three days
-
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం మంగళవారం బలహీనపడింది. దీంతో తెలంగాణలో చాలా చోట్ల బుధ,గురు,శుక్ర వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ కొనసాగనుంది. -
మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడురోజులు పలుచోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి పశ్చిమ, మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత పతనమయ్యాయి. ప్రస్తుతం సాధారణస్థితిలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రానున్న మూడురోజులు సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మంగళవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే, గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 32 డిగ్రీ సెల్సీయస్ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
వారంలో 3 రోజులు ఆఫీసుకు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా వారంలో మూడు రోజులపాటు కార్యాలయానికి వచ్చి పనిచేయడాన్ని తప్పనిసరి చేసింది. సుదూర ప్రాంతం నుంచి పనిచేసే విధానం కొనసాగింపు సరైన ఆలోచనకాదంటూ కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయ్‌కుమార్ పేర్కొ న్నారు. వెరసి సంస్థ ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా వారంలో మూడు రోజులు ఆఫీ సుకు హాజరై విధులు నిర్వహించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే వారంలో ఏ మూడు రోజులు అన్న విషయంలో స్వల్ప వెసులుబాటు(ఫ్లెక్సిబిలిటీ) కలి్పంచనున్నట్లు తెలియజేశారు. కోవిడ్–19 కారణంగా ఇంటి నుంచే విధుల(వర్క్ ఫ్రమ్ హోమ్) విధానానికి బీజం పడగా.. ఇటీవల పలు ఐటీ దిగ్గజాలు తిరిగి ఆఫీసునుంచి బా« ద్యతల నిర్వహణకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. టీసీఎస్ ఇప్పటికే..: బుధవారం క్యూ2 ఫలితాలు వెల్లడించిన టీసీఎస్ 6.14 లక్షల మంది సిబ్బందిని తిరిగి కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించవలసిందిగా ఆదేశించినట్లు వెల్లడించిన విషయం విదితమే. ఇక మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగుల విధుల విషయంలో వెసులుబాటుకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ అత్యధిక శాతం సిబ్బంది ఆఫీసులకు తరలి వస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. సుదూర ప్రాంతాల నుంచి పనిచేయడం ద్వారా అటు సిబ్బందికి, ఇటు సంస్థకు ప్రయోజనకరంకాదని విజయ్‌కుమార్ వ్యా ఖ్యానించారు. ఇది సరైన ఆలోచనకాదని, దీంతో వారంలో మూడు రోజుల పని విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే 60 శాతంమంది కార్యాలయాలకు హాజరవుతుండగా.. సిబ్బంది మొత్తానికి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు. -
ఎట్టకేలకు వానలు!
సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల రోజులుగా హిమాలయాల్లోనే తిష్ట వేసిన రుతుపవన ద్రోణి అక్కడి నుంచి దక్షిణాదికి మారడం, విదర్భ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి, దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ఉత్తర అంతర్గత తమిళనాడులో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా శనివారం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని తెలిపింది. సాధారణంగా ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉండి, వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అయితే, ఈ ఆగస్టు నెల ఆరంభం నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. ఒకట్రెండు చోట్ల అదీ స్వల్పంగానే వర్షాలు కురిశాయి. వర్షాలు కురవాలంటే అల్పపీడన ద్రోణులు గానీ, ఉపరితల ఆవర్తనాలు గానీ, బంగాళాఖాతంలో అల్పపీడనాలు గానీ ఏర్పడాలి. వాటివల్ల నైరుతి రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటాయి. కానీ దాదాపు నెల రోజులుగా ద్రోణులు, ఆవర్తనాల జాడ లేదు. వర్షాలకు దోహదపడే నైరుతి రుతుపవనాల ద్రోణి కూడా మూడు వారాలకు పైగా దక్షిణాది వైపునకు రాకుండా హిమాలయాల ప్రాంతంలోనే ఉండిపోయింది. వీటన్నిటి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. ఆగస్టు నెల వర్షపాతం సాధారణంకంటే 54 శాతం, నైరుతి రుతుపవనాల సీజను ప్రారంభం నుంచి ఆగస్టు ఆఖరు వరకు చూస్తే 25 శాతం తక్కువగా నమోదైంది. ఈ తరుణంలో రుతుపవన ద్రోణిలో కదలిక రావడం, ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురిసేందుకు తగిన వాతావరణం ఏర్పడింది. దాదాపు నెలరోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు, ప్రజలకు ఈ వానలు ఎంతగానో ఊరట కలిగించనున్నాయి. -
మూడు రోజుల్లోనే లిస్టింగ్ - సెబీ తాజా నిర్ణయం
న్యూఢిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లకు సంబంధించి సెబీ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఐపీవో ఇష్యూ ముగిసిన రోజు నుంచి ఆరు పని దినాల్లో స్టాక్ ఎక్స్చేంజ్లలో ప్రస్తుతం లిస్ట్ కావాల్సి ఉండగా, దీన్ని మూడు రోజులకు తగ్గించింది. అంటే ఇకపై ఐపీవో ముగిసిన రోజు తర్వాత నుంచి మూడో పనిదినం రోజున ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లలో లిస్ట్ కావాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 1, ఆ తర్వాత నుంచి వచ్చే ఐపీవోలకు మూడు రోజుల లిస్టింగ్ నిబంధన ఐచ్ఛికమే. అంటే ఇప్పటి మాదిరే ఆరు రోజులు (టీప్లస్6) లేదంటే మూడు రోజుల గడువు (టీప్లస్3)ను కంపెనీలు అనుసరించొచ్చు. కానీ, డిసెంబర్ 1 నుంచి మాత్రం విధిగా అన్ని ఐపీవోలు మూడు రోజుల లిస్టింగ్ నిబంధననే అమలు చేయాల్సి ఉంటుందని సెబీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అందరికీ అనుకూలమే సెబీ నిర్ణయం చిన్న ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఇన్వెస్టర్ల వరకు ఎంతో ప్రయోజనం కలిగించనుంది. షేర్ల కేటాయింపు లేకపోతే బ్యాంక్ ఖాతాల్లో బ్లాక్ అయిన నిధులు తొందరగా విడుదల అవుతాయి. రుణం తీసుకుని ఐపీవోల్లో దరఖాస్తు చేసే హెచ్ఎన్ఐలు కూడా ఉంటారు. వీరికి రోజుల వారీగా రుణంపై వడ్డీ భారం పడుతుంది. తొందరగా లిస్ట్ అయితే, తాము తీసుకున్న రుణాన్ని తొందరగా తీర్చేసే వీలుంటుంది. అటు ఐపీవోకు వచ్చిన కంపెనీలకూ ప్రయోజనమే. ఎలా అంటే ఐపీవో నిధులను అవి వేగంగా పొందొచ్చు. ఏఎస్బీఏ కింద షేర్లు అలాట్ కాని వారి నిధులను బ్యాంకు ఖాతాల్లో టీప్లస్3 రోజున అన్‌బ్లాక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే వారికి చెల్లించే పరిహారం అనేది ట్లీప్లస్3 తర్వాతి రోజు నుంచి అమల్లోకి వస్తుందని సెబీ తెలిపింది. -
మెటా కీలక నిర్ణయం వర్క్ ఫర్మ్ హోమ్..!
-
ఆ మూడు రోజులు మద్యం బంద్: ఎందుకు? ఎక్కడ?
పనాజీ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలలో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. ఆగస్టులో గోవా పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9, 10, 12 తేదీలను డ్రై డేలుగా పాటిస్తామని ఆర్థిక కార్యదర్శి ప్రణబ్ భట్ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. గోవాలోని 186 పంచాయతీ సంస్థలకు ఆగస్టు 10న ఎన్నికలు జరగనున్నాయి. 12వ తేదీన లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 9,10,12 తేదీల్లో 'డ్రై డే' అమల్లోకి వస్తుందని సర్కార్ ప్రకటించింది. ఆగస్టు 9,10, 12 తేదీల్లో మద్యం అమ్మకాలను నిలిపి వేయాలని మద్యం దుకాణదారులకు ఆదేశించారు. లైసెన్సు పొందిన బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా మద్యం అమ్మకాలు నిషేధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం ఆహారాన్ని అందించడానికి మాత్రమే ఆయా దుకాణాలను తెరవాలని చెప్పింది. ఈ విషయాన్ని తెలిపేలా ఒక బోర్డును కూడా ప్రదర్శించాలని నోటిఫికేషన్ పేర్కొంది. చదవండి : ట్విటర్ డీల్ వివాదం: మస్క్ మరో కీలక నిర్ణయం విలీనమా.. నో వే! కావాలంటే వారు వెళ్లిపోవచ్చు! -
పెరగనున్న చలి గాలుల తీవ్రత: వాతావరణ శాఖ
-
Ballari: మూడు రోజులు బ్యాంకులు బంద్
బళ్లారి టౌన్: కరోనా నియంత్రణ కోసం మంగళవారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులను బంద్ చేయాలని ఆదేశించినట్లు జిల్లాధికారి పవన్‌కుమార్ మాలపాటి తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... ప్రస్తుతం చేపట్టిన లాక్డౌన్ వల్ల కరోనా కేసులు తగ్గాయని అన్నారు. కొంత మంది బ్యాంకుల్లో పని ఉందని తిరుగుతున్నారని, దీంతో బ్యాంకులు కూడా బంద్ చేస్తే జూన్ 7 వరకు చేపట్టిన లాక్డౌన్ వల్ల మరింత కేసులు తగ్గించవచ్చన్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి జూన్ 7 ఉదయం వరకు సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సైదూల్ అడావత్ తెలిపారు. వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్, ఎస్పీ -
Rain Forecast: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో రానున్న మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మిగిలిన ప్రాంతాల్లో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపే ఉత్తర–దక్షిణ ద్రోణి బలహీనపడిందని పేర్కొంది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఈ ద్రోణి విస్తరించి ఉందని వివరించింది. మరోవైపు 1.5 కిలో మీటర్ల ఎత్తులో తూర్పు బిహార్ ప్రాంతం నుంచి దక్షిణ తీరప్రాంతమైన ఒడిశా వరకు మరో ద్రోణి వ్యాపించినట్టు తెలిపింది. చదవండి: జాగ్రత్తలతోనే మనుగడ: సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: తిరుపతిలో వైఎస్సార్ సీపీదే హవా -
పింఛన్ల పంపిణీ ఇక మూడురోజులు
సాక్షి, అమరావతి: పింఛనుదారులందరికీ ప్రతినెలా డబ్బు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క లబ్ధిదారు పింఛను అందక ఇబ్బంది పడకూడదని.. మూడురోజులపాటు పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ నిర్ణయం డిసెంబర్ నుంచే అమలుకానుంది. డిసెంబర్ పింఛన్లను 1, 2, 3 తేదీల్లో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీ వేతనాలు అందినట్లే అవ్వాతాతలకు ప్రతినెలా ఒకటో తేదీనే పింఛను డబ్బులు అందజేయాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికారులు ఈ ఏడాది జూలై నెల నుంచి పింఛన్ల పంపిణీని ఒకటో తేదీకే పరిమితం చేశారు. గిరిజన ప్రాంతాలు వంటి మారుమాల ప్రాంతాల్లో రెండురోజుల పాటు పంపిణీకి వీలు కల్పించారు. వలంటీర్లు పంపిణీ చేసేందుకు వెళ్లినప్పుడు ఊళ్లో లేకపోవడం వంటి కారణాలతో ఆ రోజు తీసుకోలేకపోయినవారికి తరువాత నెలలో బకాయితో సహా చెల్లిస్తున్నారు. లబ్ధిదారులెవరూ ఈ విధంగా ఇబ్బంది పడకూడదని, అందరికీ పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో డిసెంబర్ నుంచి ప్రతినెలా ఒకటి, రెండు, మూడు తేదీల్లో పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో అందరికీ పింఛను అందే అవకాశం ఉంది. ఏవైనా కారణాల వల్ల ఈ మూడు రోజుల్లో కూడా తీసుకోలేకపోయినవారికి ఆయా వార్డు, గ్రామ సచివాలయాల్లో ఇచ్చే ఏర్పాట్లు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. డిసెంబర్లో 61.69 లక్షల మందికి పంపిణీ డిసెంబర్ ఒకటి నుంచి మూడురోజులు 61,69,832 మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,510.90 కోట్లను రాష్ట్రంలోని అన్ని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాల్లో సోమవారం జమచేశారు. వరుసగా మూడునెలలు పింఛను తీసుకోని వారికి నిబంధనల ప్రకారం పింఛను తాత్కాలికంగా నిలిపేసి, మళ్లీ పరిశీలన అనంతరమే కొనసాగించాల్సి ఉంది. అలాంటి వారికీ ఊరట కలిగిస్తూ.. వరుసగా మూడునెలలు పింఛను తీసుకోని 7,462 మందికి మూడునెలల బకాయిలతో కలిపి ఈనెల డబ్బులను పంపిణీ చేయనున్నారు. . -
ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
సాక్షి, విజయవాడ: రాగల 24 గంటలలో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలోని మరికొన్ని ప్రాంతాలకు నైఋతి రుతు పవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా దక్షిణ కోస్తా ఆంధ్రాలో మూడు రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
ఉధృతంగా ప్రవహిస్తున్న కందూ నది
సాక్షి, కర్నూలు: మిడుతూరు మండలం తలముడిపి వంతెనపై కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నంద్యాల-నందికొట్కూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నంద్యాల డివిజన్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. మద్దూరు వంతెనపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నీట మునిగిన కాలనీల్లో గురువారం నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి పర్యటించారు. మూడు రోజులు భారీ వర్షాలు.. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో 19 నుండి 21వ తేదీ వరకు రాష్ట్ర మంతటా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని... నేడు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని తెలిపింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తాయని..ప్రజలు జాగ్రత్తలుపాటించాలని వాతావరణ నిపుణులు తెలిపారు. -
బావిలో దొంగ !
సాక్షి, జి.సిగడాం: దొంగతనానికి వెళ్లిన ఇద్దరు దొంగల్లో ఒకరు ప్రాణాలకు మీదకు కొనితెచ్చుకున్నాడు. గ్రామస్తులు వీరిని వెంబడించడంతో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. నడుము విరిగిపోవడంతో లేవలేని పరిస్థితిలో అందులోనే ఉండిపోయాడు. మూడు రోజులపాటు నరకయాతన అనుభవించాడు. ఈ క్రమంలో అరుపులు విన్న కొంతమంది రైతులు గుర్తించి రక్షించారు. మండలంలోని ముషినివలస పంచాయతీ కొప్పలపేట గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి ఈ గ్రామంలోకి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తిం చిన గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. వారిని పట్టుకునేందుకు వెళ్లడంతో అలజడిని గుర్తించిన దొంగలు పరుగులు తీశారు. గ్రామస్తులు వెంబడించి వారిలో ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదేక్రమంలో తప్పిం చుకున్న మరో దొంగ కంగారులో నీరులేని బావిని గుర్తించక ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ విషయం తెలియక దొంగ తప్పించుకున్నాడని ప్రజలు భావించారు. ఎత్తు నుంచి బావిలో పడిపోవడంతో ఆ దొంగ నడుము విరిగిపోయింది. దీంతో బావిలో నుంచి బయటకు రాలేక మూడు రోజులపాటు నరకయాతన అనుభవించాడు. ఈ నేపథ్యంలో గురువారం అటుగా వెళ్తున్న కొంతమంది రైతులు బావిలో నుంచి అరుపులు రావడాన్ని గమనించి వెళ్లి చూశారు. బావిలో అపరస్మారక స్థితిలో వ్యక్తి పడిఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బావి వద్దకు చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సహాయంతో అతడిని బయటకు తీశారు. ఈయన విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పురేయవలస గ్రామానికి చెందిన ఆదినారాయణగా పోలీసులు గుర్తించారు. అప్పటికే తీవ్రంగా గాయపడటంతో పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
లాలూకు మూడు రోజుల పెరోల్
రాంచీ/పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడు రోజుల పాటు పెరోల్ మంజూరైంది. దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరలో ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ బిహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్యరాయ్‌ను ఈ నెల 12న పట్నాలో వివాహం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని లాలూ కోరారు. అయితే ఆంక్షలతో కూడిన మూడు రోజుల పెరోల్ మాత్రమే మంజూరు చేసినట్టు జార్ఖండ్ జైళ్ల శాఖ ఐజీ హర్‡్ష మంగ్లా మీడియాకు తెలిపారు. అయితే పెరోల్ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనేది స్పష్టంగా చెప్పలేదు. నిబంధనల ప్రకారం ఆయన ప్రయాణం చేసే సమయాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోరని తెలిపారు. పెరోల్ నేపథ్యంలో లాలూకు పలు ఆంక్షలు విధించారు. ఆయన బయట ఉన్న మూడు రోజుల పాటు మీడియాతో మాట్లాడకూడదు. పార్టీ నేతలతో కానీ, కార్యకర్తలతో కానీ కలవకూడదు. ఎలాంటి రాజకీయ కార్యక్రమంలోనూ పాల్గొన కూడదు. ఆయన చేసే ప్రతీ పని వీడియోలో రికార్డు అవుతుంది. కాగా, పెరోల్‌పై గురువారం విడుదలైన వెంటనే పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్ వివాహానికి హాజరయ్యేందుకు పట్నా వెళ్లారు. విమానాశ్రయంలో కుమార్తె మీసా భారతి, కొడుకులు తేజ్‌ప్రతాప్, తేజస్వి యాదవ్‌లు ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. రాంచీ నుంచి పట్నా వరకు లాలూ వెంట ఆర్జేడీ జనరల్ సెక్రెటరీ బోలా యాదవ్ ఉన్నారు. పెరోల్ ముగిసిన తరువాత మే 14న లాలూ తిరిగి రాంచీకి వెళ్తారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఆయన రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
వెక్కిరిస్తున్న ఏటీఎంలు: మరో మూడు రోజులు ఇంతే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజలను మళ్లీ కరెన్సీ కష్టాలు పట్టి పీడిస్తున్నాయి. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఏటీఎంలలో నగదు లేక ..పెద్ద నోట్ల రద్దు సమయంలో నెలకొన్న పరిస్థితులు మళ్లీ పునరావృతమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు రాష్ట్రాల్లో 30-40శాతం నగదు కొరత నెలకొనడంపై మండిపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఏటీఎంలలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత వారం రోజులనుంచి సమస్య మరీ తీవ్రంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ఏ ఏటీఎం వద్ద చూసినా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయని తెలిపారు. నగదుకోసం 10నుంచి 15 ఏటీఎంల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కొరత తాత్కాలికమేననీ, మరో మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందంటూ చావు కబురు చల్లగా చెప్పుకొచ్చింది ప్రభుత్వం. ఈ కొరత తాత్కాలికమేననీ త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కొద్దిసేపటి క్రితం ట్విటర్లో వెల్లడించారు. దేశంలో కరెన్సీ పరిస్థితిని సమీక్షించామనీ సర్క్యులేషన్లో తగినంత కరెన్సీ ఉందనీ వెల్లడించారు. అలాగే అన్ని బ్యాంకులకు కూడా సరిపడానగదు అందుబాటులో ఉందని పేర్కొన్నారు . కొన్ని ప్రాంతాల్లో 'ఆకస్మిక, అసాధారణ పెరుగుదల' కారణంగా ఏర్పడిన తాత్కాలిక కొరతను త్వరలోనే పరిష్కరిస్తామని ట్వీట్ చేశారు. అటు పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందనీ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో చేతిలో డబ్బులు ఉంచుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఇది ఇలా ఉంటే కొన్ని రాష్ర్టాల్లో నగదు సమస్య వాస్తవమేనని ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఎస్పీ శుక్లా పేర్కొన్నారు. ప్రస్తుతం లక్షా ఇరవై ఐదు వేల కోట్ల కరెన్సీ చలామణిలో ఉందన్నారు. అయితే పలు రాష్ర్టాల్లో నగదు తక్కువగా ఉందనీ అంగీకరించిన ఆయన ప్రభుత్వం నగదు కొరతను తీర్చేందుకు రాష్ర్టాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నగదు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల నుంచి నగదు లేని రాష్ర్టాలకు డబ్బు తరలించేందుకు ఆర్బీఐ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. నగదు కొరత సమస్య మూడు రోజుల్లో తీర్చుతామని శుక్లా స్పష్టం చేశారు. అటు నగదు సంక్షోభంపై సీపీఏం నేత ఏచూరి సీతారాం కూడా ట్విటర్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. Have reviewed the currency situation in the country. Over all there is more than adequate currency in circulation and also available with the Banks. The temporary shortage caused by ‘sudden and unusual increase’ in some areas is being tackled quickly. — Arun Jaitley (@arunjaitley) April 17, 2018 ATMs were empty in November 2016. ATMs are empty now. And the only party flush with cash is the BJP: the people suffer. — Sitaram Yechury (@SitaramYechury) April 17, 2018 -
మూడు రోజుల్లో వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో రానున్న మూడు రోజుల్లో ఓ మాదిరిగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని రేకులకుంటలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగం శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి సమాచారం అందిందని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు 6 నుంచి 21 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. కాగా.. శనివారం విడపనకల్లులో 12.1 మి.మీ వర్షపాతం నమోదైంది. అగళి, లేపాక్షి, చిలమత్తూరు, తాడిమర్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు తదితర 32 మండలాల్లో తుంపర్లు పడ్డాయి. జూన్ సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా.. ఇప్పటివరకు 38.7 మి.మీ నమోదైంది. -
మూడు రోజుల్లో తెలంగాణకు 1,550 కోట్లు
-
మూడు రోజుల్లో 1,550 కోట్లు
రాష్ట్రానికి మొత్తంగా వచ్చిన నగదు 22 వేల కోట్లు సాక్షి, హైదరాబాద్: రిజర్వు బ్యాంకు గత మూడు రోజుల్లో మన రాష్ట్రానికి రూ.1,550 కోట్ల విలువైన నగదును సరఫరా చేసింది. అందులో ఎక్కువగా రూ.500, రూ.100 నోట్లే ఉండటంతో చిల్లర కష్టాలకు ఉపశమనం లభించనుంది. ఇకపై మూడు రోజులకోసారి రాష్ట్రాలకు నగదు కేటాయించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. అంటే వారంలో రెండుసార్లు నగదు రాష్ట్రానికి పంపిణీ కానుందని, దాంతో కరెన్సీ కొరత తీరుతుందని అధికారులు చెబుతున్నారు.ఇప్పటిదాకా పెద్దనోట్లే! : ఈ నెల 20, 21 తేదీల్లో తెలంగాణకు రూ.1,550 కోట్ల నగదు పంపిణీ జరిగిందని.. గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌కు ఆ నగదును సరఫరా చేశారని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. దీంతో నోట్ల రద్దు నిర్ణయం వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన కరెన్సీ రూ.22 వేల కోట్లకు చేరింది. అయితే అందులో రూ.3 వేల కోట్లే చిన్న నోట్లు.. మిగతా సొమ్ము రూ.2 వేల నోట్లు కావడం గమనార్హం. -
వరుస సెలవులతో మరిన్ని కరెన్సీ కష్టాలు
-
మార్టేరులో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు
మార్టేరు(పెనుమంట్ర) : గ్రామంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ బాస్కెట్ బాల్ పోటీలు జరగనున్నాయి. గ్రామానికి చెందిన దివంగత ఫిజికల్ డైరెక్టర్ పడాల ప్రహ్లాదరెడ్డి మెమోరియల్ పేరిట ఈ పోటీలు నిర్వహించనున్నారు. స్థానిక వేణుగోపాలస్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బాస్కెట్ బాల్ కోర్టు సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు పోటీలను పారిశ్రామిక వేత్త గొలుగూరి శ్రీరామారెడ్డి ప్రారంభిస్తారని, విశిష్ట అతి«థిగా వైఎస్సార్ సీపీ ఆచంట నియోజకవర్గ సమన్వయ కర్త కవురు శ్రీనివాసు హాజరవుతారని చెప్పారు. -
2, 3 రోజుల్లోనే అండమాన్‌కు ‘నైరుతి’
- నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: వాతావరణం శరవేగంగా మారిపోతోంది. అనూహ్య పరిణామాలతో నైరుతి రుతుపవనాల రాకకు మార్గం సుగమమవుతోంది. శనివారం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని పది రోజులు ముందుగానే తాకవచ్చన్న విషయం స్పష్టమైంది. తాజాగా రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకడానికి అనుకూల పరిస్థితులున్నాయని భారత వాతావరణ విభాగం శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. వాస్తవానికి మే 20 నాటికి రుతుపవనాలు అండమాన్‌ను తాకుతాయి. ఆ తర్వాత పది రోజులకు అంటే జూన్ ఒకటికి కేరళలోకి ప్రవేశిస్తాయి. ఈ లెక్కన నాలుగైదు రోజుల ముందుగానే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకనున్నాయి. ఆతర్వాత వారం రోజుల్లోనే ఇవి కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇది శనివారం నాటికి అల్పపీడనంగా మారనుంది. రెండ్రోజుల్లో(16 నాటికి) మరింత బలపడి వాయుగుండంగా మారవచ్చని ఐఎండీ పేర్కొంది. అదే జరిగితే నైరుతి రుతుపవనాలు మరింత బలాన్ని సంతరించుకుంటాయని రిటైర్డు వాతావరణ అధికారి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. తెలంగాణాలో వర్షాలు.. వడగాడ్పులు.. రాష్ట్రంలో రెండు రోజుల పాటు విచిత్రమైన పరిస్థితి ఏర్పడనుంది. ఒకవైపు వడగాడ్పులు, మరోవైపు అల్పపీడనంతో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీలంక తీరప్రాంతంలో హిందూ మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దీని వల్ల శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఈ రెండు రోజులు తీవ్రమైన వడగాడ్పులు కూడా వీస్తాయని హెచ్చరించింది. మధ్యాహ్నం వరకు వడగాడ్పులు, సాయంత్రాలు ఉరుములతో వర్షాలుంటాయని తెలిపింది. ఇక శుక్రవారం రామగుండంలో అత్యధికంగా 45.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 44.3, నిజామాబాద్‌లో 43.7 డిగ్రీలు రికార్డయింది. రాజధాని నగరం హైదరాబాద్‌లోనూ భానుడు ప్రతాపం చూపించాడు. కొద్దిరోజులపాటు చిరుజల్లులు, చల్లని గాలులతో ఉపశమనం పొందిన నగరవాసులకు మళ్లీ ఎండదెబ్బ తప్పడం లేదు. శుక్రవారం గరిష్టంగా 41.2 డిగ్రీలు, కనిష్టంగా 28.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో సిటీజనులు విలవిల్లాడారు. రాగల 24 గంటల్లో ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో వానలు.. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణిల ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని, కొన్నిచోట్ల ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. కోస్తా, రాయలసీమల్లోనూ పగటి పూట ఉష్ణోగ్రతలు ఒకింత అధికంగా నమోదైనా వడగాడ్పులు వీచే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోకెల్లా రామగుండంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయానికి) తునిలో 22.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. హార్సిలీహిల్స్ సమీపంలోని ఆరోగ్యవరంలో మినహా రాయలసీమలోని మిగి లిన ప్రాంతాల్లో 40 - 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత రామగుండం 45.2 ఆదిలాబాద్ 44.3 నిజామాబాద్ 43.7 మెదక్ 42.4 ఖమ్మం 42.0 భద్రాచలం 41.6 హైదరాబాద్ 41.2 మహబూబ్‌నగర్ 40.5 అనంతపురం 42.7 కడప 41.2 తిరుపతి 41.2 విజయవాడ 41.0 -
మరో మూడు రోజులు వడగాడ్పులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరో 3 రోజులపాటు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం రామగుండంలో 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 44.6, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో 44.2, ఖమ్మంలో 43.6 చొప్పున అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్‌లో 42.8 డిగ్రీలు నమోదైంది. ఉచిత హోమియో మందు: ఆయుష్ కమిషనర్ వడదెబ్బ నివారణకు హోమియో మందును రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా అందజేయాలని ఆయుష్ కమిషనర్ ఎ.రాజేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రామంతాపూర్ హోమియోపతి మెడికల్ కాలేజీ ప్రాంగణంలో సోమవారం ఏకీకృత రక్త పరీక్షల కేంద్రాన్ని రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ రక్త పరీక్షల కేంద్రానికి వచ్చే రోగులకు ఉచితంగా అన్ని రకాల పరీక్షలు చేస్తామన్నారు. వడదెబ్బకు 58 మంది మృత్యువాత తెలంగాణ జిల్లాల్లో సోమవారం వడదెబ్బతో 57 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 15 మంది.. వరంగల్ జిల్లాలో 13 మంది, ఖమ్మంలో 13 మంది చనిపోయారు. అలాగే, కరీంనగర్లో 10 మంది, రంగారెడ్డి జిల్లాలో ఒకరు, ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు, నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు మరణించారు. అలాగే నగరంలోని ఎర్రగడ్డ యునానీ ఆస్పత్రి సమీపంలో గుర్తు తెలియని 30 ఏళ్ల వ్యక్తి వడదెబ్బకు మృతి చెందాడు. సోమవారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత రామగుండం 45.0 నిజామాబాద్ 44.6 ఆదిలాబాద్ 44.3 మహబూబ్‌నగర్ 44.2 నల్లగొండ 44.2 ఖమ్మం 43.6 మెదక్ 43.5 హైదరాబాద్ 42.8 హన్మకొండ 42.5 -
మూడు రోజుల్లో ఏడుగురి ఆత్మహత్యాయత్నం
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): గత మూడు రోజుల్లో హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఏడుగురిని లేక్ పోలీసులు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కవాడిగూడకు చెందిన సాయికుమార్ (24) టీ స్టాల్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి అలవాటు పడిన ఇతను ఈ నెల 2వ తేదీ రాత్రి భార్యతో గొడవకు దిగాడు. దీన్ని గమనించిన అతని తండ్రి మందలించాడు. దీంతో సాయికుమార్ మద్యం మత్తులో ట్యాంక్‌బండ్‌కు వచ్చి హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. బైబిల్‌హౌజ్ ప్రాంతానికి చెందిన రేణుక (23) ఈ నెల 3వ తేదీ రాత్రి తన కుమార్తె సాయిప్రియతో కలిసి ట్యాంక్‌బండ్‌కు వచ్చి సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా పోలీసులు రక్షించారు. సుల్తాన్‌షాహికి చెందిన స్వప్న (27), దేవీనగర్‌కాలనీ కవాడీగూడకు చెందిన బి.శృతిలయ(24) 3వ తేదీన తన ఆరు నెలల కుమార్తెతో కలిసి హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. గస్తీ నిర్వహిస్తున్న లేక్ పోలీసులు వారిని రక్షించారు. అమీర్‌పేట్ ఎల్లారెడ్డిగూడకు చెందిన కవిత(38), రాజు భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని 3వ తేదీన గొడవ పడి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యచేసుకునేందుకు రాగా లేక్ పోలీసులు రక్షించారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
3 రోజుల పాటు భారీ వర్షాలు
- వాతావరణ శాఖ వెల్లడి సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్ప హైదరాబాద్ వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలో రుతుపవనాలు ఊపందుకున్నాయని వెల్లడించింది. దీంతో 3 రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా పేరూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైం ది. గూడూరు, మిర్యాలగూడలో 8 సెం.మీ., వెంకటాపురం, ఖమ్మం, కొణిజర్లల్లో 6 సెం. మీ., పాలకుర్తి, సారంగాపూర్, కూనవరం, గాంధారి, దోమకొండ, నిర్మల్, మణుగూరులో 5 సెం.మీ. చొప్పుననమోదైంది. సిర్పూర్(టి), ఇబ్రహీంపట్నం, పినపాక, కొత్తగూడెం, మేడ్చల్, కొల్హాపూర్, జనగాం, ఏటూరునాగారం, నారాయణఖేడ్‌లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వాగుదాటినా.. ప్రాణం నిలవలే.. బెజ్జూర్: ఆదిలాబాద్ జిల్లాలో రహదారి కష్టాలకు ఈ ఫొటో నిదర్శనం.. వానొచ్చినా.. వరదొచ్చినా.. వాగులు ఉప్పొంగితే ప్రజల ప్రాణాలకు ముప్పొచ్చినట్లే.. జిల్లాలోని బెజ్జూరు మండలంలోని కుశ్నపెల్లికి చెందిన నికాడి గౌరుబాయి(45), శ్రీరామ పద్మ(35) మంగళవారం పొలం పనులకు వెళ్లారు. సాయంత్రం చిన్నపాటి వర్షం పడుతుండగా ఇంటిదారి పట్టారు. దారిలో పిడుగుపడడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు , గ్రామస్తులు వారిని కాపాడాలనే ఉద్దేశంతో ఎడ్లబండిపై ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో కుశ్నపల్లి పెద్దవాగు వచ్చింది. బ్రిడ్జి, రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కష్టపడి బండిని వాగు దాటించారు. వారిని బెజ్జూరు ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులూ అందుబాటులో లేకుండా పోయారు. పరీక్షించిన ఆర్ఎంపీ వారు చనిపోయినట్లు ధ్రువీకరించారు. -
ఒకే కుటుంబంలో మూడ్రోజుల్లో ముగ్గురి మృతి...
చిగురుమామిడి(కరీంనగర్ జిల్లా): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వివిధ కారణాలతో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కుంచం రాజు(26) రెండు రోజుల క్రితం కూకట్‌పల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను దుబాయి వెళ్లాలని అప్పు చేసి అది తీరకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని మృతదేహన్ని సొంత గ్రామానికి తరలించారు. ఈ విషయం తెలిసిన రాజు అమ్మమ్మ అల్లెపు మల్లవ్వ(75) మనస్తాపంతో శనివారం మృతిచెందింది. కాగా, ఒకవైపు కొడుకు, మరోవైపు అత్త మరణించడంతో కుంచం రాములు(60) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో పూర్తి విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఒకే సారి ముగ్గురికి ఆంత్యక్రియలు జరపనున్నట్లు సమచారం. -
పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తే..
హైదరాబాద్: q తమ సిబ్బంది పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లిన సమయంలో కొందరు ఉండడం లేదని, దీంతో విచారణ పెండింగ్‌లో పడుతోందన్నారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న నగరవాసులు పాస్‌పోర్ట్ కోసం హైదరాబాద్‌లో దరఖాస్తు చేసుకుని మరుసటి రోజే నగరం విడిచి వెళ్తున్నారని, ఇలాంటి వారు మూడు రోజులు ఇంటి వద్దగానీ, నగరంలోగానీ ఉంటే పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ చేసేందుకు వీలు కలుగుతుందని అన్నారు. పాస్‌పోర్ట్ క్లియరెన్స్ ఒక్కోసారి 24 గంటల్లోనే పూర్తవుతోందని, కొన్ని సందర్భాల్లో మూడు రోజులకు మించడం లేదని చెప్పారు. ప్రస్తుతం నగరంలో పాస్‌పోర్ట్ దరఖాస్తులేవీ పెండింగ్‌లో లేవని స్పష్టం చేశారు. ఎఫ్‌వీవోలకు నెలకు 30 లీటర్ల పెట్రోల్.. స్పెషల్ బ్రాంచ్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్స్(ఎఫ్‌వీవోలు) సొంత బైక్‌పై వెళ్లి పాస్‌పోర్ట్ దరఖాస్తుల విచారణ చేపట్టేవారు. వారికి పోలీసులకు ఇచ్చే విధంగానే నెలకు పెట్రోల్ అలవెన్స్ కింద ప్రభుత్వం రూ.200 ఇచ్చేది. చాలీచాలని అలవెన్స్‌లు ఇవ్వడంతో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుడి నుంచి ఎంతో కొంత డబ్బు ఆశించేవారు. ఇటీవల నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి దరఖాస్తుదారుల నుంచి డబ్బులు తీసుకోవద్దని ఆదేశించారు. అయితే విధి నిర్వహణలో బైక్‌పై తిరిగితే ప్రభుత్వం నెలకు ఇచ్చే రూ.200 సరిపోదని తెలుసుకున్న ఉన్నతాధికారులు.. వారికి నెలకు 30 లీటర్ల పెట్రోల్ ఇచ్చేందుకు నిర్ణయించారు. మార్చి నుంచి ఈ అలవెన్స్‌లు ఇస్తున్నారు. కాగా, త్వరలో స్పెషల్ బ్రాంచ్‌కు తొలి విడతలో 44 కొత్త బైక్‌లు రానున్నాయి. వీటిని బాగా పనిచేసిన వారికి ఇచ్చేందుకు ఎఫ్‌వీవోల గ్రేడింగ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. -
కామిక్ కాన్‌దాన్..
-
మూడు రోజుల్లో 30 కోట్లు
మూడు రోజుల్లో రూ.30 కోట్లు వసూలు చేసి అసాధారణ రికార్డును అంజాన్ చిత్రం సాధించిందని చిత్ర యూనిట్ పేర్కొంది. సూర్య, సమంత జంటగా నటించిన చిత్రం అంజాన్. లింగుసామి దర్శకత్వంలో తిరుపతి బ్రదర్స్, యూటీవీ మోషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. తమిళనాడు, కేరళ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఏక కాలంలో అత్యధిక థియేటర్లలో విడుదలైన అంజాన్ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, వసూళ్లను మాత్రం రికార్డు స్థాయి సాధించడం విశేషం. ఈ చిత్రం మూడు రోజుల్లోనే 30 కోట్లు వసూలు చేసిందని యూనిట్ వర్గాలు వెల్లడించారుు. తమిళం, మలయాళం భాషల్లో ఇంతకు ముందు ఏ చిత్రం సాధించనంత రికార్డు స్థాయి వసూళ్లతో అంజాన్ చరిత్ర తిరగ రాస్తుందని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ఆరు నిమిషాల నిడివి తగ్గింపు పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందిన అంజాన్ చిత్రంలోని ఆరు నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు తెలిసింది. చిత్ర రెండో భాగంలో నిడివి ఎక్కువయ్యిందనే విమర్శలు రావడంతో ఆ ఆరు నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు యూటీవీ మోషన్స్ సంస్థ ప్రతినిధి ధనుంజయన్ వెల్లడించారు. చిత్రంలో హాస్య నటుడు బ్రహ్మానందం హాస్య సన్నివేశాలున్నాయన్నారు. అవి కథకు సంబంధం లేకపోవడంతో తొలగించినట్లు ఆయన వివరించారు. అయితే తెలుగు వెర్షన్లో ఈ సన్నివేశాలు యథాతథంగా ఉంటాయని తెలిపారు. -
మూడు రోజులకు ముప్ఫయ్ ఐదు లక్షలా!?
హాట్ గాళ్ అంటే ఎలా ఉంటుంది? అని ఇప్పుడు ఎవర్ని ప్రశ్నించినా.. చటుక్కున ‘సన్నీ లియోన్’ పేరు చెబుతారు. ఒకప్పుడు నీలి చిత్రాల్లో నటించిన సన్నీ ఇప్పుడు అవి మానేశారు. కానీ, సినిమాల్లో మాత్రం గ్లామరస్ రోల్స్‌లో కనిపించి, కుర్రకారు మతిపోగొడుతున్నారు. ఉత్తరాదిన ఈ శృంగార తారకు బోల్డంత క్రేజ్ ఉంది. దక్షిణాదిన సన్నీ ఆగమనం కోసం ఎదురు చూస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఇక్కణ్ణుంచి సన్నీని చాలా అవకాశాలు వరిస్తున్నాయి. తమిళ ‘వడకర్రీ’ (తెలుగులో ‘కుల్ఫీ’) తరువాత తెలుగులో ఆమె ‘కరెంటు తీగ’కు పచ్చ జెండా ఊపారు. మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సన్నీ ఒక పాటకు నర్తించడంతో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లో కనిపిస్తారట. తన మొత్తం చిత్రీకరణకు కేవలం మూడు రోజులు పడుతుందని సమాచారం. ఈ మూడు రోజులకు సన్నీ తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా ముప్ఫయ్ ఐదు లక్షలని వినికిడి. మరి.. సన్నీయా.. మజాకానా! -
పోలీస్ కస్టడీకి జాకీర్ హుస్సేన్
చెన్నై రైల్వే స్టేషన్లో పేలుళ్ల వెనుక కుట్రను ఛేదించేందుకు పోలీస్ యంత్రాంగం దూసుకుపోతోంది. పేలుళ్లకు రెండురోజుల ముందు పట్టుపడిన తీవ్రవాది జాకీర్ హుస్సేన్‌ను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టగా, 9 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలో ముఖ్యంగా చెన్నై నగరంలో తీవ్రవాదుల కదలికలున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఇటీవల భారీ ఎత్తున తనిఖీలు ప్రారంభించారు. ఇందులో భాగంగా గత నెల 29న మన్నాడీ అనే ప్రాంతంలో జాకీర్‌హుస్సేన్ పట్టుబడ్డాడు. ఇతని నుంచి సేకరించిన సమాచారంతో మరో ఇద్దరు నిందితులను 30న అరెస్ట్ చేశారు. వీరందరినీ అరెస్ట్ చేసిన మరుసటి రోజే అంటే ఈనెల 1న సెంట్రల్లో జంటపేలుళ్లు సంభవించాయి. అరెస్టులకు ప్రతీకారంగానే పేలుళ్లు జరిపి ఉంటారని తొలుత భావించినా పట్టుపడిన వారి లక్ష్యాలు వేరని పోలీసులు గుర్తించారు. శ్రీలంకలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ గూడచారి హోదాలో జాకీర్ హుస్సేన్ చెన్నైలో అడుగుపెట్టినట్లు, ఈ సమయంలో తిరుచ్చి, బెంగళూరులలో పర్యటించినట్లు కనుగొన్నారు. చెన్నైలోని అమెరికా దౌత్యకార్యాలయం, బెంగళూరులోని ఇజ్రారుుల్ దౌత్యకార్యాలయం పేలుళ్లకు వీరు కుట్ర పన్నినట్లు తెలుసుకున్నారు. ఈ విధ్వంసాలను అమలుచేసేందుకు మాల్దీవుల నుంచి వచ్చే ఇద్దరి వ్యక్తులకు నివాస, వసతి సౌకర్యాలను సమకూర్చే బాధ్యతలను జాకీర్‌హుస్సేన్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ పనిలో ఉండగానే అతను పోలీసులకు పట్టుబడ్డాడు. ముఖానికి ముసుగు ధరింపజేసి భారీ బందోబస్తు మధ్య పోలీసులు చెన్నై ఎగ్మూరు కోర్టుకు జాకీర్‌హుస్సేన్‌ను తీసుకువచ్చారు. జాకీర్ హుస్సేన్ కార్యకలాపాలపై విచారణ జరిపేందుకు పదిరోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాల్సిందిగా క్యూ బ్రాంచ్పోలీసులు కోర్టుకు విన్నవించారు. అయితే 9 రోజులకు న్యాయమూర్తి అనుమతించారు. దీంతో వెంటనే అదే స్థితిలో కోర్టు బైటకు తీసుకువచ్చిన జాకీర్‌హుస్సేన్‌ను విచారణ నిమిత్తం రహస్య ప్రదేశానికి తరలించారు. సెంట్రల్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న పేలుళ్లకు కుట్ర బెంగళూరులోనే జరిగినట్లు తెలుస్తున్నందున ఆ కోణంలో రెండోదశ విచారణను సోమవారం ప్రారంభించారు. చెన్నై-బెంగళూరు రైల్వే స్టేషన్ల మధ్య సెల్‌ఫోన్ సంభాషణలను విశ్లేషిస్తున్నారు. బాంబులు అమర్చిన అనంతరం సెల్ఫోన్లో ముష్కరులు చర్చించుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. రెండు రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న 358 కిలోమీటర్ల దూరం వరకు జరిగిన అన్ని సంభాషణల టేపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్లో పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులే కారణమని దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. అయితే వీరితో అల్ఉమ్మా తీవ్రవాదులు కూడా చేతులు కలిపి జాయింట్ ఆపరేషన్ చేసే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు. అందుకే అలాగే వేలూరు జైలులో శిక్ష ను అనుభిస్తున్న ఆల్ ఉమ్మా తీవ్రవాదులు పన్నా ఇస్మాయిల్, పోలీస్ ఫక్రుద్దీన్, బిలాల్మాలిక్లను విచారిస్తున్నారు. -
సంక్రాంతి సెలవులు మూడు రోజులే!
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలలకు విద్యాశాఖ మూడు రోజులే సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఎప్పటిలా కాకున్నా.. కనీసం ఐదు రోజులైనా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల చేసిన వినతులను ప్రభుత్వం పట్టించుకోలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల రెండు నెలల పాటు పాఠశాలలు మూతపడ్డారుు. దీంతో సెలవుదినాలు, ఆదివారాల్లో కూడా ఉపాధ్యాయులు పాఠశాలలను నడుపుతున్నారు. ఈనేపథ్యంలో సంక్రాంతికి కనీసం ఐదు రోజులైనా... సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ పంఘాలు కోరినా... ప్రభుత్వం పట్టించుకోలేదు. మూడు రోజులు మాత్రమే సెలవుల తీసుకోవాలని ఖరాకండిగా నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ డెరైక్టరేట్ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యూరుు. ఈ విషయమై డీఈఓ జి. కృష్ణారావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్ ఇచ్చిన ఉత్తర్శుల మేరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులుగా పరిగణిస్తామన్నారు. దీనిపై ఎటువంటి సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు. -
ఓటరు నమోదుకు మూడు రోజులే గడువు
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :ఒక్క వేటుతో చెట్టును పడగొట్టగలమో లేదో...కానీ ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతో అవినీతి వక్షాన్ని కూల్చవచ్చు. ఆ ఒక్క ఆయుధం మన ఓటే కావచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకున్న విలువ అలాంటిది. సమసమాజ నిర్మాణం ప్రజల చేతుల్లోనే ఉంది. సచ్చీలురైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి రాజ్యాంగం ఇచ్చిన అద్భుతమైన కానుక ఓటుహక్కు. నవభారత నిర్మాణం కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందాల్సిందే. సమాజంలో ఓటుహక్కుకు ఉన్న ప్రాధాన్యతను యువత తెలుసుకోవాలి. డిసెంబర్ 17వ తేదీ వరకు... నూతన ఓటర్ల నమోదుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్త ఓటర్ల నమోదుకు ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం కల్పించారు. బూత్‌లెవల్ ఏజెంట్లు నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను స్వీకరించనున్నారు. 2014 జనవరి 16వ తేదీన ఓటర్ల చివరి జాబితాను ప్రచురిస్తారు. బూత్‌స్థాయి అధికారులు, తమశీల్దార్లు, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు అందిస్తున్నారు. పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లు ఈ-సేవా, మీ-సేవా, ఏపీ ఆన్లైన్ సెంటర్లలో ఓటరు గుర్తింపు కార్డులు పొందవచ్చు. 18 ఏళ్లు నిండిన వారు ఫారం-6 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలి. ఓటరు(చనిపోయిన, నివా సం మారిన వారి)పేరును జాబితా నుంచి తొలగించుకోవడానికి ఫారం-7, జాబితాలో ఓటరు పేరు, ఫొటో, తండ్రి, భార్య, భర్త పేర్ల సవరణకు ఫారం-8, నియోజకవర్గ పరిధిలోని ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరో పోలింగ్‌స్టేషన్‌కు ఓటును మారుకునేందుకు ఫారం-8ఏ ఉపయోగించాలి. ఈ-రిజిస్ట్రేషన్ ఈజీ... ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియపై భారీ కసరత్తు చేస్తోంది. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థుల నుంచి నూతన ఓటరు దరఖాస్తులు తీసుకోవాలని జిల్లాలోని అన్ని కళాశాలల ప్రిన్సిపాల్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే మీ-సేవ, పోస్టాఫీసు, బ్యాంకుల్లో దరఖాస్తులను అందుబాటులో ఉంచింది. జిల్లాలో 87 వేల దరఖాస్తులు జిల్లాలో ఇప్పటి వరకు నూతనంగా ఓటరు నమోదుకు 87 వేల అప్లికేషన్లు అందినట్లు జిల్లా అధికారులు తెలిపా రు. ఆదివారం(నేడు) జిల్లాలోని ప్రతి పోలింగ్ బూత్‌లో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓటరు కార్డుతో ప్రయోజనాలు... ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవడానికి, నివాస ప్రాంతం, వయసు ధ్రువీకరణ పత్రంగా బ్యాంక్ ఖాతా తెరవడానికి, డ్రైవింగ్ లెసైన్స్, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, గ్యాస్ కనెక్షన్ పొందడానికి ఓటరుకార్డు ఉపయోగపడుతుంది.