'తీన్మార్' హీరోయిన్ కు తప్పిన ప్రమాదం | Kriti Kharbanda escapes fire accident | Sakshi
Sakshi News home page

'తీన్మార్' హీరోయిన్ కు తప్పిన ప్రమాదం

Published Tue, Jul 22 2014 3:00 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

'తీన్మార్' హీరోయిన్ కు తప్పిన ప్రమాదం - Sakshi

'తీన్మార్' హీరోయిన్ కు తప్పిన ప్రమాదం

'తీన్మార్' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన కృతి కర్బందా... అగ్ని ప్రమాదం నుంచి బయటపడింది. సినిమా షూటింగ్ లో ప్రమాదాలు సాధారణం. ఆమె చేస్తున్న సినిమా షూటింగ్ లో ప్రమాదమేమీ జరగలేదు. కానీ ఆమె బస చేసిన హోటల్ రూమ్ లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తప్పించుకుంది.

'హోటల్ చిరాంత్ లో నాకు ఎగ్జిక్యూటివ్ సూట్ ఇచ్చారు. గీజర్ తో వేన్నీళ్లు కాచుకుని సాన్నం చేసి.. కాసేపు టీవీ చూసి నిద్రపోయా. కొంత సమయం గడిచాక నిప్పులు అంటుకున్న చప్పుడు వినబడితే లేచాను. అయితే కలలో అనుకుని మళ్లీ నిద్రపోయాను. మళ్లీ శబ్దం వినబడడంతో మేల్కోని చూసే సరికి గదిలో మంటలు మెల్లగా వ్యాపిస్తున్నాయి. చాలా భయపడిపోయాను. వెంటనే తేరుకుని తడి తవల్ ఒంటికి చుట్టుకుని గట్టిగా కేకలు వేశాను. ఇంతలో సినిమా, హోటల్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ఎప్పుడూ భయపడని నేను చావును దగ్గరగా చూశాను' అని కృతి భయంగా చెప్పింది.

హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. కృతి తెలుగులో నటిస్తున్న 'కరెంట్ తీగ' సినిమా షూటింగ్ లోనూ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి మంచు మనోజ్ బయటపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement