సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో రానున్న మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మిగిలిన ప్రాంతాల్లో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపే ఉత్తర–దక్షిణ ద్రోణి బలహీనపడిందని పేర్కొంది.
ప్రస్తుతం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఈ ద్రోణి విస్తరించి ఉందని వివరించింది. మరోవైపు 1.5 కిలో మీటర్ల ఎత్తులో తూర్పు బిహార్ ప్రాంతం నుంచి దక్షిణ తీరప్రాంతమైన ఒడిశా వరకు మరో ద్రోణి వ్యాపించినట్టు తెలిపింది.
చదవండి:
జాగ్రత్తలతోనే మనుగడ: సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: తిరుపతిలో వైఎస్సార్ సీపీదే హవా
Comments
Please login to add a commentAdd a comment