![మూడు రోజులకు ముప్ఫయ్ ఐదు లక్షలా!?](/styles/webp/s3/article_images/2017/09/2/71403372988_625x300.jpg.webp?itok=zef5npVW)
మూడు రోజులకు ముప్ఫయ్ ఐదు లక్షలా!?
హాట్ గాళ్ అంటే ఎలా ఉంటుంది? అని ఇప్పుడు ఎవర్ని ప్రశ్నించినా.. చటుక్కున ‘సన్నీ లియోన్’ పేరు చెబుతారు. ఒకప్పుడు నీలి చిత్రాల్లో నటించిన సన్నీ ఇప్పుడు అవి మానేశారు. కానీ, సినిమాల్లో మాత్రం గ్లామరస్ రోల్స్‌లో కనిపించి, కుర్రకారు మతిపోగొడుతున్నారు. ఉత్తరాదిన ఈ శృంగార తారకు బోల్డంత క్రేజ్ ఉంది. దక్షిణాదిన సన్నీ ఆగమనం కోసం ఎదురు చూస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఇక్కణ్ణుంచి సన్నీని చాలా అవకాశాలు వరిస్తున్నాయి.
తమిళ ‘వడకర్రీ’ (తెలుగులో ‘కుల్ఫీ’) తరువాత తెలుగులో ఆమె ‘కరెంటు తీగ’కు పచ్చ జెండా ఊపారు. మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సన్నీ ఒక పాటకు నర్తించడంతో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లో కనిపిస్తారట. తన మొత్తం చిత్రీకరణకు కేవలం మూడు రోజులు పడుతుందని సమాచారం. ఈ మూడు రోజులకు సన్నీ తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా ముప్ఫయ్ ఐదు లక్షలని వినికిడి. మరి.. సన్నీయా.. మజాకానా!