
టెక్ దిగ్గజం గూగుల్ (Google) బుధవారం బెంగళూరులో తమ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది. దీనికి ’అనంత’ అని పేరు పెట్టినట్లు కంపెనీ ఒక బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. అంతర్జాతీయంగా తమకున్న భారీ కార్యాలయాల్లో ఇది కూడా ఒకటని పేర్కొంది.
నేవిగేషన్‌కి సులభంగా ఉండేలా అనంతలోని ప్రతి ఫ్లోరు.. వీధుల నెట్‌వర్క్‌లాగా ఉంటుందని పేర్కొంది. చిరకాలంగా టెక్నాలజీలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, దేశీయంగా అంకుర సంస్థలు .. యాప్ వ్యవస్థలు వృద్ధి చెందుతున్న తీరు ఇందుకు నిదర్శనమని తెలిపింది. డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు కోట్ల మంది జీవితాల్లో పరివర్తన తెస్తున్నాయని వివరించింది.

వివిధ ఉత్పత్తులు, ప్లాట్‌ఫాంలతో కోట్ల మంది యూజర్లకు చేరువ కావడానికి తమకు భారత్‌లో ప్రత్యేక అవకాశం లభించిందని తెలిపింది. అనంత అంటే 'అపరిమితం' అని అర్థం. ఇది టెక్నాలజీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అపరిమితమైన అవకాశాలను సూచిస్తుంది.

గూగుల్ అనంతలో 100 శాతం మురుగునీటి రీసైక్లింగ్, వర్షపునీటి సేకరణ.. పవర్ వినియోగాన్ని తగ్గించడానికి పెద్ద స్మార్ట్ గ్లాస్ ఇన్‌స్టాలేషన్ వంటివి ఉన్నాయి. ఇంటీరియర్ మెటీరియల్స్ కోసం దాదాపు పూర్తిగా స్థానికంగా ఉన్నవాటినే ఉపయోగించారు. భారతదేశం ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమైన అవకాశాన్ని సూచిస్తుందని కంపెనీ వెల్లడించింది.