Current teega
-
మనోజ్‌లో ఫుల్ కరెంట్ ఉంది : కె. రాఘవేంద్రరావు
‘‘ఈ సినిమా ఫుల్ రన్‌తో ముందుకెళుతోంది. ఇలాగే ముందుకు సాగుతూ ఫుల్ కలక్షన్స్ సాధించాలి. మనోజ్‌లో ఫుల్ కరెంట్ ఉంది. ఈ విజయానికి ప్రధాన కారణం అదే. విజయాన్ని అందుకున్న యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. మనోజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన చిత్రం ‘కరెంట్ తీగ’. ఈ చిత్రం విజయోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడారు. అతిథుల్లో ఒకరైన కృష్ణంరాజు మాట్లాడుతూ- ‘‘మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మీప్రసన్న మంచి నిర్మాతలనిపించుకున్నారు. మనోజ్ కూడా సినిమా తీస్తే.. ‘ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ’ అవుతుంది. ‘కరెంట్ తీగ’ విజయం సాధించినందుకు చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు. రచయిత పరుచూరి గోపాకృష్ణ మాట్లాడుతూ- ‘‘కరెంట్ తీగ శత్రువులకు షాక్.. లోకానికి వెలుగునిస్తుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు వెలుగు ఇచ్చింది’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. కానీ, ఇందులో ఉన్న ట్రైన్ ఎపిసోడ్ కోసం మనోజ్ తీసుకున్న రిస్క్ గురించి విని, బాధపడ్డాను. అప్పట్లో మేం కూడా డూప్ లేకుండా ఫైట్స్ చేశాం కానీ.. ఇలాంటి రిస్కులు తీసుకోలేదు. నా బిడ్డ అనే కాదు.. ఏ హీరో కూడా రిస్క్ తీసుకోకూడదు. ‘కరెంట్ తీగ’ మంచి కామెడీ చిత్రం అనో, పాటలు, ఫైట్స్ ఉన్నాయనో, సన్నీ లియోన్ ఉందనో కాదు.. ఈ చిత్రంలో ఉన్న నీతి కోసం చూడాలి. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. ముఖ్యంగా గత నాలుగేళ్లల్లో మేం నిర్మించిన చిత్రాల్లో ఆడియో పరంగా బాగా సేల్ అయిన చిత్రమిది. మనోజ్ పాడిన పాట నాకు బాగా నచ్చింది. మామూలుగా డైలాగులు చెప్పేవాళ్లు పాటలు అంతగా పాడలేరు. కానీ, మనోజ్ బాగా పాడాడు... బాగా ఫైట్స్ చేశాడు.. ఒక నటుడు ఇలా అన్నీ బాగా చేశాడంటే ఆ ఘనత దర్శకుడికి దక్కుతుంది. డెరైక్టర్ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని నమ్మే వ్యక్తిని నేను. నాకు తెలిసి సినిమా పరిశ్రమలో రెండు కులాలే ఉన్నాయి.. ఒకటి.. నటకులం.. రెండోది సాంకేతిక నిపుణుల కులం. అంతే’’ అన్నారు. ‘‘ఏడాది పాటు రెండు వందల కుటుంబాలు కష్టపడి పని చేస్తే రెండు గంటల సినిమాని చూడగలుగుతున్నాం. అలాంటి చిత్రాన్ని పైరసీతో నాశనం చేస్తున్నారు. దొంగ సీడీలు అమ్మడమే కాదు.. కొనడం కూడా నేరమే’’ అని మనోజ్ అన్నారు. ‘కరెంట్ తీగ’కు విజయం చేకూర్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారాయన. చిత్రం విజయం సాధించడం పట్ల నాగేశ్వరరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా ఈ వేడుకలో జయసుధ, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, వరప్రసాద్‌రెడ్డి, తనీష్, నవీన్ చంద్ర తదితర అతిథులతో పాటు చిత్రబృందం పాల్గొన్నారు. -
సన్నీలియోన్ ముచ్చట్లు
-
మనోజ్ సాహసాలు ఈ చిత్రానికి హైలైట్ : మోహన్‌బాబు
‘‘హుదూద్ తుఫాను సృష్టించిన బీభత్సం వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు చూస్తే బాధేసింది. అందుకే ఈ నెల 17న విడుదల చేయాల్సిన ‘కరెంట్ తీగ’ను 31వ తేదీకి వాయిదా వేశాం’’ అని నటుడు డా.మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మనోజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా మంచు విష్ణు నిర్మించిన చిత్రం ‘కరెంట్ తీగ’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అచ్చు స్వరాలందించారు. ఈ సినిమా ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లోని నారాయణమ్మ కాలేజీలో బుధవారం జరిగింది. మోహన్‌బాబు మాట్లాడుతూ -‘‘నిజానికి వేల సీడీలు అమ్ముడైతే ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపుతారు. అమ్ముడు కాకపోయినా ఇటీవల వేడుకలు జరుపుతున్నారు అది వేరే విషయం. కానీ.. మా పాటలు నిజంగా జనాదరణ పొందాయి కాబట్టే.. ఈ వేడుక చేశాం. విష్ణు హీరోగా ‘దేనికైనా రెడీ’ చేసిన నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్నీ అద్భుతంగా తీశారు. మనోజ్ పదేళ్లలో చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే... ‘కరెంట్ తీగ’ మరో ఎత్తు. అతని సాహసాలే ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. హుదూద్ తుపాను బాధితులు పడే ఇబ్బందులను అందరూ స్వయంగా వెళ్లి చూడాలని, వీలైనంత సహాయం చేయాలని మనోజ్ కోరారు. హుదూద్ బాధితులకు సంఘీభావంగా రామజోగయ్యశాస్త్రి రచన, అచ్చు స్వరాలతో రూపొందించిన ‘యూనిటీ..’ అనే పాటను ఈ వేదికపై వినిపించారు. ఈ వేడుకలో నాగేశ్వరరెడ్డి, అచ్చు, రచయిత కిశోర్ తిరుమల బృందం, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాదరెడ్డి, సంపూర్ణేష్ తదితరులు పాల్గొన్నారు. -
కరెంట్‌తీగ టీమ్‌తో చిట్ ఛాట్
-
లైఫ్ ఈజ్ ఫెస్టివల్
తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా మారిన యూత్‌ఫుల్ హీరోయిన్ రకూల్ ప్రీత్‌సింగ్. లౌక్యం విజయం, కరెంట్ తీగ విడుదలకు సిద్ధంగా వుండటంతో పాటు వరుస సినిమా షెడ్యూల్‌తో బిజీగా మారింది రకూల్. విజయాలు సంతోషాలు కలిసిన ఈ దీపావళి తనకెంతో స్పెషల్ అంటూ పండుగ ముచ్చట్లు ‘సిటీప్లస్’తో పంచుకుంది. రెండేళ్లుగా వర్క్ షెడ్యూల్‌తో దీపావళి సెలబ్రేషన్ కుదరటం లేదు. ఈసారి పండుగ కోసం షూటింగ్ కు ఓ రోజు లీవ్ తీసుకుని మరీ ఇంటికెళ్తున్నా. రోజంతా ఫ్యామిలీతోనే గడిపేస్తాను. గతేడాదితో పోలిస్తే ఈసారి దివాలీ నాకు చాలా స్పెషల్. లౌక్యం హిట్, కరెంట్ తీగ సినిమాతో జోష్‌తో ఉన్నా. చిన్నప్పుడు క్రాకర్స్ బాగా కాల్చేదాన్ని. టెన్త్ క్లాస్ నుంచి మానేశాను. దీపాలు, రంగోలీలతో ఇళ్లంతా అలంకరిస్తాను. సేవ్ అండ్ సేవ దివాలీ అంటే వెలుగులతో పాటు సంతోషాన్ని పంచడం కూడా. అందుకే పండుగ వేళ సంబరాల కోసం స్పెండ్ చేసే డబ్బులో కొంత చారిటీకి వినియోగిస్తుంటాను. క్రాకర్స్‌పై ఖర్చు మానేసి సేవా కార్యక్రమాలకు వినియోగిస్తే బాగుంటుందని నా ఆలోచన. పండుగకు స్వీట్లూ కొనుక్కోలేని వాళ్లుంటారని, వారి కోసం ఏదైనా చేయగలిగితే బాగుంటుందని చిన్నప్పుడు నాన్న చెప్పిన మాట నచ్చింది. అప్పటి నుంచి నాకు చేతనైన సాయం చేస్తుంటాను. హెల్పింగ్ నేచర్.. ఈ నాయిస్, పొల్యూషన్ వల్ల ఎవరికీ ఇబ్బంది కలుగకుండా దీపావళి జరుపుకోవాలి. పెట్స్‌కి, ఆస్పత్రులు, పేషెంట్స్ వున్న చోట వారికి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటే అందరికీ హ్యాపీ. సంతోషంగా, సురక్షితంగా పండుగ జరుపుకోవాలి. ఈ పండుగ సందర్భంగా మంచి మనసుతో వైజాగ్ హుదూద్ తుపాను బాధితులకు వీలైనంత సాయం అందిస్తే బాగుంటుంది. - ఓ మధు -
నిర్వేదానికి లోనయ్యా..
‘‘మనిషికి రెండు కళ్లు ఎంత ముఖ్యమో... తెలుగువారికి మన రెండు రాష్ట్రాలూ అంత ముఖ్యం. వీటిలో దేనికి ఇబ్బందులెదురైనా... అది తెలుగువారందరికీ బాధాకరమే. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ సహిత ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు తుఫాన్ బీభత్సానికి గురవ్వడం నా మనసును కలచివేసింది. ఈ ప్రళయం గురించి విని ఒక విధమైన నిర్వేదానికి లోనయ్యాను. తెలుగువారు ఇబ్బందుల్లో ఉన్న ఈ తరుణంలో మా ‘కరెంట్ తీగ’ చిత్రాన్ని విడుదల చేయడం సబబు కాదు. అందుకే, ఈ నెల 17న విడుదల కావాల్సిన ఆ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నాం’’ అని మోహన్‌బాబు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో పత్రికలవారితో మోహన్‌బాబు మాట్లాడుతూ -‘‘తుఫాన్ బీభత్సానికి గురైన ప్రాంతాలకు నా బిడ్డలతో కలిసి వెళ్లాలనుకుంటున్నాను. మాతో పాటు కలిసి సహాయం అందించాలని ఎవరైనా ముందుకొస్తే ఇంకా ఆనందిస్తా. నేనెప్పడూ స్వయంగానే వెళ్లి సహాయం అందిస్తాను. రాజీవ్‌గాంధీ చెప్పిన ఓ మాటే దానికి కారణం. ‘ప్రభుత్వం సొమ్ము 80 శాతం కూడా ప్రజలకు చేరదు. దోచుకునేవాళ్లు దోచుకోగా 20 శాతమే వెళుతుంది’ అని. అందుకే... ఆ అవకాశం ఎవరికీ ఇవ్వకుండా, నేనే స్వయంగా వెళ్లి సహాయం అందిస్తా. వంద మందిని నేను కాపాడలేకపోవచ్చు. కానీ నేనొక్కణ్ణి ఒక్క వ్యక్తినైనా కాపాడలేనా అనేది నా నమ్మకం’’ అన్నారు. ‘కరెంట్ తీగ’ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘నేనిప్పుడు అయ్యప్ప మాలలో ఉన్నాను. చెడు మాట్లాడకూడదు. చెడు ఆలోచనలు చేయకూడదు. నిజమే చెప్పాలి. మనోజ్‌కి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవుతుందంటే అహంకారం అవుతుంది. అందుకే... బ్రేక్ అవుతుందని నమ్ముతాను అని చెబుతున్నా. ఇంతకు ముందు మనోజ్ సినిమాలు ఓ ఎత్తు. ఇదొక ఎత్తు’’ అని మోహన్‌బాబు నమ్మకంగా చెప్పారు. -
‘కరెంట్‌తీగ’ ఆడియో ఆవిష్కరణ
-
మనోజ్ అసలైన సినీ యాత్ర ఇప్పుడే మొదలైంది :దాసరి నారాయణరావు
‘‘మనోజ్ పదేళ్ల ప్రయాణం తర్వాత వస్తున్న సినిమా ఇది. సినీరంగంలో పదేళ్ల తర్వాతే కెరీర్ అనేది మొదలవుతుంది. అంటే... మనోజ్ అసలైన సినీ యాత్ర ఇప్పుడే మొదలైందన్నమాట. ‘కరెంట్‌తీగ’ కథ నాకు తెలుసు. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు అనగానే.. సినిమా హిట్ అని చెప్పేశాను. నా సొంత సినిమాల విషయంలో నా జడ్జిమెంట్ తప్పిందేమో కానీ... ఇతరుల సినిమాల విషయంలో నా జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పలేదు. ఎందుకంటే.. నాగేశ్వరరెడ్డి ప్రతిభావంతుడైన దర్శకుడు. సక్సెస్ ఫార్ములా అతనికి బాగా తెలుసు’’ అని డా. దాసరి నారాయణరావు అన్నారు. డా. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మనోజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా మంచు విష్ణు నిర్మించిన చిత్రం ‘కరెంటు తీగ’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అచ్చు పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని దాసరి ఆవిష్కరించారు. ఈ వేడుకలో దాసరి ఇంకా మాట్లాడుతూ- ‘‘ఎలాంటి ఫీట్ అయినా... డూప్ లేకుండా చేయడానికి మనోజ్ ఇష్టపడతాడు. అలా చేస్తానని ఏ హీరో అన్నా.... పక్కవాళ్లు కూడా ప్రోత్సహిస్తారు. కానీ... అది ఎంతవరకు సబబు. మీరు డూప్ లేకుండా చేసినా, చూసే జనాలు మాత్రం డూపే అంటారు కదా. ఇంకేంటి ప్రయోజనం? నా చిన్నతనంలో యడ్లబండ్ల మీద ప్రయాణించేవాళ్లం. అందుకని ఇప్పుడు కూడా యడ్లబండ్లపైనే ప్రయాణిస్తామంటే ఎలా? మా రోజుల్లో ఇన్ని సాంకేతిక విలువలు లేవు. కానీ... మీకు ఎన్నో సౌకర్యాలుండగా వాటిని ఉపయోగించుకోకుండా... డూప్ లేకుండా చేసేస్తాం అంటే ఎలా? మీపై మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. పైగా హీరో అనేవాడు పబ్లిక్ ప్రాపర్టీ. ఈ విషయాన్ని మనోజ్‌తో పాటు ప్రతి హీరో గుర్తుంచుకోవాలి’’ అన్నారు. మోహన్‌బాబు - ‘‘నటుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు తనతో సినిమాలు తీసిన దర్శక, నిర్మాతలను గౌరవించాలని మనోజ్ అనుకోవడం అభినందనీయం. ‘నిన్ను అందరూ మంచి నటుడు అంటుంటే చాలా ఆనందంగా ఉంది. అయితే, రిస్కీ ఫైట్స్ చేయడం మాత్రం నాకూ, మీ అమ్మకూ చాలా బాధగా ఉంది. అంత రిస్క్ చేయకూడదు’ (మనోజ్‌ని ఉద్దేశించి). మనోజ్ పుట్టినప్పుడు మా గురువుగారు దాసరి నారాయణరావు ఎత్తుకున్నారు. మరి.. ఆ సమయంలో ఏమనుకున్నారో కానీ.. ఆయన లక్షణాలన్నీ వచ్చాయి. నటిస్తున్నాడు.. పాటలు రాస్తున్నాడు.. ఫైట్స్ సమకూరుస్తున్నాడు.. ఇలా మనోజ్ అన్నీ చేస్తున్నాడు. నాగేశ్వరరెడ్డి అద్భుతమైన దర్శకుడు. అప్పట్లో నా ‘అసెంబ్లీ రౌడీ’ సంచలన విజయం సాధిస్తుందన్నాను. ఈరోజు ‘కరెంటు తీగ’కు కూడా అలానే అంటున్నాను’’ అన్నారు. విష్ణు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలోని ‘పిల్లా...’ పాట రెండేళ్ల క్రితం తయారైంది. నాకలాంటి మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టం. అందుకని, నా సినిమాలో ఉపయోగించుకోవాలనుకున్నాను. కానీ, మనోజ్ సినిమాకే కుదిరింది. మిగతా పాటలన్నీ కూడా బాగుంటాయి. ఈ చిత్ర సంగీతదర్శకుడు అచ్చు పెళ్లి ఈరోజే. అందుకే తను ఈ వేడుకకు రాలేదు’’ అని చెప్పారు. మనోజ్ మాట్లాడుతూ- ‘‘బేసిక్‌గా నాకు చదువు వచ్చేది కాదు. కుదరుగా వుండేవాణ్ణి కాదు. చిన్నప్పుడు బుద్ధి కూడా ఉండేది కాదు. నా చిన్నప్పుడు దాసరి అంకుల్ తనతో పాటు రీ-రికార్డింగ్ థియేటర్‌కు, షూటింగ్స్‌కు తీసుకెళ్లేవారు. అందుకేనేమో సినిమా మీద నాకు ఇష్టం ఏర్పడింది. నన్ను ప్రోత్సహించిన మా అమ్మా, నాన్న, అన్నయ్య అక్కకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. ‘‘మోహన్‌బాబుగారు నన్ను కోప్పడినా ఫర్వాలేదు.. ఆయనకన్నా మనోజ్ గొప్ప నటుడు. జగపతిబాబుతో సినిమా చేయాలనే నా బలమైన కోరిక ఈ చిత్రంతో తీరింది’’ అని నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ వేడుకలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, టి. సుబ్బిరామిరెడ్డి, సి. నరసింహారావు, చుక్కపల్లి సురేష్, పరుచూరి గోపాలకృష్ణ, రామ్‌గోపాల్ వర్మ తదితర అతిథులు శుభాకాంక్షలందజేశారు. జగపతిబాబు, విష్ణు, సుప్రీత్ తదితర చిత్రబృందంతో పాటు మనోజ్‌తో సినిమాలు చేసిన దర్శక, నిర్మాతలు దశరథ్, వీరు పోట్ల, అనిల్, ఎన్వీ ప్రసాద్, అనిల్ సుంకర, డీయస్ రావు తదితరులు పాల్గొన్నారు. మనోజ్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరోలు రామ్‌చరణ్, అల్లరి నరేశ్, నాని, వరుణ్ సందేశ్, నిఖిల్.. అందించిన శుభాకాంక్షల వీడియో క్లిప్పింగ్‌ని ప్రదర్శించారు. -
'దేవదాసు బ్రేకప్..' అమ్మాయిలకు అంకితం
హీరో మంచు మనోజ్ గాయకుడి అవతారం ఎత్తి తాను పాడిన 'దేవదాసు బ్రేకప్..' పాటను తనకు స్ఫూర్తినిచ్చిన అమ్మాయిలకు అంకితం చేశాడు. ఈ పాట పాడుతున్నప్పుడు తీసిన వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. కరెంటు తీగ సినిమా కోసం మనోజ్ ఈ పాట పాడాడు. ఈ పాట ట్యూన్స్, లిరిక్స్ అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉంటాయని, అందుకే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోందని, ఇంటర్నెట్లో విస్తృతంగా వెళ్లిపోయిందని మనోజ్ అన్నాడు. పాటను విడుదల చేసిన ఒక్కరోజులోనే బాగా చూశారని చెప్పాడు. ఇక్కడే పాటను ఇంతలా ఆదరిస్తున్నారని, ఇక స్క్రీన్ మీద మరింతగా ఆకట్టుకుంటుందని తెలిపాడు. విష్ణు నిర్మాతగా వ్యవహరించి తీసిన ఈ సినిమాకు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా, సన్నీ లియోన్ కూడా ఓ ఐటెం సాంగ్‌లో తళుక్కుమంది. అక్టోబర్ రెండో తేదీన ఈ సినిమా విడుదల కానుంది. -
ప్రేమా.. దోమా.. వద్దురా మామా..!!
-
అదృష్టవంతుడు..!
మంచు మనోజ్ అంటే... చురుకుదనానికి చిరునామా. ‘దొంగ దొంగది’ టైమ్‌లో అతను బొద్దుగా ఉండేవాడు. కానీ తనలోని వేగానికి ఆ బొద్దుతనం కూడా అడ్డం రాలేదు. ‘మన్మథ రాజా మన్మథ రాజా’ పాటలో కథానాయిక సదాకు సవాల్ విసిరాడు మనోజ్. ఇప్పుడు గతంలోకి వెళ్లాల్సిన అవసరం దేనికంటారా! ‘దొంగా దొంగది’ సినిమా విడుదలై నేటికి పదేళ్లు. అంటే... హీరోగా మనోజ్ కెరీర్ మొదలై పదేళ్లన్నమాట. ఈ పదేళ్లలో 12 సినిమాల్లో మనోజ్ హీరోగా నటించాడు. వాటిలో ‘నేను మీకు తెలుసా?’, ‘వేదం’ చిత్రాలు ప్రయోగాలు. ‘ప్రయాణం’ ఓ ప్రేమకథ. బిందాస్, పోటుగాడు మాస్ కథలు. ఇలా విభిన్న రకాల చిత్రాల్లో నటిస్తూ నటునిగా సినిమా సినిమాకూ ఎదుగుతున్నారు. నేటి యంగ్ హీరోల్లో మహానటుడు ఎన్టీఆర్‌తో నటించిన అదృష్టవంతుడు కూడా మనోజే. ‘మేజర్‌చంద్రకాంత్’లో బాలనటునిగా ఎన్టీఆర్‌తో తెరను పంచుకున్నాడు తను. పుణ్యభూమి నా దేశం, అడవిలో అన్న చిత్రాల్లో బాలనటునిగా మనోజ్ నటన చూస్తే... తండ్రి మోహన్‌బాబు గుర్తుకురాక మానడు. పాత్ర కోసం తన శరీరాన్ని హింసించుకోవడానికి కూడా వెనుకాడని హీరో మనోజ్. ప్రస్తుతం ఆయన ‘కరెంట్ తీగ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. -
'తీన్మార్' హీరోయిన్ కు తప్పిన ప్రమాదం
'తీన్మార్' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన కృతి కర్బందా... అగ్ని ప్రమాదం నుంచి బయటపడింది. సినిమా షూటింగ్ లో ప్రమాదాలు సాధారణం. ఆమె చేస్తున్న సినిమా షూటింగ్ లో ప్రమాదమేమీ జరగలేదు. కానీ ఆమె బస చేసిన హోటల్ రూమ్ లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తప్పించుకుంది. 'హోటల్ చిరాంత్ లో నాకు ఎగ్జిక్యూటివ్ సూట్ ఇచ్చారు. గీజర్ తో వేన్నీళ్లు కాచుకుని సాన్నం చేసి.. కాసేపు టీవీ చూసి నిద్రపోయా. కొంత సమయం గడిచాక నిప్పులు అంటుకున్న చప్పుడు వినబడితే లేచాను. అయితే కలలో అనుకుని మళ్లీ నిద్రపోయాను. మళ్లీ శబ్దం వినబడడంతో మేల్కోని చూసే సరికి గదిలో మంటలు మెల్లగా వ్యాపిస్తున్నాయి. చాలా భయపడిపోయాను. వెంటనే తేరుకుని తడి తవల్ ఒంటికి చుట్టుకుని గట్టిగా కేకలు వేశాను. ఇంతలో సినిమా, హోటల్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ఎప్పుడూ భయపడని నేను చావును దగ్గరగా చూశాను' అని కృతి భయంగా చెప్పింది. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. కృతి తెలుగులో నటిస్తున్న 'కరెంట్ తీగ' సినిమా షూటింగ్ లోనూ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి మంచు మనోజ్ బయటపడ్డాడు. -
'మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం'
-
మూడు రోజులకు ముప్ఫయ్ ఐదు లక్షలా!?
హాట్ గాళ్ అంటే ఎలా ఉంటుంది? అని ఇప్పుడు ఎవర్ని ప్రశ్నించినా.. చటుక్కున ‘సన్నీ లియోన్’ పేరు చెబుతారు. ఒకప్పుడు నీలి చిత్రాల్లో నటించిన సన్నీ ఇప్పుడు అవి మానేశారు. కానీ, సినిమాల్లో మాత్రం గ్లామరస్ రోల్స్‌లో కనిపించి, కుర్రకారు మతిపోగొడుతున్నారు. ఉత్తరాదిన ఈ శృంగార తారకు బోల్డంత క్రేజ్ ఉంది. దక్షిణాదిన సన్నీ ఆగమనం కోసం ఎదురు చూస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఇక్కణ్ణుంచి సన్నీని చాలా అవకాశాలు వరిస్తున్నాయి. తమిళ ‘వడకర్రీ’ (తెలుగులో ‘కుల్ఫీ’) తరువాత తెలుగులో ఆమె ‘కరెంటు తీగ’కు పచ్చ జెండా ఊపారు. మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సన్నీ ఒక పాటకు నర్తించడంతో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లో కనిపిస్తారట. తన మొత్తం చిత్రీకరణకు కేవలం మూడు రోజులు పడుతుందని సమాచారం. ఈ మూడు రోజులకు సన్నీ తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా ముప్ఫయ్ ఐదు లక్షలని వినికిడి. మరి.. సన్నీయా.. మజాకానా!