‘మత్స్యకారులు వేటకు వెళ్లరాదు’ | Weather Report: Thunderstorms And Gusty Winds Expected In AP | Sakshi
Sakshi News home page

వాతావరణ హెచ్చరిక: మత్స్యకారులు వేటకు వెళ్లరాదు

Published Fri, May 1 2020 3:39 PM | Last Updated on Fri, May 1 2020 4:28 PM

Weather Report: Thunderstorms And Gusty Winds Expected In AP - Sakshi

సాక్షి, విజయవాడ: రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఆ అల్పపీడనం 48 గంటల్లో బలపడి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్‌ తెలిపారు. 

కోస్తా తీరం వెంబడి గంటకు 30-40 కిమీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. దీంతో సముద్రం అలజడి ఎక్కువ ఉంటుండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రాగల 48 గంటలు రాయలసీమలో పలు చోట్ల 41-43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని మహిళలు, పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు రైతులు, కూలీలు, పశు/గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల శాఖ కమిషనర్‌ సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement