న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా వారంలో మూడు రోజులపాటు కార్యాలయానికి వచ్చి పనిచేయడాన్ని తప్పనిసరి చేసింది. సుదూర ప్రాంతం నుంచి పనిచేసే విధానం కొనసాగింపు సరైన ఆలోచనకాదంటూ కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయ్‌కుమార్ పేర్కొ న్నారు. వెరసి సంస్థ ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా వారంలో మూడు రోజులు ఆఫీ సుకు హాజరై విధులు నిర్వహించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే వారంలో ఏ మూడు రోజులు అన్న విషయంలో స్వల్ప వెసులుబాటు(ఫ్లెక్సిబిలిటీ) కలి్పంచనున్నట్లు తెలియజేశారు. కోవిడ్–19 కారణంగా ఇంటి నుంచే విధుల(వర్క్ ఫ్రమ్ హోమ్) విధానానికి బీజం పడగా.. ఇటీవల పలు ఐటీ దిగ్గజాలు తిరిగి ఆఫీసునుంచి బా« ద్యతల నిర్వహణకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది.
టీసీఎస్ ఇప్పటికే..: బుధవారం క్యూ2 ఫలితాలు వెల్లడించిన టీసీఎస్ 6.14 లక్షల మంది సిబ్బందిని తిరిగి కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించవలసిందిగా ఆదేశించినట్లు వెల్లడించిన విషయం విదితమే. ఇక మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగుల విధుల విషయంలో వెసులుబాటుకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ అత్యధిక శాతం సిబ్బంది ఆఫీసులకు తరలి వస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. సుదూర ప్రాంతాల నుంచి పనిచేయడం ద్వారా అటు సిబ్బందికి, ఇటు సంస్థకు ప్రయోజనకరంకాదని విజయ్‌కుమార్ వ్యా ఖ్యానించారు. ఇది సరైన ఆలోచనకాదని, దీంతో వారంలో మూడు రోజుల పని విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే 60 శాతంమంది కార్యాలయాలకు హాజరవుతుండగా.. సిబ్బంది మొత్తానికి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు.
వారంలో 3 రోజులు ఆఫీసుకు
Published Sat, Oct 14 2023 6:29 AM | Last Updated on Sat, Oct 14 2023 6:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment