మూడు రోజుల్లో 30 కోట్లు | Anjaan mints 30 crores in the box-office | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో 30 కోట్లు

Published Tue, Aug 19 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

మూడు రోజుల్లో 30 కోట్లు

మూడు రోజుల్లో 30 కోట్లు

 మూడు రోజుల్లో రూ.30 కోట్లు వసూలు చేసి అసాధారణ రికార్డును అంజాన్ చిత్రం సాధించిందని చిత్ర యూనిట్ పేర్కొంది. సూర్య, సమంత జంటగా నటించిన చిత్రం అంజాన్. లింగుసామి దర్శకత్వంలో తిరుపతి బ్రదర్స్, యూటీవీ మోషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. తమిళనాడు, కేరళ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఏక కాలంలో అత్యధిక థియేటర్లలో విడుదలైన అంజాన్ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, వసూళ్లను మాత్రం రికార్డు స్థాయి సాధించడం విశేషం. ఈ చిత్రం మూడు రోజుల్లోనే 30 కోట్లు వసూలు చేసిందని యూనిట్ వర్గాలు వెల్లడించారుు. తమిళం, మలయాళం భాషల్లో ఇంతకు ముందు ఏ చిత్రం సాధించనంత రికార్డు స్థాయి వసూళ్లతో అంజాన్ చరిత్ర తిరగ రాస్తుందని చిత్ర యూనిట్ పేర్కొన్నారు.
 
 ఆరు నిమిషాల నిడివి తగ్గింపు
 పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందిన అంజాన్ చిత్రంలోని ఆరు నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు తెలిసింది. చిత్ర రెండో భాగంలో నిడివి ఎక్కువయ్యిందనే విమర్శలు రావడంతో ఆ ఆరు నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు యూటీవీ మోషన్స్ సంస్థ ప్రతినిధి ధనుంజయన్ వెల్లడించారు. చిత్రంలో హాస్య నటుడు బ్రహ్మానందం హాస్య సన్నివేశాలున్నాయన్నారు. అవి కథకు సంబంధం లేకపోవడంతో తొలగించినట్లు ఆయన వివరించారు. అయితే తెలుగు వెర్షన్‌లో ఈ సన్నివేశాలు యథాతథంగా ఉంటాయని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement