సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. కొద్దిరోజుల నుంచి ఎండ తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురుస్తున్నప్పటికీ ఉక్కుపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో బుధవారం భానుడు ప్రతాపం చూపించాడు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోని జైసద్‌లో 45.7, జగిత్యాలలోని ఐలాపూర్ 45.1 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవే ఈ ఏడాదిలో గరిష్ట ఉష్ణోగ్రతలు కావడం విశేషం. మరో పది జిల్లాల్లో సైతం 43-44 డిగ్రీల వరకు ఎండ మండిపోయింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) April 27, 2022
ఇదిలా ఉండగా.. గురు, శుక్రవారాల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 3 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. అలాగే, శనివారం నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment