Weather Department officials
-
Alert: తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. కొద్దిరోజుల నుంచి ఎండ తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురుస్తున్నప్పటికీ ఉక్కుపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో బుధవారం భానుడు ప్రతాపం చూపించాడు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోని జైసద్‌లో 45.7, జగిత్యాలలోని ఐలాపూర్ 45.1 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవే ఈ ఏడాదిలో గరిష్ట ఉష్ణోగ్రతలు కావడం విశేషం. మరో పది జిల్లాల్లో సైతం 43-44 డిగ్రీల వరకు ఎండ మండిపోయింది. pic.twitter.com/Kal4GMQr3H — IMD_Metcentrehyd (@metcentrehyd) April 27, 2022 ఇదిలా ఉండగా.. గురు, శుక్రవారాల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 3 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. అలాగే, శనివారం నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. -
అమెరికాలో విచిత్ర ఘటన.. ప్రాణాలతో ఉన్నా చనిపోయినట్టుగా..
ఉత్తర అమెరికా చలి గుప్పిట్లో చిక్కుకుని గజగజ వణికిపోతుంది. చలి గాలుల తీవ్రత, మంచు తుఫాను దాటికి జనజీవనం స్థంభించి పోయింది. సుమారు 1400 ఫ్లైట్లు రదయ్యాయి. రోడ్ల మీదికి వాహనాలతో రావొద్దంటూ ఎమర్జెన్సీ ప్రకటించాయి పలు రాష్ట్రాలు. స్నోస్ట్రోమ్ ఎఫెక్ట్‌తో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో ఇగ్వానస్ అనే ఉసరవెల్లి తరహా జీవులు సజీవ శవంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఫ్లోరిడా రాష్ట్రంలో ఇవి ఎక్కడ పడితే అక్కడ ప్రాణంతో ఉన్నా శవాల్లా పడిపోతున్నాయి. దీంతో యూఎస్ వాతావరణ శాఖ అక్కడి ప్రజలకు పలు కీలక సూచనలు జారీ చేసింది. శవాల్లాగే ఇగ్వానస్ శరీరంలో చల్లని రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఉష్ణోగ్రత్తలు మైనస్ 4 సెల్సియస్ డిగ్రీల నుంచి మైనస్ 10 సెల్సియస్ డిగ్రీల మధ్య ఉంటే ఇవి తట్టుకోలేవు. ఉన్న పళంగా అచేతనంగా మారిపోతాయి. ప్రాణం పోదు కానీ చచ్చిన శవంలా ఎక్కడివక్కడే సుప్త చేతనావస్థ స్థితికి చేరుకుంటాయి. ఈ పరిస్థితి కారణంగా ప్రస్తుతం ఫ్లోరిడా రాష్ట్రంలో రోడ్ల మీద ఇళ్ల పక్కన, పార్కుల్లో ఇవి ఎక్కడ పడితే అక్కడ చనిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ ఒక్క సారి ఉష్ణోగ్రత పెరిగితే ఇవి సాధారణ స్థితికి చేరుకుంటాయి. కాబట్టి వాటికి ఎటువంటి హానీ తలపెట్టవద్దంటూ స్థానిక అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడివి కాదు జీవవైవిధ్యం కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇగ్వానస్లను ఫ్లోరిడాకి తీసుకువచ్చని జీవ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గటుగా అవి ఇంకా పూర్తిగా ఎవాల్వ్ కాలేదని చెబుతున్నారు. అందువల్లే ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు అవి అచేతన స్థితికి చేరుకుంటున్నాయని చెబుతున్నారు. అతిశీతల పరిస్థితులకు అలవాటు పడ్డ ద్రువపు ఎలుగుబండ్లు ముందుగానే అనువైన చోటు ఎంపిక చేసుకుని సుప్తచేతనావస్థ స్థితిలోకి వెళ్తాయంటున్నారు. It’s officially raining iguanas in South Florida pic.twitter.com/9ecBQELUUE — Cristian Benavides (@cbenavidesTV) January 30, 2022 గతంలో పూర్తిగా ఎదిగిన ఇగ్వౌనస్ సుమారు 1.5 మీటర్ల పొడవుతో 7.5 కేజీల బరువు వరకు పెరుగుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఉత్తర అమెరికాలో 2010లో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు ఇగ్వౌనస్లు ఇదే తరహా ప్రమాదం ఎదుర్కొన్నాయి.. ఇవి చనిపోయినట్టుగా ప్రజలు భావించడంలో.. ఆ ఏడాది ఇగ్వౌనస్లు పెద్ద మొత్తంలో తుడిచిపెట్టుకుపోయాయి. మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదని.. ప్రజలు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. -
అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై ఉండదు
సాక్షి, అమరావతి/విశాఖ దక్షిణ: వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారి గ్యాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్ పశ్చిమ ప్రాంతాల్లో కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదిలావుండగా.. రుతు పవనాల కదలిక జోరుగా ఉందని, ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
Andhra Pradesh: వచ్చే 3 రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆదివారం వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది క్రమంగా ఒడిశా వైపు ప్రయాణించే అవకాశముంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో 2 రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయి. ముఖ్యంగా మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంవల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మత్స్యకారులెవ్వరూ రాగల రెండు రోజులపాటు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక గడిచిన 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. విజయనగరంలో 15సెం.మీ, పూసపాటిరేగలో 14.3 సెం.మీ, డెంకాడలో 14.2, కొప్పెర్లలో 13.5, గోవిందపురంలో 12.8, నెల్లిమర్లలో 12.2, రాంబిల్లిలో 10.9, పైడి భీమవరంలో 10.8, కె.కోటపాడులో 9.5, బొందపల్లిలో 8.7, భోగాపురంలో 8.4, మారికవలస, భీమిలిలో 8.3, ఎల్.ఎన్.పేటలో 8.1, కొయ్యూరులో 7.8, విశాఖ రూరల్, దేవరాపల్లిలో 7.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
రేపు మూడు జిల్లాల్లో భారీ వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. అదేవిధంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఉత్తర బంగాళా ఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది దిశ మార్చుకొని ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణ వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లా ల్లో తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో వెంకటగిరిలో 6.1 సెంటీమీటర్లు, తవనంపల్లెలో 5.1, గోరంట్లలో 4.9, కృత్తివెన్నులో 4.6,నూజివీడులో 4.5, తాడేపల్లిగూడెంలో 4.2, జగ్గయ్యపేటలో 3.7, పలమనేరులో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఈ నెల 28న ఉత్తర బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. -
5 జిల్లాల్లో అతి భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఈ స్థాయి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. గుంటూరు, శ్రీకాకుళం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకూ కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. వచ్చే 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. వీటి ప్రభావం వల్లే భారీ వర్షాలు కురుస్తున్నాయని.. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఇలాగే వర్షాలు పడతాయని వివరించారు. అల్పపీడన ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. 25వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి గరిష్టంగా 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. రాష్ట్రమంతటా కురిసిన వర్షాలు మంగళవారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే తూర్పు గోదావరి జిల్లా చింతూరులో అత్యధికంగా 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని వరరామచంద్రపురం, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా కూనవరంలో 7, కొత్తపల్లిలో 5.4, ఆత్మకూరులో 5.3, విజయనగరం జిల్లా తెర్లాం, బొండపల్లి, మెరకముడిదం, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, రణస్థలంలలో 5, కృష్ణా జిల్లా గన్నవరంలో 3.4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో 1 నుంచి 4 సెం.మీ. వర్షం కురిసింది. -
నేడు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. -
తెలంగాణలో మరో రెండ్రోజులు వానలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు సూచించింది. దీనికి అనుబంధంగా ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి వ్యాపించి ఉన్నట్లు వివరించింది. వాటి ప్రభావంతో రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు సైతం నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 30 సెం.మీ. వర్షపాతం.. రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8:30 గంటల వరకు 1.93 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో ఇప్పటివరకు 30.17 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా 16 జిల్లాల్లో అధికం, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో 11.8 సెం.మీ., వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేటలో 11.3 సెం.మీ., వరంగల్‌లో 10.1 సెం.మీ., ఖానాపూర్‌లో 10 సెం.మీ. వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు మండలాల్లో అతిభారీ, 20కిపైగా మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. -
కాకినాడ తీరంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం కాకినాడ తీరానికి సమీపంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో ఆవరణం వరకూ విస్తరించి ఉంది. అల్పపీడనం కారణంగా.. ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఒడిశా, మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ వరకూ సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. అల్పపీడనం వల్ల రాష్ట్రంపై తేమ గాలుల తీవ్రత పెరిగింది. దీనికితోడు దక్షిణం నుంచి రుతుపవన గాలులు విస్తరిస్తున్నాయి. ఈ కారణంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ., గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులెవరూ సోమవారం వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. మరోవైపు కర్ణాటకలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, తుంగభద్రలోకి వరద నీరు భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో సామర్లకోటలో 8.3 సెం.మీ., రంగంపేటలో 6.6, గొల్లప్రోలులో 6.3, జగ్గంపేటలో 5.9, పెద్దాపురంలో 5.3, రాజవొమ్మంగి, పిఠాపురంలో 4.8, నక్కపల్లిలో 4.7, దేవీపట్నంలో 4.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బిహార్‌పై ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఒడిశా, ఉత్తర కోస్తా వరకూ విస్తరించింది. ఇది సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు ఈ నెల 11న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తా జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ. వరకూ.. గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని వివరించారు. మత్స్యకారులెవరూ రానున్న మూడు రోజులపాటు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. జంగారెడ్డిగూడెంలో 13.5 సెం.మీ., పెదపూడిలో 12.5, కాకినాడలో 10.3, ముండ్లమూరులో 10 సెం.మీ. భారీ వర్షపాతం నమోదవగా.. ఉలవపాడులో 9.6, సింగరాయకొండ, అద్దంకిలో 8.6, గోపాలపురం, కందుకూరులో 8.5, జగ్గంపేటలో 8.1, దేవరపల్లి 7.7, రాజాంలో 7.3, పిఠాపురంలో 7.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
11న అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తా తీరంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి మంగళవారం మధ్యాహ్నానికి బలహీనపడింది. ఈ నెల 11 లేదా 12న బంగాళాఖాతంలో కోస్తాకు సమీపంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఇది క్రమంగా దిశ మార్చుకుని ఒడిశా వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 11, 12 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పారు. కోస్తాంధ్రలో బుధవారం ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు పడతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. రుతుపవనాలు బలహీనంగా ఉన్న సమయంలో రాయలసీమలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలున్నాయి. గడిచిన 24 గంటల్లో విజయనగరంలో 7 సె.మీ, గరివిడిలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఉత్తర కోస్తాపై ఉపరితల ద్రోణి.. నేడు, రేపు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉత్తర కోస్తా తీరం వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. కర్నూలు జిల్లాలో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో ఆమదాలవలసలో 8 సెం.మీ., గూడూరులో 7.1, సి.బెలగొలలో 6.2, కె.నాగులాపురంలో 5.2, తంబళ్లపల్లెలో 4.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
రాష్ట్రంలో భారీ వర్షాలు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): నైరుతి రుతుపవనాల కదలికలు జోరుగా ఉండటంతో రాష్ట్రంలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని, వీటివల్ల కూడా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. -
నేడు, రేపు భారీ వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/అమరావతి: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. ఇది వచ్చే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దీనికి తోడు నైరుతి రుతు పవనాలు విస్తరిస్తుండటంతో రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా హీరలో 30 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. -
ఏప్రిల్ 16 నుంచి ఏపీలో అకాల వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాతావరణం క్రమంగా మారుతోంది. ఎన్నడూ లేని విధంగా నడి వేసవిలో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా.. ఎండలు పెరిగి అకాల వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇవన్నీ.. నైరుతి రుతుపవనాల రాకకు ముందస్తు సంకేతాలని భావిస్తున్నారు. మధ్య బంగాళాఖాతంలో అధికపీడనం కొనసాగుతోంది. దీనికి తోడు దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు రాష్ట్రంపై విస్తరిస్తున్నాయి. ఈ తేమ గాలులు క్రమంగా దిగువకు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో.. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 16 నుంచి రాయలసీమలోని కర్నూలులో వర్షాలు ప్రారంభమై క్రమంగా మిగిలిన జిల్లాలకు విస్తరిస్తాయని, అదేవిధంగా.. కోస్తాంధ్రలోనూ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ నెల 22 వరకు వర్షాలు పడే సూచనలున్నాయని, దీని వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంపై తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నేడు, రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కురుపాంలో 3.1 సెం.మీ., గుమ్మలక్ష్మీపురంలో 2.7, చింటూరులో 2.1, రుద్రవరం, బుట్టాయగూడెంలలో 1.7, పెదకూరపాడులో 1.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
దిశ మార్చుకున్న బుల్బుల్ తుపాన్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పింది. పశ్చిమ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగతున్న బుల్బుల్ తీవ్ర తుపాను శుక్రవారం దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఇది పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు దక్షిణ నైరుతి దిశగా 450 కి.మీ, బంగ్లాదేశ్‌కు దక్షిణ నైరుతి దిశగా 550 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తరదిశగా పయనిస్తున్న ఈ తీవ్ర తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. అయితే శనివారం ఉదయం దిశ మార్చుకుని ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ క్రమంగా బలహీన పడనుంది. ఇది శనివారం అర్ధరాత్రి పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాల మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సముద్రం అలజడిగా ఉండనున్న నేపథ్యంలో మత్స్యకారులెవ్వరూ శనివారం వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. -
కోస్తాలో ‘పెథాయ్’ కలవరం
సాక్షి, విశాఖసిటీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత తీవ్రమైంది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనిస్తోంది. శుక్రవారం రాత్రికి మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1090, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 930 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. అనంతరం ఇది శనివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తుపానుగా బలపడనుంది. తుపానుగా మారిన తర్వాత 16వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో పెథాయ్.. తీవ్ర తుపానుగా మారుతూ.. వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. పెథాయ్ తీవ్ర తుపానుగా బలపడిన తర్వాత గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతోనూ కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం ఒంగోలు, కాకినాడ మధ్యలో పెథాయ్ తీరందాటే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ వర్షాలు తీవ్ర వాయుగుండం, తుపాను ప్రభా వం వల్ల శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కోస్తాంధ్రలో చెదురు మదురుగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తదుపరి రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్రలో చెరుదుమదురుగా వర్షం పడుతుంది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు. దీంతోపాటు కాకినాడ గంగవరం పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికతో పాటు సిగ్నల్ సెక్షన్–5ను సూచించారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు హెచ్చరిక సమాచారాన్ని ఐఎండీ పంపించింది. రాష్ట్రవిపత్తు నిర్వహణ శాఖ దక్షిణ కోస్తా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అవసరమైతే లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బృందాలను సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. తీరంలో తుపాన్ల ఘోరం సాక్షి, అమరావతి: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను నష్టాన్ని జనం మరువకముందే మరో సూపర్ సైక్లోన్ వస్తోందనే వార్తలు కోస్తా ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా చలికాలంలో వచ్చే తీవ్ర, పెను తుపాన్లు కోస్తా జిల్లాలను వణికిస్తున్నాయి. వాయుగుండం వస్తోందంటే సముద్రతీర ప్రాంత గ్రామాలు, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల లంక గ్రామాల వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతుంటాయి. ఈ సీజన్లో వచ్చిన తుపాన్లు భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగించడమే ఈ భయానికి కారణం. ఆ కాలంలో వచ్చిన దివిసీమ ఉప్పెన పది వేల మందిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా వేలకోట్ల ఆస్తి నష్టం మిగిల్చింది. 1990 దశకంలో సూపర్ సైక్లోన్ ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ను వణికించింది. 2013 అక్టోబరు, నవంబరు నెలల్లో ఏకంగా పైలాన్, హెలెన్, లెహర్ అనే మూడు తుపాన్లు భారీ నష్టం మిగిల్చాయి. 2014లో హుద్‌హుద్ తుపాను ఉత్తరాంధ్రను మరీ ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాను దారుణంగా దెబ్బతీసింది. మొన్న అక్టోబరు రెండో వారంలో తిత్లీ తుపాను వల్ల ప్రాణనష్టం తక్కువైనప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉంది. అందువల్లే రాష్ట్రంలో తుపాను తీరం దాటనుందంటేనే తీరప్రాంతం గజగజా వణికిపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారి ఈనెల 17వ తేదీన ఒంగోలు–కాకినాడ మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించడంతో దీనివల్ల తమకెంత ముప్పు ఉంటుందోనని తీరగ్రామాల వారు భయపడుతున్నారు. అక్టోబరు, నవంబరు నెలల్లోనే అధికం.. భారత వాతావరణ విభాగం సమాచారం ప్రకారం 1891 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 82 తుపాన్లు సంభవించాయి. అక్టోబరు, నవంబరు నెలల్లోనే రాష్ట్రంపై వాయుగుండాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో సంభవించిన సూపర్ సైక్లోన్లలోకెల్లా అతి పెద్దది 1977లో సంభవించిన ప్రచంఢ తుపాను అని చెప్పవచ్చు. దీనినే దివిసీమ ఉప్పెన అని కూడా అంటారు. ఇందులో ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయాయి. రాష్ట్రానికి సంబంధించి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే అత్యధిక తుపాన్లు తీరం దాటాయి. సముద్రమట్టానికి కొంచెం తగ్గులో ఉండటంవల్ల తమిళనాడు నుంచి వచ్చే తుపాన్లు ఎక్కువగా ఇక్కడే తీరం దాటతాయని, ఈ ప్రాంతం అందుకు అనువుగా ఉండటమే కారణమని వాతావరణ నిపుణులు తెలిపారు. కోస్తాలో తొమ్మిది జిల్లాలు ఉన్నప్పటికీ ఎక్కువగా నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనే తీరం దాటుతుంటాయి. ఉత్తరాంధ్రలో అయితే విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో తీరం దాటుతుంటాయి. మారిన విపత్తుల తీరు.. గతంతో పోల్చితే విపత్తుల తీరు మారిపోయింది. గతంలో ఏడాది పొడవునా కురిసే వర్షం ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఒకేరోజు కురుస్తోంది. ఇలా అతి స్వల్పసమయంలో అత్యధిక వర్షం కురవడంవల్ల వరదలు ముంచెత్తుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ లాంటి వాతావరణ మార్పులే ఇలా అతి తక్కువ సమయంలో అత్యంత అధిక వర్షం కురవడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకదాని మీద మరొకటి ఒక్కోసారి ఒకదాని మీద మరొకటి అన్నట్లు వాయు‘గండా’లు వెంట వెంటనే వస్తుంటాయి. ఒకేనెలలో రెండు మూడు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 1992 అక్టోబరులో వారం రోజుల్లోనే రెండు తుపాన్లు సంభవించాయి. 1987 అక్టోబరులో కేవలం పక్షం రోజుల్లో మూడు తుపాన్లు ముంచెత్తాయి. 2013లో అక్టోబరు–నవంబరు నెలల్లో మూడు తుపాన్లు దెబ్బతీశాయి. ఈశాన్యంలోనే తీవ్రత ఎక్కువ రాష్ట్రంలో నైరుతీ రుతు పవనాల కాలంలో కంటే ‘ఈశాన్యం’ సమయంలోనే ఎక్కువ వరదలు, తుపాన్లు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అక్టోబరు, నవంబరు నెలల్లోనే అత్యధిక తుపాన్లు సంభవించాయి. ఈశాన్య రుతుపవనాల కాలంలో అధిక విపత్తులు సంభవించి పంటలను, ఇళ్లను, ఇతర ఆస్తులను దెబ్బతీస్తున్నాయి. 2014లో హుద్‌హుద్, మొన్న అక్టోబరులో తిత్లీ తుపానువల్ల విద్యుత్తు సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతిని నెల రోజులుపైగా అనేక గ్రామాల్లో అంధకారంలో మగ్గాల్సి వచ్చింది. -
నేడు రాష్ట్రంలోకి నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. రుతుపవనాలు ఇప్పటికే ఏపీలోని కర్నూలు, మచిలీపట్నంలోకి ప్రవేశించాయన్నారు. ముందుగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని చెప్పారు. మరోవైపు రుతుపవనాల రాక ముందే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. గత 24 గంటల్లో కొడంగల్‌లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దేముల్, యాచారం లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
కేరళ, లక్షద్వీప్‌లో భారీ వర్షాలకు అవకాశం!
తిరువనంతపురం: రానున్న 24 గంటల్లో కేరళ, లక్షద్వీప్‌లలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతాయంది. రానున్న 24 గంటల్లో కేరళ, లక్షద్వీప్, దక్షిణ తమిళనాడులో గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. -
ఖరీఫ్‌కు రెడీ
- దుక్కులు సిద్ధం చేసుకునే పనుల్లో రైతన్నలు - ఖరీఫ్‌పై కోటి ఆశలు - అందుబాటులో ఉన్న ఎరువులు, విత్తనాలు - రుతుపవనాల కోసం ఎదురుచూపు రైతులు ఖరీఫ్ సాగుకు కోటి ఆశలతో సిద్ధం అవుతున్నారు. ఈసారి రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే వస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొనడంతో రైతులు పనుల్లో నిమగ్నమయ్యూరు. దుక్కులు దున్నుతున్నారు. సాగు సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో పెట్టడంతో కొనుగోలు చేస్తున్నారు. ఈసారి జిల్లా సాధారణ సాగు 4,77,000 హెక్టార్లు కాగా, 5,64,294 హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఎరువులు కూడా 2,51,600 మెట్రిక్ టన్నులు అవసరం. ఎరువులతోపాటు విత్తనాలను అధి కారులు అందుబాటులో పెట్టారు. గత ఏడాది ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు ఆ కష్టాల నుంచి ఇంకా కోలుకోలేదు. అప్పులపాలై పుట్టెడు కష్టాల్లో ఉన్న అన్నదాతలు మళ్లీ గంపెడాశలతో ఖరీఫ్‌కు సిద్ధమవుతున్నారు. ఈ సారైనా కాలం కలిసిరాకపోతుందా అని వానదేవుడిపైనే ఆశలన్ని పెట్టుకుని సాగుకు సమాయత్తమవుతున్నారు. నాగళ్లు అమరిస్తూ.. పొడి దుక్కులను దున్ని తొలకరి జల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ములుగు : ఈ ఖరీఫ్‌లో వర్షాలు ముందే పలకరిస్తాయ ని వాతావరణ శాఖ వెల్లడించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సిద్ధం ఉం చేందుకు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, ఇన్చార్జ్ జేడీఏ గంగారాం ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 4 లక్షల 77 వేల హె క్టార్లలో సాధారణ సాగు ఉండగా, 5 లక్షల 64 వేల 294 హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచ నా వేశారు. అందుబాటులో విత్తనాలు జిల్లావ్యాప్తంగా 2,40,881 హెక్టార్లలో సాధారణ పత్తి సాగు ఉండగా ఈ సారి సుమారు 2,75,000 హెక్టార్లలో సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాకు 13,75,000 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం ఉండగా 19 లక్షల ప్యాకెట్లు ప్రభుత్వం నుంచి అందినట్లు ఇన్చార్జి జేడీఏ తెలిపారు. అలాగే 1,22,850 క్వింటాళ్ల వరిధాన్యం విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేటు సంస్థల ద్వారా రైతులకు అందిస్తామని జేడీఏ తెలి పారు. అలాగే మొక్కజొన్న సాధారణ సాగు కోసం 10 వేల 256 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉన్నాయని, ఈ విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 180 క్వింటాళ్ళ పెసర్లు, 3 వేల కింటాళ్ల మొక్కజొన్న, 700 క్వింటాళ్ళ సోయాబీ, 50 క్వింటాళ్ల కందులు, 5 వేల క్విం టాళ్ల జీలుగ విత్తనాలు ఉన్నాయి. ఎరువులు సిద్ధం.. ఖరీఫ్ సాగుకు 2,51,600 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. వీటిలో యూరియూ 1,20,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా ప్రస్తుతం వ్యవసాయ శాఖ వద్ద 47 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు, ఎంఓపీ, ఎస్ఎస్పీ ఎరువులు రైతుల సాగుకు సరిపడ డిమాండ్ మేరకు అందిస్తామని జేడీఏ తెలిపారు. హెచ్చరిస్తున్న ఎల్‌నినో ఖరీఫ్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న రైతులను ఎల్‌నినో ప్రభా వం వెంటాడే పరిస్థితి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది. గత సంవత్సరం 993.7 మి.మి సాధారణ వర్షపా తం నమోదు అవుతుందని భావించినా ఎన్‌నినో ప్రభావంతో కేవలం 623.5 మి.మి వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈసారి కూడా రైతన్నలు పంటల సాగు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.