజ్‌ని అందరూ ‘కలెక్షన్ కింగ్’ అంటారు’’ అని చెప్పారు. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని దర్శకుడు అన్నారు. ఇంకా కథానాయికల్లో ఒకరైన అనుప్రియ, సత్యదేవ్ కూడా మాట్లాడారు.
Advertisement
Advertisement