
దేశవ్యాప్తంగా జూన్ 16న విడుదల కానున్న ఆదిపురుష్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని నిరు పేదలకు, అనాథలకు ఉచితంగా చూపించాలని చాలా మంది ప్రముఖులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ సినిమా టిక్కెట్లను కొనుగోలు చేసి ప్రత్యేక షోలు వేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రామ్ చరణ్, కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్, గాయని అనన్య బిర్లా 10,000 టిక్కెట్లు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు.
(ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా)
ఇప్పుడు తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక జంట కూడా ఆ క్లబ్‌లో చేరారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ అనాథ శరణాలయాలకు చెందిన 2500 మంది పిల్లలకు వారు ఆదిపురుష్ సినిమాను చూపించాలని నిర్ణయించుకున్నారు. 'ఎలాంటి హద్దులు లేకుండా అందరూ వేడుకలా జరుపుకోవాల్సిన సినిమా ఆదిపురుష్. దీనిని మా జీవితకాలంలో వచ్చిన అవకాశంగా భావించాలి. ఆదిపురుష్.. ద్వారా ఇతహాస మహాగాధ రామాయణం గురించి తెలుసుకునేలా తెలుగు రాష్ట్రాల్లోని పలు అనాథ శరణాలయాల్లో ఉన్న 2500 పిల్లలకు చూపించాలని నిర్ణయించుకున్నాం. జైశ్రీరామ్ అనే పవిత్ర శ్లోకం అన్ని చోట్ల ప్రతిధ్వనించాలి' అని మంచు మనోజ్, భూమా మౌనిక అన్నారు.
(ఇదీ చదవండి: కావాలనే చేస్తుందా?.. మరో టాప్ హీరోకు షాకిచ్చిన కంగనా రనౌత్?)
Comments
Please login to add a commentAdd a comment