
మహారాణిపేట(విశాఖ దక్షిణ): నైరుతి రుతుపవనాల కదలికలు జోరుగా ఉండటంతో రాష్ట్రంలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని, వీటివల్ల కూడా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.