rains in AP
-
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తాయని పేర్కొంది.రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవనున్నాయని.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 65 కిమీ వేగంతో గాలులు విస్తాయని.. ఏపీలో అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన వాతావరణ శాఖ.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది.ఇక, తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం చూపుతోంది. హైదరాబాద్‌లో పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. రాబోయే నాలుగు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 2,3 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ.. ఆ వార్తల్లో నిజం లేదు Heavy Rain Forecast to Tirupati, Nellore Districts -
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ల ఎత్తులో విస్తరించింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. సోమవారం ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. మరోవైపు ఈ నెల 18 నాటికి వాయవ్య బంగాళాఖాతంలోనే మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అదేరోజు నుంచి రాష్ట్రంలో వర్షాలు ఊపందుకునేందుకు అవకాశం ఉంది. చదవండి: వైఎస్సార్ షాదీ తోఫాలో మార్పులు.. ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ -
ఏపీకి అలర్ట్.. మరో 3 రోజులు వర్షాలు..
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం మధ్య బంగాళాఖాతం వైపునకు కదలింది. దీని ప్రభావంతో మరో 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. బుధవారం విజయనగరం జిల్లా సారధిలో 9.8 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. చదవండి: దిగివచ్చిన కేంద్రం.. ఫలించిన సీఎం జగన్ ఒత్తిడి -
Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, విజయనగరం, కాకినాడ జిల్లాల్లో సోమవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా నాతవరంలో 8.8, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 8.5 సెంటీమీటర్ల వర్షం పడింది. రాబోయే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని, వర్షాలు పడుతున్నా వేడి వాతావరణం ఉంటుందని వివరించింది. చదవండి: అప్పటి టీడీపీ ప్రభుత్వం అంటే హెరిటేజ్ ప్రభుత్వమేనా..! -
ఏపీలో వర్షాలు.. రానున్న రెండు రోజుల్లో..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో దిగువస్థాయి నుంచి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న రెండురోజుల్లో మళ్లీ వర్షాలు మొదలు కానున్నాయి. గురువారం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులకు కూడా ఆస్కారం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాలో మాత్రం పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. మరోవైపు డిసెంబర్ నాలుగో తేదీన దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం విలీనం కానుంది. తరువాత అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్ -
కొద్దిరోజుల్లో ఏపీలోకి ఈశాన్య రుతుపవనాలు.. భారీ వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాలు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడును అక్టోబర్ 20 లేదా అంతకు రెండు రోజులు అటుఇటుగా తాకుతాయి. కానీ, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఈ నెల 23 వరకు పూర్తి కాలేదు. ఇంతలో బంగాళాఖాతంలో ఏర్పడిన ‘సిత్రాంగ్’ తుపాను కూడా ఈశాన్య గాలులను నిలువరించడం ద్వారా రుతుపవనాల ఆలస్యానికి కారణమైంది. ఈ నెల 25తో సిత్రాంగ్ తుపాను పూర్తిగా బలహీనపడింది. చదవండి: కుమారుడు, భార్య.. తన కళ్లెదుటే.. ఎంత శిక్ష వేశావు దేవుడా.. ఈ నేపథ్యంలో ఈ నెల 29 నుంచి ఆగ్నేయ భారతదేశ ద్వీపకల్పంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమవుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నాటి నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రవేశం సాధారణం కంటే వారానికి పైగా ఆలస్యమవుతోంది. నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశమంతటా వర్షాలు కురిపిస్తే ఈశాన్య రుతుపవనాలు మాత్రం దక్షిణ భారతదేశంలోనే ప్రభావం చూపుతాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల పాటు ఈ రుతుపవనాలు విస్తారంగా వర్షాలను కురిపిస్తాయి. ఈశాన్య రుతుపవనాల వల్ల కోస్తాంధ్రలో 338.1 మిల్లీమీటర్లు, రాయలసీమలో 223.3 మిల్లీమీటర్ల సాధారణ సగటు వర్షపాతం నమోదవుతుంది. ఈ సీజనులో తుపాన్లకు ఆస్కారం.. నైరుతి రుతుపవనాల సీజన్లో కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలోనే బంగాళాఖాతంలో తపానులు ఎక్కువగా ఏర్పడతాయి. వాటిలో అధికంగా దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడులపైనే ప్రభావం చూపుతాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజను (అక్టోబర్–డిసెంబర్ల మధ్య)లో కనీసం మూడు తుపానులు ఏర్పడుతుంటాయి. కానీ.. ఈ ఏడాది అంతకు మించి ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 30 నుంచి భారీ వర్షాలకు అవకాశం మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా ఈ నెల 29 నుంచి రాష్ట్రంలో వర్షాలు మొదలు కానున్నాయి. 30వ తేదీ నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. అదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అది తీవ్రరూపం దాలిస్తే రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తాయి. -
ఏపీలో కుండపోత.. మరో రెండు రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు పడతాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం ఉత్తరాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. వర్షాల కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చదవండి: ‘సంక్షేమం’ ఖర్చులో ఏపీదే అగ్రస్థానం బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తులు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో 14.40 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం కురిసింది. కనిగిరి మండలం ఏపీ మోడల్ స్కూల్ ప్రాంతంలో 14.27 సెంటీమీటర్లు, బాపట్ల జిల్లా నగరం పరిధిలో 13.80 సెంటీ మీటర్లు, ప్రకాశం జిల్లా పొదిలి మండలం అన్నవరంలో 13.05 సెంటీమీటర్లు, ఒంగోలు మండలం ఏరరేజర్ల ప్రాంతంలో 13 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ప్రకాశం జిల్లా కంభం చెరువు పూర్తిస్థాయిలో నిండింది. -
ఏపీ వాసులకు అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయి. ఏపీలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు.తెలంగాణలోని అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు పడతామని వాతావరణ శాఖ పేర్కొంది. చదవండి: టీడీపీ నేత లైంగిక వేధింపులు: బాలిక సెల్ఫీ వీడియో.. బయటపడ్డ షాకింగ్ నిజాలు -
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారానికి ఏపీ తీరం వైపునకు పయనించే అవకాశం ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి ప్రకటించింది. చదవండి: రామోజీ అర్ధసత్యాల ‘పంచాయితీ’ అదే సమయంలో కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడవచ్చని వివరించింది. మరోవైపు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలో మీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల సముద్రం అలజడిగా ఉంటుందని, రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు హుకుంపేట (వైఎస్సార్ జిల్లా)లో 3.5 సెం.మీ., కపిలేశ్వరపురం (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా)లో 3.2, చాట్రాయి (ఏలూరు)లో 3.1, రాజానగరం (తూర్పుగోదావరి)లో 3, ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా)లో 2.9, జగ్గంపేట (కాకినాడ జిల్లా) 2.6, గొలుగొండ (అనకాపల్లి జిల్లా)లో 2.3 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. -
నిదురపో.. హాయిగా..
విశాఖపట్నం: మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గిరిజన రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. చంటి బిడ్డలను తమతోపాటే తల్లులు తీసుకువెళ్లి.. ఓ వైపు పనులు చేస్తూనే వారిని సాకుతూ మాతృత్వపు మమకారం చాటుతున్నారు. పంట భూముల్లోనే వారిని లాలించి.. నిద్రపుచ్చే దృశ్యాలు మన్యం అంతటా కనిపిస్తున్నాయి. హుకుంపేట–అడ్డుమండ ప్రధాన రహదారి గడ్డిమర్రి సమీపంలో చోడినారు సేకరణలో తల్లిదండ్రులు బిజీగా ఉండగా.. దగ్గరలోనే చిన్నారులు చీర ఊయల, గొడుగు కింద నిద్రపోతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. (క్లిక్: మన్యం అందం.. ద్విగుణీకృతం) -
శాంతిస్తున్న గోదారమ్మ
సాక్షి, అమరావతి, పాడేరు/సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం, ఏలూరు: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వర్షాలు తెరపివ్వడం.. ఉప నదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గోదారమ్మ శాంతిస్తోంది. ఉప నదులు ఉప్పొంగడంతో గోదారమ్మ విశ్వరూపం ప్రదర్శించటాన్ని చూసి చిగురుటాకుల్లా వణికిపోయిన ప్రజలకు ఇప్పుడు కాస్త ఊరట కలుగుతోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వస్తున్న వరద ప్రవాహం 24,84,356 క్యూసెక్కులకు తగ్గడంతో నీటి మట్టం 21.10 అడుగులకు పడిపోయింది. గోదావరి డెల్టాకు 9,500 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 24,74,856 క్యూసెక్కుల (213.87 టీఎంసీలు)ను బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఎగువన వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో సోమవారం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వచ్చే వరద క్రమేణ తగ్గనుంది. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశాల్లో వర్షాలు తెరపినిచ్చాయి. దాంతో ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, కడెంవాగు, శబరి తదితరాలలో వరద తగ్గుముఖం పట్టింది. ఇది గోదావరిలో వరద తగ్గుముఖం పట్టేలా చేస్తోంది. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌లోకి వచ్చే వరద 9.28 లక్షల క్యూసెక్కులకు, దానికి దిగువన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజ్‌లోకి వచ్చే వరద 9.45 లక్షల క్యూసెక్కులకు, ఆ బ్యారేజ్‌కు దిగువన సీతమ్మసాగర్‌లోకి వస్తున్న వరద 16.68 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలంలో తగ్గుతున్న వరద మట్టం ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుతుండటంతో భద్రాచలం వద్ద వరద మట్టం తగ్గుతోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు 17,58,166 క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గడంతో భద్రాచలం వద్ద వరద మట్టం 59.40 అడుగులకు తగ్గింది. వరద మట్టం 53 అడుగులకు తగ్గే వరకు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. సోమవారం వరద మట్టం 48 లేదా అంతకంటే దిగువకు చేరుకునే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద వరద మట్టం 43 అడుగుల కంటే దిగువకు చేరుకుంటేనే ప్రమాద హెచ్చరికలను అధికారులు ఉపసంహరించుకుంటారు. మంగళవారానికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోలవరం వద్ద అప్రమత్తం పోలవరం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వచ్చే వరద గంట గంటకూ తగ్గుతోంది. అయినప్పటికీ సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహ మూర్తి నేతృత్వంలో జల వనరుల శాఖ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలకు పోలవరంలోకి వచ్చే వరద ప్రవాహం 20,83,779 క్యూసెక్కులకు తగ్గింది. దాంతో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 38.29 మీటర్లకు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 27.54 మీటర్లకు తగ్గింది. సోమవారం పోలవరం ప్రాజెక్టులోకి వచ్చే వరద ప్రవాహం 17 నుంచి 17.50 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉంది. వరద గండం గట్టెక్కినట్లే ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల గుండెలపై కుంపటి దిగినట్టయ్యింది. మరో రెండు రోజుల్లో అంటే మంగళవారం సాయంత్రానికి గోదావరి లంక గ్రామాలు ఊపిరి పీల్చుకునే అవకాశముంది. వారం రోజులుగా వీడని వరద ముంపుతో లంక గ్రామాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకుని వారికి బాసటగా నిలిచే దిశగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపకదిన చర్యలు తీసుకుంది. మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామంలో బాధితులకు సహాయం అందజేసేందుకు వెళుతున్న పడవ గోదావరిలో అదుపు తప్పి తిరగబడింది. వీఆర్వో లక్ష్మితో పాటు వీఆర్ఏలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. లంక గ్రామాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటుతో పాటు సహాయక చర్యల్లో రాష్ట్ర మంత్రులు తానేటి వనిత, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్లు, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొంటున్నారు. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు మురళీధర్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌లు ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలిస్తున్నారు. ముంపు గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు కొనసాగుతున్నాయి. బోట్లపై రాకపోకలు సాగించే వారికి సాయం చేస్తున్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేయడంలో వలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వరద ఉధృతితో రాజమహేంద్రవరం రోడ్డు వంతెనలో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ వేగవంతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. 3, 5, 6, 9, 16 బెటాలియన్లకు చెందిన 10 బృందాల్లోని 356 మంది సిబ్బంది రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆదివారం వరద ముంపు జిల్లాల్లోని 950 మంది బాధితులను రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో పలువురు గర్భిణులు, వృద్ధులు ఉన్నారు. లంక ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం, నీరు, కొవ్వొత్తులను పంపిణీ చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు, పశ్చిమగోదావరిలో ఆచంట, నర్సాపురం, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వేలేరుపాడు మండలంలో పర్యటించారు. పోలవరం ముంపు మండలాల్లోని 61 గ్రామాల్లో 18,707 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, భోజన వసతి ఏర్పాటు చేశారు. ఆచంట మండలంలోని లంక గ్రామాల్లో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రతిరోజు వెయ్యి మందికి తన సొంత నిధులతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సాపురం పట్టణం, మండలంలో చీఫ్ విప్, ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు వరద తీవ్రతను పరిశీలించారు. విలీన మండలాల్లో వరద నీరు కాస్త తగ్గడంతో అధికార యంత్రాంగం, స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. చింతూరు నుంచి ముంపు గ్రామాలకు లాంచీల ద్వారా బియ్యం, ఇతర నిత్యావసర సరకుల రవాణాను వేగవంతం చేశారు. అంటు వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు నెల్లిపాక వీఆర్వో కట్టం వెంకటేశ్వర్లు, విస్సాపురం వీఆర్వో ముచ్చిక వీర్రాజులపై జేసీ సూరజ్ గనోరే చర్యలకు ఆదేశించారు. -
శ్రీశైలం @854 అడుగులు.. వరద ఇదేరీతిలో కొనసాగితే ఆరురోజుల్లో
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులోకి శుక్రవారంతో పోలిస్తే శనివారం వరద ఉద్ధృతి పెరిగింది. సాయంత్రం 6 గంటలకు కృష్ణా ప్రధాన పాయపై ఉన్న జూరాల నుంచి 1,52,368.. ఉపనది తుంగభద్రపై ఉన్న సుంకేశుల బ్యారేజీ ద్వారా 1,61,988.. వెరసి 3,14,356 క్యూసెక్కులు చేరుతుండటంతో శ్రీశైలంలో నీటినిల్వ 854 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 90 టీఎంసీలు నీరుంది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 125 టీఎంసీలు అవసరం. వరద ఉద్ధృతి ఇదేరీతిలో కొనసాగితే ఆరురోజుల్లో శ్రీశైలం నిండే అవకాశం ఉంది. కృష్ణానది ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. కర్ణాటకలో కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్.. ఉపనది తుంగభద్రపై ఉన్న తుంగభద్ర డ్యామ్‌లలోకి చేరుతున్న వరదను చేరినట్లుగా దిగువకు వదులుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 1.68 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 1.48 లక్షల క్యూసెక్కులు విడుదల చేసిన నేపథ్యంలో ఆదివారం కూడా ఇదేరీతిలో శ్రీశైలంలోకి వరద ఉద్ధృతి కొనసాగనుంది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువనున్న నాగార్జునసాగర్‌కు 31,784 క్యూసెక్కులు తరలిస్తోంది. నాగార్జునసాగర్‌కు దిగువన బేసిన్లో వర్షాలు తెరిపి ఇవ్వడంలో పులిచింతల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద కూడా 11,081 క్యూసెక్కులకు తగ్గింది. కృష్ణా డెల్టా కాలువలకు 3,700 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 7,381 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. రెండు, మూడు రోజుల్లో..
సాక్షి, అమరావతి: రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు నెమ్మదిగా రాష్ట్రమంతా విస్తరిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలకు, తర్వాత నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్రలో విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాయలసీమలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. కోస్తా జిల్లాల్లో మాత్రం పలుచోట్ల ఎండల తీవ్రత కొనసాగుతోంది. చదవండి: AP: అందరి చూపు మనవైపే.. దేశంతోనే పోటీ పడుతున్నాం.. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడుతున్నా, ఎక్కువ ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దిలా ఉండగా మంగళవారం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 41 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంటలో 34, అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గాదిరాయిలో 22.5, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం మంగోలులో 21, పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో 13.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కొండాయిగూడెంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
Cyclone Asani : ఏపీకి అలర్ట్.. దూసుకొస్తున్న అసని..
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను కొనసాగుతోంది. తీవ్ర తుపానుగా మారి ఒడిశా తీరానికి దగ్గరగా వస్తోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఆదివారం నర్సీపట్నం, శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, కోనసీమ, విజయవాడ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అనంతపురం, కడప ప్రాంతాల్లోను వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో భారీ వర్షానికి రోడ్లు నీళ్లతో నిండి ట్రాఫిక్ స్తంభించింది. చదవండి: పాపం రమాదేవి.. భర్త ప్రాణాలు కాపాడబోయి.. కృష్ణా జిల్లా మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లో భారీవర్షాలు, ఈదురు గాలులకు చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. కోతకొచ్చిన మామిడికాయలు రాలిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు, ఎక్కువచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదిలి నేటి (శనివారం) సాయంత్రానికి వాయుగుండంగా, ఆదివారానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపానుకు అసాని అని పేరు పెట్టనున్నారు. తుపాను వాయవ్య దిశగా ప్రయాణించి 10వ తేదీన ఉత్తరాంధ్ర–ఒడిశా మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇది బంగ్లాదేశ్ వైపు ప్రయాణించే సూచనలు కూడా ఉన్నాయని, అయితే 10వ తేదీన విశాఖపట్నం తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనిప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, వెళ్లినవారు వెంటనే తిరిగి రావాలని కోరారు. చదవండి: ఎంపీగా ఉండి కోర్టుకు రావడమేంటి? రఘురామకు హైకోర్టు చీవాట్లు -
Weather Report: ఏపీకి ఐఎండీ చల్లని కబురు..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏటా జూన్ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల సీజను ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలను కురిపిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షాలే కురుస్తాయని తాజాగా వెల్లడించినా రాష్ట్రానికి మాత్రం సమృద్ధిగా వానలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఈ వార్త ఇటు రైతాంగానికి, ప్రభుత్వానికి ఎంతో ఊరటనిస్తోంది. గడచిన మూడేళ్లుగా రాష్ట్రంలో ఇటు నైరుతి, అటు ఈశాన్య రుతుపవనాలు మంచి వర్షాలే కురిపిస్తున్నాయి. ఫలితంగా పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. గత ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సాధారణం కంటే 19 శాతం అధిక వర్షపాతం నమోదైంది. చదవండి: సర్ప్రైజ్ అంటూ కళ్లు మూసుకోమని కాబోయే భర్త గొంతు కోసి.. 2021లో ఈ జిల్లాల్లో అధికం ఇక రాష్ట్రంలో నైరుతి సీజనులో సగటు సాధారణ వర్షపాతం 514 మిల్లీమీటర్లు కాగా.. 2021లో (జూన్–సెపె్టంబర్) 613.3 మిల్లీమీటర్లు (+19 శాతం) కురిసింది. కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. -
రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు
సాక్షి, అమరావతి: వచ్చే రెండు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దాని ప్రభావంతో ఆదివారం, సోమవారం వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆదివారం ప్రకాశం, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, వివరించారు. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల జల్లులు పడతాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పగటిపూట మామూలు వాతావరణమే ఉండి సాయంత్రానికి వర్షాలు పడతాయని, ఉష్ణోగ్రతలు యధావిధిగా కొనసాగే పరిస్థితి ఉందని వివరించారు. కాగా, రాష్ట్రంలో పగటిపూట 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట కూడా సాధారణంగా కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. మూడు రోజుల తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. పిడుగుపడి బాలుడి మృతి మంత్రాలయం రూరల్: పిడుగుపాటుకు గురై ఓ బాలుడు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చమర్రిలో శనివారం చోటుచేసుకుంది. రచ్చమర్రికి చెందిన వేమన్న, నాగమ్మ దంపతుల ద్వితీయ కుమారుడు హరిజన సురేష్ (12) తాత జానయ్య దగ్గర ఉంటూ స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. బాలుడు శనివారం తాతయ్యతో కలిసి పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో పిడుగుపడటంతో సురేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. తాత జానయ్య దూరంగా ఉండటంతో పిడుగు నుంచి తప్పించుకున్నాడు. -
AP Rain Alert: 29వ తేదీ వరకు దక్షిణ కోస్తా, రాయలసీమకు వర్ష సూచన
సాక్షి, అమరావతి/విశాఖపట్నం : కొమరిన్, శ్రీలంక తీర ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తీవ్ర అల్పపీడనంగా ప్రయాణించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రమంతటా ఆది, సోమవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 30–40 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది. మత్స్యకారులెవ్వరూ సోమవారం వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. -
AP Rain Alert Today: అల్పపీడనం ముప్పు తప్పినట్టే..!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం దాని పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారకుండా అలాగే కొనసాగుతూ తమిళనాడు, శ్రీలంక వైపు ప్రయాణిస్తుండడంతో రాయలసీమకు వర్షాల ముప్పు తప్పినట్లేనని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసినా.. అలాగే కొనసాగుతోంది. శ్రీలంక, తమిళనాడులోని కడలూరు, చెన్నై తీరం వైపు ఇది కదులుతుండడంతో అక్కడ భారీవర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం లేదు. 26వ తేదీ నుంచి పలుచోట్ల భారీవర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని, 28, 29 తేదీల్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో 29వ తేదీనాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. (చదవండి: వైఎస్సార్ మరణంలో బాబు కుట్రపై అనుమానాలు..) -
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండ్రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక తీరాల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించారు. గడచిన 24 గంటల్లో ప్రకాశం జిల్లా బి.నిడమానూరులో అత్యధికంగా 275 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. చింతవరంలో 57, వై.రామవరంలో 54.5, నూజివీడులో 32.5, పెదబయలులో 31.5 మి.మీ. నమోదైంది. (చదవండి: అప్పుడలా.. ఇప్పుడిలా.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం) -
Rain Alert: ఏపీలో నేడు, రేపు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో తూర్పు గాలులు తక్కువ ఎత్తులో రాష్ట్రం వైపు బలంగా వీస్తున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. (చదవండి: AP: దైన్యాన్ని తరిమి.. ధాన్యం భరోసా) ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. నవంబర్ మొదటి వారంలో కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే సూచనలున్నాయని చెబుతున్నారు.(చదవండి: బాబు ఊగిపోతూ.. తమ్ముళ్లు తూగిపోతూ!) రెండో వారంలో అల్ప పీడనం నవంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని.. ఇది వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుందా లేక దిశ మార్చుకుంటుందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదంటున్నారు. గడచిన 24 గంటల్లో పెదకాకానిలో 79.75 మి.మీ., శృంగవరపుకోటలో 55.5, అద్దంకిలో 54.25, జీకే వీధిలో 53, అనంతగిరిలో 51, వేమనపురంలో 49, జగ్గయ్యపేటలో 48.25, చింతలపూడిలో 46.5, తాడిమర్రిలో 45.75 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
రబీకి నిండుగా నీరు
సాక్షి, అమరావతి: విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా నీరు సమృద్ధిగా ఉంది. ఖరీఫ్ పంటలకు పూర్తిస్థాయిలో నీరందించిన రాష్ట్ర ప్రభుత్వం.. రబీకి కూడా నీరందించేందుకు సిద్ధమవుతోంది. 2019, 2020 తరహాలోనే యాజమాన్య పద్ధతుల ద్వారా నీరందించనుంది. తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టుకు ప్రయోజనం కలిగేలా జలవనరుల శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా గోదావరి, కృష్ణా, నాగావళి, వంశధార నదులు పోటీ పడి ప్రవహించాయి. వర్షాఛాయ ప్రాంతమైన పెన్నా నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్)లో కూడా సమృద్ధిగా వర్షాలు కురవడంతో పెన్నమ్మ కూడా పరవళ్లు తొక్కింది. దాంతో ఖరీఫ్ పంటలకు సమృద్ధిగా నీళ్లందించారు. ఇప్పటికీ వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టుల్లో గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. అందువల్ల రబీ పంటలకూ సమృద్ధిగా నీటిని సరఫరా చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. మూడు డెల్టాలతోపాటు ఇతర ఆయకట్టులోనూ.. గోదావరి డెల్టాలో ఏటా రబీ పంటలకు నీటిని సరఫరా చేస్తారు. కృష్ణా డెల్టాలో 2019లో తొలి సారిగా రబీకి ప్రభుత్వం అధికారికంగా నీటిని విడుదల చేసింది. గతేడాది కూడా దాన్ని కొనసాగించింది. ఈ ఏడాదీ కృష్ణా డెల్టాలో రబీకి నీళ్లిచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కండలేరు, సోమశిల రిజర్వాయర్లలో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. దీంతో పెన్నా డెల్టాలో కూడా పూర్తి స్థాయిలో రబీకి నీళ్లందించనుంది. వంశధారలో గతేడాది తరహాలోనే నీటి లభ్యత ఆధారంగా ఈ ఏడాదీ సాగు నీరిచ్చేందుకు చర్యలు చేపట్టింది. తుంగభద్రలోనూ వరద కొనసాగుతుండటంతో హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ) ఆయకట్టులో నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. నీటితో కళకళలాడుతున్న ప్రకాశం బ్యారేజీ అవకాశం ఉన్న ప్రతి ప్రాజెక్టులోనూ నీటి విడుదల వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు నిండటంతో ఖరీఫ్, రబీల్లో 2019, 2020లలో కోటి ఎకరాల చొప్పున ఆయకట్టుకు నీళ్లందించాం. ఈ ఏడాదీ అదే రీతిలో ఖరీఫ్‌లో నీళ్లందించాం. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆన్ అండ్ ఆఫ్ విధానంలో నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. రబీలోనూ అధిక ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు రబీలో అవకాశం ఉన్న ప్రతి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, జలవనరుల శాఖ ఈఎన్సీ -
Rain Alert: ఏపీలో రెండు రోజులు వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): దక్షిణ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని, దీనివల్ల అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని కారణంగా రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చదవండి: Extramarital Affair: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు! -
Weather Update: అతి భారీ వర్షాలు పడే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఈ రోజు రాత్రికి వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం బలపడనుంది. తదుపరి 48 గంటల్లో వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు పయనించనుంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమబెంగాల్-ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. రాగల 3 రోజుల వాతావరణ సమాచారం శనివారం శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమ, కృష్ణా ,గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఆదివారం శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం సోమవారం శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం -
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కోస్తా జిల్లాలు తడిసిముద్దయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో వరద ఉధృతికి, పిడుగుపాటుకు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో ఇద్దరు గల్లంతవ్వగా, మరో ఇద్దరు మృతి చెందారు. కుండపోతగా కురిసిన వానలకు కొండ వాగులు, వంకలు, నదులు ఉధృతరూపం దాల్చాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. సాక్షి, నెట్వర్క్: కృష్ణా జిల్లాలో సోమవారం 1.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు మెట్ట, డెల్టా, ఏజెన్సీ ప్రాంతాలు జలమయమయ్యాయి. మన్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగులు రాజవొమ్మంగి మండలం చెరుకుంపాలెంలో అంగన్వాడీ కేంద్రాన్ని చుట్టుముట్టాయి. ఎటపాకలో మిర్చి తోటలు నీట మునిగాయి. కాకినాడలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రిలోకి వర్షపు నీరు భారీగా చేరడంతో అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోట్‌క్లబ్ కాంపౌండ్ వాల్ కూలిపోయింది. జిల్లాలో సగటు 25.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ శ్రీకేష్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తోటపల్లి, మడ్డువలస జలాశయాలకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. విజయనగరం జిల్లాలో చెరువులు పూర్తి స్థాయిలో నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. చంపావతి, సువర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తోటపల్లి, వట్టిగెడ్డ, తాటిపూడి జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తడిసి ముద్దయింది. ఏజెన్సీలో కొండవాగులు పొంగి పొర్లాయి. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గుండేటి వాగు పొంగి ప్రవహించడంతో 10 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లింగపాలెం మండలం యడవల్లిలో భారీ వర్షానికి ఇంటి గోడ కూలి గొడ్డేటి నాగేశ్ (55) మృతి చెందాడు. యువతి గల్లంతు బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయ దర్శనానికి వెళ్లిన మనీషా వర్మ (23) అనే యువతి కొండవాగుల ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆమె సోదరుడు, మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. రాగల రెండు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడుతుందని తెలిపారు. ఇక గురువారం మోస్తరు వర్షం పడుతుందన్నారు. కాగా, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సగటున 6.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలో ఉధృతంగా వరాహ, శారదా నదులు విశాఖ ఏజెన్సీలో గెడ్డలు, కొండవాగులు, వరాహ, శారద నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనంతగిరి మండలం పైడపర్తికి చెందిన పాడి కన్నయ్య (41) వరద ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. అలాగే మాడుగుల మండలం గొప్పులపాలెంకు చెందిన పాగి నాగమణి (28) పిడుగుపాటుతో మృతి చెందింది. -
6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 6వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. అది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంవైపు కదిలే సూచనలున్నా దాని ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని పేర్కొంది. దీనివల్ల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తీరప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 11న శ్రీకాకుళం జిల్లాలో భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రధానంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవీ చదవండి: గూఢచారి ‘ధ్రువ్’ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే.. మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్ -
జోరు వానలోనూ పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల జోరుగా వర్షాలు కురుస్తున్నా బుధవారం పింఛన్ల పంపిణీ ఉత్సాహంగా కొనసాగింది. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు వానలోనూ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. రాష్ట్రంలో మొత్తం 59,18,673 మందికి ప్రభుత్వం పింఛను డబ్బు విడుదల చేసింది. 1వ తేదీనే 54,10,830 మంది లబ్ధిదారులకు (91.42 శాతం మందికి) రూ.1,263.23 కోట్లు అందాయి. తొలిరోజు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 93.57 శాతం మందికి, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 89.04 శాతం మందికి పింఛన్లు పంపిణీ అయినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురు, శుక్రవారాల్లో కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. మూడు రోజుల్లోనే లబ్ధిదారులందరికీ పింఛన్లు అందేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. ఒకవైపు జోరుగా వర్షాలు కురుస్తున్నా, పింఛన్ల పంపిణీలో మొక్కవోని లక్ష్యంతో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది శ్రద్ధ చూపారని మంత్రి అభినందించారు. పారాణి పాదాలతోనే పింఛన్ల పంపిణీ.. గంపలగూడెం: పెళ్లి పీటలు ఎక్కబోతూ.. పారాణి పాదాలతోనే ముందుగా పింఛన్లు పంపిణీ చేశారు కృష్ణా జిల్లా గంపలగూడెంలో వలంటీరు కోట శివకృష్ణ. అతడికి మైలవరం మండలం మొర్సుమల్లికి చెందిన యువతితో బుధవారం ఉదయం 7.55 గంటలకు వివాహ ముహూర్తం నిర్ణయించారు. 35 కిలోమీటర్ల దూరంలోని వధువు ఇంటివద్ద కల్యాణ మంటపానికి వెళ్లాల్సి ఉన్నందున వేకువజామున 4 గంటలకే శివకృష్ణను కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లి కుమారుడిని చేశారు. పెళ్లి బట్టలు ధరించి బాసికాలు, కాళ్లకు పారాణితోఉన్న శివకృష్ణ ఉదయం 6 గంటల వరకు తన పరిధిలోని 15 మంది లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేశారు. ఆ తర్వాత ముహూర్తానికి సమయం అవుతుండటంతో మొర్సుమల్లికి బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వ ఆశయం నెరవేరేలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన శివకృష్ణను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. కిడ్నీ బాధితురాలికి తక్షణమే పింఛన్ మంజూరు చేయించిన సెర్ప్ సీఈవో గుంటూరు జిల్లా అమరావతి రూరల్ మండలానికి చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు గీతకు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ వెంటనే పింఛను మంజూరు చేయించారు. ఆధార్, ఈ–కేవైసీ సమస్య కారణంగా పింఛను మంజూరుగాక ఆమె ఇబ్బంది పడుతున్నట్లు తెలియడంతో ఆయన వెంటనే స్పందించారు. సిబ్బందితో కలిసి స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. పెళ్లి మంటపం నుంచి పింఛన్ల పంపిణీకి.. పరిగి/కళ్యాణదుర్గం రూరల్: పెళ్లి తంతు ముగియగానే నేరుగా పింఛన్ల పంపిణీకి వెళ్లి పలువురి ప్రశంసలు అందుకున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు వలంటీర్లు. పరిగి మండలం ముల్లమోతుకపల్లిలో వలంటీర్‌గా చేస్తున్న హరీష్‌రెడ్డి బుధవారం ఉదయం 9.30 గంటలకు గ్రామంలోని బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో లక్ష్మిని వివాహమాడారు. పెళ్లి వేడుక ముగియగానే నేరుగా వెళ్లి తన పరిధిలోని మొత్తం 27 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లికి చెందిన వలంటీర్ వరలక్ష్మికి యనకల్లుకు చెందిన ఈశ్వర్‌తో వివాహమైంది. వేడుక పూర్తికాగానే ఆమె వెళ్లి గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశారు. -
ఏపీలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: జార్ఖండ్ నుంచి ఒడిశా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇప్పటివరకు నైరుతి నుంచి వాయువ్యం మీదుగా వీచిన గాలులు.. నేటి నుంచి దిశ మార్చుకొని నైరుతి నుంచి ఈశాన్యం మీదుగా వీచే అవకాశాలున్నాయి. ఫలితంగా.. వాతావరణంలో మార్పులు రానున్నాయి. ఎండ తీవ్రత క్రమంగా తగ్గనుంది. బుధవారం మాత్రం ఎండలు ఠారెత్తించాయి. అనేక చోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం కూడా ఎండలు ఇదే రీతిలో ఉండే అవకాశముంది. ఇదిలా ఉండగా.. ఈ నెల 16న కోస్తా తీరంలో అల్పపీడనం ఏర్పడి ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణ వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 16 నుంచి వర్షాలు జోరందుకునే సూచనలున్నట్లు తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. -
నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/అనంతపురం: దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అందువల్ల ఈ నెల 20, 21 తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇది బలపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. ఒకవేళ బలపడి వాయుగుండంగా మారితే ఒడిశా వైపు కదులుతుందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కదిరిలో రికార్డు స్థాయి వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా కదిరిలో అత్యధికంగా 23 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పెనుకొండ, హిందూపురం పట్టణాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. లేపాక్షిలో 10.04 సెం.మీ., ఎన్పీ కుంటలో 9, అమడగూరులో 8.52 చిలమత్తూరులో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కదిరిలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి పెద్దఎత్తున వర్షం నీరు చేరింది. ఓడీ చెరువు సమీపంలో ప్రధాన రహదారి తెగిపోవడంతో కదిరి, హిందూపురం, బెంగళూరు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పుట్టపర్తి వద్ద చిత్రావతి, కుషావతి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 3 నుంచి 6 సె.మీ. వర్షం కురిసింది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ చాలాచోట్ల వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
ఏపీ: రెండు రోజులు వర్షాలే..
సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీ, హైదరాబాద్‌కు తూర్పు దిశలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది క్రమంగా తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతం మీదుగా అరేబియా సముద్రం వైపు కదులుతోంది. దీనివల్ల గాలుల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుంది. దీని ప్రభావంతో రాయలసీమలో విస్తారంగా, కోస్తాంధ్రలో అడపాదడపాగా వానలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో ఆవరణం వరకు విస్తరించి కొనసాగుతోంది. సముద్రంలో తూర్పు, పశ్చిమ గాలుల కలయికతో ఏర్పడిన షియర్ జోన్ సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కి.మీ. మధ్య విస్తరించి ఉంది. వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రానున్న రెండు రోజుల (గురు, శుక్రవారాలు) పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
ఆవర్తనం ప్రభావంతో. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని, దీనికి అనుబంధంగా దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం మధ్యస్త ట్రోపోస్ఫియరిక్ స్థాయి వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉందని, తూర్పు–పశ్చిమ షియర్ జోన్ వెంబడి సముద్ర మట్టం నుంచి 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని వెల్లడించింది. ఈ ప్రభావం వల్ల ఉత్తర, దక్షిణ కోస్తాలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో అత్యధికంగా 88.25 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
నేడు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. -
కోస్తాకు రేపు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా తీర ప్రాంతం మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు తేమను తీసుకువస్తోంది. దీనికితోడుగా ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 2.1 నుంచి 3.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది క్రమంగా ఛత్తీస్‌గఢ్ వైపు పయనించనుందని తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. సోమవారం శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ, రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని వివరించారు. ఈ నెల 13 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లోనూ అనకాపల్లిలో 6.7 సెం.మీ., మధురవాడలో 6.6, సూళ్లూరుపేటలో 6, కోటనందూరులో 5.7, పరవాడలో 5.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
ఉత్తర కోస్తాపై ఉపరితల ద్రోణి.. నేడు, రేపు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉత్తర కోస్తా తీరం వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. కర్నూలు జిల్లాలో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో ఆమదాలవలసలో 8 సెం.మీ., గూడూరులో 7.1, సి.బెలగొలలో 6.2, కె.నాగులాపురంలో 5.2, తంబళ్లపల్లెలో 4.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
విస్తరిస్తున్న ‘ఆవర్తనం’
సాక్షి, అమరావతి/ విశాఖపట్నం/ అవనిగడ్డ/ కర్నూలు: దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలపై ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ఆంధ్రప్రదేశ్ తీరానికీ విస్తరించింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో (సోమ, మంగళవారాలు) రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల పరిసరాల్లో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలో పశ్చిమ, వాయవ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవగా, అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కర్నూలు జిల్లాలో తుంగభద్ర పరీవాహక ప్రాంతాలైన మంత్రాలయం, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురవడంతో నదిలో వరద నీరు పోటెత్తింది. గోనెగండ్ల, గూడూరు, సీ.బెళగల్, వెల్దుర్తి తదితర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడటంతో హంద్రీ నదికి వరద చేరింది. మంత్రాలయం క్షేత్రం జలమయమైంది. నల్లవాగు, తుమ్మలవాగు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. తుమ్మలవాగులో లారీ చిక్కుకుపోగా అతి కష్టం మీద బయటకు తీశారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు జిల్లాలోని కోడుమూరులో అత్యధికంగా 120.4 మి.మీ., ఎమ్మిగనూరులో 116.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 54.8 మి.మీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 52.5, గూడూరులో 41.5, శ్రీకాకుళం జిల్లా కోవిలంలో 39.3, రేగిడి ఆముదాలవలసలో 35.3, పాలకొండలో 34.5, బొబ్బిలిలో 32, కర్నూలు జిల్లా మంత్రాలయంలో 31.5, కృష్ణా జిల్లా గుడివాడలో 30.8, విజయనగరం జిల్లా బొండేపల్లిలో 30.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 45 ప్రాంతాల్లో 15 నుంచి 30 మి.మీ. వర్షం పడగా, అనేకచోట్ల 5 నుంచి 16 మి.మీ. వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో మచిలీపట్నం జలమయమైంది. విజయవాడలో తేలికపాటి జల్లులు కురిశాయి. హంసలదీవి తీరంలో రాకాసి అలలు కృష్ణా జిల్లా హంసలదీవి సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. పాలకాయతిప్ప బీచ్ వద్ద సముద్ర అలలు 4 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. సముద్రపు నీరు సుమారు 200 మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చి డాల్ఫిన్ భవనం చుట్టూ చేరింది. తీరం పొడవునా పర్యాటకులు సేదతీరేందుకు ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లలు సముద్ర అలల ధాటికి కొట్టుకుపోయాయి. తీరానికి వెళ్లే రహదారి ముందు భాగాన్ని అలలు బలంగా తాకడంతో ధ్వంసమైంది. తారు, మట్టి కొట్టుకుపోయి కొండరాళ్లు బయటపడ్డాయి. బీచ్ నుంచి సాగర సంగమం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. సముద్ర స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని, పర్యాటకులెవదూ తీరానికి రావద్దని అధికారులు కోరారు. -
రెండు రోజుల్లో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: జార్ఖండ్ నుంచి దక్షిణ కోస్తాంధ్రా వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. ఇది దక్షిణ ఒడిశా వైపు 0.9 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర భారతదేశం, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడడం వల్ల గాలుల వేగం రాష్ట్రంపై పెరిగింది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా.. ఉత్తరకోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు పడే అవకాశాలున్నాయి. కాగా, జూలై మొదటి వారంలోనూ కోస్తా, రాయలసీమల్లో వర్షాలకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
రాష్ట్రంలో భారీ వర్షాలు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): నైరుతి రుతుపవనాల కదలికలు జోరుగా ఉండటంతో రాష్ట్రంలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని, వీటివల్ల కూడా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. -
వచ్చే రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర కోస్తా, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అనేక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల్లో కదలిక నెమ్మదిగా ఉంది. వారం, పది రోజల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించే పరిస్థితి ఉందని, వర్షాలకు ఢోకా లేదని అంచనా వేస్తున్నారు. -
తీరంలో ఈదురుగాలులు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో వచ్చే 48 గంటల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాల జోరు తగ్గిందని, పశ్చిమ గాలుల వల్ల వాయవ్య భారతదేశంలో మిగిలిన భాగాల్లో వీటి పురోగతి నెమ్మదిగా ఉందని తెలిపారు. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణ, ఢిల్లీల్లో రుతుపవనాల ప్రవేశానికి అంత అనుకూలంగా లేదని చెప్పారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో దిగువ స్థాయిలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా.. మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు నెమ్మదిగా ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. -
మరింత బలపడుతున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల మధ్య కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం శనివారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఒడిశా మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదలవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం తుపానుగా మారే అవకాశం లేదని చెప్పారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో 2 రోజులు పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు వర్షాలు పడతాయని తెలిపారు. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతో వాటి ప్రభావంతో కూడా వర్షాలు ఎక్కువగా కురిసే పరిస్థితి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 15వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని సూచించింది. -
వరుణుడి కరుణ
రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల కింద 105.79 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2019–20, 2020–21 నీటి సంవత్సరాల్లో వరద జలాలను ఒడిసి పట్టిన ప్రభుత్వం.. ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకుపైగా నీళ్లందించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాదీ వరద జలాలను గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి.. రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించడానికి చర్యలు చేపట్టింది. గోదావరి డెల్టాకు ఈ నెల 15 నుంచి నీళ్లందించడానికి జల వనరుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కృష్ణాలో వరద ప్రవాహం.. గోదావరిలో నీటి మట్టం 14 మీటర్లకు దాటగానే కృష్ణా డెల్టాకు నీళ్లందించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం పెరగగానే.. వంశధార, తోటపల్లి, మడ్డువలస తదితర ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మిగతా ప్రాజెక్టుల్లోకి చేరే వరద ప్రవాహం, నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీళ్లందించడంపై నీటి పారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశాల్లో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాల ప్రారంభంలోనే నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్)తో పాటు రాష్ట్రంలోనూ సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటం.. దుర్భిక్ష రాయలసీమలో అప్పుడే బాహుదా, హంద్రీ వంటి నదుల్లో వరద ప్రవాహం ప్రారంభం కావడాన్ని నీటి పారుదల రంగ నిపుణులు మంచి శకునాలుగా అభివర్ణిస్తున్నారు. గతేడాది ఇదే రోజుతో పోల్చితే ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు 88.26 టీఎంసీలు అధికంగా ఉన్నాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అంచనా వేసింది. ఆ అంచనాల మేరకు సమృద్ధిగా వర్షాలు కురిస్తే గతేడాది కంటే ముందుగానే ఈ ఏడాది ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంటుంది. గత రెండేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ ఖరీఫ్‌లో గరిష్ట స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల ఈ నెల 1 నుంచి ఆదివారం వరకు 16.21 మి.మీల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 29.90 మి.మీల వర్షం కురింది. నెల్లూరు మినహా మిగతా 12 జిల్లాల్లోనూ సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. దుర్భిక్ష రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనూ సాధారణం కంటే సగటున 170 శాతం అధిక వర్షపాతం కురవడం గమనార్హం. నైరుతి రుతు పవనాల ప్రారంభ దశలోనే రాష్ట్రంతోపాటు.. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులు నిండాలంటే 557.53 టీఎంసీలు అవసరం ► రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు అప్పుడే నదుల్లో వరద ప్రవాహం ప్రారంభమైంది. చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు బాహుదా నది ఉరకలెత్తడంతో ఎన్టీఆర్ జలాశయం నిండింది. దాంతో గేట్లు ఎత్తి దిగువకు వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పెన్నాలో వరద ప్రవాహం ప్రారంభమైంది. సోమశిల ప్రాజెక్టులోకి 6,600 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కర్నూలు జిల్లాలో హంద్రీ నది ద్వారా గాజులదిన్నె, శ్రీశైలం ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద ప్రవాహం చేరుతోంది. నాగావళి, వంశధారలోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది. ► కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, వెలిగోడు, గాజులదిన్నె, అవుకు తదితర ప్రాజెక్టుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 601.13 టీఎంసీలు. ప్రస్తుతం 230.78 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ నిండాలంటే 370.35 టీఎంసీలు అవసరం. కృష్ణా బేసిన్లో ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో గతేడాది కంటే ఈ ఏడాది అధికంగా నీటి నిల్వలు ఉన్నాయి. బేసిన్లో సమృద్ధిగా వర్షాలు కురిస్తే గతేడాది కంటే ఈ ఏడాది ముందుగానే కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం చేరే అవకాశం ఉంటుంది. గతేడాది తరహాలోనే వరద ఉధృతి కొనసాగితే బేసిన్లో ప్రాజెక్టులన్నీ త్వరగా నిండే అవకాశం ఉంటుంది. ► పెన్నా బేసిన్లో ఎన్నడూ లేని రీతిలో ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీరు నిల్వ ఉంది. బేసిన్లో మొత్తం ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 261.58 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 146.57 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ నిండాలంటే 115.01 టీఎంసీలు అవసరం. పెన్నాలో ఆదిలోనే వరద ప్రవాహం ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే ప్రాజెక్టులన్నీ నిండే అవకాశం ఉంటుందని నిపుణుల అంచనా. ► గోదావరిలోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది. రాష్ట్రంలో గోదావరి బేసిన్లో ప్రాజెక్టుల నీటి నిల్వ 12.56 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.09 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► వంశధార, నాగావళి, ఏలేరు తదితర నదుల్లో వరద ప్రవాహం ప్రారంభమైంది. ఈ బేసిన్లలో ప్రాజెక్టుల పూర్తి స్థాయి నీటి నిల్వ 107.08 టీఎంసీలు.. ప్రస్తుతం 42.39 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు నిండాలంటే 64.69 టీఎంసీలు అవసరం. వరుసగా మూడోసారి సకాలంలో నైరుతి రుతు పవనాలు మూడేళ్లుగా వాతావరణం అనుకూలంగా మారడంతో నైరుతి రుతుపవనాలు సకాలంలో విస్తరిస్తున్నాయి. రుతుపవనాలు ఇలా రావడం గత 23 ఏళ్లలో ఇదే ప్రథమం. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వాతావరణ పరిస్థితి.. లానినో ప్రభావంతో సముద్రంలో వేడి తగ్గడం రుతు పవనాల గమనానికి అనుకూలంగా మారింది. 2019 నుంచి లానినో ఉంది. ప్రస్తుతం లానినో వల్ల వాతావరణం చల్లబడి వర్షాలు బాగా కురుస్తున్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. మన రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏటా 566 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సివుంది. లానినో వల్ల గత ఏడాది సాధారణం కంటే ఎక్కువగా 720 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రుతు పవనాలంటే.. భూమధ్య రేఖ నుంచి ప్రయాణించే గాలులు ఎత్తుగా ఉన్న హిమాలయాలు అడ్డు రావడంతో అక్కడ ఆగిపోతాయి. వాటినే నైరుతి రుతు పవనాలుగా పిలుస్తారు. ఆ గాలుల్లో తడి శాతం ఎక్కువగా ఉండడం వల్ల మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. అక్కడ ఆగిపోయిన ఆ గాలులు మళ్లీ భూమధ్య రేఖ వైపు వెనక్కి వస్తాయి. వీటిని ఈశాన్య రుతు పవనాలుగా పిలుస్తారు. ఈ గాలుల్లో తడి శాతం తక్కువగా ఉండడం వల్ల పెద్దగా వర్షాలు పడవు. ఎలినినో, లానినో అంటే.. పసిఫిక్ మహాసముద్రంలో సాధారణం గాలులు భూమధ్య రేఖ వెంబడి పడమటి వైపు వీస్తూ దక్షిణ అమెరికా నుండి ఆసియా వైపు వేడి నీటిని పీల్చుకుంటాయి. ఆ నీటిని భర్తీ చేయడానికి, చల్లటి నీరు సముద్రం లోతుల నుండి పైకి వస్తుంది. అక్కడ వీచే గాలులను అడ్డుకునే వాతావరణ పరిస్థితులను ఎలినినో, లానినో అంటారు. వీటి ప్రభావం అన్ని సముద్రాలపైనా పడి వాతావరణ, పర్యావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఎలినినో మన దేశంలో సాధారణ వాతావరణ పరిస్థితులను అడ్డుకుంటుంది. ఇది ఉంటే వర్షాలు పడవు. కరువు పరిస్థితులు ఏర్పడతాయి. లానినో ద్వారా అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. సాధారణంగా ఇవి 9 నుండి 12 నెలల వరకు, కొన్నిసార్లు సంవత్సరాలపాటు ఉంటాయి. రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలు అంతటా విస్తరించాయి. రాయలసీమ.. తెలంగాణ, మహారాష్ట్రల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించాయి. సోమవారం సాయంత్రం నాటికి దక్షిణాంధ్ర జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే సూచనలున్నాయని, రాగల రెండు రోజుల పాటు కోస్తా, సీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో నంబులపూలకుంటలో 11 సెం.మీ, చినమండెంలో 9, ఊటుకూరులో 8, సంబెపల్లె, అనంతపురంలో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
Southwest Monsoon: 'నైరుతి' పలకరింపు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించాయి. రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు శుక్రవారం తాకాయి. గురువారం కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు శుక్రవారం దక్షిణ అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతం, లక్షద్వీప్, కేరళ మొత్తం వ్యాపించాయి. ఏపీతో పాటు, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోను ఇవి వ్యాపించినట్లు అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. ఈ నెల 7, 8 తేదీల్లో కోస్తాలోని కృష్ణాజిల్లా వరకు, అనంతరం నెమ్మదిగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు, 11వ తేదీన ఉత్తరాంధ్ర అంతటా రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యంలో మూడురోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కర్ణాటక నుంచి భారీ మేఘాలు రాయలసీమ వైపుగా విస్తరిస్తుండటంతో శనివారం అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీవర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. మరోవైపు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడి అనేకచోట్ల వర్షాలు పడ్డాయి. రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలోని ఎక్కువచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాలో 55 మండలాలకుగాను 47 మండలాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షం కురిసింది. అనంతపురంలో 12 సెంటీమీటర్లు, నంబులిపులికుంటలో 10, రాప్తాడులో 9, రాయచోటి, సింగనమలల్లో 8, లక్కిరెడ్డిపల్లె, సెత్తూరు, అమరపురాల్లో 7, ధర్మవరంలో 6, కంబదూరు, మదనపల్లె, ఓక్‌లలో 5, నెల్లిమర్ల, అరకు, కైకలూరు, బ్రహ్మసముద్రం, ఊటుకూరు, గుర్రంకొండ, కూనుర్పి, తాడిమర్రి, కనెకల్లు, తాడిపత్రి, సంబపల్లె, కల్యాణదుర్గంలలో 4 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిశాయి. . పిడుగులుపడి ఇద్దరి మృతి గుడుపల్లె/మదనపల్లె టౌన్: చిత్తూరు జిల్లాలోని గుడుపల్లె, మదనపల్లె మండలాల్లో శుక్రవారం పిడుగులు పడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. గుడుపల్లె మండలం తిమ్మనాయనపల్లెలో పిడుగుపాటుకు మునెప్ప (50) ప్రాణాలు కోల్పోయాడు. మదనపల్లె మండలం ఈశ్వరమ్మకాలనీకి చెందిన వారు మైదానంలో క్రికెట్ ఆడుకుంటుండగా పిడుగుపడింది. ఆడుకుంటున్న 8 మంది గాయపడ్డారు. వీరిలో ఆటోనడుపుకొంటూ జీవనం సాగించే ఎస్.రోషన్ (25) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన ఆరీఫ్ (25)ను తిరుపతి ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. -
మూడు రోజుల పాటు వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఆగ్నేయ అరేబియాలో నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి. రుతుపవనాలు గురువారం కేరళను తాకనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది. కాగా, నైరుతి రుతుపవనాల రాక వల్ల అకాల వర్షాలు వస్తాయని, ఆ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రా, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బుధవారం రాష్టంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా నూజివీడులో 122 మిల్లీమీటర్లు, అగిరిపల్లిలో 109, తోటపల్లిలో 99, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 98.5, పలాసలో 50, కంచిలిలో 48, మెళియాపుట్టి, రాజాంలలో 47, ఇచ్ఛాపురంలో 46.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా బొండపల్లి, నెల్లిమర్లలో 44.25 మిల్లీమీటర్లు, సీతానగరంలో 41.5, విశాఖ జిల్లా కె.కోటపాడులో 34.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. ముంచంగిపుట్టు మండలంలోని బిరిగూడ, ముత్తగుమ్మి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. 23 పశువులు, 6 మేకలు మృత్యువాత పడగా.. ఓ పశువుల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. -
Southwest Monsoon: సకాలంలోనే రాష్ట్రానికి నైరుతి
సాక్షి, విశాఖపట్నం: ముందుగా అనుకున్నట్లుగానే రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకనున్నాయి. జూన్ 5 లేదా 6వ తేదీ నాటికి రాయలసీమని నైరుతి తాకనుంది. ఆ సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు విస్తరించి, దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు రానున్నాయి. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు విస్తరిస్తాయి. అలాగే, జూన్ 11 లేదా 12 నాటికి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు విస్తరించనున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత పదేళ్ల రికార్డులను బట్టి చూసినా కూడా ఇదే తరహాలో నైరుతి విస్తరణ జరుగుతూ వస్తోందని వారు వివరిస్తున్నారు. గత రెండేళ్లు మాదిరిగానే.. ఈసారీ రుతుపవనాల కాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని, పంటలకు అనుకూలంగా వర్షాలు కురిసి అన్నదాతలకు మేలు చేకూరుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐఎండీ భిన్న ప్రకటనల్లో వాస్తవమెంత? తొలుత మే 31న నైరుతి కేరళని తాకనున్నట్లు కొద్ది రోజుల క్రితం భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటన చేసింది. ఆ తర్వాత ఆ ప్రకటనను మార్చి రుతుపవనాలు కాస్త ఆలస్యమవుతున్నాయని, జూన్ 3న కేరళని తాకనున్నాయని ఐఎండీ తాజాగా మరో ప్రకటన చేసింది. వాస్తవానికి మే 27 నాటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే అప్పటికే రుతుపవనాలు బలహీనంగా మారటంతో విస్తరణలో జాప్యం జరుగుతోందని, మరో రెండ్రోజుల్లో తిరిగి బలపడి విస్తరణలో వేగం పుంజుకుంటాయని స్పష్టం చేస్తున్నారు. రెండు రోజులపాటు వర్షాలు సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా దడ పుట్టించిన ఎండల తీవ్రత సోమవారం తగ్గింది. అక్కడక్కడా కొన్నిచోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి.మరోవైపు రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. అల్పపీడనాలు లేకపోవడం వల్ల.. నైరుతి రుతుపవనాలు సకాలంలోనే రాష్ట్రంలోకి రానున్నాయి. రుతుపవనాలు వచ్చిన తర్వాత తొలకరి వర్షాలు మెల్లమెల్లగా అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఇప్పటికే కేరళని తాకిన రుతుపవనాలు బలహీనంగా ఉండటం వల్ల వర్షాలు కేరళకు మాత్రమే పరిమితమైపోయాయి. అయినా త్వరలోనే వేగం పుంచుకుంటాయి. జూన్ నెలలో తొలి రెండు వారాల వరకు బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనాలు ఏర్పడే అవకాశం లేనందున రుతుపవనాలు విస్తరించనున్నాయి. – సాయి ప్రణీత్, వాతావరణ నిపుణుడు -
నెలాఖరు నుంచి వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి అమరావతి: మండుతున్న ఎండలు, వడగాడ్పులతో గత మూడు రోజులుగా తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. అరేబియా సముద్రం నుంచి గాలులు నేరుగా వీస్తుండటంతో ఈ నెలాఖరు నుంచి వర్షాలు పడతాయని వెల్లడించారు. శనివారమూ ఎండలు, వడగాడ్పులు ఉంటాయని, ఆదివారం నుంచి వాతావరణం చల్లబడుతుందని, పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి మేఘాలు ఉత్తరాంధ్ర వైపు రావడంతో జూన్ మొదటి వారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుతుపవనాలు జూన్ 5 నాటికి రాష్ట్రాన్ని తాకుతాయని వివరించారు. మూడో రోజూ భానుడు భగభగ రాష్ట్రంలో వరుసగా మూడో రోజూ శుక్రవారం కూడా భానుడు భగ్గుమన్నాడు. వడగాడ్పులు విజృంభించాయి. అనేక ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎండలు మంటలు పుట్టించాయి. శనివారం కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
Hottest Summer: ‘రికార్డు’ భగభగలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: గాలులు, వర్షాలతో తూర్పు తీరాన్ని వణికించిన యాస్ తుపాను.. మన రాష్ట్రంలో వ్యతిరేక ప్రభావం చూపింది. ఎండ భగభగలాడేలా చేసింది. తుపాను తేమగాలుల్ని తీసుకుపోవడంతో రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతం నుంచి పొడిగాలులు నేరుగా మన రాష్ట్రం వైపు వస్తున్నాయి. ఫలితంగా బుధవారం భానుడు ప్రతాపం చూపించాడు. కోస్తా, రాయలసీమల్లోని చాలా ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా అల్లూరులో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నంలో మే నెలలో 43 ఏళ్ల తర్వాత.. 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1978 మే 19న విశాఖ నగరంలో నమోదైన 42 డిగ్రీలు మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతగా ఉంది. బుధవారం నగరంలో 42.3 డిగ్రీలు నమోదైంది. ఈనెల 30 వరకు వడగాలులు, ఎండలు ఈనెల 30 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలతో పాటు వడగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని 36 మండలాలు, కృష్ణాలోని 15, తూర్పు గోదావరిలోని 12, విజయనగరంలోని 2, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున 68 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో 28, పశ్చిమ గోదావరిలో 18, విజయనగరంలో 14, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున మొత్తం 65 మండలాల్లో వడగాలులు వీస్తాయని చెప్పారు. కోస్తాలోని పలు ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈనెల మే 30 తర్వాత తేమగాలులు తెలంగాణ మీదుగా రాష్ట్రం వైపు రావడంతో ఎండల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుందని, వర్షాలు మొదలవుతాయని తెలిపారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గురువారం సాయంత్రానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతం మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. జూన్ 5వ తేదీ నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. వచ్చే 4 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కన్నబాబు ఒక ప్రకటనలో కోరారు. -
నేడు తీరం దాటనున్న 'యాస్'
సాక్షి, విశాఖపట్నం/పూసపాటిరేగ (విజయ నగరం)/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న యాస్ తుపాను మరింత బలపడింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ అతి తీవ్ర తుపానుగా మారింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 200 కిలోమీటర్లు, బాలాసోర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 290, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది బుధవారం మధ్యాహ్నం ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల్లోని పారాదీప్, సాగర్ ఐలాండ్స్ మధ్య బాలాసోర్‌కు దక్షిణ దిశలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం దాటిన తర్వాత 12 గంటల పాటు అతి తీవ్ర తుపానుగానే కొనసాగుతూ 27వ తేదీ ఉదయానికి క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. రాష్ట్రంలో యాస్ తుపాను ప్రభావంపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస తీరంలో సముద్రం 10 మీటర్ల ముందుకు వచ్చింది. సముద్రంలో బలంగా గాలులు వీయడం వల్లే సముద్రం ముందుకు వచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. తీరానికి అనుకుని ఉన్న ఈ గ్రామస్తులు అధికారుల హెచ్చరికలతో సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వానలు ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రెండురోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి వానలు పడతాయని చెప్పారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో బుధవారం గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టులో సెక్షన్ సిగ్నల్ నంబర్–1, 2, 3తో పాటు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేయగా, కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు అప్రమత్తత సమాచారం అందించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కెరటాల ఉద్ధృతి పెరుగుతుందని తెలిపారు. రెండురోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పలు జిల్లాల్లో వర్షాలు గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విశాఖపట్నం జిల్లా అంతటా ఆకాశం మేఘావృతమైంది. తుఫాన్ కారణంగా రాజస్థాన్ నుంచి పొడిగాలులు రాష్ట్రం వైపుగా వీస్తుండటంతో ఎండలు కూడా పెరుగుతున్నాయి. మాచర్ల, చీమకుర్తి, దొనకొండలో అత్యధికంగా 42 డిగ్రీలు, అవుకు, ఒంగోలు, కలిగిరిల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మాల్దీవులు, కొమరిన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. 48 గంటల్లో మాల్దీవులతోపాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. అప్రమత్తమైన ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్... ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో యాస్ తుపాను ప్రభావం తీవ్రంగాను, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రపై స్వల్పంగా ఉండటంతో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే వంతెనలు, నదుల సమీపంలోని రైల్వే ట్రాక్స్, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. వరద ఉధృతికి కాలువలు పొంగి ట్రాక్‌లు దెబ్బతినకుండా ముందస్తు చర్యలుగా పూడికతీత పనులు ప్రారంభించారు. వాల్తేరు డివిజన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 24 గంటలూ తుపాను పరిస్థితిని పసిగట్టేందుకు విశాఖ డివిజన్‌తో పాటు భువనేశ్వర్‌లోని హెడ్‌క్వార్టర్స్, ఖుర్దారోడ్, సంబల్పూర్లలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్స్ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. తుపాను కారణంగా మరో మూడు ప్రత్యేక రైళ్లను రద్దుచేస్తున్నట్లు రైల్వేశాఖ మంగళవారం ప్రకటించింది. ఈ నెల 28న యశ్వంత్‌పూర్–గౌహతి (06577), చెన్నైసెంట్రల్–భువనేశ్వర్ (02840), 30న పూరి–చెన్నైసెంట్రల్ (02859) రైళ్లను రద్దుచేసింది. -
తూర్పు తీరంలో 'యాస్' అలజడి
సాక్షి, విశాఖపట్నం, సాక్షి, అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపాన్ వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది పోర్టు బ్లెయిర్‌కు ఉత్తర వాయువ్య దిశగా 710 కి.మీ, పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 450 కి.మీ, బాలాసోర్‌కి ఆగ్నేయ దిశగా 550 కి.మీ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణ ఆగ్నేయ దిశగా 540 కిలోమీటర్ల మధ్య కేంద్రీకృతమైంది. గత ఆరు గంటలుగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా ప్రయాణిస్తోంది. ఇది మంగళవారం ఉదయం నాటికి తీవ్ర తుపాన్‌గా, 24 గంటల్లో అతి తీవ్ర తుపాన్‌గా బలపడనుందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో వాయువ్య బంగాళాఖాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అనంతరం పారాదీప్, సాగర్ ఐలాండ్స్ మధ్య చాలా తీవ్రమైన తుపాన్‌గా మారి బుధవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అతి తీవ్ర తుపాన్‌గా మారినప్పుడు గంటకు 135 నుంచి 160 కి.మీ. వేగంతో, తీరం దాటే సమయంలో గంటకు 155 నుంచి 165 కి.మీ, గరిష్టంగా 185 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. తుపాన్ ప్రభావంతో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం అలజడిగా ఉంటుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు ఒక ప్రకటనలో సూచించారు. తుపాన్ ప్రభావం ఎక్కువగా ఒడిశా, పశ్చిమ బెంగాల్.. సిక్కిం రాష్ట్రాలపై, స్వల్పంగా జార్ఖండ్, బిహార్, అసోం, మేఘాలయ రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. – ఆంధ్రప్రదేశ్‌లో దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై మాత్రమే కొంత వరకు ఉంటుందని వెల్లడించారు. – శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నేడు, రేపు మేఘావృత వాతావరణం ఉంటుందని, అక్కడక్కడా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. – ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నేడు, రేపు ఉత్తర కోస్తా తీరంలో గంటకు 80 నుంచి 90 కి.మీ, గరిష్టంగా 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. తీరం దాటే సమయంలో ఉత్తరకోస్తా తీరంలో గంటకు 140–160, గరిష్టంగా 185 కి.మీ వేగంతో కోస్తా తీరం వెంట గాలులు వీస్తాయి. దక్షిణ కోస్తా తీరంలో గంటకు 80 నుంచి 90 కి.మీ, గరిష్టంగా 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. – తీరం వెంట బలమైన గాలుల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. అలలు 2 నుంచి 4 మీటర్ల ఎత్తుకు ఎగసిపడతాయి. – మత్స్యకారులు ఈ నెల 27వతేదీ వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. – విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరిక జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. – వచ్చే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. – తుపాన్ తీరం దాటిన తర్వాత రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుందని, వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. – గడిచిన 24 గంటల్లో జూపాడు బంగ్లాలో 4 సెంమీ, దర్శి, మర్రిపూడి, చీమకుర్తి, పగిడ్యాల, గుత్తి 3 సెంమీ, ముండ్లమూరు, యర్రగొండ్లపాలెం, వెలిగండ్ల, పొదిలి, ఆత్మకూరు, నందికొట్కూరు, ఓర్వకల్లు, ఊటుకూరులో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. సీఎంలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ తుపాను పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిషా ముఖ్యమంత్రులతోపాటు అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ తుపాను కదలికలను పరిశీలిస్తే రాష్ట్రంపై ప్రభావం స్వల్పంగానే ఉండే అవకాశాలున్నప్పటికీ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ముందుకు సాగుతామని చెప్పారు. మే 22న కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి నిర్వహించిన సమావేశానికి అన్ని విభాగాల అధికారులు హాజరయ్యారని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధంగా ఉందని తెలిపారు. -
రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు
-
అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి శుక్రవారమే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈరోజు (శనివారం) అల్పపీడనం కొనసాగుతుంది, మరియు దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని, రాగల 6 గంటలలో ఇది వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి బలపడి రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అనంతరం ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈనెల 26వ తేదీ ఉదయానికి ఒడిస్సా-పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలోని ఉత్తర బంగాళాఖాతము ప్రాంతమునకు చేరుకుంటుందని వెల్లడించింది. అదే రోజు సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఒడిస్సా, బంగ్లాదేశ్ తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పరిమితంగా ఉండనుంది. ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ: ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. - సంచాలకులు, అమరావతి వాతావరణ కేంద్రము -
బలపడిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/అమరావతి బ్యూరో: తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శనివారం సాయంత్రానికి మరింత బలపడింది. ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా.. 24వ తేదీన యాస్ తుపానుగా రూపాంతరం చెందనుంది. ఆ తర్వాత 24 గంటల్లో మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలకు ఈ నెల 26న చేరే సూచనలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అదేరోజు సాయంత్రం ఒడిశా, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని తాకే వీలుందన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఆదివారం గంటకు 40 నుంచి 50 కి.మీ., గరిష్టంగా 60 కి.మీ. వేగంతోనూ, 24న 50 నుంచి 60 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో గంటకు 60 నుంచి 70 కి.మీ., గరిష్టంగా 80 కి.మీ. వేగంతో గాలులు వీస్తామని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు. 5 రోజులపాటు మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్న ప్రాంతం అప్రమత్తమైన నౌకాదళం, కోస్ట్‌గార్డ్ తుపాను నేపథ్యంలో భారత నౌకాదళం, తీరగస్తీ దళం(కోస్ట్‌గార్డ్) సహాయక చర్యలకు సిద్ధమయ్యాయి. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 8 ఫ్లడ్ రిలీఫ్ బృందాలతోపాటు నాలుగు డైవింగ్ బృందాలను ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు తూర్పు నౌకాదళం పంపించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు 4 నేవీ షిప్‌లు విశాఖ నుంచి బయలుదేరాయి. విశాఖలోని ఐఎన్ఎస్ డేగా, చెన్నైలోని ఐఎన్ఎస్ రజాలి నేవల్ ఎయిర్ స్టేషన్లలో నేవల్ హెలికాప్టర్లు, మెడికల్ టీమ్‌లు బయలుదేరాయి. ఇండియన్ కోస్ట్ గార్డు కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమైంది. తమిళనాడు, ఒడిశా, ఏపీ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో సముద్ర జలాల్లో వేటకు వెళ్లిన మత్స్యకారుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు కోస్ట్ గార్డ్íÙప్స్, సేఫ్టీ బోట్స్‌ను పంపించేందుకు సిద్ధంగా ఉంచినట్టు విశాఖ కోస్ట్‌గార్డ్ ప్రధాన కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు.. నలుగుర్ని బలిగొన్న పిడుగులు సాక్షి నెట్వర్క్: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో సగటున 22.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. జిల్లాలోని చేబ్రోలులో అత్యధికంగా 81.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతం నుంచి కంభం చెరువుకు వరద నీరు వచ్చి చేరుతోంది. గుండ్లకమ్మ, లోతువాగు, జంపలేరు, పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కర్నూలు జిల్లా వెలుగోడులో 60.2 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. జిల్లా అంతటా సగటున 14.2 మిలీమీటర్ల వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. శనివారం వెలిగండ్ల, విజయవాడలో 9 సెం.మీ.,గజపతినగరం, ప్రొద్దుటూరు, ముద్దనూరు, దువ్వూరులో 7, వల్లూరు, రాయదుర్గం, కమలాపురం, కంబదూరులో 6 సెం.మీ., పోలవరం, చింతలపూడి, భీమవరం, బద్వేల్, హిందూపురం, పెనుకొండ, ఆత్మకూరు, చిత్తూరు, కడప, బ్రహ్మసముద్రంలో 5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా, విజయనగరం జిల్లాలో శనివారం వేర్వేరుచోట్ల పిడుగులు పడి నలుగురు మృత్యువాత పడ్డారు. బొబ్బిలి మండలం చింతాడలో సంకిలి తౌడు(45), గుంట చిన్నారావు (35), ఆజారి చిన్నారావు(35) పిడుగుపడి మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. నెల్లిమర్ల మండలం సతివాడలో గొర్రెల కాపరి గొంప సూరిబాబు(28) మృతిచెందాడు. -
Cyclone Yaas: 24న ‘యాస్’ తుపాను!
సాక్షి, అమరావతి బ్యూరో/విశాఖపట్నం: పశ్చిమ తీరాన్ని వణికించిన టౌటే అత్యంత తీవ్ర తుపాను బలహీనపడిన కొద్దిరోజులకే బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడబోతోంది. ఉత్తర అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. అది వాయవ్యదిశగా కదులుతూ వాయుగుండంగాను, ఆపై తీవ్ర వాయుగుండంగాను బలపడి ఈనెల 24న తుపానుగా మారనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ మరింతగా తీవ్రరూపం దాల్చి ఈ నెల 26 ఉదయానికి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ల మధ్య తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. దీని ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై అధికంగాను ఉంటుందని అంచనా వేసింది. రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తుపాను ఏర్పడనున్న నేపథ్యంలో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. యాస్ తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాస్ అంటే.. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపానుకు ఒమన్ దేశం సూచించిన ‘యాస్’ అని నామకరణం చేయనున్నారు. తుపాను ఏర్పడ్డాక ఈ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. యాస్ అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చింది. ఆంగ్లంలో జాస్మిన్ (మల్లెపూవు) అని అర్థం. తుపాన్లు ఏర్పడినప్పుడు వాటికి పేర్లు పెట్టడం రివాజుగా వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు రానున్న తుపాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలను కురిపించనుంది. అయితే మన రాష్ట్రంలో ఎండలు ఉధృతం కావడానికి దోహదపడనుంది. మధ్య బంగాళాఖాతంలో ఈ తుపాను ఏర్పడనున్న నేపథ్యంలో గాలివాటం మారనుంది. కొన్నాళ్లుగా నైరుతి, దక్షిణ గాలులు వీస్తుండడంతో రాష్ట్రంలో ఉష్ణ తీవ్రత అంతగా కనిపించడం లేదు. ఈ తుపాను ఏర్పడటానికి ముందు నుంచి రాష్ట్రంపైకి ఉత్తర గాలులు వీయనున్నాయి. ఫలితంగా అటునుంచి వచ్చే గాలులు వేడిగా ఉండడం వల్ల రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజులు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఊటుకూరులో 13 సెంటీమీటర్లు, అమడగూరులో 10, ఉంగుటూరులో 9.6, కడపలో 9, ఆగిరిపల్లిలో 8.5, కంభంలో 8, అద్దంకిలో 7.5, మొవ్వలో 7.3, బెస్తవానిపేట, పెనగలూరుల్లో 7, పొదిలి, ఉరవకొండల్లో 6, సత్తెనపల్లి, కోయిలకుంట్ల, వల్లూరుల్లో 5, జమ్మలమడుగు, వెంకటగిరికోట, దొర్నిపాడు, ప్రొద్దుటూరు, పామిడి, కమలాపురం, జూపాడుబంగ్లాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అండమాన్‌లోకి ‘నైరుతి’ మరోవైపు నైరుతి రుతుపవనాల తొలి అడుగు అండమాన్ సముద్రంలోకి ప్రవేశంతోనే పడుతుంది. శుక్రవారం ఈ రుతుపవనాలు దక్షిణ, ఉత్తర అండమాన్ సముద్రం, నికోబార్ దీవులతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రెండు రోజుల్లో నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించనున్న ఈ రుతుపవనాలు మన రాష్ట్రంలోకి జూన్ 5వ తేదీనాటికి ప్రవేశించే అవకాశం ఉంది. -
Southwest Monsoon: రేపు ‘నైరుతి’
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి శుక్రవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. 22వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని పేర్కొంది. ఇది క్రమంగా బలపడి వాయవ్యదిశగా కదులుతూ తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపానుగా మారితే దీనికి యాస్ పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఇది మే 26 నాటికి పశ్చిమ బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా రుతుపవనాల రాకకు సంకేతంగా తూర్పు, పశ్చిమ తీరాల్లో తుపాన్లు ఏర్పడుతుంటాయని చెబుతున్నారు. ఈ తుపాను ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండబోదని, కేవలం కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాగల రెండు రోజులు కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో మాత్రం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు. -
తూర్పు మధ్య బంగాళాఖాతంలో 23న అల్పపీడనం
సాక్షి, అమరావతి బ్యూరో/విశాఖపట్నం: పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసిన ‘టౌటే’ తుపాను బలహీనపడిన తరుణంలో తూర్పు తీరాన్ని వణికించడానికి మరో తుపాను సిద్ధమవుతోంది. ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం రాబోయే తుపాను సముద్రంలోనే బలపడుతుంది. ఆపై దిశ మార్చుకుని ఉత్తర కోస్తా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం వైపు పయనిస్తుంది. పశ్చిమబెంగాల్ లేదా బర్మాలో తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్ల సమీపానికి వచ్చేసరికి దిశ మార్చుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా ఈ నెల 25, 26 తేదీల తర్వాత మన రాష్ట్రంలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈనెల 23న అల్పపీడనం ఏర్పడినా, బలపడి తుపానుగా మారినా నైరుతి రుతువపనాల ఆగమనానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని వాతావరణశాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. 21న అండమాన్ సముద్రంలోకి ‘నైరుతి’.. మరోవైపు ఈనెల 21న నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలోకి ప్రవేశించే వీలుందని ఐఎండీ మంగళవారం వెల్లడించింది. రుతుపవనాలు కేరళను తాకడానికి ముందు అండమాన్ సముద్రంలోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే అంటే.. ఈనెల 31న కేరళను తాకుతాయని ఐఎండీ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. పెరిగిన ఉష్ణోగ్రతలు కాగా, మంగళవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీనికితోడు ఉక్కబోత వాతావరణం నెలకొంది. రానున్న 3 రోజులు వాతావరణం మరింత వేడిగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయన్నారు. ఇదిలావుంటే.. వచ్చే 2 రోజుల్లో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఒకటి రెండుచోట్ల మోస్తరు వానలు కురుస్తాయని తెలిపారు. -
సకాలంలోనే రుతుపవనాలు
సాక్షి, అమరావతి: నైరుతీ రుతుపవనాలు ఈసారి కూడా సకాలంలోనే రాష్ట్రంలో ప్రవేశిస్తాయని భారతీయ వాతావరణశాఖ అంచనా వేసింది. వ్యవసాయ రంగానికి ఎంతో కీలకమైన ఖరీఫ్ సీజన్ (జూన్ నుంచి సెపె్టంబర్ వరకు)లో కురిసే వర్షాలు నైరుతీ రుతుపవనాల ప్రభావంతో పడేవే. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈనెల 31న రుతుపవనాలు కేరళను తాకుతాయి. జూన్ 1కి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు తొలుత కేరళలో ప్రవేశిస్తుంటాయి. ఆరేబియా మహా సముద్రంలో ప్రస్తుతం ఏర్పడిన టౌటే తుపాను రుతుపవనాల రాకను వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. తుపాను ప్రభావంతో ఈనెల 21 నాటికే అండమాన్ నికోబార్ దీవుల నుంచి రుతుపవనాల కదలికలు ప్రారంభం కావచ్చని అంచనా. రుతుపవనాలకు ఒక నెల ముందు అరేబియా మహాసముద్రం లేదా బంగాళాఖాతంలో అల్పపీడనాలో, తుపాన్లో ఏర్పడుతుంటాయి. వీటివల్ల రుతుపవనాల్లో కదలిక వస్తుంది. అయితే ఈసారి అరేబియా మహాసముద్రంలో తుపాను వల్ల ఇప్పటికే కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, కర్ణాటక, గోవాలలో భారీవర్షాలు కురుస్తున్నాయి. మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఓమోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా రాష్ట్రాల్లో మరో నాలుగైదు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, ఆ సమయానికి కాస్త అటు ఇటుగా రుతుపవనాలు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ప్రకటించింది. గత ఏడాది జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ ప్రకటిస్తే జూన్ 5న ప్రవేశించాయి. ఈసారి మాత్రం జూన్ ఒకటికి ఒకరోజు ముందే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. మే నెలలో అండమాన్‌లో వర్షాలు పడ్డాయంటే రుతుపవనాలు రాకడ ప్రారంభమైనట్టుగా భావిస్తుంటారు. రాష్ట్రంలో రెండురోజులు తేలికపాటి వానలు సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి గుజరాత్ వైపు తేమ గాలులు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో వచ్చే రెండురోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చెదురుమదురు వానలు పడే సూచనలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ప్రత్తిపాడులో 3 సెంటీమీటర్లు వంతున వర్షపాతం నమోదైంది. -
Rain Forecast: ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ద్రోణి విస్తరించడం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర–దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి ఉంది. 0.9 కిలోమీటర్లు ఎత్తు వద్ద ఇప్పటికే ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వద్ద బిహార్ తూర్పు ప్రాంతాల నుంచి ఉత్తర ప్రాంత ఒడిశా వరకు వ్యాపించి ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడింది. దీంతో రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా ఆంధ్రా, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. చదవండి: అమరావతి జేఏసీ వెబినార్ అట్టర్ ఫ్లాప్ తిరుపతి ఉప ఎన్నికపై పిటిషన్ల కొట్టివేత -
Rain Forecast: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో రానున్న మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మిగిలిన ప్రాంతాల్లో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపే ఉత్తర–దక్షిణ ద్రోణి బలహీనపడిందని పేర్కొంది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఈ ద్రోణి విస్తరించి ఉందని వివరించింది. మరోవైపు 1.5 కిలో మీటర్ల ఎత్తులో తూర్పు బిహార్ ప్రాంతం నుంచి దక్షిణ తీరప్రాంతమైన ఒడిశా వరకు మరో ద్రోణి వ్యాపించినట్టు తెలిపింది. చదవండి: జాగ్రత్తలతోనే మనుగడ: సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: తిరుపతిలో వైఎస్సార్ సీపీదే హవా -
రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా వ్యాపిస్తోంది. ఇది మరట్వాడా, ఉత్తర కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం వరకు వ్యాపించి ఉందని, దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖలోని వాతావరణ శాఖ అధికారులు శనివారం తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలతోపాటు రాయలసీమలోని పలు చోట్ల వర్షాలు కురిసే వీలుందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని పాములపాడు, కొత్తపల్లి, జూపాడుబంగ్లా, ఓర్వకల్లు, మిడుతూరు మండలాల్లో శనివారం అకాల వర్షాలు పడ్డాయి. నందికొట్కూరు మండలం నాగటూరులో పిడుగుపాటుతో ఓ మహిళ మృతిచెందింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజవొమ్మంగి మండలంలోని తంటికొండ గ్రామ సమీపాన ఈదురుగాలులతో కురిసిన వర్షానికి భారీ వృక్షం కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. -
రెండురోజులు కోస్తాంధ్రలో వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/కర్నూలు (అగ్రికల్చర్): నైరుతి మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి వ్యాప్తి చెందుతోంది. ఉత్తర దక్షిణ తమిళనాడులో ఏర్పడిన ఆవర్తనం ఇప్పడు ద్రోణిగా మారి విస్తరిస్తోంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల వరకు ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. రాయలసీమలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కర్నూలు జిల్లాలో మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. పెనుగాలులు వీచాయి. పిడుగులు పడ్డాయి. సంజామల మండలం మిక్కినేనిపల్లిలో పిడుగుపడి షేక్ రజియా అలియాస్ రేష్మ (18) మృతిచెందింది. పెనుగాలులకు ఓర్వకల్లు, వెల్దుర్తి, బేతంచర్ల తదితర మండలాల్లో మామిడికాయలు రాలిపోయాయి. -
రాయలసీమకు కాస్త తక్కువ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, న్యూఢిల్లీ: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. వరుసగా మూడో ఏడాదీ సాధారణ వర్షపాతం నమోదయ్యేలా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వెల్లడించింది. సాధారణ వర్షపాతం నమోదైతే దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడవు. ఏటా రుతుపవనాల సీజనుకు ముందు ఏప్రిల్, మే నెలల్లో ఐఎండీ నైరుతి రుతుపవనాల తీరుతెన్నుల (దీర్ఘకాలిక వ్యవధి సగటు–ఎల్పీఏ) అంచనాలను రూపొందిస్తుంది. ఈ అంచనాల తొలి నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజనులో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల పాటు ప్రభావం చూపుతాయి. ఐఎండీ 1961–2010 మధ్య కాలానికి దేశవ్యాప్తంగా ఎల్పీఏ సగటు 88 సెంటీమీటర్ల వర్షపాతంగా తేల్చింది. ఎల్పీఏ సగటు 96 నుంచి 104 శాతం (అంటే ఐదు శాతం ఎక్కువ లేదా తక్కువ) అంచనా వేస్తే.. ఆ ఏడాది సాధారణ వర్షపాతమని లెక్క. వచ్చే నైరుతిలో 98 శాతం వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. ప్రస్తుత నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో కోస్తా కంటే రాయలసీమలో వర్షాలు తక్కువగా కురిసే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు వర్ష సూచనలు తక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఐఎండీ మే నెలలో రెండోవిడత నివేదిక విడుదల చేస్తే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండటంతో ఎప్పుడూ మే 31 లేదా జూన్ మొదటి వారంలో కేరళని తాకే నైరుతి రుతుపవనాలు ఈసారి 5 నుంచి 7 రోజుల ముందే వచ్చే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలోను సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భూశాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రాజీవన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మోహపాత్రా శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కోస్తాంధ్రలో సాధారణం కంటే తక్కువ, రాయలసీమలో కొన్నిచోట్ల సాధారణ వర్షపాతం, కొన్నిచోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. -
అకాల వర్షాలతో రైతులు లబోదిబో
(విశాఖ దక్షిణ)/పీలేరు /గంగవరం(చిత్తూరు జిల్లా)/పెదదోర్నాల/హిందూపురం: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలో పిడుగు పాటుకు ఒకరు మరణించగా, ఓ ఆవు మృతి చెందింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. కల్లాల్లో మిర్చి తడిసిపోయింది. శ్రీకాకుళం జిల్లా రాజాం, పాలకొండ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అనంతపురం జిల్లా హిందూపురంలో గాలివాన హోరెత్తింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లేపాక్షి మండలంలోని కల్లూరు ఎస్సీ కాలనీలో కొబ్బరి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు ఆందోళన చెందారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన రైతు పి.వెంకటరమణ (50) పిడుగుపాటుకు గురై మరణించగా.. గొర్రెలు మేపుకునేందుకు వెళ్లిన నాగరాజ, హరిబాబు, చంద్రకళ తీవ్రంగా గాయపడ్డారు. వారిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంగవరం మండలం మామడుగు గ్రామానికి చెందిన త్యాగరాజులు పొలం వద్ద నుంచి పాడి పశువును ఇంటికి తోలుకొస్తుండగా పిడుగు పడింది. ఈ క్రమంలో ఆవును వదిలేసి త్యాగరాజులు పరుగులు తీశాడు. అయితే ఆవు మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. రానున్న 48 గంటల్లో మోస్తరు వర్షాలు కొమరిన్ ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు, కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు 30–40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు.. చిత్తూరు జిల్లా ముడివేడులో 58 మి.మీ, శ్రీకాకుళం జిల్లా భామనిలో 52, అనంతపురం జిల్లా హిందూపురం ఆర్టీవో ఆఫీసు ప్రాంతంలో 50, ప్రకాశం జిల్లా బి.చెర్లపల్లిలో 45, మార్కాపురం ప్రాంతంలో 44, అనంతపురం జిల్లా హిందూపూర్ ప్రాంతంలో 44, విజయనగరంలో 41 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. పాడేరులో రెండు సెంటీ మీటర్లు, చింతపల్లిలో సెంటీ మీటర్ వర్షపాతం నమోదైంది. -
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇప్పటికే ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఉత్తర తమిళనాడులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్లు ఎత్తు వద్ద కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో ఉత్తర కోస్తాంధ్రా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఉత్తర కోస్తాంధ్రలో 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వివరించారు. సోమవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలో 39.3, జంగమేశ్వరపురం, కర్నూలులో 39.2. కడపలో 38.2, తిరుపతిలో 37.7, నందిగామలో 37.6, అమరావతిలో 36.6, ఆరోగ్యవరంలో 36.5, తుని 36.2, విజయవాడలో 36.0, కాకినాడలో 35.6, నెల్లూరు 35.5, విశాఖపట్నం 33.7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
వరదలపై మంత్రి అనిల్ కుమార్ సమీక్ష
సాక్షి, అమరావతి : వర్షాల కారణంగా ఎగువ రాష్ట్రాల నుంచి వరద వస్తూ ఉండటంతో అధికారులను అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. సోమవారం ఇరగేషన్ కార్యాలయంలో వరదలపై మంత్రి అనిల్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమాశానికి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యార. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ ప్రాజెక్టుల్లో సమస్యలు, చెరువులకు గండ్లు, కృష్ణ-గుంటూరు జిల్లాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తగిన జాగ్రతలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు. చదవండి: కరకట్ట నుంచి ఖాళీ చేయండి : మంత్రి అనిల్ -
నడుంలోతు నీళ్లు, అయినా మేం ఎక్కడకీ వెళ్లం!
సాక్షి, విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణమ ఉగ్రం రూపం దాల్చింది. విపరీతంగా కృష్ణనదిలోకి నీరు చేరడంతో ప్రజలు వణికిపోతున్నారు. వరదనీరు పోటెత్తడంతో జనజీవానం అతలాకుతలం అవుతోంది. అధిక వర్షాల కారణంగా కృష్ణలంక లోతట్టు ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. భూపేష్ గుప్తా నగర్లోకి నడుం లోతు నీరు చేరుకుంది. దీంతో అక్కడ ఉన్నవారిని ముంపు పునరావాస కేంద్రాలకు తరలించాడనికి అధికారులు ప్రత్నిస్తున్నారు. అయితే దొంగల భయంతో వారు తమ ఇళ్లను విడిచి వచ్చేందుకు ఇష్టం పడటం లేదు. వీరంతా గట్టుమీద గుడారాలు ఏర్పాటు చేసుకొని తలదాచుకుంటున్నారు. ట్యూబుల సహాయంతో ఇళ్ల నుంచి సామాన్లు తరలిస్తున్నారు. కరుణించి కాపాడమంటూ కృష్ణమ్మను వేడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. చదవండి: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ -
మహోగ్ర కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరు ప్రవాహం తోవడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద పోటెత్తుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీలోకి 6,99,548 క్యూసెక్కులు రాగా.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 9 గంటలకు 7,79,221 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 2,963 క్యూసెక్కులు వదులుతూ బ్యారేజీ వద్ద 70 గేట్లను ఎత్తివేసి 7,76,258 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద కారణంగా లంక గ్రామాల్లో పత్తి, మిరప, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. పసుపు, కంద, అరటి, బొప్పాయి, కూరగాయలు, పూల తోటల్లో నీరు నిల్వ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎగువన పెరిగిన వరద కృష్ణా బేసిన్లో ఎగువన వరద పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ నిండుకుండల్లా మారడంతో వస్తున్న వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.63 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. దీనివల్ల గురువారం జూరాల ప్రాజెక్టులోకి వచ్చే వరద పెరగనుంది. జూరాల నుంచి విడుదల చేస్తున్న 2.73 లక్షల క్యూసెక్కులకు.. నల్లమల అటవీ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల కొండవాగులు వరద ఉధృతి తోడవడంతో శ్రీశైలంలోకి 3.47 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు 3.44 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. నాగార్జున సాగర్‌లోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి వస్తున్న ప్రవాహానికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 4.30 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. వంశధార ఉగ్రరూపం ఒడిశా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కురిసిన వర్షాలకు వంశధార ఉగ్రరూపం దాల్చింది. గొట్టా బ్యారేజీలోకి 42,980 క్యూసెక్కులు చేరుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ గేట్లన్నీ ఎత్తేసి 46,916 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కాగా, గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,21,804 క్యూసెక్కుల చేరుతుండగా.. 175 గేట్ల ద్వారా అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
71,821 హెక్టార్లలో పంటలపై వర్ష ప్రభావం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వల్ల కురిసిన వర్షాల ప్రభావం 9 జిల్లాల్లో 71,821 హెక్టార్లలో పంటలపై పడింది. వైఎస్సార్ కడప, అనంతపురం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, విజయనగరం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలపై వర్ష ప్రభావం ఉన్నట్టు గుర్తించింది. తక్షణమే నివారణ చర్యలు చేపట్టేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించింది. 54,694 హెక్టార్లలో వరి, 12,047 హెక్టార్లలో పత్తి, 1,600 హెక్టార్లలో మినుము, 969 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. -
అన్ని విధాలా సాయం అందిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: భారీ వర్షాల వల్ల ఎదురైన కష్టనష్టాల నుంచి ఆదుకునేందుకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రధాని మోదీ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు భరోసా ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులపై బుధవారం మోదీ.. సీఎం జగన్‌కు ఫోన్ చేసి రాష్ట్రంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాలు, నెలకొన్న పరిస్థితులను సీఎం ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు. వాయుగుండం తీరం దాటిందని, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న చర్యల గురించి ప్రధానికి వివరించారు. బాధితులను ఆపద నుంచి కాపాడడంలో, వారికి పునరావాస, సహాయక చర్యల్లో అన్ని విధాలా తోడుంటామని ప్రధాని భరోసా ఇచ్చారు. బాధితుల క్షేమాన్ని కాంక్షించారు. కాగా, ప్రధాని మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడా ఫోన్లో మాట్లాడారు. ఆ రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీసి, ఆదుకుంటామని చెప్పారు. కాగా, భారీ వర్షాలు, వరద పరిస్థితిపై ఏపీ, తెలంగాణ సీఎంలతో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. రెస్క్యూ, రిలీఫ్ విషయంలో కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని అందులో పేర్కొన్నారు. కేంద్రం అండగా ఉంటుంది తెలంగాణ, ఏపీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజలకు మోదీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. -
లోతట్టు ప్రాంతాలు జలమయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి/అమరావతి బ్యూరో/అమలాపురం/జగ్గంపేట/కర్నూలు (అగ్రికల్చర్): తెలంగాణ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో పశ్చిమగోదావరి జిల్లాలోని తమ్మిలేరు ఉగ్రరూపం దాల్చింది. ఏలూరులో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వెంటనే స్పందించి రెండుచోట్ల భారీ గండ్లు పెట్టించడంతో ఏలూరు ముంపు నుంచి తప్పించుకుంది. నగరంలో ఆరు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తమ్మిలేరు కాల్వపై నిర్మించిన వంతెనకు కృష్ణా జిల్లా వైపు గండిపడే ప్రమాదం ఉండటంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో ఎర్రకాల్వకు, దెందులూరు మండలం సత్యనారాయణపురంలో గండేరువాగుకు రెండు గండ్లు పడ్డాయి. దీంతో జోగన్నపాలెం, దోసపాడు, దెందులూరు దళితవాడల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. భీమవరం మండలం తోకతిప్పలో వర్షానికి రేకుల షెడ్డు కూలి వృద్ధురాలు మృతి చెందింది. కామవరపుకోట మండలం అడమిల్లిలో చేపలు పట్టడానికి వెళ్లి బాలస్వామి మరణించాడు. ‘తూర్పు’లో ముంపులోనే పలు ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, కాకికాడ నియోజకవర్గాలు ముంపు బారిన పడ్డాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు కాలనీలు నీటమునిగాయి. ఏలేరు రిజర్వాయర్ ముంపు నీరు కాకినాడ శివారులో ట్రెజరీ కాలనీ, టీచర్స్ కాలనీ, రమణయ్యపేట జనచైతన్య కాలనీలను ముంచేసింది. అధికారులు పడవలపై వెళ్లి బాధితులకు ఆహారం, నీరు, మందులు అందజేశారు. జగ్గంపేట మండలం రామవరంలో వరద ఉధృతికి ఇల్లు కూలిపోయింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లాలో సగటున 10.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మెట్టలో తాండవ, పంపా రిజర్వాయర్ల గేట్లు మూసివేశారు. కరపలో ముంపుబారిన పడిన వరి చేలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాలకు విజయవాడలో రాణీగారితోట, కృష్ణలంక, రామలింగేశ్వర్‌నగర్, రణవీర్నగర్, బాలాజీ నగర్, యనమలకుదురు తదితర ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. కర్నూలు జిల్లాలో 44 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. నీట మునిగిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎఫ్‌సీఐ కాలనీ తూర్పు గోదావరి జిల్లాలో పది మందిని కాపాడిన హోంగార్డ్ ప్రాణాలకు తెగించి వరదలో చిక్కుకున్న పదిమంది కార్మికులను కాపాడిన ఓ హోంగార్డ్ సాహసం అందరి ప్రశంసలు పొందింది. తూర్పుగోదావరి జిల్లా రామవరంలో బుధవారం పోలవరం ఎడమ కాలువ, పుష్కర కాలువలకు గండ్లు పడి వరదనీరు భారీగా గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో బయటకు వచ్చే దారిలేక రామవరం వద్ద సిరామిక్ ఫ్యాక్టరీలో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వీరిలో పురుషులతోపాటు మహిళలు కూడా ఉన్నారు. వీరిని రక్షించేందుకు హైవే మొబైల్ డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డ్ అర్జున్ నడుము లోతు నీళ్లల్లోనే వెళ్లి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. అతడి సాహసాన్ని హోం మంత్రి సుచరితతోపాటు పలువురు అభినందించారు. కోస్తా, సీమకు మోస్తరు వర్షసూచన సాక్షి, విశాఖపట్నం: వచ్చే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ఉత్తర కోస్తా, తెలంగాణలపై అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి ఉంది. కాగా, గత 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. -
కృష్ణాజిల్లాను కుదిపేసిన వాయుగుండం
సాక్షి, విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం కృష్ణాజిల్లాను కుదిపేసింది. వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జడి వాన ఇంక వదల్లేదు. పంట పొలాలు నీటమునిగాయి. వరి పంట కొన్ని ప్రాంతాల్లో నెలకొరిగింది. పత్తి నీటిలో మునిగింది. కూరగాయల పొలాలు దెబ్బతిన్నాయి. చాలా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ నగరంలో కొన్ని కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి సమీక్షించారు. స్థానిక అధికారులు ఎక్కడిక్కడ సహాయ చర్యలు చేపట్టారు. 4331 హెక్టార్లలో పత్తి, 4284 హెక్టార్ల వరి, 866 హెక్టార్ల మొక్కజొన్న, 740 ఎకరాల మినుము, అరటి, తోటకూర పంటలకు నష్టం వాటిల్లింది. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు ఇక విజయవాడ దుర్గ ఘాట్‌లో కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. విద్యాధరపురంలో కొండ చరియలు పడి ఇల్లు ధ్వంసంకాగా, ఒకరు మృతి చెందారు. అలాగే నగరంలోని నదీతీర ప్రాంతంలో ఉన్న కృష్ణలంక సమీపంలోని తారకరామ నగర్ కాలనీ, రాణిగారి తోట, భూపేష్ గుప్తా నగర్, రామలింగేశ్వర నగర్ తదితర కాలనీలు మునిగిపోయాయి. నదిలోకి ఒక్కసారిగా ఎగువ నుంచి వరద నీరు చేరడం... ప్రస్తుతం ఆరు లక్షలకి పైగా క్యూసెక్కుల నీరు క్రిందకి వదలడంతో ఈ కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. దాదాపుగా అయిదారు అడుగుల పైనే నీరు ప్రవహిస్తోంది. తారకరామ నగర్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తమ ఇళ్లలో విలువైన సామాన్లు, వంట సామాగ్రి తీసుకుని పునరావాస కేంద్రాలకి బయలుదేరారు. నదీ తీరప్రాంతంలో రక్షణ గోడ పూర్తి చేయడం ద్వారానే తమకి ముంపు బెడద తొలుగుతుందంటున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ కృష్ణానదికి ఎగువ నుంచి పెరుగుతున్న వరద ఉధృతి నేపధ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ కి దాదాపుగా 6 లక్షల వరకు ఇన్ ఫ్లోస్ వచ్చి చేరుతుండటంతో 70 గేట్లని ఎత్తి ఆరు లక్షల క్యూసెక్కులనిక్రిందకి వదులుతున్నారు. శ్రీశైలం నాగార్జున సాగర్... పులిచింతల నుంచి వరద నీటిని వదలడంతో సాయంత్రానికి ప్రకాశం బ్యారెజ్ వద్ద ఇన్ ఫ్లో ఏడు లక్షల క్యూసెక్కులకి చేరుకుంటుందని భావిస్తున్నారు. మరోవైపు కృష్ణా నదికి వదర నీరు పోటెత్తడంతో కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ అధికారులని అప్రమత్తం చేశారు. విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాలు ముంపుబారిన పడటంతో ప్రజలని పునరావాస కేంద్రాలకి తరలించారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన వాన -
లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలి: మంత్రి ఆదేశం
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: అల్పపీడనం ప్రభావంతో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి వరద పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వర్షాల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లా రెవిన్యూ శాఖ పోలీస్ యంత్రాంగం సమన్వయంతో ఇతర శాఖలను అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలు కారణంగా అంటూ వ్యాధులు ప్రబలకుండా ముందుగానే అన్ని ప్రాంతాల్లో మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అవసరం ఉన్న ప్రాంతంలో మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న దృష్ట్యా ప్రజలు అనవసరంగా బైటికి రావద్దని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ లోతట్టు ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అదేవిధంగా తమ్మిలేరుకు వరద ఉధృతి పెరిగింది. అక్కడ 5000 క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏలూరు తమ్మిలేరుకు ఇరు వైపుల ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏలూరులోని లోతట్టు ప్రాంతంలో జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టండి అని ఆయన అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 6:30 నుంచి 7: 30 మధ్య కాకినాడకు అతి సమీపంలో వాయుగుండం తీరం దాటిందని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. ఈ కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదవండి: భారీ వర్షాలు : ఉద్యోగులకు సెలవులు రద్దు -
భారీ వర్షాలు : ఉద్యోగులకు సెలవులు రద్దు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని భారీ వర్షాలపై పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల డీపీవోలు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో దీనిపై సమీక్షించారు. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ అధికారులు, ఉద్యోగులందరికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని జిల్లాల్లో మంచి నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని గిరిజా శంకర్ ఆదేశించారు. వర్షాల కారణంగా పేరుకుపోయిన డ్రైన్‌ను శుభ్ర పరచాలని సూచించారు. అన్ని గ్రామాల్లోనూ క్లోరినషన్ చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నిరంతరం వర్షాల పరిస్థితులు సమీక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా గిరిజా శంకర్ వెల్లడించారు. ఇక కాకినాడ సమీపాన వాయుగుండం తీరాన్ని తాకింది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా వర్షాలు పడనున్నాయి. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీనిపై ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ, ఇది డీప్ డిప్రెషన్ మాత్రమేనని, తుఫానులా మారలేదని చెప్పారు. ఫలితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రస్తుతం కాకినాడ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, రాగల మూడు నాలుగు గంటలు పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరుల మీదుగా వర్షాలు తెలంగాణా వైపు వెళతాయన్నారు. ప్రస్తుతం గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల మేర గాలులు వీస్తున్నాయన్నారు. తీర ప్రాంతంలో 60 నుంచి 65 కిలో మీటర్ల వేగం ఉండొచ్చు అని తెలిపారు. అన్ని జిల్లాల్లో సహాయకచర్యలు అందించడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మంగళగిరిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సర్వం సిద్ధం చేసుకొని ఉన్నాయని తెలిపారు. రెండు రోజుల క్రితమే కాకినాడకు ఒక ప్లటూన్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపామని వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నానానికి ఏపీలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. చదవండి: భారీ వర్షాలు: తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం/కర్నూలు (అగ్రికల్చర్) /శ్రీశైలం ప్రాజెక్ట్/నిడదవోలు/సాక్షి, అమరావతి బ్యూరో: పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలతో కృష్ణా, దాని ఉపనదులు ఉప్పొంగుతున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండల్లా మారడం.. ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండటంతో వచ్చిన వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 1.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. శ్రీశైలంలో 127.91 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇంకో 87 టీఎంసీలు చేరితే నిండిపోతుంది. నాగార్జునసాగర్‌లో 243.20 టీఎంసీలు నిల్వ ఉండగా.. మరో 69 టీఎంసీలు చేరితే నిండుతుంది. పులిచింతల ప్రాజెక్టులోకి కేవలం 1,950 క్యూసెక్కులు మాత్రమే చేరుతుండటంతో నీటి నిల్వ 8.90 టీఎంసీలకు పరిమితమైంది. ప్రకాశం బ్యారేజీకి వరద పోటు పులిచింతల ప్రాజెక్టుకు దిగువన ఖమ్మం (తెలంగాణ), గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా మున్నేరు, వైరా, కట్టలేరు, కొండవాగులు ఉప్పొంగుతుండటంతో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. దీంతో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 80,520 క్యూసెక్కులు చేరుతుండగా.. గేట్లు ఎత్తి 60,707 క్యూసెక్కులను కడలిలోకి విడుదల చేస్తున్నారు. ఉధృతంగా గోదావరి గోదావరి నదిలోకి భారీగా వరద చేరుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శుక్రవారం రాత్రి 7 గంటలకు 10 అడుగులకు చేరింది. దీంతో 175 గేట్లను ఎత్తి 7,86,935 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం ఎనిమిది లక్షల క్యూసెక్కులకు చేరింది. రాత్రి పది గంటలకు ఆ వరద ప్రవాహం తొమ్మిది లక్షల క్యూసెక్కులకు చేరుతుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అంచనా వేసింది. బలపడుతున్న అల్పపీడనం ► ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమరావతి శాఖ తెలిపింది. ► దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో కూడా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం ప్రకటించింది. ► కాగా, ఈ నెల 19న వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ► దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచి సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది. ► గత 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిశాయి. -
‘మత్స్యకారులు వేటకు వెళ్లరాదు’
సాక్షి, విజయవాడ: రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఆ అల్పపీడనం 48 గంటల్లో బలపడి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్ తెలిపారు. కోస్తా తీరం వెంబడి గంటకు 30-40 కిమీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. దీంతో సముద్రం అలజడి ఎక్కువ ఉంటుండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రాగల 48 గంటలు రాయలసీమలో పలు చోట్ల 41-43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని మహిళలు, పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు రైతులు, కూలీలు, పశు/గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల శాఖ కమిషనర్ సూచించారు. -
రానున్న 24 గంటల్లో అల్ప పీడనం
సాక్షి అమరావతి, సాక్షి నెట్వర్క్: మలక్కా జలసంధి, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో దక్షిణ అండమాన్, పరిసర ప్రాంతాల్లో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తర్వాత రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు.. దక్షిణ ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే నైరుతి మధ్యప్రదేశ్ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో బుధవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని చోట్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం కలిగింది. -
మే మొదటివారంలో అల్పపీడనం..
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో మే మొదటివారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు.. దీని ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. రాగల 48 గంటలు రాయలసీమలో 41-43 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కన్నబాబు సూచించారు. -
తిరుమలలో కుండపోత వర్షం
సాక్షి, విశాఖపట్నం/తిరుపతి : ఈశాన్య విదర్భ, పరిసర ప్రాంతాల్లో 0.9 కిమీ ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు, కొమరిన్ ప్రాంతం వరకూ ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం తిరుపతి, తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన ప్రాంతాలన్నీ జలమయం కావడంతో రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. మరో వైపు నేడు, రేపు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
‘సీమ’ ఇంట.. రెండో పంట
సాక్షి, అమరావతి: ‘మా చేలల్లో ఈ కాలంలో విత్తనాలు వేసి 15 ఏళ్లు దాటిందనుకుంటా. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు వేశాం. ఎంత సంతోషంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. ఎర్ర నేలల్లో వానలు పడందే రెండో పంట వేయలేం. మా అదృష్టం బాగుండి ఈ ఏడాది కురిసిన వానలతో రెండు పంటలు వేశాం. వేరుశనగ పీకాం. ఇప్పుడు 8 ఎకరాల్లో ఉలవ వేశా. మా అప్పులు తీరినట్టే’నని సంబరపడుతున్నాడు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మేపర్తికి చెందిన రైతు డి.వెంకటరాముడు. ‘తొలకరి తప్ప రెండో పంట తెలియదు నాకు. 17, 18 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది మా ఊళ్లో ఎటుచూసినా పచ్చగా కనిపిస్తోంది. చెరువులు, బావులు, కుంటల కింద తప్ప పంటలు తెలియవు నాకు. అలాంటిది ఇప్పుడు మా ఊరి పొలాల్లో జొన్న, సజ్జ, ఉలవ వేశారు’ అని అంటున్నాడు కర్నూలు జిల్లా బసాపురంలో ఆరు ఎకరాల్లో జొన్న పంట వేసిన రామన్న. ఇలా ఒకరి ద్దరు కాదు.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా ల్లోని అన్నదాతల ఆనందం ఇది. సుదీర్ఘకాలం తర్వా త కురిసిన, కురుస్తున్న వర్షాలకు రైతులు ఈ ఏడాది రబీ సీజన్లో రెండో పంటను సాగు చేస్తున్నారు. ఎప్పుడు వేసినా ఒక పంటతోనే సరిపెట్టుకునే వీరు ఈసారి అనుకూల వాతావరణంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అన్ని చోట్లా రిజర్వాయర్లు, కుంటలు, చెరువులు నీళ్లతో తొణికిసలాడుతున్నాయి. భూ గర్భ జల మట్టం కూడా పెరిగింది. ప్రస్తుత వర్షాలూ అనుకూలమే.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రాయలసీమ ప్రాంతంలో రెండో పంటకు అనుకూలంగా మారాయి. దీంతో ఆరుతడి పంటల్ని పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. ‘గత పాతికేళ్లలో మా ప్రాంతంలో ఇంత పెద్దఎత్తున రెండో పంట వేయడం ఇదే మొదటి సారి’ అని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన జి.గంగయ్య యాదవ్ చెప్పారు. ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలలో రబీ సాగు విస్తీర్ణ లక్ష్యం 11,59,453 హెక్టార్లు. ఇందులో ఇప్పటికే 5,56,213 హెక్టార్లు సాగులోకి వచ్చింది. కరవుకు నెలవైన అనంతపురం జిల్లాలో సైతం ఇప్పటికే 99 శాతం విస్తీర్ణం సాగులోకి రావడం విశేషం. ఏటా పంట విత్తే సమయంలో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడేవారు. అప్పుల కోసం వ్యాపారుల చుట్టూ తిరిగే వారు. ఈ ఏడాది వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పరిస్థితిని సమూలంగా మార్చి వేసింది. వైఎస్సార్ రైతు భరోసా పథకంతో రైతులను, కౌలు రైతులను ఆదుకుంది. ఒక్కో రైతుకు ఏటా రూ.13,500 వస్తుంది. ఇందులో సింహ భాగం ఇప్పటికే రైతు ఖాతాల్లో జమ కావడంతో వ్యవసాయం పండుగగా మారింది. ఆరుతడి పంటలు భారీగా సాగు ఆరుతడి పంటలుగా ఉన్న ఉలవ, జొన్న, సజ్జ, శనగ, పొద్దు తిరుగుడు, జనుము పంటల్ని పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రబీ పంటల సాగు దాదాపు పూర్తయింది. చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సుమారు 75 శాతం విస్తీర్ణంలో, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 50 శాతం విస్తీర్ణంలో పంటల్ని సాగు చేశారు. అంతా అనుకూలంగా ఉంటే రబీ సీజన్లో ఉలవ 25 వేల హెక్టార్లలో సాగవుతుంది. కానీ ఈ ఏడాది ఇప్పటికే 37 వేల హెక్టార్లలో పంట వేశారు. శనగ నిర్ణీత సాగు విస్తీర్ణం 4.42 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికి 3.09 లక్షల హెక్టార్లలో సాగయింది. జొన్న నిర్ణీత సాగు విస్తీర్ణం 1.14 లక్షల హెక్టార్లయితే ఇప్పటికి 55 వేల హెక్టార్లలో విత్తారు. సీజన్ ముగిసే నాటికి సాగు విస్తీర్ణం పరిపూర్తి అవుతుందని వ్యవసాయ అధికారుల అంచనా. పశువుల మేతకు ఇబ్బంది తప్పినట్టే.. తొలి పంట చాలక రెండో పంట లేక వేసవి వస్తే గ్రాసం లేక మూగజీవాలను కబేళాలకు తోలాల్సి వచ్చేది. ఈ ఏడాది ఆ పరిస్థితి తప్పిందని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన అమీన్ అభిప్రాయపడ్డారు. ఉలవ, జొన్న, సజ్జ వంటి వాటితో పశువుల్ని కాపాడుకోవచ్చని చెప్పారు. వేసవిలో పొట్టచేతబట్టుకుని వలస పోయే పరిస్థితి తప్పుతుందని రైతు నాయకుడు భరత్ కుమార్ చెప్పారు. ఆరుతడి పంటలు భారీగా సాగు ఆరుతడి పంటలుగా ఉన్న ఉలవ, జొన్న, సజ్జ, శనగ, పొద్దు తిరుగుడు, జనుము పంటల్ని పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రబీ పంటల సాగు దాదాపు పూర్తయింది. చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సుమారు 75 శాతం విస్తీర్ణంలో, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 50 శాతం విస్తీర్ణంలో పంటల్ని సాగు చేశారు. అంతా అనుకూలంగా ఉంటే రబీ సీజన్లో ఉలవ 25 వేల హెక్టార్లలో సాగవుతుంది. కానీ ఈ ఏడాది ఇప్పటికే 37 వేల హెక్టార్లలో పంట వేశారు. శనగ నిర్ణీత సాగు విస్తీర్ణం 4.42 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికి 3.09 లక్షల హెక్టార్లలో సాగయింది. జొన్న నిర్ణీత సాగు విస్తీర్ణం 1.14 లక్షల హెక్టార్లయితే ఇప్పటికి 55 వేల హెక్టార్లలో విత్తారు. సీజన్ ముగిసే నాటికి సాగు విస్తీర్ణం పరిపూర్తి అవుతుందని వ్యవసాయ అధికారుల అంచనా. మా పంటలు బాగున్నాయి.. నా పేరు వీరన్నగౌడ్. మాది బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డం గ్రామం. నాకు హెచ్చెల్సీ చివరి ఆయకట్టు 9వ డిస్ట్రిబ్యూటరీ కింద 20 ఎకరాల పొలం ఉంది. గత 20 ఏళ్లలో ఎన్నడూ ఈసీజన్లో పంట చేతికొచ్చిన ఘటన లేదు. సరైన వర్షాలు పడలేదు. ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సకాలంలో వర్షాలు పడ్డాయి. నాకున్న 20 ఎకరాల్లో జొన్న పంట వేశా. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వేళావిశేషమో ఏమో.. జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. -
48 గంటల్లో వాయుగండం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది సాయంత్రం తీవ్ర అల్పపీడనంగా మారింది. మరింత బలపడి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయుగుండంగా మారే క్రమంలో తీవ్ర అల్పపీడనం కోస్తాంధ్ర తీరం వైపుగా కదులుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 కి.మీ. నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. పలు జిల్లాల్లో వర్షాలు తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో మంగళవారం 22 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సోమవారం అర్ధరాత్రి మంగళవారం సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. పలు గ్రామాలు, నగరాల్లో రహదారులు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లాలో మంగళవారం చిరు జల్లులు కురిశాయి. రొంపిచర్ల మండలంలోని వి.రెడ్డిపాలెంలో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ప్రకాశం జిల్లా అంతటా వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. నెల్లూరులో 10 సెంటీమీటర్లు, ఒంగోలులో 7, అమలాపురం, కందుకూరు, అగలిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
చినుకు చక్కగా..
సాక్షి, అమరావతి: జూన్ 1న మొదలైన ఖరీఫ్ (సార్వా) సీజన్ సెప్టెంబర్ 30తో ముగిసింది. నైరుతి రుతు పవనాలు కూడా సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసినట్లే లెక్క. సాంకేతికంగా చూస్తే.. రుతు పవనాలు దాటిపోవడానికి వారం అటూ ఇటూ పట్టవచ్చు. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ఆరంభంలో కొంత నిరాశ కలిగించినప్పటికీ చివరకు వచ్చేసరికి సంతృప్తి మిగిల్చాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించిన దానికంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో అధిక వర్షపాతం.. మిగిలిన 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యాయి. నైరుతి సీజన్లో రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం 514.4 మిల్లీమీటర్లు కాగా.. ఈ ఏడాది ఈ సీజన్లో 565.2 మిల్లీమీటర్ల వర్షపాతం (10 శాతం అధికం) నమోదైంది. వాతావరణ శాఖ 50 ఏళ్ల సగటు వర్షపాతాన్ని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తుంది. దీనికంటే 19 శాతం ఎక్కువ కురిసినా, తక్కువ కురిసినా సాధారణ వర్షపాతంగానే పేర్కొంటుంది. సాధారణం కంటే 20 శాతం తక్కువైతే లోటు వర్షపాతంగా, ఎక్కువైతే అధిక వర్షపాతంగా గుర్తిస్తుంది. ప్రాంతాలవారీగా చూస్తే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో సాధారణం కంటే 12 శాతం, కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో 9 శాతం అధిక వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలో 556.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 676.4 మిల్లీమీటర్లు (22 శాతం అధికం) వర్షపాతం రికార్డయ్యింది. తూర్పు గోదావరి జిల్లాలో 728.9 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతానికి గాను 874 మిల్లీమీటర్లు (20 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్లలో జలకళ ప్రస్తుత సీజన్లో రాష్ట్రంలో అనుకున్న వర్షపాతం నమోదు కావడంతోపాటు ఎగువ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిశాయి. దీంతో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార నదుల్లో వరద నీరు పోటెత్తింది. ఫలితంగా శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణా, గోదావరి డెల్టాలో పంటల సాగుకు, భూగర్భ జలమట్టం పెరుగుదలకు ఇది బాగా దోహదపడుతోంది. ఈ వర్షాలు రబీలో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు కూడా బాగా ఉపకరిస్తాయని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. సాగు.. బాగు సెప్టెంబర్ 30తో ముగిసిన ఖరీఫ్ సీజన్లో పంటల సాగు కూడా ఆశాజనకంగానే ఉంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 42.04 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాలన్నది లక్ష్యం. ఈ లెక్కన జూన్ 1నుంచి సెప్టెంబర్ 25 నాటికి 38.30 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 35.26 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. సీజన్ మొత్తమ్మీద చూస్తే.. సెప్టెంబరు 25వ తేదీ వరకూ గణిస్తే 93 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. దీని ప్రకారం చూస్తే ఈ సీజన్లో సాగు సంతృప్తికరంగా ఉన్నట్లే. రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్ ఆరంభం నుంచి రెండు నెలలు సరైన వర్షం కురవకపోవడం వల్ల నిర్ణయించిన సాగు లక్ష్యంలో 93 శాతం విజయవంతమైంది. -
శ్రీశైలానికి మళ్లీ వరద
సాక్షి, అమరావతి: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం మరోసారి పెరిగింది. ఎగువ నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,00,987 (8.72 టీఎంసీలు) క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి.. విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 95,963 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 182.60 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయిని జలాశయాల నుంచి సైతం భారీఎత్తున వరద జలాలను దిగువకు విడుదల చేస్తుండడంతో శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మరింతగా పెరగనుంది. మరోవైపు.. కృష్ణా, ప్రధాన ఉపనదులైన తంగభద్ర, భీమా పరివాహక ప్రాంతాలలో కూడా రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా నది ప్రధాన పాయలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి, నారాయణఫూర్ జలాశయాల్లోకి ఈ పాయ నుంచి వస్తున్న వరదను వచ్చింది వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. భీమా నదిలో వరద ప్రవాహం పెరగడంతో ఉజ్జయిని జలాశయం నుంచి 30 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాల ప్రాజెక్టులోకి 1.90 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 2.03 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్రలోనూ వరద ప్రవాహం భారీగా పెరిగింది. దాంతో తుంగభద్ర జలాశయం నుంచి 85 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలంలోకి వరద ప్రవాహం చేరుతోంది. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న నీటిలో నాగార్జునసాగర్‌కు 23,260 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో కుడి, ఎడమ కాలువలు, పులిచింతల, ఏఎమ్మార్పీలకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 9,753 క్యూసెక్కులు చేరుతుండగా 5 వేల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 11,451 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 16,774 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గంటగంటకూ పెరుగుతున్న గోదావరి ఇదిలా ఉంటే.. చత్తీస్‌గఢ్.. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు పోటెత్తి గోదావరి నదికి చేరుతున్నాయి. దాంతో గోదావరిలో వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజిలోకి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 5,53,077 క్యూసెక్కులు చేరుతుండగా.. బ్యారేజీ 175 గేట్లను ఎత్తి 5,54,774 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. మరోవైపు.. వంశధార నదిలోనూ వరద ప్రవాహం పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి 36,566 క్యూసెక్కులు చేరుతుండగా 22 గేట్లు ఎత్తి 37,954 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.